నెల్లూరులో నేడు (115)

నెల్లూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివారులోని అయ్యప్పగుడి సెంటర్ సమీపంలోని చింతాలమ్మ వైన్స్ షాపులో సోమవారం తెల్లవారుజామున దుండగులు దోపిడీకి యత్నించారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్ చంద్రయ్య, అతనికి సహాయంగా ఉన్న దేవినేని శ్రీనివాసులపై దొంగలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన శ్రీనివాస్ మృతి చెందగా, వాచ్‌మెన్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దోపిడీకి పాల్పడేకంటే ముందు షాపులోని నగదును క్యాషీయర్ తీసుకెళ్లడంతో.. దొంగలు మిగిలిన సొమ్మును, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

childrens dayuనవంబర్ 14... మాజీప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిరోజు. ఆయనకు చిన్నారులంటే ఇష్టం. అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇంతవరకు ఎన్ని నవంబర్ 14లైనా వచ్చి ఉండొచ్చు. కాని 2014 నవంబర్ 14కు మాత్రం ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. లాయర్ వారపత్రిక ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరం నందు నిర్వహించిన బాలల దినోత్సవం బాలల ఆనందోత్సాహాలకు వేదికగా నిలిచింది. కిక్కిరిసిన వివిధ పాఠశాలల చిన్నారుల కేరింతలతో టౌన్ హాల్ మార్మోగిపోయింది.

ప్రతిభావంతులైన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఓ పక్క చిన్నారి లోకాన్ని మైమరపిస్తే, ఇంకో పక్క ముఖ్య అథితులుగా వచ్చిన పెద్దలు ఆశీస్సులతో ఇచ్చిన అభిభాషణ వారిలో స్ఫూర్తిని నింపింది. ఆయా పాఠశాలల విద్యార్థులు టౌన్ హాల్ కు పోటెత్తినట్లు వచ్చారు. హాలు నిండి కొందరు చిన్నారులు నిలుచోవాల్సి వచ్చింది. అయినా ఎవరూ అసౌకర్యంగా భావించకుండా అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్న చిన్నారుల నృత్యాలను చూస్తూ కార్యక్రమం ఆశాంతం అలానే నిలుచుండిపోయారు.

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో పాటు.. నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ ధనుంజయ్ రెడ్డి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ జయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలో చేరారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సీఎంగా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభావితులమై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 
 
నిజానికి వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాల్సి వుంది. అయితే, ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ఈనెల 11వ తేదీ నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఆయన నెల్లూరు జిల్లా పర్యటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో వారంతా మంత్రి నారాయణ, సీనియర్ నేత సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 

vyasarachanaమాజీప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకొని లాయర్ వారపత్రిక ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు టౌన్ హాలులో నెహ్రూ జీవితవిశేషాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుండి దాదాపు 500మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10వేలు, రూ.5వేలు, రూ.3వేలు, కన్సొలేషన్ బహుమతులు క్రింద పదిమందికి ఒక్కోక్కరికి రూ.500లు చొప్పున నవంబర్ 14వ తేదీ టౌన్ హాలులో జరిగే నెహ్రూజయంతి సందర్భంగా చిన్నారుల విజయదీపిక పుస్తకావిష్కరణ అనంతరం విజేతలకు బహుమతులు, పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

anrఅత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో ప్రజలకు ఎన్ని కల్యాణ మండపాలు అందుబాటులోకి వచ్చినా చాలడం లేదు. అదీగాక ఎక్కవు శాతం కల్యాణ మండపాలలో పార్కింగ్ సమస్య ఉంటుంది. వీటిని అధిగమిస్తూ... నెల్లూరు మినీబైపాస్ లో జివిఆర్ ఆర్ జూనియర్ కాలేజీ పక్కన బండి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా ఆధునికంగా నిర్మించిన ఎఎన్ ఆర్ ఏసి ఫంక్షన్ హాల్ నెల్లూరీయులకు అందుబాటులోకి వచ్చింది. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఫంక్షన్ హాలు వద్ద పార్కింగ్ కు ఏ సమస్యా లేదు. వివాహాలు, సమావేశాలు, రిసెప్షన్ వేడుకలు, నిశ్చితార్ధం వంటి వేడుకలను ఎంతో సౌకర్యవంతంగా ఆనందమయంగా చేసుకునేలా ఈ హాల్ ను అందించిన యాజమాన్యానికి లాయర్ అభినందనలు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని తన భాగస్వామ్యాన్ని కల్పించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని సుందర సింహపురిగా తీర్చిదిద్దుతానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఆదివారం నెల్లూరులో చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జాతి నేతల విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు వీధులను ఊడ్చిన తర్వాత ర్యాలీ, సభ నిర్వహించారు.ఈ సందర్భంగావెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నెల్లూరు నుంచే మహోద్యమంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహం ఉంటే ప్రోత్సాహం ఉంటుందని, స్వచ్ఛభారత్‌ను జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలన్నారు.  స్వచ్ఛ్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, చేపట్టినట్టు తెలిపారు.గాంధీజీ కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకే ప్రధాని మోడీ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. దేశ స్వరూప స్వభావాలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం స్వచ్ఛభారత్‌పై అందరితో ప్రమాణం చేయించారు. 

rosaiahడాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. సెప్టెంబర్ 21న జరగవలసిన ఈ కార్యక్రమం ఈ నెలకు వాయిదా పడింది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమంలో రోశయ్యతో పాటు రాజ్యసభసభ్యులు డా. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, ఐ.వరప్రసాద్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని 2013 సంవత్సరానికి గాను అవార్డుని సినీనటుడు మోహన్ బాబుకి ఇవ్వనున్నారు. పైన పేర్కొన్న అతిథులందరూ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు అందుకున్న వారే కావడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకత కాబోతుంది. బహుశా ఈ నెల 21నే ఈ కార్యక్రమం ఉండవచ్చని అవార్డు కమిటీ కార్యదర్శి బి.వి.నరసింహం లాయర్ కి తెలిపారు.

kotam birthనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా 26వ తేదీ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మందా బాబ్జీ ఆధ్వర్యంలో స్థానిక గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ నందు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మందా బాబ్జీ మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన తర్వాత తొలి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మా నాయకులు కోటంరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఖరీదైన రాజకీయాలను సామాన్యులు శాసించి చూపించగలరని నిరూపించిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని, పెద మధ్య తరగతి కుటుంబాల ఆశీస్సులు వారికి ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాకుటూరు శివరంజన్ రెడ్డి, జంగాల గోపాలరావు, మనుబోలు రవీంధ్రనాథ్ రెడ్డి, మందా పెదబాబు, మురహరి, కడింపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు.

mohan babuప్రముఖ సినీనటుడు, నిర్మాత, మాజీరాజ్యసభ సభ్యుడు డా. యం.మోహన్ బాబు డా. బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డును అందుకోబోతున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును వివిధ రంగాలలో తమ ప్రతిభ నైపుణ్యాలతో పేరు గడించిన 17మంది ప్రముఖులు ఇప్పటికే అందుకున్నారు. సినీరంగం నుండి చూస్తే ఇప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, మల్లెమాల సుందరరామిరెడ్డి, శ్రీమతి పి.సుశీలలు ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

అవార్డు అందుకోనున్న వారిలో మోహన్ బాబు 18వ వ్యక్తి కాగా, సినిమా రంగం నుండి అందుకుంటున్న వారిలో 7వ వారు. 1974లో సినీ రంగప్రవేశం చేసి కన్నవారి కలలు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాల్లో నటించినా నటుడిగా మోహన్ బాబుకు జీవితాన్ని ప్రసాదించిన చిత్రం స్వర్గం నరకం. ఈ సినిమా 1975లో విడుదల కాగా దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు నటజీవితానికి బలమైన పునాది వేసిన స్వర్గం నరకం చిత్రం తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు.

ఇప్పటివరకు 520సినిమాలలో మోహన్ బాబు నటించగా వాటిలో 146సినిమాలలో హీరోగా చేశాడు. సినీ నటుడిగా ఎన్నో అవార్డులు ఆయన ఇంట్లో తిష్టవేస్తే 1995లో రాజ్యసభ సభ్యత్వం ఆయనను వరించింది. అటు సినీరంగంలో క్షణం తీరికలేకుండా గడుపుతూనే మరోవైపు వ్యాపార రంగంవైపు దృష్టి మరల్చి 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించి కేజీ నుండి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో చదువుకునేలా తిరుపతి సమీపంలోని రంగంపేటలో విద్యాసంస్థను స్థాపించి, దాదాపు 1200మంది బోధన సిబ్బందితో ఏడాదికి 10వేల మంది విద్యార్థిని విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ బిరుదును భారత ప్రభుత్వం 2007లో మంచు మోహన్ బాబుకి అందించిందంటే ఒక నటుడిగానే కాకుండా ఇంకా పలు రంగాలలో ఆయన అందించిన సేవలకు ఈ పద్మశ్రీ బిరుదు ప్రదానమే పెద్ద నిదర్శనం.

ఈ ఏడాది కొంత ఆలస్యమైనా డా. బెజవాడ గోపాలరెడ్డి అవార్డుకి సముచిత వ్యక్తిని ఎంపికచేసింది కమిటీ. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

kanyasulkamసంఘసంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధమైన కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు నెల్లూరు విదేకగా మారనుంది. ఈ నెల 21వ తేదీన నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు 8గంటల పాటు ఈ నాటకాన్ని ప్రదర్శించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రసిద్ధ నటీనటులతో ప్రదర్శించనున్న ఈ పూర్తిస్థాయి నాటకాన్ని చూడగలగడం ఒక అదృష్టమనే చెప్పాలి. విజయనగరం వారి నవయువ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దర్శకులు శొంఠినేని కిషోర్, సమన్వయకర్త వెలుగు రామినాయుడుల నేతృత్వంలో ఈ నాటకం ప్రదర్శితమవుతుంది.

Page 6 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter