రాష్ట్రీయ వార్తలు


వలస వచ్చిన నాయకులు... అడ్డదారుల్లో పోగేసిన కోట్ల కొద్ది డబ్బు... అనుకూల మీడియా ప్రచారం... వచ్చే ఎన్నికలలోనూ తమను ఇవే గెలిపిస్తాయని చంద్రబాబు నమ్ముతున్నాడా? వచ్చే ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగాలి, ప్రతిపక్షం ఉనికి ఉండకూడదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు పైవాటిని బలంగానే నమ్ముతున్నట్లుగా వుంది. ఏ ప్రభుత్వానికైనా లేదా ఏ నాయకుడిని చూసైనా ఓటేయాలంటే ఒక్కటైనా బలమైన కారణముండాలి. 1983లో కేవలం కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత, సినీ…

Read more...

చంద్రబాబు కలల రాజధాని అమరావతి వేదికగా మూడురోజులు మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మొదలుకొని మహిళా మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలతో పాటు సీఎంల కూతుర్లు, కోడళ్లు, కేంద్రమంత్రుల కూతుర్లు కూడా ఈ సదస్సులో పాల్గొని మహిళా సాధికారత గురించి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. అయితే వారి పిలుపులన్నీ కూడా అక్కడ కూర్చున్న వారి…

Read more...

ఏప్రిల్‌లో నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికార తెలుగుదేశం పార్టీలో ఈ సీటుకు పోటీ ఉండగా, ప్రతిపక్ష వైకాపా మాత్రం పోటీ పెట్టడానికి గట్టి అభ్యర్థి అన్వేషణలో వుంది. తొలుత వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను చూస్తానని, బెంగుళూరులో అభ్యర్థి ఉన్నాడని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే, ఆయన మనసులో వున్నోళ్లు పోటీకి విముఖత…

Read more...

తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు నేలపై ఆయనో చరిత్ర. తెలుగుసినిమాకే కాదు, జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయాలకే వెలుగు తెచ్చిన నాయ కుడు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నానంటూ ఆయన తనయుడు, సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి రసవత్తర చర్చకు తెరలేపారు. అందులో ఎన్టీఆర్‌ పాత్రను తానే పోషిస్తు న్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను…

Read more...

మంత్రివర్గ విస్తరణ... తెలుగుదేశంలో ఇదో బ్రహ్మపదార్ధంగా మారింది. మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు రావడం, ఆ తర్వాత వాయిదా వేయడం ఒక షెడ్యూల్‌గా తయారైంది. ఇదిగో ఈ సంక్రాంతికే... లేదు ఉగాదికి... ఇది కూడా మిస్సయితే దసరాకు... ఇలా మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి గాని మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. 2014లో చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో సమర్ధులకంటే అసమర్ధులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే ఎక్కువుగా వున్నారు.…

Read more...

పెద్దనోట్ల రద్దు ప్రభావం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు క్యూలు లేవు. బ్యాంకుల్లో అడిగిన వారికి అడిగినంత కాకపోయినా అవసరాల మేరకు డబ్బులు ఇస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు బ్యాంకుల్లో నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. 2వేల నోట్ల కంటే కూడా కొత్త 500నోట్లు బాగానే చెలామణిలోకి రావడంతో చిల్లర కష్టాలు తీరాయి. వ్యాపారాలు సాధారణ స్థితిలో జరుగుతున్నాయి. కరెన్సీ కష్టాలు చాలావరకు తీరినట్లే! మరి…

Read more...


''విభజించు పాలించు'' అన్న బ్రిటీషోడి సిద్ధాంతాన్ని చంద్రబాబు బాగానే వంటబట్టించుకున్నాడు. తన రాజకీయ ప్రయోగాలలో ఇప్పుడు కుల విభజనకు సిద్ధపడ్డాడు. అదే రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులను విభజించడం! 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్‌ హామీ వల్ల కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కులాలందరూ ఒక్కటై తెలుగుదేశంకు ఓట్లేసారు. 'కాపు' క్రింద ఏకమైన ఈ కులాలను చంద్రబాబు ఇప్పుడు విడదీయబోతున్నాడు. ఇందుకు మంజునాథ్‌ కమిషన్‌ను వేదికగా చేసుకోబోతున్నాడు. కాపులను…

Read more...


ఇంతకంటే దగా ఉందా? ఇంతకంటే మోసం ఉందా? ఇంతకంటే వంచన ఉందా? ఇంతకు మించిన దారుణం ఉందా? భారతదేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటకు, చేసిన బాసకు విలువలేకుంటే ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తున్నట్లా? ప్రజాప్రభుత్వం నడుస్తున్నట్లా? ఆంధ్రప్రదేశ్‌... మూడేళ్లుగా రెండు ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన రాష్ట్రం. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చిప్ప చేతికిచ్చి పంపించిన ఘనత యూపిఏ ప్రభుత్వానిది. అయితే విభజన సమయంలో ఏపికి…

Read more...


సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవా లయాలని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఏనాడో చెప్పారు. నిజమే... కృష్ణదేవ రాయలు నిర్మించిన చెరువులు, బ్రిటీష్‌ వారి హయాంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ కట్టిం చిన ధవళేశ్వరం, ప్రకాశం, నెల్లూరు ఆనకట్ట వంటి సాగునీటి కేంద్రాలు, స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలలో నిర్మించబడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి డ్యామ్‌లు, ఎన్టీఆర్‌ పాలనలో పురుడుపోసుకున్న తెలుగుగంగ, సోమశిల, కండ్లేరు వంటి ప్రాజెక్టులు ఈ…

Read more...


Page 4 of 47

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter