రాష్ట్రీయ వార్తలు


రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ నుండి నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ప్రస్తుతమున్న శాసనసభ్యుల బలాబలాలు చూస్తే తెలుగు దేశంకు మూడు, వైకాపాకు ఒకటి రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే రాష్ట్రంలో రేపేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఇంతవరకు 17మంది దాకా వైకాపా ఎమ్మెల్యేలు ఆకర్షితులయ్యారు. వైకాపాకు ఇంకా 50మంది సభ్యులున్నారు.…

Read more...

అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుక్కుంటున్నా కేంద్ర ప్రభుత్వం పెట్టడంలేదు. అసలు ఆయన మాటనే పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని చంద్రబాబు ఎంత సాధారణంగా తీసుకుంటున్నాడో, కేంద్ర ప్రభుత్వం అంతకంటే సాధారణంగా తీసుకుంటోంది. సిద్ధడు అద్దంకి పోనూ పోయాడూ, రానూ వచ్చాడు... అన్నట్లుగా వుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి ప్రధానితో చర్చించడానికై…

Read more...

ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలకు బాటలు వేసింది. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తెలుగుదేశంపై ఎదురుదాడికి దిగారు. హోదా అపరసంజీవని కాదని చెప్పింది చంద్రబాబేనని, మళ్ళీ హోదాపై ఎలా విమర్శలు చేస్తారంటూ నిలదీస్తున్నారు. అయితే ప్రత్యేకహోదా విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. చంద్రబాబు తొలి నుండి కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీ…

Read more...

నవ్యాంధ్రలో భయంకరమైన విద్యా దోపిడి జరుగుతోంది. కళ్ళ ముందే వేలకోట్లు నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్నికల్లో ఒక పార్టీని గెలిపించే స్థాయిలో డబ్బు కుమ్మరించి పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు అలంకరించే దశకి విద్యా సంస్థల అధినేతలు ఎదుగుతున్నారంటే ఇక విద్యను అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసే దోపిడీ ఎంత భారీగా వుంటుందో మనం వేరే వూహించుకోవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధానమైన వ్యవస్థగా విద్యా…

Read more...

ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో ఏసిబికి చిక్కిన కాకినాడ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆదిమూలం మోహన్‌ అవినీతి మూలాలు నెల్లూరు జిల్లాలోనూ వున్నాయి. దీనిపై నెల్లూరు ఏసిబి అధికా రులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. కాకినాడలో మోహన్‌ ఇంటిపై దాడి చేసినప్పుడు ఏసిబి అధికారుల కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో ఆయన ఆస్థులు బయట పడడం జరిగింది. దాదాపు వందలకోట్ల విలువైన ఆస్తులు బయట పడ్డాయి. ఇవన్నీ ఆయనకు…

Read more...

చంద్రబాబు... జగన్‌... ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ తమ పార్టీల జెండాలు రెపరెపలాడించాలనుకున్నారు. తెలంగాణ రాజకీయాలలోనూ కీలకంగా ఉండాలనుకున్నారు. వీరి ఆలోచనకు ప్రధాన కారణం హైదరాబాద్‌. ఈ నగరంలో ముస్లింల తర్వాత సీమాంధ్ర సెటిలర్స్‌దే ఆధిపత్యం. వ్యాపారం కూడా ఎక్కువ. సగం తెలంగాణ హైద్రాబాదే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో పట్టు కలిగి ఉండడమంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రాధాన్యత కలిగి ఉండడమే. అందుకే చంద్రబాబు విభజన తర్వాత రెండు…

Read more...


మన రాష్ట్రానికి పైనున్న కేంద్రప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. పైనున్న రాష్ట్రాలూ అన్యాయం చేస్తున్నాయి. రాష్ట్రానికి వివిధ రూపాలలో అన్యాయం జరుగుతున్నా ఇదేమని ప్రశ్నించలేని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదనే సామెత వుంది. బెదిరించే వాడికే భగవంతుడు వరమిస్తాడన్న నాటు సామెత ఇంకోటి వుంది. కేంద్రం కూడా అంతే! దబాయించి అడిగే కేసీఆర్‌, జయలలిత, మమతా బెనర్జీ లాంటి…

Read more...


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజాప్రతినిధులకు చేతనైతే, వీలయితే 2014 ఎన్నికల్లో హైదరాబాద్‌లో నరేంద్ర మోడీ చేసిన ఎన్నికల ప్రచార ప్రసంగం సి.డిని మళ్ళీ ఆయనకు చూపించాలి. ఆ పని చేస్తే వాళ్లు సొంత రాష్ట్రానికి కొంతన్నా సాయం చేసినవాళ్లవుతారు. ఆనాటి ఎన్నికల సభలో మోడీ ప్రసంగంలో ఒక మాట మాత్రం ప్రజల చెవుల్లో కాదు, గుండెల్లోనూ మార్మోగుతుంది. ఆ మాటే.. ''రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్‌పార్టీ తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది''.…

Read more...


ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎవరినీ ప్రశాంతంగా బ్రతకనీయడం లేదు. రైతుల పరిస్థితి చూస్తే అంతంత మాత్రం. వ్యాపా రాలు దారుణంగా వున్నాయి. ఐపి పెడు తున్న రియల్‌ వ్యాపారులు పెరుగుతున్నారు. మద్యం వ్యాపారాలు గతమంత ఘనంగా లేవు. చంద్రబాబు ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించాక ఇసుక కేంట్రాక్టర్లందరూ తలా ఒక పనిలోపడ్డారు. మళ్ళీ ఏం గుబులు పుట్టిందో ఏమో... ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లందరూ పొలో…

Read more...


Page 10 of 45

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter