జిల్లా వార్తలు


నవ్యాంధ్రలో జరుగుతున్న భారీ విద్యా దోపిడీపై నినదిస్తూ ప్రారంభించబడిన ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి''పై జిల్లాలోని ఓ పాత వారపత్రిక రోత రాతలు రాసి ఉద్యమాన్ని విమర్శించే ప్రయత్నం చేసింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ అవాకులూ చవాకులూ పేలింది. ఒక సత్సంకల్పంతో ప్రారంభించబడిన ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి'పై బురద చల్లడానికి విశ్వప్రయత్నం చేసింది. ఆ పాతపేపరుపై ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి'' చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.…

Read more...

నెల్లూరుజిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అర్థరాత్రి దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తప్పుడు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు చాలావరకు రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి వస్తున్నాయి. రాత్రయినా దస్తావేజులు వస్తూ ఉండటంపై సబ్‌రిజిస్ట్రార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత సెంట్రల్‌ సర్వర్‌ను నిలిపి వేయడం ద్వారా వాటిని కట్టడి చేయాలని కోరుతూ గతంలో సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజికి మొరపెట్టు కున్నారు. ఈ…

Read more...

దాహం వేసినప్పుడు బావి తవ్వు కోవడం ప్రభుత్వాలకు అలవాటై పోతుంది. అయితే ఆ విధంగా తవ్వినా ఫర్వాలేదు. కాని తవ్వుతున్నట్లు నటిస్తుం డడంతోనే వచ్చిన ఇబ్బందంతా! గత యేడాది నవంబర్‌లో వచ్చిన వర్షాలు, వరదలకు నెల్లూరు లోని పలు ప్రాంతాలు మునిగిపోవడం చూసాము. కొన్ని కాలనీలలో అయితే నాలుగురోజుల దాకా తెప్పల్లో వెళ్లి బాధితులకు ఆహారపొట్లాలు, మంచినీళ్లు అందించాల్సి వచ్చింది. ఇంత తీవ్ర పరిస్థితులు తలెత్తడానికి కారణం నగరంలో పంట…

Read more...

తలా తోక లేకుండా చేసే పనులకు ఎంత ప్రజాధనం దుర్వినియోగమవు తుందన్నదానికి నెల్లూరులోని విగ్రహాల ఐలాండ్‌లే ఒక ఉదాహరణ. నగరాన్ని అందంగా కనిపించేలా చేయడానికి వివిధ ఆకృతులతో ఐలాండ్‌లు నిర్మించడం వరకు ఓకే! అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించని రీతిలో ఐలాండ్‌లు ఉండాలి. రోడ్లు వెడల్పుగా వుండి, ట్రాఫిక్‌ సాఫీగా పోతుంటే ఐల్యాండ్‌ ఎంత పెద్దదున్నా ఇబ్బంది లేదు. కాని నెల్లూరులో రోడ్లు ఉండేదే అంతంత మాత్రం. ఆక్రమణలతో రోడ్లు…

Read more...

రాజ్యసభ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఆశావహుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఉండేది నాలుగు సీట్లు. ఇప్పటి లెక్క ప్రకారం తెలుగుదేశంకు దక్కేది మూడు సీట్లు. రాష్ట్రంలోని 13జిల్లాల నుండి కూడా దాదాపు రెండు డజన్ల మంది నాయకులు రాజ్య సభను ఆశిస్తున్నారు. ఈ మూడు సీట్లకు ఏర్పడ్డ పోటీలో నెల్లూరుజిల్లా నుండి బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌ రెడ్డిల పేర్లు వినిపించాయి. తాజా సమాచారాన్ని విశ్లేషిస్తే మూడు రాజ్యసభ స్థానాల…

Read more...

2016 సంవత్సరానికి సంబంధించినంతవరకు నెల్లూ రోళ్లు అదృష్టవంతులే అనుకోవాలి. ప్రతిరోజూ పేపర్లలో, టీవీ లలో వస్తున్న వార్తలను చూస్తుంటే నిజంగా మన పరిస్థితి ఎంతో మెరుగ్గా వుందని సంబరపడాలి. దేశంలో ఎక్కడచూసినా కరువు రక్కసి విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో అయితే క్రికెట్‌ స్టేడియాలను తడపటానికి నీళ్లు లేక ఐపిఎల్‌ మ్యాచ్‌లను అక్కడ నుండి మార్చడం చూశాం. ఇక మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో కొన్ని కరువు జిల్లాలకైతే కేంద్రం రైల్‌ట్యాంకర్ల ద్వారా…

Read more...

ఆపరేషన్‌ ఆకర్ష్‌కు నెల్లూరుజిల్లాలో ఇంతవరకు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ మాత్రమే తగులుకోవడం తెలిసిందే! నెల్లూరుజిల్లా నుండి కనీసం ముగ్గురు ఎమ్మె ల్యేలనన్నా లాగాలని తెలుగుదేశం నేతల ప్రయత్నం. వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌ వెంట బలంగా నిలబడి వుండేది ఈ జిల్లాలోనే! ఏడు మందిలో ఒకరు మాత్రమే వెళ్లారు. మరో ఇద్దరిని తీసుకెళ్లాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరంపరలోనే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి పేరు తెరమీదకొచ్చింది.…

Read more...


ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చచ్చిపోయిందని చాలామంది అంటున్నారు. వాస్తవమేంటంటే అది చచ్చిపోలేదు. తెలుగు దేశంపార్టీ రూపంలో బ్రతికేవుంది. పచ్చినిజం ఏంటంటే ఎన్టీఆర్‌ కాలం నాటి తెలుగుదేశమే చచ్చిపోయింది. ఇప్పు డున్నది కాంగ్రెస్‌ తెలుగుదేశమే. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. పార్టీ పేరు, పార్టీ జెండా, పార్టీ రంగు, పార్టీ సింబల్‌... ఇవి మాత్రమే తెలుగుదేశం. జెండా మారకున్నా అజెండా మారింది. ఇప్పుడున్న పార్టీలో 30శాతం మంది ఒరిజినల్‌ తెలుగుదేశం…

Read more...

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని వీడి ఇప్పటి వరకు 17మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం లోకి పోయారు. నెల్లూరుజిల్లాలో కూడా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఇటీవల తెలుగుదేశంలో చేరడం తెలి సిందే! అయితే వీరిలో ఇద్దరి ముగ్గురి వల్ల తప్పితే మిగతా వారు పోయినందువల్ల వైకాపాకు నష్టమేమీ లేదు. కాని నెల్లూరు జిల్లాలో మాత్రం వైకాపాకు అసలైన నష్టం తన నిస్వార్ధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని…

Read more...


Page 6 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter