జిల్లా వార్తలు


రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులకు ప్రధాన ఆదాయవనరు ఇసుక. ఇంతకుముందు రాజకీయ నాయకులు దీని జోలికి వచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు ఇసుకలో ఉన్నంత డబ్బు మరిదేంట్లోనూ ఉండడం లేదు. అందుకే అందరి కళ్ళు ఇసుక మీదే పడ్డాయి. జిల్లాలో ఇసుకరీచ్‌ల టెండర్ల వ్యవహారం అయోమయంలో పడింది. ఇసుక ద్వారా ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటే, కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఇంకోటి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక ఎత్తు వేస్తే, కాంట్రాక్టర్లు ఇంకో ఎత్తు వేసి…

Read more...

చంద్రబాబుకు ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో తెలుసు. కాబట్టే అన్ని పార్టీల నుండి నాయకులను తన పార్టీలోకి లాగేసుకుంటున్నాడు. ఆనం సోదరులను కూడా ఆయన ఆ ఆలోచనతోనే పార్టీలోకి తీసుకున్నాడు. ఆనం సోదరులను తెలుగు దేశంలోకి తీసుకోవడంలో మంత్రి నారాయణ ప్రోద్బలం కూడా ఉందన్నది వాస్తవం. అయితే కేవలం నెల్లూరుజిల్లా రాజకీయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆనం బ్రదర్స్‌ను తెలుగుదేశంలోకి తీసుకోలేదు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి సీనియార్టీని రాష్ట్ర…

Read more...

నెల్లూరుజిల్లాలో రైల్వే ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే పరంగా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుండడంతో జిల్లాలో రైల్వే ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌ పరిధిలో ఇప్పుడు నెల్లూరు జిల్లా కీలకంగా వుంది. దీనికి కారణం కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్‌. ఈ లైన్‌ వచ్చాకే దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో అగ్రస్థానంలో నిలవ సాగింది. పోర్టు మూలంగా రైల్వేకు అనూహ్యంగా ఆదాయం పెరిగింది. అయితే…

Read more...

పాలకులు మారినా నెల్లూరు నగర పాలక సంస్థ రాత మారడం లేదు. ఎలుకలు తినే వాళ్లు పోతే ఏనుగులు తినేవాళ్లొచ్చారన్నట్లుగా ఇక్కడి పాలకులు తయారవుతున్నారు. గత పాలకులనే మంచనిపించేలా, గత పాలకవర్గం అవినీతే కొంచెం తక్కువుగా ఉందనిపించేలా కొత్త పాలకవర్గం తయారవుతోంది. నెల్లూరులో దోమలు పెరిగినట్లే, పందులు బలిసినట్లే, కుక్కలు విస్తరించినట్లే నగర పాలక సంస్థ అవినీతి కూడా పెరిగిపోతోంది. చివరికి నెల్లూరు నగరపాలక సంస్థను ఏ స్థాయికి చేర్చారంటే...…

Read more...

అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అధికారులు బెంబేలెత్తుతున్నారు. నెల్లూరుజిల్లా పోస్టింగ్‌ అంటే ఒకప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడకు రావడానికే భయపడుతున్నారు. అధికారపార్టీ నాయకులు అధికారులను అంతగా సతాయిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకోవాలనే తొందరలో నిబంధనలు సైతం ఉల్లంఘించి తమ పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు అధికారపార్టీ నేతల మాట కాదనలేక అటు నిబంధనలు ఉల్లంఘించలేక అధికారులు నలిగిపోతున్నారు.…

Read more...

దొంగలు దొంగలు ఊర్లు పంచుకోవడం గురించి కథలలో విన్నాం. ఇక రౌడీషీటర్లు ఏరియాలను పంచుకుని దాదాగిరిలు చేయడం వంటివి సినిమాలలోనే కాదు, నిజజీవితంలో కూడా చూస్తుంటాం. ఇలాంటిదే ఇప్పుడు నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా జరిగింది. మేయర్‌, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నెల్లూరుకు మంజూరైన పనులలో కమిషన్లను వాటాలేసి పంచుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌గా వున్న అజీజ్‌ గాని, కార్పొరేటర్లుగా ఎన్నికైన వాళ్లుగాని…

Read more...

''అపాచి''... నెల్లూరుజిల్లా తడ ప్రాంతంలో అడిడాస్‌ బూట్లు తయారు చేసే కంపెనీ ఇది. ఇక్కడ రోజుకి సుమారు 8500మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా సమీప గ్రామాల నుండి షిఫ్టుల వారీగా పని చేయడానికి ఇక్కడికి వస్తారు. తడ పరిసర ప్రాంతాల గ్రామాలతో పాటు ఎక్కువగా సూళ్లూరుపేట, సత్యవేడు, వరదయ్యపాళెం, దొరవారిసత్రం, నాయుడుపేటల నుండి సుమారు 2000మంది ఇక్కడ డే షిఫ్టులో పని చేస్తారని సమాచారం. అయితే వీళ్ళంతా ఉదయం…

Read more...


రైతులే దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న భారతదేశంలో రైతులకు ఎప్పుడూ కష్టాలే! దేశ ప్రజల అవసరాలను రైతులు తీరుస్తున్నారు గాని వారి అవసరాలను, సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రభుత్వాలు, పాలకులు రావడం లేదు. వ్యవసాయానికి యుద్ధానికి ఈరోజు పెద్ద తేడా లేకుండా పోయింది. యుద్ధానికి పోతే తిరిగి ఇంటికి చేరుతామో లేదో తెలియదు. సేద్యం కూడా అట్లాగే అయ్యింది. పంట చేతికొస్తుందో లేదో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు గాని, ప్రకృతి…

Read more...

ఇవేం నోర్లు... ఇవేం మాటలు మొన్నటి దాకా నెల్లూరు రాజకీయాలు బాగా చప్పగా వుండినాయి. నేతల మాటల్లో పదునుండేది కాదు. వాడి వేడి విమర్శలుండేవి కావు. దానికి కారణం అంతా అడ్జస్ట్‌మెంట్‌ రాజకీయం. జిల్లా మంత్రి నారాయణ రాజకీయ నాయకుడు కాదు. అతనికి రాజకీయంగా ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పటికీ అతనిని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ బాగానే కలబెట్టాడు. ఆయనకు రాజకీయంగా లోతు తెలియక ''నన్ను ఒక…

Read more...


Page 8 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter