జాతీయ వార్తలు


భారత నూతన ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ సాయంత్ర 6 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య రాష్ట్రపతి భవన్‌‑లో 15వ ప్రధానిగా మోడీ చేత రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అపూర్వ స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో మోదీ తమ పూర్తి పేరు చెబుతూ హిందీ భాషలో ప్రమాణం చేశారు. అతిథుల కరతాళ ధ్వనుల మధ్య నరేంద్ర దామోదర్…

Read more...

భారతీయుల మనసులను గెలుచుకున్న మోడీ ఇప్పుడు మామూలు చాయ్ వాలా కాదు.. భారతీయుల దిల్ వాలా. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని కాదు, ఆయన సంతోషం. సాక్షాత్తూ భరతమాతకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నది ఆయన ఆనందం. దేశ మాతకు సేవచేసే అవకాశం లభించిందన్న సంతోషం ఆయనను భావోద్వేగానికి లోను చేసింది. ఉద్వేగభరితమైన అనుభూతితో ఆయన కళ్ళలో ఆనందభాష్పాలు తొణికిసలాడాయి. ఆ అనుభూతి నిజంగానే అనిర్వచనీయం. అందుకే ప్రజలకు…

Read more...

దేశంలో పసిడి గిరాకి తగ్గుతోంది. గతంలో ధరల ఎంత పెరిగినా గిరాకీ ఉండే పుత్తడిని కొనడానికి ఇండియన్స్ ముందుకు రావటం లేదు. 2013 తో పొలిస్తే 2014జనవరి నుంచి మార్చి వరకు 26 శాతం డిమాండ్ పడిపోయింది. 2013 లో 257.5 టన్నులుగా ఉన్న డిమాండ్ 190.3 టన్నులకు తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. రూ.73,184 కోట్ల నుంచి రూ. 48,853 కోట్లకు తగ్గింది. కరెంట్ అకౌంట్ కట్టడితో ప్రభుత్వం పసిడి…

Read more...

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో 73 ఏళ్ల ఆనంది బెన్ పటేల్ బాధ్యతలు చేపట్టడం ఖాయమైనట్లు సమాచారం. ఆనంది బెన్ పటేల్ ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా వున్నారు . కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పేరును రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే గుజరాత్కు ఆమే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. గుజరాత్ ఉక్కు మహిళగా పేరు గాంచిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి…

Read more...

రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దం పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అయితే బాబు మరోసారి సీమాంధ్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు.   చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం దృష్ట్యా ఎన్టీయే కన్వీనర్‌గా ఆయన్ను నియమించనున్నారు. కీలకమైన ఎన్టీయే చైర్మన్‌ పదవి చంద్రబాబుని వరిస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉత్తరాదికి చెందిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి…

Read more...

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు.. తమకు భగవంతుడిపై నమ్మకం ఉన్నట్లు ఇకపై తప్పనిసరిగా, స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ తర్వాతే ఆలయ సిబ్బంది వారిని దర్శనానికి అనుమతించాలి. గవర్నర్ నరసింహన్ ఈ మేరకు టీటీడీకి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఈ ఆదేశాలను త్వరలో జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశ అజెండాలో చేర్చనున్నారు. దీనిపై బోర్డు చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Read more...


భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు, ఎన్డీయే పక్షాల సమావేశం అనంతరం మధ్యాహ్నం ఎన్డీయే బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. తాము తమ నేతగా మోడీని ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మోడీని, ఎన్డీయేను అభినందించారు. ఆ తర్వాత…

Read more...


నరేంద్రమోడీ పార్లమెంట్‌కి వచ్చినప్పుడు భారతీయ జనతాపార్టీ నాయకులు ఆయనకు భారీ సంఖ్యలో గుమిగూడి స్వాగతం పలికారు. నరేంద్రమోడీ పార్లమెంట్ మెట్ల దగ్గరకు రాగానే ఎవరూ ఊహించని విధంగా ఆయన మోకాళ్ళ మీద వంగి, నేలమీదకి పూర్తిగా ఒరిగిపోయి పార్లమెంట్ మెట్లకు నమస్కరించారు. ఈ చర్య పార్లమెంట్ మీద నరేంద్రమోడీకి వున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. కంటతడి పెట్టిన నరేంద్రమోడీ  దేశం, పార్టీ కన్నతల్లివంటివని, తన ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే…

Read more...


లోకసభ ఎన్నికల్లో సరిగ్గా పని చేయలేదంటూ మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేశారు. తన మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన పలికారు. అదే సమయంలో ఎన్నికల్లో కష్టపడి పని చేసిన మరో ముగ్గురికి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులే వుండగా, మరొకరు కోయంబత్తూరుకు చెందిన ఎమ్మెల్యే వున్నారు. సిఎం సిఫారసుల మేరకు ముగ్గురు మంత్రులను తొలగించి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించనున్నట్టు…

Read more...


Page 10 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter