నెల్లూరులో నేడు (149)

court buildingజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం జిల్లా యంత్రాంగానికి రద్దీ ఎక్కువ కావడంతో దీని ప్రభావం పరోక్షంగా జిల్లా యంత్రాంగంపైన పడుతున్నందున, ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఖాళీగా వున్న కోర్టు భవనంలో ప్రజావిజ్ఞప్తుల దినంను నిర్వహించడానికి నిర్ణయించారు.

శుక్రవారం(23.05.14) మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రజలు రావడంతో కొంతమేర ఇబ్బంది ఏర్పడుతుందని అసౌకర్యాన్ని తొలగించడం కోసం కోర్టు భవనం ఉపయోగించుకోదలచి, ఆ భవనం యొక్క స్థితిగతులను కూళంకషంగా తనిఖీలు నిర్వహించవలసిందిగా రోడ్లు భవనాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు.

collec spఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారాలకు సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసే నగదు మరియు లిక్కరు వాటిపై పటిష్టమైన నిఘా వుంచి సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు.

పోలీస్ అధికారులతో అక్రమ నగదు, లిక్కర్ పంపిణీ మరియు బందోబస్తు ఏర్పాట్లపై జరిగిన సమీక్షాసమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రకాలుగా నగదు, మందు అక్రమ మార్గాలలో డంప్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని, అటువంటి వాటిపై తగిన సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రదేశాలకు పోయి గుర్తించి, వాటిని సీజ్ చేయాలన్నారు. అలాగే 7వ తేదీ పోలింగ్ జరిగే ముందురోజున ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్, డియస్పీలు వెంకటనాథరెడ్డి, రాంబాబు, బాలవెంకటేశ్వరరావు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

anilనెల్లూరులోని ప్రశాంతినగర్, సింహపురి కాలనీలలో ఈ నెల 22న వైయస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7న జరిగే సాధారణ ఎన్నికల్లో దివంగత మహానేత కుమారుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు వేసే ఓటు రాబోయే 5సంవత్సరాలు రాష్ర్టాన్ని సుభిక్షంగా వుంచేలా రాజన్న సంక్షేమ పథకాలు సక్రమంగా సాగాలే చేస్తాయని తెలిపారు. అలాగే 165డివిజన్ లోని గుర్రాలమరుగు, సంగం, ఆదినగర్ ప్రాంతాలలో కూడా అనిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏ.బాలకోటేశ్వరరావు, కాకుటూరు విజయభాస్కర్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, గంగపట్నం వినయ్, మురళి, రామ్మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సుందరయ్య కాలనీ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న సుమోను లారీ ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మృతులు ఎన్నికల విధుల కోసం వచ్చిన పాట్నా పోలీసులుగా గుర్తించారు. అలాగే ప్రక్కనే ఉన్న 108 వాహనాన్ని కూడా లారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నవాపేటలోని బంగ్లా తోట వద్ద శాంతి ఇంగ్గీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ వల్ల పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. 

thyagarajనెల్లూరు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవాలు ఈ నెల 21 నుండి 27 వరకు టౌన్ హాలు ఆవరణలో వైభవంగా జరుగనున్నాయి. 2013న నవంబరు నుండి 2014 ఫిబ్రవరి వరకు నగరంలో భిక్షాటణ చేసి తద్వారా లభించిన నగదు, వదాన్యుల సహకారంతో వారం రోజుల పాటు ఈ సంగీతోత్సవాలు జరుగుతాయి. కీర్తిశేషులు శ్రీపతి పండితారాద్యుల సాంబమూర్తి, డా‖ యనమండ్ర వేంకటేశ్వర శాస్త్రిలు 49 ఏళ్ల క్రిందట ప్రాంభించిన ఈ ఉత్సవాలు సంగీత సరస్వతి త్యాగరాజ స్వామిపై భక్తితో ఏటికేటికి మీదు మిక్కిలి ఉత్సాహంతో జరుపుతుండడం విశేషం. నెల్లూరులోని ఔత్సాహిక గాయకులతో పాటు చెన్నైలోని శాస్త్రీయ సంగీత నిష్టాతులు ఈ స్మరణోత్సవాలలో తమ గాత్రాలతో, వాయిద్యాలతో మహానీయ వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజుని స్మరిస్తూ ఈ బాలగోపాలాన్ని ఆనందడోలికల్లో ఓలలాడించడం జరుగుతోంది. 21న నెల్లూరుకు చెందిన జె.వి.యస్.ఆర్.ఎస్.ప్రసాద్ అండ్ పార్టీ, 22న చెన్నైకు చెందిన దినేష్ కుమార్ అండ్ పార్టీ చే వాద్య సమ్మేళనం, 23, 24, 25, 26 తేదీల్లో చెన్నైకు చెందిన సిక్కిల్ గురుచరణ్ అండ్ పార్టీ, సాతూరు సిస్టర్స్ అండ్ పార్టీ, అమృతమురళి అండ్ పార్టీ, తోపూరు బి.సాయిరామ్ అండ్ పార్టీలచే గాత్రకచేరీలు వుంటాయి.

zp buildingనెల్లూరుజిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఆన్ రిజర్వుడ్ గా నిర్ణయించారు. గతంలోనూ ఈ పదవి జనరల్ లోనే ఉండటం విశేషం. అలాగే జిల్లాలోని 46జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు కూడా రిజర్వేషన్లను శుక్రవారం ప్రకటించారు.

rekha raniనెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్ గా జి.రేఖారాణి శుక్రవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు ఆమెను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Saturday, 15 February 2014 14:49

అనిల్ బైక్ ర్యాలీ

Written by

anil bykeపార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు నగర వైయస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా ఆయన వైయస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి బ్యాక్ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ భవన్ నుండి మినీబైపాస్ మీదుగా గాంధీబొమ్మ వరకు వందలాది బైక్లపై వెళుతూ బంద్ ను అనిల్ పర్యవేక్షించారు.

jayendraకంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురికావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే వైద్యులు అన్నీ పరీక్షలు నిర్వహించారు . ఆరోగ్యం నిలకడగానే వుందని డాక్టర్స్ చెప్పారు .  జయేంద్ర సరస్వతి ఆదివారం నెల్లూరు కి వచ్చారు .

Page 10 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter