రాష్ట్రీయ వార్తలు
ఆయన్నొక సాధారణ ఆడిటర్ అనుకున్నారు... ఆయనకు లెక్కలు తప్ప రాజకీయాల్లో ఎక్కాలు తెలియవనుకున్నారు. ఆయనను రాజ్యసభకు పంపు తుంటే... ఈ ఆడిటర్ పార్లమెంటుకు వెళ్ళి ఏం చేస్తాడన్నారు. వై.యస్.కుటుంబం పట్ల విశ్వాసం చూపినందుకే రాజ్యసభకు పంపించారన్నారు. నిజమే... వై.యస్. కుటుంబం పట్ల ఆయన చూపి స్తున్నది విశ్వాసం కాదు, అంతకుమించిన ప్రేమ, అభిమానం. అంతటి అభిమానం ఉండబట్టే జగన్‌తో పాటే కేసుల్లో ఇరుక్కున్నాడు. జగన్‌తో పాటే జైలులో గడిపాడు. ఈరోజు…
ఒక తెలుగు సినిమాలో హీరో చిరంజీవిని విలన్లు చావగొడ తారు. చచ్చిపోయాడనుకుని గొయ్యి తీసి పూడ్చేస్తారు. అతని ప్రేయసిని చెరపట్టబోతారు. అప్పుడు ఆమె హీరోనుద్దేశించి... రాజా రాజా అని కేక వేస్తుంది... ఆ కేకలు మన హీరో చెవిని తాకుతాయి. హీరో కళ్ళు తెరు స్తాడు. మట్టిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. విలన్లపై విరుచుకుపడి వారికి నలుగుపెడతాడు. శుభం కార్డు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అన్నది కూడా అలాగే తయారైంది.…
నాలుగేళ్ళ చంద్రబాబు పాలనలోని పాపాలను బీజేపీ బయట పెట్టబోతోందా? బాబు విధానాలలోని వైఫల్యాలను ఎత్తి చూపనుందా? కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలేవంటూ బొక్కలు వెదకనుందా? ఇది మీ అవినీతి చిట్టా అంటూ చీటీ చించబోతుందా? ఓటు-నోటు కేసును తిరగతోడనుందా? పోలవరం అంచనా వ్యయం పెంపులో బాబు అక్రమాలను ప్రశ్నించబోతుందా? వైరిపక్షాలతో జతకట్టి తెలుగుదేశం పార్టీని కకావికలం చేయనుందా? రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలివి. నిజమే ప్రస్తుత రాజకీయ పరిణామాలను…
పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ వెనుక కూడా ఒక శక్తి చేరివుంది. ఆ శక్తి పేరే మాదాసు గంగాధరం. నెల్లూరుజిల్లాకు చెందిన మాజీఎమ్మెల్సీ. పవన్‌కళ్యాణ్‌కు పవర్‌స్టార్ అన్నది ఎవరో ఇస్తే ఇచ్చిన…
నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. కొందరికి గ్లోబల్ కాంట్రాక్టర్‌గా, ఇంకొందరికి ఆథ్యాత్మికవేత్తగా, మరికొందరికి పారిశ్రామికవేత్తగా పరిచయం. కాని నెల్లూరీయులందరికీ మాత్రం ఒక మానవతావాదిగా, సేవాభి లాషిగా సుపరిచయం. ఇంతకాలం ఆయనకు…
2014 ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు అంటే ప్రాంతీయ పార్టీలు ఎగబడే పరిస్థితి. నరేంద్ర మోడీ మేనియా అప్పట్లో ఆ స్థాయిలో వుండింది. ఏపి, తెలంగాణలోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలని ఆనాడు ఇరు రాష్ట్రాల బీజేపీ నాయకులు భావించారు. కాని, చంద్రబాబు నాయుడు తెలివిగా పావులు కదిపాడు. నరేంద్ర మోడీ ఇమేజ్ను ఎలాగైనా వాడు కోవాలనిచెప్పి తన రాజకీయ గురువు రామోజీరావు ద్వారా రిలయన్స్ అంబానిని రంగంలోకి…
ఈ పవన్ కళ్యాణ్‌కు ఏమైంది? చంద్రబాబుతో బెడిసిందా? ప్యాకేజీ గడువు ముగిసిందా? కొత్త ప్యాకేజీ కుదరలేదా? లేక తన అంతరాత్మను ప్రశ్నించుకుని వాస్తవ లోకంలోకి వచ్చాడా? 14వ తేదీ గుంటూరులో జరిగిన 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని విన్న వారందరినీ తొలిచి వేసిన ప్రశ్నలివే! పవన్ అందరికీ పూర్తి షాకిచ్చాడు. నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలు గాని, రాజ కీయ విజ్ఞులు గాని పవన్ కళ్యాణ్‌ను…
నాలుగు పుట్ల ధాన్యం పండించాలంటే ఒక ఎకరాలో సేద్యం చేయాలి. దుక్కిదున్నే దగ్గర నుండి నారు ఏతలు మొదలుకొని నీళ్ళు, కరెంట్, ఎరువులు, పురుగుమందులు, కలుపు కూలీలు, చివరికి కోతల వరకు ఎట్లా లేదన్నా ఎకరాకు 25 నుండి 30వేల పెట్టుబడి అవుతుంది. దిగుబడికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఈ నాలుగు నెలల్లో పెట్టుబడి ఒకెత్తయితే, పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒకెత్తు. అకాల వర్షాల నుండి, ఈదురుగాలుల…
'మన్మధుడు' సినిమాలో సీన్ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు. ఇదే సీన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంది. కేంద్రంలోని బీజేపీ వాళ్ళు చంద్రబాబును దూరంగా వుంచారు. దాంతో ఆయన వారికి దూరం…