జిల్లా వార్తలు


అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు మంచికంటే చెడుకు ఎక్కువుగా ఉపయోగపడుతోంది. పోలీసుల చేతిలో తుపాకీ ఉంటే హంతకులను చంపొచ్చు, అదే హంతకుల చేతుల్లో తుపాకీ ఉంటే ఏ పాపం తెలియని అమాయకులను చంపుతారు. ఏదైనా మంచి లేదా చెడ్డ వారి చేతుల్లో ఉంటే తేడా ఇదే! సాంకేతిక పరిజ్ఞానాన్ని అరాచకశక్తులు నేరాలకు ఉప యోగించుకుంటుంటే పోలీసులు మాత్రం దానిని నేర నియంత్రణకు ఉప యోగిస్తున్నారు. జిల్లా ఎస్పీగా వచ్చిన…

Read more...

అమరావతి రాజధాని నిర్మాణ కమిటి సభ్యులు, మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు రాజ్యసభ రేసులో నిలిచివున్నాడు. త్వరలో రాష్ట్రం నుండి ఆరు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో నాలుగు స్థానాలు ఖచ్చితంగా టీడీపీ ఖాతాలోకే వస్తాయి. ఈలోపు వైసిపి ఎమ్మెల్యేలు ఇంకొందరు పార్టీ మారితే ఇంకో సీటు అదనంగా కూడా రావచ్చు. వీటిలో బీద మస్తాన్‌రావుకు ఒక సీటు ఖాయమనే ప్రచారం వుంది. ఇప్పటికే బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా…

Read more...

విశాఖ, చెన్నై కోస్టల్‌ కారిడార్‌కు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ కారిడార్‌లో పారిశ్రామికంగా నెల్లూరు జిల్లా కీలకం కానుంది. జిల్లాలో కావలి, అల్లూరు, విడవలూరు, ఇందు కూరుపేట, టి.పి.గూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ, డి.వి.సత్రం మండలాల్లో భూ సేకరణ జరగాల్సి వుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి చిల్లకూరు, కోట మండలాల్లో 8వేల ఎకరాల భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ యం.జానకి ఇటీవల…

Read more...

ఆనం విజయకుమార్‌రెడ్డి తన అన్నల అండదండ లేకుండా, ఆనం బ్రాండ్‌ లేకుండా కేవలం తన వ్యక్తి గత ప్రతిష్ట, పరిచయాలతో నిర్వహించిన మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం విజయవంతమైంది. నిజమే... ఒక రాజకీయ నాయకుడిగా ఆనం విజయకు ఇది తొలి కార్యక్రమమే. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. వాటికి కారణం ఆయనే అయ్యుండొచ్చు. కాని, ఆ సక్సెస్‌ ఇమేజ్‌ అంతా ఆనం బ్రదర్స్‌ ఖాతాలో చేరింది. నిన్న…

Read more...

కాంగ్రెస్‌పార్టీకి ఒక గొప్ప సాంప్రదాయముంది. ఆ పార్టీ అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా, ఇదేదీ కాకుండా చిక్కిశల్యమై శిథిలావస్థలో వున్నా పార్టీలోని నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒకే స్థాయిలో ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితి ఇంకే పార్టీలోనూ ఉండదు. అది కాంగ్రెస్‌ గొప్పతనం. వారసత్వ వైభవం కూడా! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ కోమా స్థితిలోకి వెళ్లిపోయింది. ఐసియులో వెంటిలేటర్‌ మీద వున్న రోగిలా వుంది ఆ…

Read more...

ఈమధ్య రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు, మున్సిపాల్టీ లకు పనితీరును బట్టి ర్యాంకులిచ్చారు. నెల్లూరుజిల్లాకు చెందిన నారాయణ మున్సిపల్‌ శాఖకు మంత్రిగా నేతృత్వం వహిస్తున్నారు. అంటే నెల్లూరు నగరపాలక సంస్థకు ఆయనే పెద్దమనిషి. అలాంటి నెల్లూరు కార్పొరేషన్‌ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. అయితే పైనుండి క్రిందకు కాదు... క్రింద నుండి పైకిపోయే వరుసలో రెండోస్థాన మన్నమాట! రాష్ట్రంలో మనకంటే దరిద్రపు కార్పొరేషన్‌ ఇంకా ఒకటి ఉన్నందుకు మనం సంతోషించాలి. మున్సిపల్‌…

Read more...

రాష్ట్రంలో ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగడం చూస్తున్నాం. అధికారం లేకుంటే ఆక్సిజన్‌ అందనట్లు బాధపడుతున్న ఓ 8మంది ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకు న్నారు. వైకాపా కంచుకోటల్లాంటి కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి ఎమ్మె ల్యేలు పోయినా నెల్లూరుజిల్లా నుండి ఇంకా పోలేదు. నిన్న మొన్నటివరకు జగన్‌ వెనుక జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు ఏడు మంది గట్టిగానే నిలబడివున్నారు. అయితే ఈమధ్య గూడూరు ఎమ్మెల్యే…

Read more...


2014 ఎన్నికల్లో వైకాపాకు అత్యధిక సీట్లు సాధించింది కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఈ నాలుగు జిల్లాలు కూడా ఆరోజు జగన్‌ వెంట నడిచాయి. అయితే ఈరోజు ఈ నాలుగు జిల్లాలలో మూడు జిల్లాల ఎమ్మెల్యేలు దారి తప్పారు. వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. కర్నూలు జిల్లా నుండి దగ్గర బంధువైన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలు…

Read more...

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకతో జనాన్ని ఊరిస్తోంది. ఫ్రీ ఇసుకే కదా అని ట్రాక్టర్లు తీసుకుని రీచ్‌ల వద్దకు పోతే అక్కడ స్థానిక అధికారపార్టీ నాయకులు అడ్డు కుంటూ ట్రాక్టర్‌కింతని సుంకం కట్టాల్సిం దేనంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా మారింది పరిస్థితి. జిల్లాలో 9రీచ్‌లలో ఇసుకను ఉచి తంగా తీసుకోవచ్చంటూ జిల్లా కలెక్టర్‌ యం.జానకి ప్రకటించారు. కోలగట్ల, పడ మటిపాలెం, అప్పారావుపాలెం, పుచ్చల పల్లి,…

Read more...


Page 7 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter