జాతీయ వార్తలు


జీవిత ఖైదును అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి ముందస్తుగా విడుదల చేసే అధికారాలను ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం సమావేశమై జూలై 18వ తేదీకల్లా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తమ స్పందనలు తెలియచేస్తే ఈ అంశంపై జూలై 22న విచారణ చేపట్టవచ్చని తెలిపింది. అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించగల తమ…

Read more...

ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అమిత్ షా నియామకానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఆమోద ముద్రవేసింది. అమిత్ షా పేరును ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అమిత్ షా నియామకం ద్వారా పార్టీపై నరేంద్ర మోడీ  పూర్తి సాధించినట్టయింది. అధ్యక్షుడిగా ఎంపికైన అమిత్ షాకు సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు.

Read more...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు హూసైనీని నటరాజన్ తుపాకితో బెదిరించాడని, తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించడని తేలడంతో కుట్రాలంలోని బంగ్లాలో నటరాజన్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయనను చెన్నైకు తీసుకువచ్చారు.…

Read more...

షార్‌లో మోడీతో చంద్రబాబు 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన మోడీ, చంద్రబాబుల భేటీ పదింపావుకు ముగిసింది. ఈ సమావేశంలో మోడీ, బాబు ఇద్దరే ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితిని, ఎపికి కావాల్సిన సాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను, దానికి అదనంగా చేయాల్సిన సాయం గురించి మోడీకి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర…

Read more...

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బోర్డుల తొలగింపుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పేరు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేటు సంస్థలు కూడా తమ బోర్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణను మార్చుకోవడానికి 30 రోజుల సమయం ఇస్తున్నట్టు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  గడువు దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరు అలాగే కనిపిస్తే... కార్మిక శాఖ జరిమానా విధిస్తుంది.…

Read more...

వై.యస్. జగన్ వ్యాపార భాగస్వామి, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేత శ్రీనివాసన్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ కమిటీకి తొలి చైర్మన్ గా నిలిచాడు. అనేక అవరోధాలను దాటుకొని ఆయన అనుకొన్నది సాధించాడు. ఆ మధ్య జగన్ ఆస్తుల కేసులో సీబీఐ శ్రీనివాసన్ ను కూడా విచారించింది. అయితే తనపై జగన్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని.. తను ఇష్టపూర్వకంగానే ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టానని శ్రీనివాసన్ సీబీఐతో స్పష్టం చేశాడు.ఆ విధంగా…

Read more...


మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు సోనియాకు దిమ్మ తిరిగిపోయింది. ఒక్క సారిగా తన పవర్ పోయేటప్పటికి ఆమెకు ఏమీ తోచడం లేదేమో. అందుకే సోనియాగాంధీ ఇప్పుడు తన చేతికి ఉన్న శక్తిని ఉపయోగించి ముఖ్యమంత్రులను మార్చే పని పెట్టుకొంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వారిని మార్చి కొత్త ముఖ్యమంత్రులను నియమించే పనిని పెట్టుకొంది. మహారాష్ట్ర, అస్సాం, హర్యానాల ముఖ్యమంత్రులను  మార్చనున్నారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో…

Read more...


మిస్టర్ కూల్, టీమిండియా కెప్టెన్ ధోని భారత్ లో నెం.1 అని మరోసారి రుజువు చేసుకున్నాడు. అయితే అది ఆటలో కాదు. సంపదలో. ప్రపంచం మొత్తం మీద సంపన్న క్రీడాకారుల జాబితాలో ధోని 22వ స్థానంలో నిలిచాడు. తాజాగా ఫ్రోబ్స్ ఎనౌన్స్ చేసిన వందమంది సంపన్న క్రీడాకారుల్లో మహీ చేరాడు. లిస్ట్ లో అమెరికన్ బాక్సర్ ఫ్లోయడ్ మేవెదర్, గోల్ఫ్ ప్లేయర్ టైగర్ ఉడ్స్, టెన్నిస్ ప్లేయర్లు ఫెదరర్, రఫెల్ నాథల్ కూడా ఉన్నారు.…

Read more...


కాంగ్రెస్ హఠావో... దేశ్ బఛావో... అనే నినాదంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ప్రధాని మోడీ మనసులో బలంగా నాటుకుపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రాజ్యసభసీటును ఇచ్చి తన కేబినెట్ లోకి తీసుకోవాలని నరేంద్ర మోడీ ఆశపడుతున్నారు. తన తొలి కేబినెట్ లోనే పవన్ కు స్థానం కల్పించే విషయమై మోడీ పవన్ ను కోరగా ఆయన తిరస్కరించారట. కాని పవన్ తన ప్రశంగాలతో మోడీ…

Read more...


Page 9 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ముగ్గురు మొనగాళ్లు
  ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
  ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter