నెల్లూరులో నేడు (128)

tsp reddy'లాయర్‌' వారపత్రికకు అమెరికాలోని 'నాటా' సంస్థ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో వున్న డల్లాస్‌ నగరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 'నాటా' 3వ ద్వైవార్షిక సమావేశం జరుగుతున్న సంద ర్భంగా 'నాటి నెల్లూరు - నేటి నెల్లూరు - రేపటి నెల్లూరు' అనే అంశంపై ప్రసంగించేందుకు 'లాయర్‌' వారపత్రిక సంగ్రాహకులు తుంగా శివప్రభాత్‌రెడ్డికి ఆహ్వానం అందింది. డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికపై ఈ నెల 29న అత్యంత వైభవంగా జరుగనున్న నాటా సంబరాల్లో ప్రత్యేకించి నెల్లూరీయుల ఆత్మీయ సమావేశంలో శివప్రభాత్‌రెడ్డి పాల్గొని ఆరోజు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30గంటల వరకు నెల్లూరు జిల్లా ప్రాభవ వైభవాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించనున్నారు. ప్రాచీనకాలం నుంచి నెల్లూరు వైభవం, ప్రస్తుత ప్రగతి, భవిష్యత్తులో నెల్లూరు అభ్యున్నతికి చేయాల్సిన కృషి వగైరాలను ఆయన ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రస్తావించ నున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 22న బయలుదేరి ఆయన అమెరికా వెళ్తున్నారు. ఈ సమావేశంలో అమెరికా వైఎస్‌ఆర్‌గా పిలువబడే ప్రఖ్యాత వైద్యులు, పుట్టిన వూరైన నెల్లూరుజిల్లా నిడిగుంటపాళెం అభివృద్ధికి అనేక సేవలందిస్తోన్న సమాజసేవాతత్పరుడు డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి సన్నారెడ్డి తదితరులతో పాటు, నెల్లూరుకు చెందిన పలువురు ప్రముఖులు, అమెరికా రాష్ట్రాలలో నివసిస్తున్న అనేకమంది నెల్లూరీయులు పాల్గొననున్నారు.

Friday, 06 May 2016 07:00

మళ్ళీ...టోల్‌ గోల!

Written by

toll plazaవద్దన్న పని చేయడంలోనే ఆనందం వుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. నేషనల్‌ హైవే అధికారులు సందు దొరికి నప్పుడల్లా 'టోల్‌ప్లాజా' వ్యవహారాన్ని పైకి లేపి జనాన్ని హడలగొట్టేస్తున్నారు. మా రోడ్లు మా ఇష్టం. మధ్యలో మీరెవరు అడగడానికి అన్నట్లుంది వారి తీరు. సాక్షాత్తూ కేంద్ర రవాణా మంత్రి చెప్పినా వారెవరూ వినేటట్లు లేరు. వాస్తవానికి టోల్‌ప్లాజాల నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరే కించాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవ సరమైతే అక్కడ నిర్మించుకునేందుకు వారికి అధికారం వుంది. అయితే, ఎప్పుడూ ట్రాఫిక్‌ రద్దీతో వుండే నగర పరిధిలో టోల్‌ప్లాజా నిర్మించడం వల్ల ప్రజలపై ఆర్ధికభారం పడుతుందని, ఇక్కడికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో టోల్‌ప్లాజా వుంది కనుక, ఆ కట్టేదేదో నగరానికి దూరంగా కట్టుకుంటే ప్రజలకు కూడా ఇబ్బంది వుండదనేది ప్రజాప్రతినిధుల అభ్యర్థన. అంతేకాక, ఈ టోల్‌ప్లాజా ఏర్పాటుచేస్తే, ఇక అన్ని వాహనాలు నగరం లోకే ప్రవేశిస్తాయని, దీంతో ప్రమాదాలు పెరిగే ప్రమాదం వుందని కూడా వారు చెప్తున్నారు. ఈ బాధలన్నిటినీ సంబంధిత అధికారులు పెద్దమనసుతో ఆలోచించి,

ఉన్నతాధికారులకు కూడా నచ్చజెప్పి వుండి వుంటే ఇంత తతంగమంతా వుండేది కాదు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా పట్టించుకోకుండా, పట్టుబట్టి ఇక్కడ టోల్‌ప్లాజా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంలో అంతరార్ధమేమిటో ఎవరికీ బోధపడడం లేదు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు, అన్ని పార్టీల నాయకులు కూడా నగర పరిధిలోని కొండాయపాళెం వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తారని భావిస్తున్న టోల్‌ ప్లాజాను వ్యతిరేకిస్తూనే వున్నారు. ఈ టోల్‌ప్లాజా ఏర్పాటు విషయమై సోమి రెడ్డి తదితరులు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకురాగా, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రాష్ట్ర కార్యదర్శిని ఢిల్లీకి పంపి టోల్‌ప్లాజా ఏర్పాటును ఎట్టకేలకు నిలుపుదల చేయిం చారు. కేంద్రం కూడా అందుకు సాను కూలంగానే స్పందించడంతో, ఇక ఆ గొడవ తీరిపోయిందిలే అని ప్రజలు, ప్రజాప్రతినిధులు సంబరపడ్డారు.

అయితే, వూరకే వుంటే ఊరా పేరా.. అన్న సామెతగా, కొద్ది కాలం గడిచాక అందరూ మర్చిపోయుంటారని అనుకు న్నారో ఏమో.. మళ్ళీ ఇక్కడ టోల్‌ప్లాజా ఏర్పాటుకు లోలోపలే సన్నాహాలు జరుగు తున్నాయని తెలిసి ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

nehru statueగత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని మనుమసిద్ధి మారాజులా ఏలిన మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నగరంలోని పలు విగ్రహాల ఐల్యాండ్‌లను ప్రత్యేకశ్రద్ధతో నిర్మించారు. ఉన్న ఐల్యాండ్‌లను వెడల్పు చేసి పెంచడమేకాకుండా రకరకాల బొమ్మలు, వాటర్‌ ఫౌంటేన్‌లు పెట్టించి అందంగా తీర్చిదిద్దారు. అయితే ఐల్యాండ్‌లు వెడల్పు చేయడం వల్ల రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది.

నెల్లూరులో మద్రాసుబస్టాండ్‌ వద్ద నెహ్రూ బొమ్మ ఐలాండ్‌, బాలాజీనగర్‌ వద్ద ఫూలే బొమ్మ ఐలాండ్‌, పొదలకూరు రోడ్డులో రైతు ఐల్యాండ్‌, కరెంట్‌ ఆఫీసు సెంటర్‌లో వై.యస్‌.బొమ్మ ఐల్యాండ్‌, హరనాథపురం జంక్షన్‌లో ఆనం వెంకురెడ్డి విగ్రహం ఐల్యాండ్‌లు వివేకా హయాంలో నిర్మించబడ్డవే! వీటిని బాగా పొడవు, వెడల్పుతో ఏర్పాటు చేశారు. అయితే ట్రాఫిక్‌ రద్దీ ఉన్న రోడ్లలో ఈ ఐల్యాండ్‌ల మూలంగా ట్రాఫిక్‌జాం అవుతోంది. జిల్లా ఎస్పీగా వచ్చిన విశాల్‌గున్ని నగరంలో ట్రాఫిక్‌ను సరిదిద్దే క్రమంలో ఐల్యాండ్‌లపై దృష్టి పెట్టారు. ఐల్యాండ్‌లను కుదించాలని నగరపాలక సంస్థ అధికారులతో చర్చించారు.

ఈమేరకు ఐల్యాండ్‌లు తగ్గించే ప్రక్రియ మొదలయ్యింది. మద్రాసు బస్టాండ్‌ వద్ద వున్న నెహ్రూ బొమ్మ ఐల్యాండ్‌ను తగ్గించారు. ఐల్యాండ్‌ను తగ్గించాక ఇప్పుడిక్కడ రోడ్డు విశాలంగా మారింది. ట్రాఫిక్‌ కోసం మరికొన్ని ఐల్యాండ్‌లను తగ్గించనున్నారు.

mgb malllనెల్లూరు స్థాయి పెరుగుతుంది. టౌన్‌ నుండి సిటీ... సిటీ నుండి మెగా సిటీగా మార్పు చెందు తోంది. మహానగరాలలో ఉండే కార్పొరేట్‌ వ్యాపార వ్యవస్థలన్నీ కూడా నెల్లూరులో కొలువు దీరుతు న్నాయి. పాతకాలం నుండి కూడా నెల్లూరుకు క్లాస్‌ సిటీ అనే పేరుంది. మార్కెట్‌లోకి ఎంత ఖరీదైన కార్లు వచ్చినా చెన్నై, హైదరాబాద్‌ల తర్వాత అవి ఎక్కువుగా కనపడేది నెల్లూరు రోడ్ల మీదే! ఇక సినిమాహాల్స్‌ పరంగా అయితే నెల్లూరుకు వున్న పేరు చెప్పనవసరం లేదు. గతంలోనే నెల్లూరులో వున్నంత హైక్లాస్‌గా సినిమా థియేటర్లు ఇంకెక్కడా వుండేవి కావు. మన థియేటర్లు అంత బాగా వుండేవి. ఇప్పుడు ఆ థియేటర్లనే ఇంకా ఆధునీకరించడం చూసాం. రాఘవ సినీ కాంప్లెక్స్‌తో పాటు లీలా మహల్‌, అర్చన వంటి థియేటర్లు అత్యాధునికంగా నిర్మించడం తెలిసిందే! ఇక మహానగరాలలో వుండే ఫుడ్‌కోర్టులు, హోటళ్లు నెల్లూరుకు వచ్చేశాయి. నెల్లూరుకు మరింత కార్పొరేట్‌ సొగసులద్దుతూ దర్గామిట్ట వద్ద నిర్మాణంలో వున్న యం.జి.బ్రదర్స్‌ మల్టీప్లెక్స్‌ మాల్‌ కూడా త్వరలోనే ప్రారంభానికి నోచుకోబోతోంది. ఈ మాల్‌లో ఐదు సినిమా థియేటర్లతో పాటు మెక్‌డోనాల్డ్డ్‌, బరిస్టా వంటి అంతర్జాతీయ ఫుడ్‌ కోర్టులు, మరెన్నో ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌తో షాపులు ప్రారంభం కానున్నాయి.

నెల్లూరులో డబుల్‌ సెల్లార్‌ పార్కింగ్‌తో కట్టిన మొట్టమొదటి నిర్మాణం ఇదే! కాగా, దీని పక్కనే పాత వెంకటరమణ థియేటర్స్‌ స్థానంలో ఎన్‌ఆర్‌ మల్టీప్లెక్స్‌ కూడా శరవేగంగా నిర్మాణం జరుపు కుంటోంది. ఈ రెండు మాల్స్‌ ప్రారంభమైతే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. నగరం మరింత రద్దీగా మారుతుంది. షాపింగ్‌ ప్రియులకు ప్రతిరోజూ పండుగే!

Friday, 25 March 2016 07:45

ఈ ఎండలేంటి బాబో...

Written by

sun hotమార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఉష్ణోగ్రతలు 40డిగ్రీలను తాకాయి. మార్చిలోనే ఇలా వుంటే, రేపు ఏప్రిల్‌, రోళ్లు పగిలే రోహిణికార్తె వచ్చే మేనెలల్లో ఇంకెలా కాయబోతున్నాయన్నది వూహించుకుంటేనే ఆందోళన కలుగుతోంది.

ఉదయం 10గంటలకే భానుడు ఛండ ప్రచండంగా నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం 4గంటల దాకా వీలై నంతవరకు బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. గట్టిగా ఒక అరగంట ఎండలో తిరిగితే కళ్లు బైర్లు కమ్ముతు న్నాయి. తీరప్రాంతంలోని విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ ఉత్పాదన మొద లవడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరగ డానికి కారణమని నిపుణులు పేర్కొంటు న్నారు. ఇప్పుడే ఎండలు ఇలా కాస్తు న్నాయి. రేపు ఇంకెంత ముదరబోతున్నా యన్నది అందరి ఆందోళన.

ఇక సమ్మర్‌ వ్యాపారాలు బాగానే ఊపందుకున్నాయి. సమ్మర్‌ ఫ్రూట్స్‌గా చెప్పుకునే పుచ్చ, కర్బూజకాయలను రోడ్ల మీద గుట్టలు గుట్టలుగా పోసి అమ్ము తున్నారు. కొబ్బరిబోండాలకీ గిరాకీ పెరిగింది. సోడా బండ్లు, మజ్జిగ బండ్లు, ఐస్‌క్రీం బండ్లు మళ్ళీ రోడ్లెక్కాయి. కూల్‌డ్రింక్‌ షాపులు, ఐస్‌క్రీం పార్లర్‌లు మళ్ళీ కిటకిటలాడుతున్నాయి. ఏసిలు, ఫ్రిజ్‌లు, కూలర్‌లు, ఫ్యాన్‌ల కొనుగోళ్లు పెరిగాయి.

పగటిపూట ప్రయాణాలకు జనం భయపడుతున్నారు. పగలు ఏసి బస్సుల్లో తప్పితే మామూలు బస్సుల్లో తిరిగే పరి స్థితి లేదు. సాధారణ బస్సుల్లో ఉదయం, లేదా సాయంత్రం ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. సమ్మర్‌ను దృష్టిలో పెట్టు కుని ఆర్టీసీ వాళ్లు కూడా ఏసి బస్సులను పెంచడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా పగలు ఎక్కువుగా ప్రయాణాలుండే తిరుపతి, చెన్నైలకు ఏసి బస్సులను ప్రవేశపెట్టాల్సి వుంది.

railway fly overఎట్టకేలకు నెల్లూరు నగరంలో రెండు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఒకటి కొండాయపాలెం రైల్వేగేటు మీదుగా, రెండోది బి.వి.నగర్‌ రైల్వేగేటు మీదుగా! 105కోట్లతో ఈ రెండు వంతెనలను కట్టనున్నారు. జిఎన్‌టి రోడ్డు నుండి రైల్వే ట్రాక్‌ మీదుగా మినీబైపాస్‌కు కలిసే విధంగా ఈ రెండు వంతెనలను నిర్మించబోతున్నారు. ఈమేరకు ఈ రెండు వీధులలో ఆక్రమణలను తొలగించనున్నారు.

ఈ రెండు ఫ్లైఓవర్‌లు పూర్తయితే కరెంట్‌ ఆఫీసు సెంటర్‌, బి.వి.నగర్‌, ఎన్‌జిఓ కాలనీ, కొండాయపాలెం వాసులకు రైల్వేగేట్ల కష్టాలు తగ్గుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా వర్షాల సీజన్‌లో వాహనాల రాకపోకలకు ఈ ఫ్లైఓవర్‌ వంతెనలు బాగా ఉపయోగ పడతాయి. నగరంలో అయ్యప్పగుడి వద్ద తప్పితే ఒక్క రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కూడా లేదు. నగరం మధ్యలో నుండి రైల్వేట్రాక్‌ పోతుంది. ఈ ట్రాక్‌కు తూర్పు, పడమరల వైపున నగరం విస్తరించి వుంది. ఈఈ రెండు ప్రాంతాలకు రాకపోకలకు నాలుగు అండర్‌ బ్రిడ్జిలు, రైల్వే గేట్లే ఆధారం. అయ్యప్పగుడి రైల్వే ఓవర్‌ వంతెన నగరానికి ఓ కొసన ఉండడంతో ఎవరికీ ఉపయోగపడదు. వర్షాకాలంలో నాలుగు అండర్‌ బ్రిడ్జిలలోనూ నీళ్లు చేరి వాహనాల రాకపోకలు బంద్‌ అవుతున్నాయి. కొండాయపాలెం, బి.వి.నగర్‌ ఫ్లైఓవర్‌లు పూర్తయితే వర్షాకాలంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి.

fruits marketఒకప్పుడు రాజీవ్‌మార్గ్‌గా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ రోడ్డుగా పేర్లు మార్చుకున్న నెల్లూరు లోని మినీబైపాస్‌ రోడ్డు అన్ని వ్యాపారాలకు ఒక మినీమార్కెట్‌గా మారుతోంది. నాలుగై దేళ్ల క్రితం దాకా ఈ రోడ్డు పక్కన పెద్దగా వ్యాపార సందడి ఉండేది కాదు. కాని ఇటీవలకాలంలో పేరుమోసిన బంగారు దుకాణాలు, గుడ్డల అంగళ్లు ఈ రోడ్డు పక్కనే వెలిశాయి. కల్యాణ మండపాలు నిర్మించ బడ్డాయి. ఇప్పుడు రోడ్డు వెంబడి చిరు వ్యాపా రాలు ఎక్కువవుతున్నాయి. కడియం వాళ్ళు మినీబైపాస్‌ను ఆనుకుని వున్న సర్వేపల్లి కాలువ కట్ట స్థలంలో నర్సరీలు పెట్టుకుని పూలమొక్కలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఫర్నీచర్స్‌, బొమ్మలు వంటివి అమ్ముతున్నారు. ఈ మధ్య మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లు, మొబైల్‌ కొబ్బరి బోండాల దుకాణాలు ఎక్కువయ్యాయి. ఇక ఈ రోడ్డులో పెద్ద పండ్ల మార్కెట్టే నడుస్తోందని చెప్పవచ్చు. జ్యోతిరావ్‌ ఫూలే బొమ్మ నుండి బి.వి.నగర్‌ సెంటర్‌ దాకా రోడ్డు పక్కన మొబైల్‌ పండ్లషాపులు, కూరగాయల కొట్లు బ్రహ్మాండంగా వెలిశాయి. ఇక హోటళ్లు, గ్రానైట్‌ షాపులకు లెక్కేలేదు. మొత్తానికి మినీబైపాస్‌ పెద్ద మార్కెట్‌ సెంటరైపోయింది.

spజిల్లా ఎస్పీ వ్యవహారం ఇంతవరకు తేలలేదు. గత నెలలో నగరంలోని ఓ వర్గం వారితో వచ్చిన వివాదం మూలంగా ఎస్పీ గజరావు భూపాల్‌ విధులకు దూరంగా వుంటున్నారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు వెళ్లొచ్చాక కూడా ఆయన విధుల్లో చేరలేదు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనప్పుడు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌ ఇక్కడ ఇన్‌ఛార్జ్‌ ఎస్పీగా వ్యవహరించారు. ఆరోజు మైనార్టీల వివాదం పరిష్కారానికి ఎస్పీని బదిలీ చేస్తామని జిల్లా తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఒక వర్గం ప్రజల ఒత్తిడితో బదిలీ చేస్తే అది మొత్తం పోలీసు శాఖ మీదే ప్రభావం చూపుతుంది. పోలీసులలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నెల్లూరు ఎస్పీ ఒక్కడినే బదిలీ చేస్తే అది రాజకీయం అవుతుందని, ఒక వర్గం వారికి తలొంచి నట్లవుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా ఐపిఎస్‌ల బదిలీలు చేపట్టినప్పుడు నెల్లూరు ఎస్పీ బదిలీని కూడా అందులో కలిపేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ గజరావ్‌ భూపాల్‌ కూడా ఇక్కడ వుండడం కంటే ఇక్కడ నుండి పోవడమే ఉత్తమమనుకుంటున్నట్లు సమాచారం.

aziz mayurనెల్లూరు నగరపాలక సంస్థలో 13వ ఆర్ధిక సంఘం విడుదల చేసిన 13.75కోట్ల రూపాయల పనులకు సంబంధించిన టెండర్లు రద్దు కావడం తెలిసిందే! ఈ పనులను దక్కించుకునేందుకు అజీజ్‌ వర్గం కార్పొరేటర్లు ఎన్నెన్నో ప్లాన్‌లు వేశారు. మీటింగ్‌లు పెట్టారు. కమిషన్‌లు పంచుకున్నారు. నోటి దాకా వచ్చిన కూడుపోయినట్లు ఆనం, అనిల్‌ వర్గీయులు వేసిన పోటీ టెండర్ల మూలంగా అజీజ్‌ వర్గీయుల కమిషన్‌లు పోయాయి. టెండర్లు తెరిస్తే తమకు ఒక్క పని కూడా దక్కదని తెలుసుకున్న అజీజ్‌ చివరకు ఆ టెండర్లనే రద్దు చేయించాడు. 13.75కోట్ల పనులను చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించి నామినేషన్‌ క్రింద తమ అనుచరులకు పనులివ్వాలనుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ మీద పనులు కేటాయిస్తే కోర్టుకు పోవడానికి మేయర్‌ వ్యతిరేక వర్గీయులు సిద్ధంగా వున్నామని హెచ్చరించారు. మార్చి నెలాఖరులోపు ఈ నిధులు ఖర్చు చూపించాలి. ఈ నిధులు ఖర్చు చేస్తేనే మరో 6.75కోట్లు 13వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరవుతాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెండర్లకు పోతే మేయర్‌ వర్గీయులకు పనులు దక్కడం కష్టమే. ఈ నెల 29న ఈ 13.75కోట్ల పనులకు మరోసారి టెండర్లు పిలిచారు. ఇంతకుముందులాగా కమిషన్లు మాట్లాడుకుని టెండర్లు వేసే పరిస్థితి లేదు. ప్రతి పనికి పోటీ టెండర్లు పడడం ఖాయం. ఈ పద్ధతిలో కమిషన్ల కోసం ఆశపడ్డ కార్పొరేటర్ల ఆశలపై నీళ్ళు చల్లినట్లే!

అనుబంధ సంస్థల్ని కూడా కాపాడండి

పాతుకుపోయిన పాత కన్వీనర్ల కంపు వదిలించండి

సేవాభిలాష వున్న యువ మేధావులకు అవకాశం కల్పించండి

redcrossఎంతోకాలంగా రకరకాల ఆరోప ణలు, విమర్శల నేపథ్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ-నెల్లూరు శాఖకు ఎట్టకేలకు సుప్రశాంత వాతావరణంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించారని, మొత్తం ఓటర్లని ఓటింగ్‌లో పాల్గొననీయ కుండా జీవిత సభ్యత్వాన్ని రెన్యూవల్‌ చేసుకున్న వారికే ఓటుహక్కు వుంటుందని ఓ కిరికిరి పెట్టి పాత కమిటి వారు తమ తమ తెలివి తేటలన్నీ ఉపయోగించి మళ్ళీ వాళ్ళే కుర్చీలు ఎక్కేలా పథకం రచించా రన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఎంతో సంయమనంతో వ్యవహరించి ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌, అధికారయంత్రాంగం అభినందనీయులే. ఈ ఎన్నికల్లో గత పాలకవర్గమే మళ్ళీ విజయం సాధించడం విశేషం. గత. కొన్నేళ్ళుగా పాలనలో వున్న పాలకవర్గానికే ఓటర్లు మళ్ళీ పట్టం కట్టారు. దీంతో కొత్తగా ఎన్నికైన కార్యవర్గం రెడ్‌క్రాస్‌ బాధ్యతలను స్వీకరించింది. అయితే, ఇదే సందర్భంలో రెడ్‌క్రాస్‌ అను బంధ సంస్థల కన్వీనర్ల నియామకంలోనూ జిల్లా ఉన్నతాధికారులు తగు చొరవ తీసుకోవాల్సి వుంది. పాతవారి గుత్తాధి పత్యం నుంచి వీటిని కాపాడాల్సివుంది. రెడ్‌క్రాస్‌ అనుబంధ సంస్థల్లో బ్లడ్‌బ్యాంక్‌, క్యాన్సర్‌ ఆసుపత్రి, స్పాస్టిక్‌ సెంటర్‌, జనరిక్‌ మందుల షాపు, కుక్కకాటు చికిత్సకై ఏర్పాటుచేసిన విభాగం, హెచ్‌ఐవి క్లినిక్‌, ప్రకృతి వైపరీత్యాల విభాగం, పినాకినీ గాంధీ ఆశ్రమం వంటి ప్రతిష్టాత్మక విభా గాలు వున్నాయి. ప్రజలకు అనునిత్యం సేవచేసే ఈ శాఖలు రెడ్‌క్రాస్‌ అనుబంధ విభాగాలుగా వుండడంతో వీటికి ఎంతో ప్రాధాన్యత వుంది. ముఖ్యంగా, సేవా భావమే ప్రధానంగా వున్నవారు, ప్రజాసేవ పట్ల ఎంతో ఆసక్తి వున్నవారు ఈ అనుబంధ సంస్థల్లో వుంటే వారి నిష్కళంక సేవతో ఈ విభాగాలు మరింతగా రాణి స్తాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక అనుబంధ సంస్థల్లో ఎంతో కాలంగా కొంతమంది వ్యక్తులే ఏళ్ళ తరబడి తిష్టవేసుకుని కూర్చొని కర్ర పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఎంతోకాలం నుంచి తామే ఈ సంస్థలను ఉద్ధరిస్తున్నామన్నట్లు కేవలం గొప్పలు చెప్పుకుని కాలం గడిపేసుకునేవారి కంటే, ఆచరణలో అనునిత్యం సేవాభావంతో సేవచేసే వారికే ఇలాంటి సంస్థల కన్వీ నర్లుగా అవకాశం ఇవ్వడం సముచితం. అందులోనూ రెడ్‌క్రాస్‌ వంటి సమాజ సేవా సంస్థల్లో సమాజం పట్ల బాధ్యత, సమాజ సేవ పట్ల ఆసక్తి, ఉన్నతాశయాలు కలిగినవారు వుంటే, అకుంఠిత దీక్షతో అంకితభావంతో పనిచేసేవారుంటే ఆయా సంస్థలకు కొత్త వెలుగులు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలా కాక, ఎంతోకాలంగా పాతుకుపోయిన వారినే పట్టుకుని వేలాడినందువల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనమేమీ వుండదనేది ప్రత్యేకిం చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్న నేటి రోజుల్లో, ముఖ్యంగా వైద్యరంగంలో, సమాజ సేవా రంగంలో అత్యంత ఆధు నిక పద్ధతులు కొల్లలుగా అందుబాటులోకి వచ్చిన నేటికాలంలో..ఇంకా పాతకాలపు పద్ధతులతోనే సంస్థలను నడుపుకోవడం కంటే..ఆధునిక పరిజ్ఞానం, సమాజ సేవాభిలాష, ఉన్నతమైన చదువులు.. మంచి జ్ఞాన పరిణితి కలిగిన యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రతి ష్టాత్మక సేవాసంస్థలు మరింతగా పురోగ మించేందుకు, తద్వారా ప్రజలకు మరింతగా సేవలు చేసేందుకు దోహదం చేసినట్లవుతుంది. ఈ కొత్త యేడాదిలో స్వార్ధపూరితమైన పాత కన్వీనర్ల కంపు వదిలించి జిల్లా ఉన్నతాధికారులు ఈ అనుబంధ సంస్థల్లో సమాజసేవాభిలాషతో వున్న యువతకు మంచి ప్రాతినిథ్యం ఇచ్చేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం!...

Page 4 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • 'పీకే'దేమీ లేదు
    జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…
  • కాలం కరిగిపోతుంది... ఆశ ఆవిరవుతోంది!
    నిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ…

Newsletter