నెల్లూరులో నేడు (167)

plasticస్వచ్ఛసర్వేక్షన్‌లో నెల్లూరును దేశంలోనే 20వ స్థానంలో నిలపాలంటూ మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌ ఫోటోలతో నగరంలో అక్కడక్కడా ఫ్లెక్సీలు చూస్తున్నాం. నిజమే... స్వచ్ఛసర్వేక్షన్‌లో నెల్లూరును అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అందరు కూడా సహకరించాలి. దేశంలో నెల్లూరుకు 20వ స్థానం కాదు, 1వ స్థానం వచ్చినా ఆనందమే! అసలు ఏ స్థానం రాకున్నా నగరం పరిశుభ్రంగా వుంటే ఇంకా ఆనందం. నెల్లూరును పరిశుభ్ర నగరాల జాబితాలో టాప్‌టెన్‌లో నిలపాలంటే ఎంతోకొంత ఖర్చుతో కూడుకున్న పని. అసలు నయాపైసా ఖర్చు లేకుండా చేయగల పని నెల్లూరును ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల రహిత నగరంగా మార్చడం. మున్సిపల్‌ మంత్రిగా వున్న పి.నారాయణే ముందుగా దీనికి పూనుకోవాలి. ప్లాస్టిక్‌ బ్యాగులు వాడని తొలి కార్పొరేషన్‌గా నెల్లూరును తయారుచేయాలి. ఆయన తలచుకుంటే ఇది పెద్ద సమస్య కూడా కాదు.

నేటి మానవసమాజాన్ని ప్లాస్టిక్‌ సంచులు ఏ విధంగా ఆక్రమించాయో చూస్తూనే వున్నాం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా మన దైనందిన కార్యకలాపాలలో అవి ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఉదయాన్నే ప్లాస్టిక్‌ పాలప్యాకెట్‌తోనే జీవితం మొదలవుతుంది. ప్లాస్టిక్‌ కవర్లలో కూరగాయలు, ప్లాస్టిక్‌ క్యాన్‌లలో

నీళ్ళు... ప్లాస్టిక్‌ కవర్‌లు, ప్లాస్టిక్‌ డబ్బాలలో టిఫిన్‌, వేడివేడి సాంబార్‌ పార్సిళ్ళు, ప్లాస్టిక్‌ బౌల్స్‌లో బిర్యాని పార్శిళ్ళు, ప్లాస్టిక్‌ కవర్లలో కర్రీస్‌ పార్సిల్‌... ఇలా ఒకటేమిటి... ప్రతి చోటా మనకు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు నిత్యావసర వస్తువులుగా మారాయి.

ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులతో వచ్చే అనర్ధాల గురించి ప్రతి రోజూ వైద్యులు చెబుతూనే వున్నారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధితో పాటు మరెన్నో వ్యాధులకు ఈ ప్లాస్టిక్‌ భూతమే కారణం. ప్లాస్టిక్‌ తొందరగా మట్టిలో కలిసిపోదు, డ్రైనేజీ కాలువల్లో ఈ కవర్లు పడితే డ్రైనేజీ బ్లాక్‌ అవుతుంది. చెత్తకుండీల వద్ద పడివున్న వృధా ఆహారపదార్ధాలతో పాటు ఈ ప్లాస్టిక్‌ కవర్లను మింగేయడం వల్ల ఆవులు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు చేటుగా మారిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నిషేధించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. 40మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ కవర్లు అమ్మకూడదని ప్రభుత్వం కూడా నిషేధం పెట్టింది. అయితే నెల్లూరులో ప్లాస్టిక్‌ నిషేధం అమలు కావడం లేదు. గతంలో నాలుగైదు సార్లు దాడులు నిర్వహించి, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను స్వాధీనం చేసుకుపోవడం తప్పితే పకడ్బందీగా అమలు చేసిన దాఖలాలు లేవు. ముందు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల ఉత్పత్తులను నిలిపేయాలి. దుకాణాలలో గుడ్డసంచులు లేదా జనపనార సంచులు మాత్రమే అమ్మాలి. నిషేధించిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను అమ్మే లేదా వాడే వ్యాపార దుకాణాలపై గట్టి చర్యలు తీసుకోవాలి. అధికారులతో తరచు తనిఖీలు నిర్వహిస్తుంటే ప్రజలు కూడా క్రమక్రమంగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించుకుంటారు.

marketనెల్లూరు ఏ.సి కూరగాయల మార్కెట్‌... తూకాలలో నిలువెత్తు మోసం... రెండు కిలోల టమోటాలు 20 రూపాయలంటారు... అక్కడ కొని ఇంకో చోట తూకం వేస్తే ఒకటిన్నర కిలో కూడా వుండవు. ఏ కూరగాయ లైనా కనీసం అరకేజీ తీసుకోవాలి. పావుకిలో అడిగిన వాళ్ళను చాలా చీప్‌గా చూస్తారు. కూరగాయలు ఏరుకోవడం అసలే వుండదు. ఎవరన్నా మంచివి ఏరుకుందామని గంపల్లో చేతులు పెడితే పురుగును విదిల్చినట్లు విదిలిస్తారు. ఇష్టముంటే కొనండి, లేకుంటే పోండి అన్నట్లు ఈసడించుకుంటారు. గతిలేక ఇక్కడ కూరగాయలు కొనాల్సిందే!

గతంలో ప్రభుత్వం నగరంలో రెండు చోట్ల రైతుబజార్‌లను ఏర్పాటు చేసినా అక్కడ అన్నిరకాల కూరగాయలు దొరికే పరిస్థితి లేకపోవడంతో కాలక్రమేణ అవి మూతపడ్డాయి. ఏ.సి కూర గాయల మార్కెట్టే కింగ్‌ అయ్యింది.

ఇక్కడ తూకాల మోసాలు, నకిలీ లైసెన్స్‌లపై ఎన్నోసార్లు కలెక్టర్‌, జేసీ, తూ.కో శాఖాధి కారులు దాడులు చేసారు. ఎన్నో అక్రమాలను వెలుగులోకితెచ్చారు. తూకాల్లో తేడాలను తేల్చారు. ఒకరి లైసెన్స్‌లతో ఇంకొకరు వ్యాపారం చేయడం గుర్తించారు. వ్యాపా రులకు హెచ్చరికలు చేశారు. అయినా ఏం లాభం... మార్కెట్‌లో మోసాలు ఆగిం దెప్పుడు? మొన్న కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాల తూనికలు కొలతల శాఖాధికారులు ఏ.సి మార్కెట్‌లో భారీఎత్తున దాడులు నిర్వహించారు. కాటాల్లో మోసాలు, తూకాల్లో తేడాలు గుర్తించారు. అయినా ఏం లాభం... మార్కెట్‌లో మోసాలు ఆగేది లేదు... వినియోగదారులకు న్యాయం జరిగేదీ లేదు.

Friday, 02 February 2018 13:50

మారని మువ్వా!

Written by

muvvaఒక్కొక్కరికి ఒక్కో సహజ లక్షణం ఉం టుంది. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు పనిష్‌ మెంట్లు ఇచ్చినా ఆ సహజలక్షణాన్ని మార్చు కోలేరు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు కదా... ఈ సహజ లక్షణాలు కూడా అటువంటివే!

మువ్వా రామలింగం... ఈ పేరు వినగానే జిల్లాలో ఎవరికైనా గుర్తొచ్చేది వివాదాలు, అక్రమాలు. ఎక్కడ పనిచేస్తున్నా, లేదా ఎక్కడకి బదిలీపై వెళ్తున్నా ఆయన వివాదాలను చంకలో పెట్టుకుని పోతుంటాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా వుంటూ పలు ఆరోపణలకు గురైన మువ్వాను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. అయితే ఆయన జిల్లాలోనే వుండాలని చెప్పి పైరవీలు చేసి బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ తెచ్చుకుని గత ఏడాది నవంబర్‌ 1న బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే మళ్ళీ అక్కడ వివాదాలకు ఆజ్యం పోశాడు. మువ్వా చర్యలపై ఆగ్రహించిన అక్కడి సిబ్బంది, బిఇడి ట్రైనింగ్‌ విద్యార్థులు, పాఠశాలల విద్యాశాఖ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల నెల్లూరుకొచ్చిన విద్యాశాఖ కమిషనర్‌ సంథ్యారాణి కూడా బి.ఇడి కళాశాల గొడవలపై కలెక్టర్‌ను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాలతో తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ శ్రీమతి ప్రశాంతి బి.ఇడి కళాశాలలో ఏం జరిగిందనే దానిపై విచారించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే మువ్వా రామలింగంను బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బి.ఇడి కళాశాలకు ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌గా డి.ఇ.ఓ శ్యామ్యూల్‌ను నియమించారు.

తన ఉద్యోగ జీవితంలో మువ్వా రామలింగం వివాదాలు లేకుండా పని చేసిన దాఖలాలు లేవు. 1997 ప్రాంతంలో జిల్లా డిప్యూటి డి.ఇ.ఓగా పని చేశాడు. అప్పుడంతా వివాదాలు, అయ్యవార్లతో విభేదాలమయమే. ఆ తర్వాత గుంటూరు, కర్నూలు, ఒంగోలులలో డి.ఇ.ఓగా పని చేసినా గొడవలు, ఏసిబి కేసులు. నెల్లూరుకు వచ్చాక కూడా అదే వివాదాలు... ఇతను మారడంతే!

opvనెల్లూరీయులు నిత్యావసర వస్తు వుల కోసం ఇక నానా హైరానా పడనక్కరలేదు. నేరుగా, మీ ఇంటికే..మీ చెంతకే అందుబాటులోకి వచ్చేసింది ఆన్‌లైన్‌ ప్రొవిజన్స్‌. ఇక ఏ చింతా అక్కరలేదు. మీ ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఫ్యాన్సీ ఐటమ్స్‌, బేబి టాయ్స్‌, బర్త్‌డే కేక్స్‌..ఏది కావాలన్నా సరే, ఒక్క ఫోన్‌తోనే మీరు వాటిని పొందే సదవకాశం వచ్చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో మనకు అవసరమైన వస్తువులను తెచ్చుకు నేందుకు తగిన సమయం కూడా ఉండాలి. ఎంతెంతో దూరం వెళ్లి వాటిని తెచ్చుకోవాలి. ఇక, అలాంటి శ్రమ ఏదీ ఉండదు. ఫోన్‌ ద్వారానైనా, వాట్సాఫ్‌ ద్వారానైనా సరే మీరు ఆర్డర్‌ చేస్తే చాలు... ఆయా వస్తువులు మీ ఇంటి ముంగిట్లోకి వచ్చి వాలుతాయి. నాణ్యత, సరసమైన ధర, ఫ్రీ హోమ్‌ డెలివరీ అన్నీ కలగలిసి మీ చెంతకు వచ్చేసింది.. ఆన్‌లైన్‌ ప్రొవిజన్స్‌. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 'ఆన్‌లైన్‌ ప్రొవిజన్స్‌ డాట్‌ కామ్‌'పై క్లిక్‌ చేస్తే మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు మీ ఇంట్లో

ఉన్నట్లే. సింహపురి ప్రజలకు ఇదే మా ఆహ్వానం. మా ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని 'ఆన్‌లైన్‌ ప్రొవిజన్స్‌' ఫోన్‌ నంబర్లు : 9291292913, లేదా 9866770305 లతో సంప్రదించవచ్చు.

Friday, 12 January 2018 07:18

ముగిసిన పజ్రాబాట

Written by

kotam'మన ఎమ్మెల్యే మన ఇంటికి' అంటూ నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాబాట కార్యక్రమం ఈ నెల 12వ తేదీతో ముగిసింది. సెప్టెంబర్‌ 30వ తేదీ విజయదశమి పర్వదినాన నియోజకవర్గానికి ఈశాన్యం ప్రాంతమైన కోడూరుపాడు నుండి ప్రజాబాటను ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు తన ఇంటి ముఖం చూడలేదు. 105రోజుల పాటు ప్రజల మధ్యే నీళ్ళు, నిద్ర, తిండి అంతా కూడా! నియోజకవర్గంలోని అన్ని రూరల్‌ గ్రామాలతో పాటు రూరల్‌లోకి వచ్చే కార్పొరేషన్‌ డివిజన్‌లలోనూ పర్యటించారు. ప్రతి గడప తొక్కారు. ప్రతి ఇంటి తలుపుతట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలపై అధికారులతో మాట్లాడారు. 105రోజుల పాటు ప్రజల మధ్యనే గడిపారు. 12వ తేదీన రామలింగాపురంలోని ముత్యాలపాలెంలో పర్యటించారు. అక్కడే ప్రజాబాట ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

gutkaనిషేధిత గుట్కా, ఖైనీలు నెల్లూ రులో ఎక్కువుగా దొరుకుతున్నాయి. సుప్రీంకోర్టు గుట్కాలపై నిషేధం విధించాక వీటిని బహిరంగంగా విక్రయించడం నిలిపేశారు. అయితే కొన్ని టీ, చిల్లర దుకాణాలలో చాటు మాటుగా అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏ వస్తువులనైతే నిషేధి స్తుందో మార్కెట్‌లో ఆ వస్తువుకు డిమాండ్‌ ఎక్కువుగా వుంటుంది. దాంతో ఆదాయం కూడా బాగానే వుంటుంది. ఈ కోవలోనే గుట్కాలు కూడా పెద్ద ఆదాయ వనరుగా మారాయి. నెల్లూరులో కొందరు గుట్టుచప్పుడు కాకుండా గుట్కాలను తయారు చేయడం, ఇళ్ళల్లోనే నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేయడం చేస్తున్నారు. గతంలో పోలీసులు గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి వాటిని మూసేయించారు. కాని వీటి ద్వారా ఆదాయం మరిగిన కొందరు వ్యక్తులు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల ద్వారా కర్నాటక, తమిళనాడుల నుండి గుట్కాలను తెప్పించుకుని స్థానికంగా అమ్ముతున్నారు. మొన్న ఇలాంటి ముఠానే క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఇంకా కూడా కొందరు ఇదే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే గుట్కాలను జిల్లా నుండి పూర్తిగా తరిమికొట్టేలా పోలీసులు కఠినంగానే వ్యవహరించాల్సి వుంది.

kotamనెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన పర్యటనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు ఆ ప్రజలకు సేవ చేయ డమే పరమావధిగా భావించిన శ్రీధర్‌రెడ్డి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు సమా యత్తమయ్యారు. 105 రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమానికి స్వయంగా ప్రణాళిక రూపొందించుకుని ఇంటింటికీ వెళ్ళి ప్రజలను నేరుగా కలుసుకుని వారితో మాట్లాడి, వారి అవసరాలేమిటో తెలుసుకుని ఆ మేరకు ప్రజల సమస్యలను తీర్చేందుకు సంకల్పించారు. ఈ నెల 13వ తేదితో ఈ మహత్తరమైన ప్రజాబాట కార్యక్రమం 75 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి 23వ డివిజన్‌లోని జనశక్తి నగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఇన్నిరోజులు ఏఏ కార్యక్రమాలను నిర్వర్తించారో తెలియజేశారు. ఈ 75 రోజుల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 38 గ్రామాల్లో ప్రజాబాట పూర్తయిందన్నారు. అదేవిధంగా నగరంలోని 21 కాలనీల్లో ప్రజాబాట ద్వారా ప్రజలను కలుసుకున్నామన్నారు. మొత్తంగా 31,012 ఇళ్ళకు వెళ్ళి, నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నామని, ఇప్పటిదాకా సుమారు లక్షా 10వేల మంది ప్రజలను కలుసుకున్నామని ఆయన వివరించారు. 73 చోట్ల విద్యార్థులతోను, రైతులతోను, పొదుపు మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, చేనేతకారులు, గిరిజనులు, బిసిలు, దళితులు, మైనార్టీలు..ఇలా అన్నివర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నానన్నారు. తాను ప్రజలను కలుసుకున్నప్పుడు అనేకమంది తమకు ఇళ్ళస్థలాలు ఇప్పించి ఆదుకోవాలని, పింఛన్లు ఇప్పించాలని కోరారని, అనేకమందికి ఇంకా రేషన్‌కార్డులు కూడా లేవని, కాలనీల్లో కనీస వసతులు లేవని, పక్కా రోడ్లు కానీ, డ్రైనేజీ సౌకర్యాలు కానీ లేవని తెలిపారన్నారు. మంచి నీటి వసతులు కూడా సరిగా లేవని, అదేవిధంగా నిరుద్యోగ సమస్యతో యువత ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్యలన్నిటినీ ఏరోజుకారోజు ఎస్‌ఎంఎస్‌, వాట్సాఫ్‌ల ద్వారా, తన కార్యాలయ సిబ్బంది ద్వారా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానన్నారు. ఈ సమస్యలు విన్నవించాక కొంతమంది అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నారని, మరికొందరు ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని ఆయన ఆవేదనగా అన్నారు. న్యాయమైన ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు స్పందిస్తే, ప్రజాబాట పూర్తయిన తరువాత వారిని పూలమాలలతో సత్కరిస్తామన్నారు. ప్రజాసమస్యలపై స్పందించకుంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట మధ్యలోనే మెరుపు ధర్నాలు, నిరసన దీక్షలకు దిగుతున్నానన్నారు. ప్రజాబాటలో గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం సాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసమస్యల సాధన కోసం జాతిపిత గాంధీజీ చేసిన ప్రజాఉద్యమం లాంటిదే మన ఎమ్మెల్యే-మన ఇంటికి కార్యక్రమమని ఆయన ఈ సందర్భంగా తెలియ జేశారు. ఏదేమైనా, ఒక ఎమ్మెల్యే ఇలా ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమన్నది ఎంతో అరుదైన విషయమని ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.

dummur'చంద్రముఖి' సినిమా చాలావరకు చూసే వుంటారు. ఆ సినిమాలో మొదటి ఫైట్‌లో హీరో రజనీకాంత్‌ కాలును గిరగిర గాలిలో తిప్పి గట్టిగా నేలకేసి కొడితే నేల విచ్ఛిన్నమై ధుమ్ము మేఘాల మాదిరిగా లేస్తుంది. ఇప్పుడు నెల్లూరు రోడ్ల మీద కాలిని అలా గిరగిర తిప్పి కొట్టబల్లేదు... మామూలుగా అడుగువేసినా ధుమ్ము ధట్టంగా లేస్తుంది. పాలకులేమో నెల్లూరును సుందరనందన బృందావనం చేస్తామని హామీలు ఇచ్చివున్నారు. నగరం సుందర బృందావనం మాట దేముడెరుగు, ధుమ్ము ధూళి మయంగా మారింది. ఏ రోడ్డులో, ఏ వీధిలో చూసినా మట్టి, డస్ట్‌ పౌడర్‌ దట్టంగా లేస్తుంది. ముందు కారు పోతుంటే వెనుక ద్విచక్రవాహనంలో కళ్ళు తెరుచుకుని పోలేని పరిస్థితి. భూగర్భ డ్రైనేజీ, మంచి నీటి పైప్‌లైన్‌లు అంటూ నగరంలో ప్రతి రోడ్డును తవ్వి పెట్టారు. ఇక మినీబైపాస్‌ రోడ్డును తవ్వుతున్నారు. తవ్వినచోట మళ్ళీ పూడ్చి దానిపై డస్ట్‌ వేస్తున్నారు. వాహ నాలు దానిపై వెళుతున్నప్పుడు దట్టంగా ఆ పౌడర్‌ లేస్తుంది. వెనుక వాహనాలలో వుండే వాళ్ళు ఒంటికి, తలకు పౌడర్‌ అద్దినట్లువుతోంది. ఒక మనిషి ఇంట్లో శుభ్రంగా తల స్నానం చేసి నెల్లూరురోడ్లపై 15 నిముషాలు తిరిగితే చాలు... నెత్తి మీద జుట్టు సిమెంట్‌రోడ్డులాగా అట్ట కట్టుకుపోతుంది. నెల్లూరు నగరాన్ని బెస్ట్‌ సిటీగా కాకుండా, డస్ట్‌ సిటీగా చేసి పెట్టారు మనోళ్ళు.

Friday, 01 December 2017 13:02

పేదోడికి...ధరాఘాతం

Written by

kuragayaluనిత్యావసర వస్తువులు, కూరగా యల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక అల్లాడుతున్నారు. ఎన్నడూలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. కోడిగుడ్లు మొదలుకుని, ఉల్లిపాయలు, చింతపండు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నూనెలు కూడా ఎక్సైజ్‌ సుంకం రెట్టింపవడంతో కిలోపై సుమారు రూ.10లు పెరిగి సామాన్య ప్రజలు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. దీంతో ఒక్కొక్క కుటుంబంపై ప్రతినెలా అదనపు భారం పడుతోంది. చింతపండు కర్ణాటకలోని తుమ్‌కూరు, హిందూపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. ప్రస్తుతం అక్కడ కొత్తపంటకు, పాత పంటకు మధ్య రోజులు కావడంతో ఇలా ఒక్కసారిగా ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుమతులు చేసుకునే నూనెలకు ఎక్సైజ్‌ డ్యూటి రెట్టింపు కావడంతో కిలో నూనెపై దాదాపు రూ.10లు పెరిగింది. దిగుమతులు చేసుకునే నూనెలపై గతంలో ఎక్సైజ్‌ డ్యూటి 12.5శాతం ఉండగా ఇటీవల అది రెట్టింపు 25శాతానికి చేరుకుంది. దీంతో పామాయిల్‌, రీఫండ్‌ ఆయిల్స్‌తో పాటు ఇతర అన్ని రకాల నూనెల ధరలు పెరిగాయి. అదేవిధంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో పేద మధ్య తరగతి ప్రజల జీవన విధానం భారంగా మారింది. గత నెలలో రూ.4.50 ఉన్న కోడిగుడ్డు ప్రస్తుతం రూ.6.50కు చేరుకుంది. పెరిగిన ధరలతో ప్రజలు ఏం కొని, ఏం తినాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5000ప్రాణం పోసే దేవుడిని మనుషులు చూడ లేరు... ప్రాణం నిలిపే దేవుడు వైద్యుడిని మాత్రం అందరూ చూడగలరు. భారతదేశంలో వైద్య వృత్తిని అంత పవిత్రంగా చూస్తారు. వైద్యవృత్తిని మాన వతా కోణంలో, సేవాదృక్పథంతో చూసే వాళ్ళు ప్రజల గుండెల్లో దేవుళ్ళుగానే వుంటారు. అదే వైద్యవృత్తిని మాన వత్వంతో కాక వ్యాపార కోణంలో చూసే వాళ్ళు ప్రజల మస్తిష్కాలలో బందిపోటుల కన్నా దారుణమైన దోపిడీదారు లుగా ముద్రపడిపోతారు.

చచ్చిన పేషంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేసి లక్షలు గుంజే 'ఠాగూర్‌' సినిమా సీన్‌లు నిజజీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇవి కాకుండా కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయడం... ఎడమ కాలుకు బదులు కుడి కాలికి ఆపరేషన్‌ చేయడం, కంటి నొప్పి అని పోతే పంటి నొప్పికి మందులివ్వడం, ఆసుపత్రులలో ఎలుకలు కొరికి బిడ్డలు చనిపోవడం... మన వైద్య రంగంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి అద్భుతాలలో ఇంకోటి... ఒక రోగం టెస్ట్‌ కోసం పోతే సకల రోగాలకు టెస్ట్‌లు వ్రాసి డబ్బులు గుంజడం. వైద్య రంగంలో ఇదో పెద్దదోపిడీ! పేషంట్‌ రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా ఒక వ్యాధికి సంబంధించి పరీక్ష చేయించు కోవాలనుకుంటే, అలాంటి వారికి డాక్టర్లు హెల్త్‌ ప్యాకేజీ అంటగట్టి వేల రూపాయలు దండుకోవడం... ఇదొక మెడికల్‌ దోపిడి. నెల్లూరు పొగతోటలో డయాబెటిస్‌ సెంటర్‌ వుంది. ఇటీవల ఓ వ్యక్తి షుగర్‌ పరీక్షకని వెళ్ళాడు. అతనికి షుగర్‌ సమస్య తప్ప ఇంకేమీ లేదు. షుగర్‌ టెస్ట్‌కు 300 రూపాయలు. అది కొంచెం కాస్ట్‌లీ ఆసుపత్రి కాబట్టి ఇంకో రెండొందలు అదనంగా తీసుకున్నా సమస్య లేదు. అతను షుగర్‌ టెస్ట్‌కని వెళితే తమ ఆసుపత్రిలోని ల్యాబ్‌లో వున్న అన్ని రకాల టెస్ట్‌లను ఆయనకు వ్రాసారు. ఇందులో 64ఏళ్ల వయసున్న ఆ వ్యక్తికి రాసిన టెస్ట్‌లలో హెచ్‌ఐవి టెస్ట్‌ కూడా వుంది. అంతేకాదు, అవసరం లేని టెస్ట్‌లన్నీ ఇంకా ఎన్నో వున్నాయి. ప్యాకేజీలో వున్న ఇన్ని టెస్ట్‌లను రక్తనమూనాతో నిజంగానే చేస్తున్నారో, లేకపోతే ఏదో ఒక రిజల్ట్‌ వేసి రిపోర్ట్‌ పత్రాలు ఇస్తున్నారో అన్నది ఒక అనుమానం. పేరుకేమో షుగర్‌టెస్ట్‌ వందరూపాయలే... అతనికి కావాల్సిన టెస్ట్‌ చేస్తే ఖర్చు వంద రూపాయలే... అవసరమైన టెస్ట్‌ ఒకటైతే, అనవసరమైన టెస్ట్‌లు పాతికపైగా వ్రాసి అక్షరాలా 5వేల రూపాయలు గుంజారు. ఇలా రోజుకు ఎంతమంది పేషంట్ల నుండి గుంజుతున్నారో... ఎన్ని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారో? రోగాలను బూచిగా చూపి వైద్యులు ఇలాంటి దోపిడీకి పాల్పడితే ఇక పేషంట్లు కరెన్సీ నోట్లతో కాకుండా ఆస్తుల పత్రాలను తీసుకుని ఆసుపత్రులకు వెళ్ళాల్సి వుంటుంది. ముఖ్యంగా ఈ డాక్టర్‌ రోగుల రక్తాన్ని జలగలా పీల్చడంలోనూ తద్వారా వచ్చే సంపాదనతో నగరమంతా అక్రమ కట్టడాలను నిర్మించడంలోనూ ఆరితేరి పోయి వున్నాడు. తన క్లినిక్‌లోనే పరీక్షా కేంద్రం పెట్టి అక్కరకు లేని టెస్టులన్నీ రాసిపారేసి రక్తం పీల్చేస్తున్నాడు. చక్కెర వ్యాధి డాక్టరుగా ఆయన ఫీజు 200 రూపాయలైతే ఆయన రాసే పరీక్షలకు 5000 రూపాయలంటే ఈయన గారి దోపిడీ ఏ స్థాయిలో వుందో మనం ఊహించుకోవచ్చు.

Page 2 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter