జాతీయ వార్తలు


పెద్దనోట్ల రద్దుచేసినా, దేశ రాజకీయాలు ఎలా వున్నా, నాయకులు, మన పాలకులు ఎంత రోతగా తయారైనా... ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ అగ్రదేశాలకు ధీటుగా నిలుస్తున్న ఏకైక సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. అత్యంత తక్కువ కాలంలోనే అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాల సరసన నిలిచింది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఒకటికి నాలుగుసార్లు ప్రయోగాలు జరిపి విజయవంతమైన ఉపగ్రహాలను ఇస్రో ఒకే ఒక్క ప్రయోగంతో…

Read more...

ప్రజల జీవితాల్లో క్యాలెండర్‌ మారింది. కష్టాలు మాత్రం మారలేదు. కొత్తనోట్లతో పాటు ఇంటికి కొత్త క్యాలెండర్లు కూడా వచ్చాయి. కరెన్సీ అగచాట్లు కామన్‌గానే కొనసాగుతున్నాయి. 2016సంవత్సరం వెళ్లిపోయింది. 2017కు స్వాగతం పలికాము. డిసెంబర్‌31వతేదీతో కరెన్సీ కష్టాలు ముగిసినట్లేనని భావించారు. 31వ తేదీ ప్రధాని శుభవార్త చెబుతాడని, ఈ కరెన్సీ కష్టాలకు ఇక్కడితో ముగింపు పలికినట్లేనని అనుకున్నారు. తీరాచూస్తే 31వ తేదీ ప్రధాని ప్రసంగం పేలవంగా సాగింది. కరెన్సీ రిలీఫ్‌ గురించి…

Read more...

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ... ఆధునిక భారత నిర్మాత. లాల్‌బహుదూర్‌ శాస్త్రి... నిజాయితీకి ప్రతీక. శ్రీమతి ఇందిరాగాంధీ... బ్యాంకుల జాతీయకరణ. రాజీవ్‌గాంధీ... సాంకేతిక విప్లవం. పి.వి.నరసింహారావు... ఆర్ధిక సంస్కరణలు. వాజ్‌పేయి... స్వర్ణ చతుర్భుజితో దేశమంతా నాలుగులైన్ల జాతీయరహదారులు. మన్మోహన్‌సింగ్‌... 2జీ స్కాం, బొగ్గు స్కాం... భారతదేశ ప్రధానులుగా పనిచేసిన నాయకులందరూ తమ పాలనా కాలంలో ఒక్కో అంశంపై తమ బ్రాండ్‌ వేసుకున్నారు. వీరి పేర్లు తలచు కోగానే పైన సూచించిన అంశాలు…

Read more...

నవంబర్‌ 8 రాత్రి 8గంటలకు బుస్‌... అన్నాడు.. అవినీతిని అంతం చేస్తానంటూ బుసలు కొట్టాడు. డిసెంబర్‌ 31 వరకు కస్సుబుస్సు మంటూనే వున్నాడు. ఎక్కువ త్రాగకండి మత్తు దించేస్తానన్నాడు. నల్లకుబేరుల గల్లా ఖాళీ చేయిస్తానన్నాడు. క్రొత్త యేడాది భారతావనికి వరాల జల్లు కురిపిస్తానన్నాడు. చివరికి డిసెంబర్‌ 31న తుస్‌మన్నాడు, గుండె ఝల్లుమనిపించాడు. ఊరించాడు, ఊహలపల్లకీ ఎక్కించాడు. గాల్లో లేపాడు, చుక్కలు చూపించాడు. మాటల్తోనే స్వర్గానికి చేరువగా తీసుకెళ్లాడు. నూటపాతిక కోట్ల…

Read more...

డిసెంబర్‌ 30వ తేదీ... 52రోజులుగా భారతదేశంలోని 125కోట్ల మంది ప్రజలు ఈరోజు కోసమే చూస్తున్నారు. అయితే ఇంతకాలం డిసెంబర్‌ 30వ తేదీని ఒక కోణంలో చూసేవాళ్లు. అది ఆ ఏడాది ముగింపు దినంగా భావించేవాళ్లు. కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసే వాళ్లు. ఈ సంవత్సరం పరిస్థితి అదికాదు. పాత నోట్ల రద్దుకు అది తుదిగడువు. నవంబర్‌ 8వ తేదీన పాత వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ…

Read more...

ఈ భూమ్మీద పడ్డ తొలిరోజుల్లో జయరామన్‌ కోయల వల్లి... పసిప్రాయంలో సినిమాల్లో చేరాక జయరామన్‌ జయలలిత... సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక పురచ్చితలైవి జయలలిత... తమిళనాడు సిఎం అయ్యి అనేక ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టాక అమ్మ జయ లలిత... మనిషి ఒక్కరే, కాని పేర్లు మారాయి. పదవులు మారాయి. ప్రజల మనసుల్లో, ఆలోచనల్లో, వారి భావాల్లో ఆమె స్థానం మారుతూ వచ్చింది. ఒక భర్తకు భార్య కాలేకపోయినా, ఒక బిడ్డకు…

Read more...


ఇక గట్టిగా రెండు వారాలు... బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు మనం 'క్యూ'లలో నిల్చోవడానికి మిగిలిన రోజులు. డిసెంబర్‌ 30తో నోట్ల మార్పిడికి ఆఖరిరోజు. ఆ తర్వాత ప్రధాని చెప్పినట్లు 'అచ్చేదిన్‌' వస్తుందా, జనం 'చచ్చేదిన్‌'లు వస్తాయా అన్నది వేరే సంగతి! పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం, చిన్న నోట్ల కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నవంబర్‌ 8వ తేదీ రాత్రి పెద్దనోట్లు…

Read more...


ఏమిటిది? దేశంలో ఏం జరుగుతోంది? బ్లాక్‌మనీపై అనుకున్నదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? నల్లధనంపై మన అంచనాలేమయ్యాయి? అసలు నల్లకుబేరులు ఎక్కడికిపోయారు? కేంద్రప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. నల్లధనం, అవినీతిపై యుద్ధమంటూ పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్రంలో నిస్సత్తువ ఆవహించింది. రోజురోజుకూ బ్యాంకుల్లో జమపడుతున్న నోట్ల కట్టలు... సారీ... కరెన్సీ గుట్టలు చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేస్తున్నారు. వాళ్లు అనుకున్నదొకటైతే ఇక్కడ జరుగుతున్నదొకటి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఫలితాలపై పెట్టుకున్న కలలు…

Read more...


భూమిపై వ్యవసాయ రంగానికి సంబం ధించి అత్యుత్తమ సేవలందించే లక్ష్యంతో భారతశాస్త్రవేత్తలు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి36 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ఉపగ్రహ ప్రయోగంతో మనదేశ వ్యవసాయరంగానికి మేలు బాటలు పరచినట్లే. ఉపగ్రహ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయపరంపర దిగ్విజయంగా కొన సాగుతోన్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన భారతశాస్త్రవేత్తలను ప్రజలందరూ అభినందిస్తున్నారు. 'రైతన్నల నేస్తం'గా భావించే ఈ ఉపగ్రహం భూమికి 887 కిలోమీటర్ల…

Read more...


Page 4 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter