నెల్లూరులో నేడు (167)

anilనెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల కోసం ఈ నెల 26వ తేదీ నుండి ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈనెల 17వతేదీన నెల్లూరు లోని ఎం.సి.ఎస్‌ కళ్యాణ మండపంలో వైయస్సార్‌ కుటుంబం ముగింపు సభ మరియు నియోజకవర్గ వైసిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 21వ తేదీన చేపట్టాల్సిన ప్రజాదీవెన కార్య క్రమాన్ని 'వై.యస్‌.ఆర్‌ కుటుంబం' కార్య క్రమం కారణంగా ఈనెల 26కు వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజాదీవెనలో నగరం లోని ప్రతి ఇంటికొస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. జగనన్న చెప్పిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తామని, ప్రజల దీవెనలతో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నెల్లూరు నగరంలో 'వైయస్‌ఆర్‌ కుటుంబం' ఎంతో విజయవంతమైందని, 40వేల కుటుంబాలు పార్టీకి చేరువయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ ఎం.ద్వారకానాథ్‌, కార్పొరేషన్‌ వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

loksabhaఏపిలో ఎక్కడైనా తెలుగుదేశంపార్టీకి తిరుగుండదేమో... ఒకసారి ఓడిన చోట మరోసారైనా గెలుస్తుందేమో... కాని రాష్ట్రంలో కడప తర్వాత తెలుగుదేశంకు మింగుడుపడని నియో జకవర్గం నెల్లూరే! అది లోక్‌సభ అయినా శాసనసభ అయినా?

తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 7సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ గెలిచింది రెండే రెండుసార్లు. 1983లో ఆనం రామనారాయణరెడ్డి, 1994లో టి.రమేష్‌రెడ్డిలు మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులుగా ఇక్కడ గెలవగలిగారు. ఇక తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించాక 9సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉపఎన్నికను కలిపితే నెల్లూరు పార్లమెంటుకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే నెల్లూరు పార్లమెంటులో తెలుగుదేశం గెలిచింది. 1985ఎన్నికల్లో పుచ్చలపల్లి పెంచ లయ్య, 1999ఎన్నికల్లో ఉక్కాల రాజేశ్వరమ్మలు తెలుగుదేశం అభ్యర్థులుగా విజయం సాధించగలిగారు. ఈ పదింటిలో 6సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు, 2సార్లు వైకాపా అభ్యర్థి విజయం సాధించ గలిగారు. 2009లో నెల్లూరు లోక్‌సభ రిజర్వ్‌డ్‌ కేటగిరిలో నుండి జనరల్‌లోకి మారింది. అయినా కూడా తెలుగుదేశం పరిస్థితి మారలేదు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్‌సభలోనూ తెలుగుదేశం బలహీనంగానే వుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నెల్లూరు లోక్‌సభ అభ్య ర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని దించింది. ఆయన గట్టి పోటీయే ఇచ్చాడు. గెలుపుకు కొద్ది తేడాతో మిస్సయ్యాడు.

కేంద్రంలో పట్టు నిలుపుకోవాలంటే అసెంబ్లీలో మెజార్టీని సాధించడంతో పాటు అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసు కోవాలి. 2014 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో చంద్రబాబును మోడీ వేలిమీద వెంట్రుకతో సమానంగా చూసాడు. కాని, వచ్చే ఎన్నికల్లో అంత స్వీప్‌ పరిస్థితి వుండదు. మిత్రపక్షాల ఎంపీ స్థానాలపై ఆధారపడాల్సి వుంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను సాధించడం ముఖ్యమే! ఈ దృష్టిలోనే తెలుగుదేశంకు మింగడుపడకుండా వున్న నెల్లూరు లోక్‌సభపై చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైకాపాను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థికై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Friday, 06 October 2017 07:48

పోటెత్తిన భక్తజనం

Written by

rotteనెల్లూరు నగరంలో అత్యంత భక్తిశ్రద్ధ లతో పవిత్రంగా.. వైభవాతి వైభవంగా జరిగే రొట్టెల పండుగకు భక్తజనం పోటె త్తారు. మన జిల్లా, రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాం తాల నుంచి, ఎంతెంతో దూరం నుంచి భక్తులు తండోపతండాలుగా నెల్లూరుకు తరలిరావడంతో నగరం భక్తజనసము ద్రంలా కనిపించింది. కులమతాలకు అతీతంగా.. మతసామరస్యానికి ప్రతీకగా ప్రజలు సమైక్యనాదంతో..భక్తిభావంతో ఇక్కడకు విచ్చేసి, ఎంతో పవిత్రమైన బారా షహీద్‌ దర్గాను సందర్శించుకున్నారు. దీంతో, నెల్లూరు నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనులతో నగరంలో ఎక్కడ చూసినా భక్తిభావనలు వెల్లివిరిశాయి.

ఈ నెల 1 నుంచి 5వ తేది వరకు నెల్లూరు నగరంలో పెద్దఎత్తున జరిగిన రొట్టెల పండుగను పురస్కరించుకుని నిర్వా హకులు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారయంత్రాంగంతో పాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ ఈ అయిదు రోజులు రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఇబ్బం దులు లేకుండా చూసారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సంద ర్భంగా, బారాషహీద్‌ దర్గాను నిర్వాహ కులు శోభాయమానంగా అలంకరించారు. సోమవారం అర్ధరాత్రి గంథమహోత్సవం కన్నులపండువగా సాగింది. గంధం స్వీక రించేందుకు భక్తులు పోటీపడ్డారు. కోట మిట్టలోని అమినీయా మసీదు నుంచి మతపెద్దలు, నగర మేయర్‌ అజీజ్‌, వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ హుస్సేనీల పర్యవేక్షణలో 12 బిందెల్లో గంధం కలిపి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. షేక్‌ బాషా తదితరులు 12మంది అమరవీరులకు (బారాషహీద్‌) 12బిందెల్లో గంధాన్ని ఊరేగింపుగా బారాషహీద్‌ దర్గా వద్దకు తీసుకువచ్చారు. వక్ఫ్‌బోర్డు రాష్ట్ర డిప్యూటి కార్యదర్శి మహమ్మద్‌ హనీఫ్‌, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్లు మహమ్మద్‌ హుస్సేన్‌, ఖాజా మస్తాన్‌ తదితరులు ఆ గంధాన్ని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా దర్గాకు విచ్చేసిన మంత్రి డా.పి.నారాయణ మాట్లా డుతూ, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ తాను స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకు న్నానన్నారు. బారాషహీద్‌ దర్గాకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగు తున్నారని, అది ఈ దర్గా విశిష్టతకు, ప్రాశ స్త్యానికి ప్రతీక అని అన్నారు. ప్రభుత్వం ఈ రొట్టెల పండుగను ఎంతో ప్రతిష్టాత్మ కంగా భావిస్తోందని అన్నారు. ఈ సంద ర్భంగా మంత్రితో పాటు మేయర్‌ అజీజ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఢిల్లీరావు తదితరులున్నారు.

భక్తులతో బారాషహీద్‌ దర్గా కిటకిట

ఈ అయిదురోజులు ఎంతో సంరం భంగా జరిగిన ఈ పండుగలో భక్తులు లక్షలాదిగా పాల్గొన్నారు. ఏరోజుకారోజు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి లక్షల్లోకి చేరుకుంది. బుధవారం తహలీల్‌ ఫాతెహా గంధమహోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఈ వేడుకలో ఛైర్మెన్‌ సిద్ధిక్‌, ముజా వర్లు రఫీ, ఆలీ, మతపెద్దలు హయత్‌, హుసేనీ, వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొని గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చి, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బుధవారం సినీ హాస్య నటుడు ఆలీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌ నాధరెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పురపాలక మంత్రి నారాయణ, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మి రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఇంకా పలువురు నాయకులు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గత ఏడాది కంటే ఈసారి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు బారాషహీద్‌ దర్గాకు విచ్చేశారు. దర్గా చెంతనే ఉన్న స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలు పట్టుకుని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధించుకున్నారు. అలా ఇక్కడ వరాల రొట్టెను స్వీకరిస్తే భగవంతుని అనుగ్రహంతో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, జీవితంలో తమకెన్ని కష్టాలున్నా తొలగిపోతాయని, అన్నిశుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

kotam sridhప్రజానాయకుడు కావాలంటే వందేళ్ళ రాజకీయ చరిత్ర ఉండాలా? తాతలు, తండ్రులు మంత్రులు, ఎంపీలై వుండాలా? వందలకోట్ల ఆస్తు లేమన్నా ఉండాలా? ఈ ప్రశ్నలకు 'అవును' అనే సమాధానం ఉంటుంది. ఈ 'అవును' అనే సమాధానికి ఉదాహరణగా తాతలు, తండ్రుల వారసత్వంతో మన కళ్ళ ముందే రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. ప్రజానాయకుడు కావాలంటే ఇవన్నీ అవసరం లేదు అనే జవాబుకు మాత్రం నెల్లూరుజిల్లాలో నిలువెత్తు నిదర్శనం గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఓ వ్యక్తి రాజకీయ నాయకుడే కాదు ప్రజలు మెచ్చిన నాయకుడు కూడా కాగలడని నిరూపించుకున్న ఎమ్మెల్యే అతను. మూడున్నరేళ్ల కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాకున్నా అటు ప్రభుత్వంతో పోరాడుతూ, ఇటు అధికారుల చుట్టూ తిరుగుతూ తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నిద్ర లేచింది మొదలు వారితోనే వుంటున్నాడు. తెల్లారింది మొదలు ఆయన సమస్యలను వెదుక్కుంటాడు, వాటి పరిష్కారానికి పంతం పడతాడు. సమస్యలతో బాధపడే ప్రజలను తన కార్యాలయానికి తిప్పించుకోవడం కాదు, సమస్యల్లో వున్న ప్రజల చెంతకు తానే వెళ్లాలన్నది ఆయన విధానం. ఓట్లడిగినప్పుడు ఏ గుమ్మం అయితే ఎక్కాడో, ఎమ్మెల్యే అయ్యాక కూడా అదే గుమ్మం ఎక్కాలని తనను ఓటేసి దీవించిన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆయన తపన. ఈ ఆలోచనతోనే 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' పేరుతో ప్రజల మనసులకు మరింత చేరువయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయదశమి పర్వదినాన నెల్లూరు రూరల్‌ మండలంలోని కోడూరుపాడు గ్రామం నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. నెల్లూరురూరల్‌ గ్రామాలతో పాటు రూరల్‌ పరిధిలోని నెల్లూరు కార్పొరేషన్‌ డివిజన్‌ లలో కూడా 105రోజుల పాటు ఆయన పర్యటి స్తారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ తారు. ప్రతి ఒక్కరిని పలుకరిస్తారు. ప్రతిఒక్కరి సమస్యలు వింటారు. ఈ మూడున్నరేళ్లకాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను చేసిన పనులు వివరి స్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తారు. అన్నపానీ యాలు అన్నీ ప్రజల మధ్యే! ప్రజలు, కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తారు. ఒకరోజు రాత్రి ఏ ఇంటి వద్దయితే 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' కార్య క్రమం పూర్తవుతుందో, పక్కరోజు అదే ఇంటి వద్దనుండి కార్యక్రమం మొదలు పెడతారు. ప్రజలతో పాటు గ్రామాలు, డివిజన్‌లలో వున్న వైసిపి బూత్‌ కమిటి సభ్యుల ఇళ్లకు కూడా వెళతారు. వారితో స్థానిక పరిస్థితులు, సమస్యలపై పది నిముషాలు చర్చిస్తారు. నియోజక వర్గ పరిధిలో జరిగే వివాహాలు, కర్మంత్రాలు వంటి కార్యక్రమాలకు మధ్యమధ్యలో హాజరైనా అసలు కార్యక్రమానికి బ్రేక్‌ వుండదు. ముఖ్యంగా కార్యక్రమాన్ని బాణాసంచా, డప్పులు, పూలదండలు, భారీ జనం వంటి ఆర్భాటాలకు దూరంగా కేవలం ఒక బిడ్డ తన తల్లిదండ్రుల ఇంటికి వస్తున్నంత ఆనందకర వాతావరణం ఉట్టిపడే రీతిలో నిర్వహించాలని కోటంరెడ్డి నిర్ణయించడం విశేషం. ఎమ్మెల్యే కాకముందే 2014 ఎన్నికలకు ముందే ప్రజాదీవెన పేరుతో 141రోజుల పాటు నెల్లూరు నియోజకవర్గంలో గడపగడప తొక్కిన రికార్డు ఆయనకుంది. ఈ రోజు వైసిపి చేపట్టిన గడపగడపకు వైకాపా, తెలుగుదేశం వాళ్ళ ఇంటింటికి టీడీపీ, బీజేపీ వాళ్ళ గుండె గుండెకు బీజేపీ వంటి కార్యక్రమాలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎప్పుడో ఆచరించి చూపినదే! ఆయన కాన్సెప్ట్‌లనే వీళ్ళు అనుసరిస్తున్నారు. 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' కార్యక్రమం తర్వాత 2018 ఫిబ్రవరిలో మళ్ళీ రెండో విడత కార్యక్రమాన్ని 366రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించా లని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే 2019 ఎన్నికల దాకా కూడా ఆయన తన సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి వుండదు. కాని, నియోజకవర్గంలో అందరికీ సొంత మనిషే కాబట్టి ఇంటికి వెళ్ళాలన్న బెంగే ఉండదు.

ప్రతి ఒక్కరూ ఆయన మనుషులే, ప్రతి ఒక్కరికి ఆయన సొంత మనిషే కాబట్టి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గమే ఆయనకు ఇల్లు కానుంది.

నాయకులంటే ఎన్నికల ముందు ఓటర్ల కాళ్లకు మొక్కడం, ఎన్నికల తర్వాత వాళ్ల కాలు లాగడం అన్న అభిప్రాయం వుంది. ఎమ్మెల్యే కాక ముందు ప్రజలంటే ఎంత ప్రేమాభిమానంతో వున్నాడో, ఎన్నికల తర్వాత, ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయన తన నియోజకవర్గ ప్రజలపై అంతకంటే మెండైన ప్రేమాభిమానాలు చూపిస్తుండడం అభినందనీయం.

govt hospసర్కార్‌ దవాఖానా అంటే నరకానికి నమూనా అన్న ఒక పేరుంది. నిజమే... ఇంతకాలం మనం చూసిన పెద్దాసుపత్రిలో పరిస్థితి అదే! ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే బోనస్‌గా ఇంకొన్ని రోగాలు తగులుకునేంత దుస్థితి వాతావరణం అక్కడ ఉండేది. అయితే కాలం మారింది. ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చాక పెద్దాసుపత్రి ప్రాంగణం రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాంగణంలో ఎటుచూసినా కార్పొరేట్‌ కంపెనీలులాగా వున్న భవనాలు, విశాలమైన రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పచ్చదనం... కనువిందు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరులో వున్న కార్పొరేట్‌ ఆసుపత్రులకంటే కూడా ఇప్పుడు పెద్దాసుపత్రి ప్రాంగణంలో వాతావరణమే బాగుంది. ఒకప్పుడు మనకు నరకంలా అనిపించిన పెద్దాసుపత్రిని పాత భవనాల నుండి కొత్తగా కట్టిన భవనాలలోకి త్వరలోనే ప్రభుత్వ సర్వజన వైద్యశాలగా తరలించనున్నారు. వందకోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి భవనాలు పూర్తి కావచ్చాయి. మొత్తం 750 పడకలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కంటి, ఆర్థోపెడిక్‌ విభాగాలను అనధికారికంగా ప్రారంభించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే ఈ ఆసుపత్రి ఎంతో బాగుందని ఆనందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అన్ని వైద్య విభాగాలను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిని అందంగా కట్టారు. వైద్యులు కూడా అంతే అందమైన మనస్సుతో వైద్యసేవలందిస్తే చాలామంది పేదరోగులకు జబ్బుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తప్పించిన వాళ్లవుతారు.

co opనెల్లూరుజిల్లాలో లక్షలాదిమంది రైతులున్నారు. తడ నుండి సీతారాంపురం దాకా అన్ని గ్రామాలు, పల్లెటూర్లలో సేద్యంతో స్వేదం చిందిస్తూ పంటలు పండించే అన్నదాతలకు పొలం, హలం, నీళ్ళు, బీళ్ళు, చెరువు, ఎరువుతో తప్ప జిల్లా కేంద్రమైన నెల్లూరుతో పెద్దగా సం బంధాలుండవు. అయినా జిల్లాలో వున్న రైతులందరికీ నెల్లూరు నగరంతో వున్న అనుబంధానికి ఒకే ఒక వేదిక నెల్లూరు నడిబొడ్డున వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. అవును, రైతుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం నెలకొల్పిన బ్యాంకు ఇది. రైతులే ఖాతాదారులు, రైతులే సభ్యులు, రైతులే డిపాజిటర్లు, రైతులే ఋణగ్రహీ తలు, ఈ బ్యాంకుకు రైతులే వెన్నెముక.

మన కుటుంబంలో ఎవరికైనా 60 ఏళ్లు నిండితే షష్టిపూర్తి చేస్తాం. 50ఏళ్ళు వస్తే అర్థశత జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం. అలాంటిది లక్షలాది మంది రైతులతో బంధం, అనుబంధం వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వందేళ్ళు వస్తే... ఆ వేడుకను ఇంకెంత ఘనంగా జరపాలి. అలాంటి వేడుకకే నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వతేదీ మధ్యాహ్నం 3గంటలకు బ్యాంకు ప్రాంగణంలోనే నిర్వహించన్ను శత వసంతాల వేడుకలను రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టు కూరు ధనుంజయరెడ్డి నేతృత్వంలో బ్యాంకు పాలక మండలి కమిటి సభ్యులు ఆహ్వాన కమిటీగా ఏర్పడి శత వసంతోత్సవ సంబ రాలను చరిత్రలో చిరస్మరణీయంగా నిలి చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర సహకార శాఖ మంత్రి సి.ఆదినారా యణరెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ముఖ్యఅతిథులుగా, ఏపి రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ పిన్నమ నేని కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ కె.రవీందర్‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. అలాగే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా సంస్థల ఛైర్మెన్‌లు, మాజీమంత్రులు, మాజీశాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌లు, సహ కార శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరవు తున్నారు. వందేళ్లకాలంలో ఈ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసిన బ్యాంకు మాజీ ఛైర్మెన్‌లను, మాజీ జనరల్‌ మేనేజర్‌లను ఈ వేదికపై సన్మానించాలని పాలకవర్గం నిర్ణయించింది.

నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల ప్రయాణంలో ఎన్నో మలు పులున్నాయి. ప్రగతి పథంలో ఎంతో మంది కృషి వుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1918 సంవత్సరం జనవరి 11వ తేదీన మద్రాసు రాష్ట్ర సహకార చట్టం క్రింద నేటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రిజిష్టర్‌ చేయబడింది. గ్రామీణ రైతులే సభ్యులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రైతులకు వాణిజ్య బ్యాం కుల కంటే మిన్నగా సేవలందించసాగాయి. 1933 అక్టోబర్‌ 17వ తేదీన ఇప్పుడున్న కేంద్ర సహకార బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావు బహుద్దూర్‌ చెంగయ్య పంతులు, రేబాల దశరథరామి రెడ్డి, చుండూరు సుబ్బయ్యశెట్టి, ఏ.సి.సుబ్బా రెడ్డిలు ఒక కమిటీగా ఏర్పడి ఈ భవన నిర్మాణ సన్నాహాలు సాగించారు. 1935 ఏప్రిల్‌ 21వ తేదీన మద్రాసు ప్రొవిన్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ వి.రామదాసు పంతులు చేతుల మీదుగా ఈ బ్యాంకు భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోజుకు బ్యాంకు అధ్యక్షుడుగా రేబాల దశరథరామిరెడ్డి వున్నారు. ఈ బ్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు వేల రూపాయలను షేర్‌ క్యాపిటల్‌గా మంజూరు చేసింది. అప్పటి నుండి ఇప్పటి దాకా బ్యాంకు అంచలంచెలుగా ఎదు గుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది. రావుబహుద్దూర్‌ చెంగయ్య పంతులు బ్యాంకు మొదటి అధ్యక్షులుగా సేవలం దించారు. కె.వి.రాఘవాచార్యులు, రావు సాహెబ్‌ విశ్వనాథరావు పంతులు, రేబాల దశరథరామిరెడ్డి, రేబాల లక్ష్మీనరసారెడ్డి, దువ్వూరు బలరామిరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, వేమా రెడ్డి రామచంద్రారెడ్డి, వేనాటి మునిరెడ్డి, మేకల హజరత్తయ్య, వాకాటి నారాయణ రెడ్డి, వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డిలు ఈ వందేళ్లలో బ్యాంకు ఛైర్మెన్‌లుగా సేవలం దించి బ్యాంకు పురోభివృద్ధిలో భాగస్వాము లయ్యారు.

ఇది నా అదృష్టం - మెట్టుకూరు ధనుంజయరెడ్డి

నేను మెట్ట ప్రాంతంలో పుట్టాను. రైతు సమస్యలు తెలిసిన వాడిని. నిద్రలేస్తే రైతు కష్టం చూసే వాడిని. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా రైతులకు ఈ రూపంలో సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇందులో వున్న సంతృప్తి ఇక ఏ పదవిలోనూ, ఏ బాధ్యతలోనూ వుండదు. రైతు వుంటే ఈ ప్రపంచం వుంటుంది, రైతు తింటేనే మనం తింటాం. కాబట్టి మనం రైతులను గౌరవించాలి. రైతులను ప్రోత్సహించాలి. నేను బ్యాంకు ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాక రైతుల శ్రేయస్సు కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం అహర్నిశలు కృషి చేసా! రాష్ట్ర ప్రభుత్వం మా పాలకవర్గ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టే బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. బ్యాంకు శత వసంతాల వేడుక జరుపుకునే సమయంలో బ్యాంకు ఛైర్మెన్‌గా నేనుండడం నా పూర్వజన్మ సుకృతం. ఈ వందేళ్ల ప్రయాణం ఒక చరిత్ర. ఆ చరిత్రలో నా పేరు నిలబడడం నాకు లభించిన వరం.

Thursday, 24 August 2017 11:24

నరకం చూపిస్తున్నారు

Written by

roadsనెల్లూరులో భూగర్భడ్రైనేజీ మాటేమో గాని దీని కోసం తవ్విన రోడ్లు మాత్రం జనానికి నరకం చూపిస్తున్నాయి. భూగర్భ డ్రైనేజీ కోసం ఇష్టారాజ్యంగా సిమెంట్‌ రోడ్లను తవ్వసి పైపులు వేసిన తర్వాత వాటిని సరిగా పూడ్చకపోవడంతో జనా నికి, వాహనదారులకు ఆ రోడ్ల మీద సినిమా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల అడపాదడపా వానలు పడుతున్నాయి. సిమెంట్‌రోడ్లను పైపు లైన్ల కోసం మధ్యలో తవ్వేసి మట్టితో కప్పేసారు. వానలు పడితే ఈ మట్టి కొట్టుకుపోయి మధ్యలో గుంటలు తేలుతున్నాయి. ఇలాంటి సిమెంట్‌ రోడ్లలో కారు లేదా ఇతర నాలుగుచక్రాల వాహ నాలు పోవాలంటే తవ్విన భాగాన్ని సెంటర్‌ చేసుకుని పోవాలి. ఈ దశలో ఎదురుగా ఏదన్నా వాహనం వచ్చిందంటే పక్కకు జరగడం కూడా కష్టమే! ఏ మాత్రం పక్కకు జరిగినా రోడ్ల మధ్య తవ్విన గోతుల్లో వాహనాలు ఇరుక్కు పోవడం ఖాయం. నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను చేతయ్యి చేతకాని వాళ్లు చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్‌ను ఎల్‌ అండ్‌ టి సంస్థ తీసుకుంది. వాళ్లు ఈ పనుల న్నింటిని సబ్‌ కాంట్రాక్టర్లకిచ్చారు. అను భవం లేని వాళ్ళు కూడా ఈ పనులు చేస్తున్నారు. రోడ్డు తవ్వి పైపులు వేసాక ఆ రోడ్డులో ప్యాచ్‌వర్క్‌ పూర్తి చేయాలి. కాని, కొందరు కాంట్రాక్టర్లు అలా చేయడం లేదు. తవ్విన చోట మట్టితో పూడ్చేసి పోతున్నారు. వానలు పడ్డప్పుడు ఈ మట్టి కొట్టుకు పోతుంది. గోతులు ఏర్పడుతు న్నాయి. నగరంలో ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ పనులు జరుగుతుండడం, చేసిన పనులను సక్రమంగా చేయకపోతుండ డంతో ప్రజలకు నరకం కనిపిస్తోంది.

killerగత ఏడాది జనవరిలో వరుస హత్యలకు పాల్పడి జిల్లాలో భయోత్పాతాన్ని సృష్టించిన సైకో కిల్లర్‌ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు నాల్గవ అదనపు జిల్లా జడ్జి మరణశిక్ష విధిస్తూ 17వతేదీ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే కొండాపురం మండలానికి చెందిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు కావలి పట్టణానికి వలస వచ్చి న్యూడిల్స్‌ బండిని పెట్టుకున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ అతను నేరాల వైపు దృష్టి సారించాడు. ఒంటరిగా వున్న మహిళలను టార్గెట్‌ చేసాడు. కావలిలో ఇంట్లో ఒంటరిగా వున్న ఓ మహిళను తలపై సుత్తితో కొట్టి చంపి ఆమె ఒంటిపై వున్న బంగారు నగలతో ఉడాయించాడు. నెల్లూరు రూరల్‌ మండలం పెద్దచెరుకూరులో వృద్ధ పూజారి దంపతులను హత్య చేసి పరారయ్యాడు. గతేడాది జూలై 9న నెల్లూరు, చిల్డ్రన్స్‌ పార్కు ప్రాంతంలో వున్న ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లోకి కేబుల్‌ టీవీ టెక్నీషియన్‌ లాగా వెళ్లాడు. అక్కడ వున్న నాగేశ్వరరావు భార్య ప్రభావతి మీద, వారి బంధువైన మరో అమ్మాయి మీద సుత్తితో దాడి చేసాడు. ప్రభావతి అక్కడికక్కడే చనిపోగా, ఇంకో యువతి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఇంటికొచ్చిన నాగేశ్వరరావు మీద కూడా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు చేరి వెంకటేశ్వర్లును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత గాయపడ్డ యువతి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వరుస హత్యలు అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించాయి. ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో ఈ సైకో కిల్లర్‌ పట్టుబడకపోయివుంటే జిల్లాలో ఇంకెన్ని ఘోరాలు జరిగి వుండేవో? మొత్తానికి ఈ సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Friday, 11 August 2017 14:54

ప్రజలలో అసహనం

Written by

matti roadభూగర్భ డ్రైనేజీ పనుల మాటేమోగాని నిలువునా ధ్వంసమవుతున్న రోడ్లను చూస్తుంటే జనం గుండె రగిలిపోతోంది. నగరంలో ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా శుద్ధంగా లేదు. అన్ని వీధుల్లో సిమెంట్‌రోడ్లను ధ్వంసం చేశారు. తవ్విన చోట కాంక్రీట్‌తో నింపకుండా మట్టిపోసారు. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు ఈ మట్టి కొట్టుకు పోయి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్ల మీద వాహనాలను నడపడానికే కాదు, జనం నడవ డానికి కూడా ఇబ్బందిగా వుంది. భూగర్భ డ్రైనేజీ పనులంటూ శుద్ధంగా వున్న రోడ్లను పాడు చేయ డంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

venkaనెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుండి నింగిలోకి రాకెట్లు ఎగురుతుంటాయి. ఆ రాకెట్లకు ఎగరడానికి ఒక లాంచ్‌ ప్యాడ్‌ ఉంటుంది. కాని నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం నుండి ఎటువంటి లాంచ్‌ప్యాడ్‌ లేకుండానే ఒక రాకెట్‌ ఎగిరి సాధారణ కార్యకర్త స్థాయి నుండి భారత ఉపరాష్ట్రపతి స్థాయికి దూసుకుపోయింది. ఆ రాకెట్‌ పేరే ముప్పవరపు వెంకయ్యనాయుడు.

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో మనకు చాలాగొప్పగా కనిపించే నాయ కులు బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యలు. అయితే వారికి కూడా సాధ్యం కానటువంటి అత్యున్నత స్థానాన్ని అలంకరించబోతున్న తొలి నెల్లూరీయుడు మన వెంకయ్యనాయుడు.

ఏబివిపి కార్యకర్తగా, విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆరెస్సెస్‌ సేవకుడిగా, జనసంఘ్‌ నేతగా, శాసనసభ్యుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా... ఆయన చూడని పదవులు లేవు... ఆయన ఎరుగని రాజకీయ కోణాలు లేవు. ఎన్ని పదవులు అనుభవించినా ఆయనకు సంతృప్తినిచ్చే పదవి మొదట భారతీయుడు. ఆ తర్వాత నెల్లూరీయుడు. పుట్టినగడ్డపై అంతటి మమకారం ఆయనకు. దేశంలో ఆయన తిరగని రాష్ట్రం, ఆయన కాలు మోపని ప్రాంతం లేదు. ఎక్కడ ప్రసంగి స్తున్నా, ఆయన ప్రసంగంలో 'నెల్లూరు' అనే పదం రాకుండా వుండదు. నెల్లూరుకు ఆయన ఏం చేసాడో అందరికీ తెలిసిందే! చేసిన అభివృద్ధి ఒకెత్తైతే... నెల్లూరును దేశమంతా తెలిసేలా చేసింది కూడా ఆయనే! నెల్లూరుజిల్లాను ఇంతగా ప్రేమించే నాయకుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబో తున్నాడు. 5వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో ఆయన గెలుపు లాంఛనమే! ఈ నెల 11వ తేదీ ఉపరాష్ట్ర పతిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణస్వీకారానికి ముందే తన నెల్లూరుపై అడుగుపెట్టాలని, ఆత్మీయులు, అభిమానులు, ఆప్తులతో కలిసి మాట్లాడా లని ఆయన మనసు పరితపించింది. దీనికోసమే ఆయన 7వ తేదీ ఉదయం తిరుమలలో తన ఇష్టదైవం వెంకన్న దర్శనం చేసుకుని మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరులోని విఆర్‌సి మైదా నంలో వెంకయ్యనాయుడు ఆత్మీయ అభి నందన సభకు భారీ సన్నాహాలు జరుగు తున్నాయి. ప్రముఖదాత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణ, రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి.రత్నం, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జమీన్‌రైతు సంపాదకులు నెల్లూరు డోలేంద్రప్రసాద్‌, అపస్మా నాయకులు బి.మనోహర్‌రెడ్డి, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.చంద్ర శేఖర్‌రెడ్డిలు సభ్యులుగా వున్న కమిటీ ఆధ్వర్యంలో మన వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో పాటు అన్ని పార్టీల నాయకులు, పది నియో జకవర్గాలలో వున్న వెంకయ్య అభిమా నులు, ఆత్మీయులు ఈ సభకు తరలివస్తు న్నారు. వెంకయ్య మీదున్న అభిమానంతో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు చెన్నై, బెంగు ళూరు, హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ వంటి నగరాలలో, ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన నెల్లూరీయులందరు కూడా వెంకయ్య ఆత్మీయ అభినందన సభకు ఎంతో అభిమానంతో విచ్చేస్తున్నారు.

నెల్లూరుజిల్లా నుండి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మొదటి నాయకుడు వెంకయ్యనాయుడు. ఇక్కడ మనం గర్విం చాల్సింది, స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఆయన ఎదిగిన వైనాన్ని చూసి. ఆయన పెద్దపేరున్న రాజకీయ కుటుంబంలో జన్మించి ఆ స్థాయికి చేరుకోలేదు. ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి, రాజ కీయాలలో పాయింట్‌ వన్‌పర్సంట్‌ కూడా క్రమశిక్షణ తప్పకుండా ఒకే సిద్ధాంతాన్ని ఆచరించి దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన నాయకుడు వెంకయ్య. మన పిల్లలకు ఆయన జీవితాన్ని, ఆయన ఆచరించిన సిద్ధాంతాన్ని ఆదర్శప్రాయంగా చూపాలి. ఇది ఒక వ్యక్తికి జరిగే అభినందన కాదు, ఒక పదవికి జరిగే సత్కారం కాదు, క్రమ శిక్షణాయుత జీవితానికి, సిద్ధాంత నిబ ద్ధతకు జరిగే సత్కారం. మన నెల్లూరీ యుడు సాధించిన ఔన్నత్యానికి, ఆయన చూపిన ఆదర్శానికి సన్మానం. కాబట్టి నెల్లూరీయులందరు వెంకయ్య ఆత్మీయ సభకు హాజరై ఆయనను నిండు మనసుతో దీవించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Page 3 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter