రాష్ట్రీయ వార్తలు


నెల్లూరుజిల్లా కృష్ణపట్నం - కడపజిల్లా ఓబులాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. మొత్తం రూ.1800 కోట్లతో 95కి.మీ. పరిధిలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే రాపూరు, డక్కిలి, సైదాపురం, పొదలకూరు మండలాల్లోని వందలాది గ్రామాల ప్రజల జీవన విధానం మెరుగయ్యే అవకాశాలున్నాయి. మాధవయ్యపాలెం(రాపూరు సమీపంలోని వెలిగొండల) వద్ద రైల్వే సొరంగ మార్గంలో అధునాతన యంత్రాలతో సిమెంట్‌ కాంక్రీట్‌ ప్లాస్టరింగ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సొరంగమార్గం…

Read more...

'ఓటు-నోటు' కేసే లేకపోయుంటే ఇప్పుడు చంద్రబాబు రాజకీయ నిర్ణయాలు ఎలా వుండేవో తెలుసా? ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకొచ్చుండేవాడు. తన మంత్రులిద్దరి చేత రాజీనామా చేయించి వుండేవాడు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు తెగదెంపులు జరిగి, ఆ పార్టీ మంత్రులిద్దరినీ బయటకు పంపుండేవాళ్ళు. ప్రత్యేకహోదా సాధన కోసమంటూ ఢిల్లీకి చేరి ఆ ముసుగులో అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీల అధినేతలను కలిసి తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు శ్రీకారం…

Read more...

పార్లమెంటు తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలను నిలిపేసి ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును అన్యాయంగా ఆమోదిస్తున్నప్పుడు, నిండు సభలో ఆనాటి స్పీకర్‌ మీరాకుమార్‌, అధికార ప్రతిపక్ష నేతలు మన్మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ, అద్వానీ, నరేంద్ర మోడీలు సాక్షులుగా సీమాంధ్రుల గొంతు కోస్తు న్నప్పుడు ఆనాటి సభలో సీమాంధ్రకు చెందిన పాతికమంది లోక్‌సభ సభ్యులు దద్దమ్మలుగా చేతగాని వాజమ్మలుగా మిగిలిపోయారు. ఆరోజే పాతికమంది లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసేసి స్పీకర్‌ ముఖాన పడేసి…

Read more...

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నెల్లూరుజిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సేవాభిలాషి, దానగుణ సంపన్నుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధికారికంగా ఖరారు చేసేసారు. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న వి.విజయసాయిరెడ్డి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైసిపి ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. 2014 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చివుంటే అప్పుడే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యుండేవాడు. అధికారం లోకి రాక, తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేక ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది. మార్చిలో…

Read more...

ఏం అనుభవం... ఎందులో అనుభవం...? చంద్రబాబు అంటే ఆలోచనాపరుడు, మేధావి, పాలనాదక్షుడు, అన్నింటినీ మించి అనుభవధీశాలి. ఇదీ నాలుగేళ్ళనాడు జరిగిన ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రిగా చేసిన వారి ఆలోచన. బాబుకి ఎందులో అనుభవముంది... మానాభిమానాలు ప్రక్కనపెట్టి, తనకుమాలిన పనిలో వేలుపెట్టి 5కోట్ల ఆంధ్రుల పరువును తాకట్టుపెట్టి, పదేళ్ళ ఉమ్మడి పాలనకు సలాంకొట్టి అమరావతికి పారిపోయి రావడంలో అనుభవమా...? ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపడంలో అనుభవమా? మాయమాటలతో... మాంత్రిక లెక్కలతో…

Read more...

విభజన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో రామాయపట్నం పోర్టు అంశం మళ్ళీ తెరమీదకొచ్చింది. విభజన హామీలలో నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు ఒకటి. యూపిఏ ప్రభుత్వం చివరి ఘడియల్లో ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత రక్షణ పరంగా 'ఇస్రో' అభ్యంతరాలు, పులికాట్‌ సరస్సు పర్యావరణానికి…

Read more...


ఆయన వేగంగా నడుస్తాడు... ఆయన వేగంగా పని చేస్తాడు... ఆయన కదలికలు వేగంగా వుంటాయి. ఆయన ఆలోచనలు వేగంగా వుంటాయి. ఏపిని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌లో వుంచాలన్నది ఆయన తాపత్రయం. ఏపిని ఆయన ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాడు... కాని ఈ రాష్ట్రం అక్కడిదాకా పోదు... ఇక్కడే వుంటుంది. కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిపోయింది. ఆయన వేగంగా ముందుకెళ్ళబట్టే దేశంలోనే ధనిక సీఎంల జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంకును…

Read more...


రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ జేఏసీ నాయకుడు కోదండరామ్‌ రాష్ట్రసాధన లక్ష్యంగా పోరాడితే సమై క్యాంధ్ర జేఏసీ నాయకుడు అశోక్‌బాబు ఉద్యమాన్నే తాకట్టుపెట్టడం చూసాం. ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం…

Read more...


ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై పార్లమెంటులో ఎవరి నాటకాలు వాళ్లాడుతున్నారు. ప్రత్యేకహోదాపై ఎవరి పిల్లిమొగ్గలు వాళ్లేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు పార్లమెంటు బయట పగటి వేషాలేస్తుంటే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నటనాయకుడొకరు జేఏసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి పగటి వేషాలకు, ఇట్లాంటి జేఏసీ యాక్షన్‌లకు కేంద్రం తలవంచుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ తల దించుతాడా...? టీడీపీ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ డ్రామాలకు చెక్‌పెడుతూ ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష…

Read more...


Page 3 of 58

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter