నెల్లూరులో నేడు (167)

parksఆరు లక్షలు దాటిన జనాభా, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వున్న నెల్లూరు నగరంలో ప్రజలు, పిల్లల ఆహ్లాదం కోసం ఒక్క మంచి పార్కు కూడా లేకపోవడం సిగ్గుచేటైన విషయం. నెల్లూరు నగరంలో ఎన్ని పార్కులున్నాయి, ఎన్ని పార్కుల కోసం రిజర్వు స్థలాలు వదిలి ఉన్నారనే సమాచారం పూర్తిగా కార్పొరేషన్ వద్ద కూడా లేదు. నెల్లూరు నగరంలో పార్కులున్నాయి. పార్కుల కోసం స్థలాలు వదిలి వున్నారు. ఎవరో ఒకరు వాటిని ఆక్రమించుకుంటున్నప్పుడు మాత్రమే రిజర్వ్ స్థలాల విషయం వెలుగులోకి వస్తుంది.

చింతారెడ్డిపాలెంరోడ్డు, ఆదిత్యనగర్ లో వున్న ఏకైక చిన్నపిల్లల పార్కును కూడా దరిద్రం చేసిపెట్టారు. 2000సంవత్సరంలో దాత జె.యస్.రెడ్డి జన్మభూమి క్రింద ఈ పార్కును నిర్మించి ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లకు కానుకగా ఇచ్చారు. ఈ పార్కు నిర్మాణంలో అప్పటి కలెక్టర్ శ్రీలక్ష్మి పాత్ర విస్మరించలేము. నగరంలో అత్యంత చెత్త(కంపోస్ట్ యార్డ్) ప్రాంతాన్ని అత్యంత సుందరంగా మార్చింది శ్రీలక్ష్మినే. ఆమె వల్లే ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం జరుగుతుంది కూడా. ఈ పార్కును ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ అనంతరాము వ్యాపారవేత్తలకు లీజుకు వ్రాసిచ్చేయడంతో దీని రూపురేఖలు మారిపోయాయి. ఉన్న ఒక్క మంచి పార్కు కూడా ఇప్పుడు అధ్వాన్న స్థితికి చేరుకుంది. నగరంలో చెప్పుకోదగ్గ వాటిలో స్వతంత్రపార్కు ఒకటి. చిన్నపార్కే అయినా కొద్దోగొప్పో బాగానే వుంది. నగరంలో ఇంకే పార్కు కూడా పార్కు రీతిలో లేదు. నగరంలో నవాబుపేట, స్టోన్ హౌస్ పేట, బాలాజీనగర్, ఏసి నగర్, హరనాథపురం, పొదలకూరురోడ్డు, వేదాయపాలెం, మాగుంట లే అవుట్, రవీంద్రనగర్, అయ్యప్పగుడి, రంగనాయకులపేట, సంతపేట వంటి ప్రాంతాల్లో పాత పార్కులున్నాయి. అవి జూదరులకు, వ్యసనపరులకు ఆశ్రమాలుగా మారివున్నాయి. కొత్తగా లే అవుట్లు వేసిన శివారు ప్రాంతాల్లోనూ పార్కుల అభివృద్ధి అంతం మాత్రంగానే వుంది. ఈమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాలను, డివిజన్ లను దత్తత తీసుకుంటున్నారు. ఒక గ్రామంలో పూర్తిస్థాయి వసతులు కల్పించాలంటే ఒక రకంగా సాధ్యమయ్యే పని కాదు. కాని పనిచేసే దిశగా ఇదొక ముందడుగని చెప్పవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో పార్కులను గుర్తించి వాటిని దత్తత తీసుకునే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సివుంది. గతంలో బి.లక్ష్మీకాంతం నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరించినప్పుడు ఈ దిశగా చొరవచూపాడు. పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక తయారుచేసారు. అయితే ఆయన బదిలీతో ఆ ప్రణాళిక ఆగిపోయింది. పార్కులు పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్కరు ఒక్కో పార్కును దత్తత తీసుకోవడం ఉత్తమం.

dogsగుంటూరులో ఇటీవల అభంశుభం తెలియని ఆరేళ్ళ బాలిక కుక్కల దాడిలో హృదయవిదారకంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇటువంటి దారుణాలు నెల్లూరులో కూడా జరిగే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు మేల్కొంటే మంచిది. నెల్లూరు నగరంలో ఏ వీధిలో చూసినా కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. చీకటిపడితే చాలు కొన్ని ప్రాంతాల్లో బయటకు ఒంటరిగా రావడానికే భయమేస్తోంది. వేదాయపాళెం, సంతపేట, పొదలకూరురోడ్డు, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో వాహనదారుల్ని కుక్కలు వెంబడిస్తూ తరుముకోవడంతో వాహనదారులు భయబ్రాంతులై ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు లెక్కకుమించి వున్నాయి. రాత్రి పది గంటలు దాటితే చాలు గుంపులు గుంపులుగా ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కుక్కలు, పందుల నివారణకు మునిసిపల్ సిబ్బంది చేపడుతున్న చర్యలు శూన్యం. నెల్లూరులోని 54డివిజన్ లలో వీధికుక్కలు వేలల్లో వున్నాయి. కొన్ని సందర్భాల్లో కుక్కల్ని పట్టుకుంటున్నా, కొన్ని సంస్థలు అడ్డు తగులుతున్నాయి. వాటి జోలికెళ్లొద్దంటూ అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. జంతు సంరక్షణ చట్టాలు కఠినంగా ఉండటంతో అధికారులూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఇంటిలో కుక్కను పెంచుకోవాలంటే మునిసిపాలిటీ ధృవపత్రం ఇచ్చేది. కాని ప్రస్తుతం అలాంటి నిబంధనలు ఏమీ లేవు. తమకు ఇష్టమైన కుక్కలను పోషించుకోవచ్చు. అవి అనారోగ్యంబారిన పడితే రోడ్డులో వదిలేస్తున్నారు. వీధి కుక్కలతో పాటు ఇవన్నీ గుంపులుగుంపులుగా తయారై మనుషులపైకి దాడులకు దిగుతున్నాయి.

కుక్కలు ఎక్కువుగా చిన్నారులపైనే దాడులు చేస్తున్నాయి. ముఖం, ఛాతి, గొంతుపై గాట్లు పెడతాయి. ఆ దాడులు తలదగ్గరైతే విషం మెదడుకు వెంటనే చేరిపోతుంది. దీంతో చాలా ప్రమాదకరమై మరణాలు సంభవిస్తున్నాయి. గుంటూరు సంఘటన నెల్లూరులో జరగకముందే మునిసిపల్ అధికారులు కుక్కలను నియంత్రించేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సివుంది.

nidhuluఏ ఆదాయమూ లేక ఎలాంటి పనులు చేయలేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నెల్లూరు నగరపాలక సంస్థకు 1090కోట్లు హడ్కో నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ నిధులు మంజూరైనట్లు తెలియగానే మేయర్ అబ్దుల్ అజీజ్ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నాడు. నెల్లూరుకు హడ్కో నిధుల ప్రతిపాదన ఎప్పటి నుండో వుంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ నిధులు విడుదల చేయించడానికి కృషి చేసాడు. ఈ నిధులలో 525కోట్లు భూగర్భ డ్రైనేజీకి 475కోట్లు తాగునీటి అవసరాలకు ఖర్చు పెడతామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. హడ్కో నిధులొస్తాయి. ఈ పనులకు ఖర్చు పెడతారు. అయితే ఈ నిధులు ఫ్రీగా ఇచ్చేవి కావు. ప్రతి సంవత్సరం నెల్లూరు నగరపాలక సంస్థి తిరిగి వంద కోట్ల దాకా కట్టాల్సి వుంటుంది. ప్రతి ఏటా ఈ వందకోట్ల భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై మోపుతారనే భయం కూడా ఇప్పుడు తలెత్తుతోంది.

kotam sriతెలుగేదశంపార్టీ నెల్లూరు నగర అధ్యక్షులుగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని వరుసగా రెండోసారి నియమించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నెల్లూరులోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నగర అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక జరిగింది. కోటంరెడ్డి శీనయ్యను మళ్ళీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అలాగే మాజీకౌన్సిలర్ వై.వి.సుబ్బారావును ప్రధాన కార్యదరిశగా నియమించారు. కోటంరెడ్డి శీనయ్యకు ఎక్కడున్నా చొక్కా చించుకోవడమో, లేదా అవతలి వాడి చొక్కా చించడమో జరిగేలా పనిచేస్తాడనే పేరుంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ ఎస్ యూఐలో రాజకీయ అడుగులు వేశాడు. తర్వాత కాంగ్రెస్ లో వీరసైనికుడిలా పనిచేసాడు. కాలం కలసిరాక, ఆనం బ్రదర్స్ తో సరిపడక తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వున్న సమయంలో చొక్కా ఫ్యాంటులు చించుకునేలా పనిచేశాడు.

gopalaనెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు శ్రీ వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 9వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 31వ తేదీ మంగళవారం ఉదయం 10గంటలకు ధ్వజారోహణ సమయంలో సంతానభాగ్యం కావాలని కోరే నూతన వధూవరులు, పుణ్య దంపతులు శ్రీ స్వామివారి కొడిముద్ద ప్రసాదం కొరకు ఉదయం 9గంటలకు సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. ఏప్రియల్ 1వ తేదీ హంస వాహనం, 2వ తేదీ చంద్రప్రభ, 3వ తేదీ వెండి హనుమంతసేవ, 4వ తేదీ గరుడసేవ, 5వ తేదీ కల్యాణం, 6వ తేదీ రథోత్సవం, 7వ తేదీ అశ్వవాహనం, 8వ తేదీ పొన్నవాహన సేవ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ratnamనెల్లూరు హరనాథపురంలోని రేస్ నందు ఒపన్ డే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం మరియు గౌరవ అతిథిగా ప్రముఖ భౌతికశాస్త్ర అధ్యాపకులు కోదండ రామయ్య(కోరా) విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన అనేక నమూనాలను, కళాకృతులను చూసి ఆనందించారు. విద్యార్థులను స్వయంగా వాటి వివరాలు అడిగి తెలుసుకొని వారిని ప్రశంసించారు. సంవత్సరాంతం వరకు పిల్లలు పాఠశాలలో ఏమి నేర్చుకున్నారు, వారికి సంబంధిత పాఠ్య విషయాలపై ఎంత అవగాహన పెంచుకొన్నారో వీటిని స్వయంగా తల్లిదండ్రులు వారితో కలసి ఒకరోజు పాఠశాలలో గడిపి తెలుసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి తెలియజేశారు.

cbnరాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి 8వ తేదీన నెల్లూరుకు వస్తున్నట్లు సమాచారం. ఆరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏసి స్టేడియంలో లక్షమంది మహిళలతో నిర్వహించే సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే ముత్తుకూరురోడ్డులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన అపోలో హాస్పిటల్ ను కూడా ఆయన ప్రారంభించే అవకాశాలున్నాయి.

kotam subhaకొందరు నాయకులు అందరూ ఆదర్శంగా వుండాలంటూ బోలెడన్ని మాటలు చెప్పేస్తుంటారు. తీరా తమ వద్దకు వచ్చేసరికి ఆ మాటలు తమకు వర్తించవన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కానీ, కోటంరెడ్డి అలా కాదు. చెప్పే మాటల్లోనే కాక, ఆచరణలోనూ మార్గదర్శకంగా నిలుస్తూ... అందరికీ ఆదర్శంగా వుంటున్నారు.

అందుకు ఆయన కుమార్తె శుభలేఖే ఒక చక్కని నిదర్శనం. కుమార్తె పెళ్లి వచ్చిందంటే చాలు, ఎంతో ఆడంబరంగా లక్షలాది రూపాయలు వెచ్చించి శుభలేఖలు ముద్రించి వూరంతా పంచాలని నాయకులు భావిస్తుంటారు. అయితే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అలాంటి ఖరీదు వ్యవహారాలను దూరంగా పెట్టి, సాధారణమైన తెల్లకార్డు మీదనే, అత్యంత సాదాసీదాగా శుభలేఖను ముద్రించి అందరికీ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన తమ కుమార్తె వివాహమని, మీ ఆశీస్సులే మా బిడ్డ పెళ్లికి వేదమంత్రాలనీ, నూతన వధూవరుల కొత్త జీవితానికి మీ ఆశీస్సులే శుభాశీస్సులని పేర్కొంటూ ఆయన ఎంతో అభిమానంగా ఆ శుభలేఖను పంపారు. శుభలేఖ చూసేందుకు సాదాసీదాగానే వున్నా, అందులోని అక్షరాలు కోటంరెడ్డి వినమ్రతకు, అభిమానానికి దర్పణంగా నిలుస్తాయి.

r bనెల్లూరు దర్గామిట్టలోని ఆర్ అండ్ బి అతిథిగృహఁ త్వరలోనే తిరిగి పునప్రారంభం కాబోతోంది. గత కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై ఆలనాపాలనా లేకుండా వున్న ఈ అతిథిగృహాన్ని కృష్ణపట్నం పోర్టు కంపెనీ వాళ్లు మరమ్మతులు చేపట్టి మళ్ళీ కొత్త సొగసులు తీసుకొచ్చారు. అతిథిగృహంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల్లూరుకొచ్చే విఐపిలకు కేవలం పినాకిని అతిథిగృహం మాత్రమే అందుబాటులో వుంది. అయితే అక్కడ తగినన్ని సూట్ లు లేకపోవడంతో ఒక్కోసారి ప్రైవేట్ హోటల్స్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రారంభమైతే ఈ సమస్య తీరినట్లే.

tanaతెలుగు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఈ నెల 18వ తేదీ నెల్లూరులోని శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్ లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల దాకా తానా చైతన్యస్రవంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు అడ్వయిజరీ కమిటీ ఛైర్మెన్ శ్రీ సిటి ఎం.డి. రవిసన్నారెడ్డి తెలిపారు.

2015జులై నెలలో తానా 20వ ద్వైవార్షిక సదస్సు అమెరికాలో జరుగుతుందని, అందులో భాగంగా తానా తెలుగు రాష్ర్టాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ స్థానిక కళలకు, కళాకారులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల్లో వుంటున్న నెల్లూరీయులు, పారిశ్రామికవేత్తలు సుమారు 35మంది దాకా వచ్చే అవకాశం వుందన్నారు.

సాహిత్యం, కళలు, పాత్రికేయ, వ్యవసాయ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనుపరచినవారికి సన్మానం చేస్తామని ముఖ్యసమన్వయకర్త తుంగా శివప్రభాత్ రెడ్డి తెలిపారు. గిడుగు రామ్మూర్తి అవార్డును ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీహీరో రాజేంద్రప్రసాద్, జబర్దస్త్ యాంకర్ రెష్మి, ఇతర నటులు పాల్గొంటున్నారని, సినీ గాయకులు దీపు, ప్రవీణ్, గంగాధర్ తదితరులచే సంగీత విభావరి జరుగుతుందన్నారు.

Page 9 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter