నెల్లూరులో నేడు (159)

pvrనెల్లూరు, మినీబైపాస్‌రోడ్డులో అన్నమయ్య సర్కిల్‌ వద్ద సువిశాల స్థలంలో ప్రముఖ వ్యాపారవేత్త పులిమి వెంకటరెడ్డి సారధ్యంలో నిర్మించిన పివిఆర్‌ కల్యాణ మండపంలో 20వ తేదీ తొలి కల్యాణోత్సవాన్ని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామికే నిర్వహించారు. బుధవారం రాత్రి కనుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి వేద పండితులు కల్యాణోత్సవాన్ని, పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అత్యంత అధునాతనంగా, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించిన ఈ కల్యాణ మండపాన్ని శ్రీనివాసుడి కల్యాణంతో ప్రారంభించడం శుభసూచకం. ఈ కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు నగర ప్రముఖులు, పులిమి వెంకటరెడ్డి బంధుమిత్రులు పెద్దఎత్తునే విచ్చేసారు. ఓ పక్క కల్యాణోత్సవంలో పండితుల వేదమంత్రాలు, మరోపక్క ప్రముఖ గాయని శ్రీమతి జె.బాలార్క బృందం ఆలపిం చిన అన్నమయ్య కీర్తనలు అతిథులను ఆనంద పరవశులను చేశాయి. అతిథులందరికీ ప్రసాదాలందించి పులిమి వెంకటరెడ్డి స్వామివారి ఆశీస్సులతో పాటు అతిథుల అభినందనలందుకున్నారు.

led bulbఎల్‌ఇడి బల్బులను వినియోగించు కోవడం ద్వారా వినియోగదారులు విద్యుత్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు. అందువల్ల ప్రజల్లో వీటి వాడకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు విద్యుత్‌శాఖ ముమ్మర కృషి చేస్తోంది. విలువైన రెండు ఎల్‌ఇడి బల్బులను తక్కువ ధరకే ఇచ్చి తద్వారా విద్యుత్‌ పొదుపుకు మార్గం చూపుతూ వినియోగదారునికి మంచి సేవ లందిస్తోంది. ఇందులో భాగంగా సోమ వారం నెల్లూరు రామ్మూర్తినగర్‌లో వున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు విచ్చేసిన ట్రాన్స్‌కో సి.ఇ నందకుమార్‌ వాటి వినియోగం గురించి అధికారులకు తెలియజేశారు. ఎపిఎస్‌సిడిసిఎల్‌, డిఇఎల్‌పి, ఇఇఎస్‌ఎల్‌ శాఖల ద్వారా కేవలం ఇంటి సర్వీసులకు మాత్రమే రాయితీతో ఈ ఎల్‌ఇడి బల్బులు ఇస్తారన్నారు. ఇళ్ళ విద్యుత్‌ వినియోగంలో నాణ్యత పాటించి పొదుపు చర్యలు తీసు కునేందుకే ప్రతి ఇంటికీ రెండు ఎల్‌ఇడి బల్బులను రాయితీతో కేవలం ఇరవై రూపాయలకే అందిస్తున్నామన్నారు. ఈ బల్బులకు మూడేళ్ళ వారెంటీ ఇస్తామని, ఈ బల్బులతో అధిక ఆదా వుంటుందని, విద్యుత్‌బిల్లు గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. 9 మెగావాట్ల ఎల్‌ఇడి బల్బు 60 వాట్ల సాధారణ బల్బుతో సమానమని, వినియోగదారులు ఇటీవల కరెంట్‌బిల్లు చెల్లించిన రశీదు, ఆధార్‌కార్డుతో సమీప ప్రాంతంలోని సెక్షన్‌ కౌంటర్‌లో ఒక బల్బుకు పది రూపాయల వంతున చెల్లించి పొందవచ్చని, అయితే వీటిని ఎట్టి పరిస్థితు ల్లోనూ తిరిగి విక్రయించుకోరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ బల్బ్‌ల వల్ల ఏడాదికి 500 నుంచి 700రూపాయల దాకా ఆదాయం పొందే అవకాశం వుందని తెలి పారు. 800 రూపాయల విలువైన బల్బు లను కేవలం 20 రూపాయలకే అంది స్తున్నామన్నారు. నెల్లూరు నగరంలోని 10 సబ్‌స్టేషన్లలో ప్రతి ఇంటి వినియోగదారు నికీ ఈ బల్బులు అందుబాటులో వుంటా యని, ప్రతి వినియోగదారుడు వీటిని వినియోగించుకుని విద్యుత్తును ఆదా చేయాలని ఆయన కోరారు. నెల్లూరు నగరంలోని పొదలకూరురోడ్డు మిలీనియం సబ్‌స్టేషన్‌లో ఎల్‌ఇడి బల్బుల పంపిణీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఇ నాగ శయనరావు, టెక్నికల్‌ డి.ఇ వెంకటేశ్వర రావు, అధికారులు సంజయ్‌కుమార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సౌకర్యాన్ని వినియోగదారులందరూ సత్వరం వినియోగించుకుని విద్యుత్‌ ఆదా చేయడం ఎంతైనా మంచిదే!..

hazarathకళలకు, కళాకారులకు, కళాసంస్థలకు తనవంతు సహాయసహకారాలు అందిస్తూ అన్నదాత హజరత్‌బాబుగా పేరు సంపాదించుకున్న వినయశీలి, మితభాషి, దానకర్ణుడు మురళీకృష్ణ 70 హోటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరిశెట్టి హజరత్‌బాబుకు సంస్కృతి తరంగాలు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ట్రస్టు వ్యవస్థాపకులు రేణిగుంట రాజశేఖర్‌, ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి 'కళాతపస్వీ' బిరుదును ప్రదానం చేసి గజమాల, పూలకిరీటం, శాలువ, సన్మాన పత్రంతో ఘనంగా సన్మానించారు. మంగళవారం నెల్లూరు టౌన్‌హాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక సభ సహకారంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సరదా సంగీత, నృత్య పోటీలు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగాయి. ఎన్నో ఏళ్లుగా నెల్లూరులో కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ఉత్సాహపరుస్తున్న హజరత్‌బాబును సత్కరించారు. అనంతరం ట్రస్ట్‌ తరఫున కంభం విజయరామిరెడ్డిని రేణిగుంట రాజశేఖర్‌ రోజామాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నాట్య మయూరి బేబి సుమేధ ప్రత్యేకంగా ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం సభికులను విశేషంగా ఆకట్టు కుంది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు నలుబోలు బలరామయ్యనాయుడు, బి.వి.నరశింహం, వల్లకవి వెంకటసుబ్బారావు, శింగంశెట్టి మురళీమోహన్‌రావు, టివి ఆర్టిస్టు సూర్య తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా దగ్గుపాటి రాధాకృష్ణ వ్యవహరించారు. సుధాకర్‌రెడ్డి రచనా దర్శకత్వంలో శృతి కళానికేతన్‌ నెల్లూరు వారిచే ప్రదర్శించిన 'మా'నవధర్మం సాంఘిక నాటిక ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అనంతరం శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యంలో గెలుపొందిన వారికి శాలువాలతో, మెమొంటోలు బహూక రించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శాస్త్రీయ నృత్యంకు బాడిగ అనిల్‌కృష్ణ (అవనిగడ్డ), భాగవతుల వెంకటరామశర్మ (విజయవాడ), శాస్త్రీయ సంగీతంకు బ్రహ్మానందం (విజయవాడ) వ్యవహరించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు 85 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాలను ట్రస్ట్‌ వ్యవస్థాపకులు రేణిగుంట రాజశేఖర్‌ పర్యవేక్షించారు.

kartheekamమహాశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సందర్భంగా నెల్లూరు జిల్లా లోని అన్ని శైవక్షేత్రాల్లో ఆథ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సైదాపురం మండలం కలిచేడుకు సమీపంలోని సిద్దలయ్యకోన, కొడవలూరు మండలం గండవరంలోని శివాలయం, విడవలూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో వెలసియున్న శైవక్షేత్రం, సీతారామపురం మండలం సమీపంలోని భైరవకోన, సోమశిల మల్లీశ్వరస్వామి దేవస్థానం కార్తీకశోభతో శోభిల్లుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ దేవాలయాలను దర్శించుకుంటున్నారు.

కార్తీక దీపాల వెలుగులు

కార్తీకమాసం తొలి సోమవారం శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆల యాల్లో కార్తీక దీపాలను శోభాయమా నంగా భక్తులు వెలిగించారు. కార్తీకదీపాల కాంతులతో జిల్లాలోని శివాలయాలు ప్రత్యేకశోభను సంతరించుకున్నాయి. తొలి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకదీపాలను శివాలయంలో భక్తి శ్రద్ధలతో వెలిగించి కార్తీకమాస వ్రతా లను నిర్వహించారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నా భక్తులు పరమేశ్వరుని దర్శనానికి శివాలయాల్లో బారులు తీరారు. ప్రత్యేకపుష్పాలంకర ణలు, విద్యుద్దీప కాంతులతో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు పాలాభిషేకాలు, రుద్రహోమాలు, మహన్యాసపూర్వక ఏకా దశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. దర్గా మిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో వున్న సుంద రేశ్వరస్వామి ఆలయంలో మహిళాభక్తులు విశేషంగా పాల్గొని కార్తీక దీపాలను వెలి గించి నోములు నోచుకున్నారు. నెల్లూరు నగరంలోని పలు శివాలయాల్లో భక్తులు విశేషంగా పాల్గొని కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

నెల్లూరుజిల్లాలోని అన్ని శైవక్షేత్రాల దర్శనార్థం జిల్లా ప్రజలకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో షటిల్‌ బస్సులను నడిపించా లని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలను జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. జిల్లాలో వుండే శైవక్షేత్రాలను దర్శించుకునే భాగ్యాన్ని పర్యాటకశాఖ వీలైనంత త్వరగా కల్పిస్తుందని ఆశిద్దాం.

pigsనెల్లూరు నగరంలో పందులు రాజ్యమేలుతున్నాయి. మురికి వాడలలోనే కాకుండా ప్రధాన ప్రాంతాల్లోనూ పందులు మందలు మందలుగా తిరుగుతున్నాయి. అయితే నగర పాలక సంస్థ మాత్రం పందులను, మనుషులను ఒకటేగా చూస్తున్నట్లుంది. ఈ పందులను పట్టి దూరంగా తరలించాలనే ఆలోచనే లేకుండా పోయింది. చివరకు ఈ పందులు మా ఏరియాల్లో మీరు ఉండడమేంటన్నట్లుగా మనుషుల మీద దాడులకు దిగుతున్నాయి.

12వ తేదీ వెంకటేశ్వరపురంలోని జనార్ధనరెడ్డి కాలనీలో హలీమా అనే మూడేళ్ళ చిన్నారిపై పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందు తుంది. కొన్ని రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో ఐదేళ్ళ బాలుడు పందుల దాడిలో చనిపోయాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగివున్నాయి. మరి నగర పాలకులు ఎప్పటికి మేలుకుంటారో?

chandrababu arupuముఖ్యమంత్రి చంద్రబాబుకు భలే కోపం వచ్చింది. చంద్రుడు కాస్తా చంఢ శాసనుడయ్యాడు. తనలోని ఉగ్రరూపాన్ని చూపాడు. ''చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు... మాడి మసై పోతావ్‌'' అన్న బాలయ్య డైలాగ్‌ను వినే వుంటారు. కాని ఇక్కడ చంద్రబాబు మాత్రం తన రెండోవైపు చూపించాడు. ఎదురుగా వున్న కాంట్రాక్టర్‌ను ఎడాపెడా వాయించాడు. చంద్రబాబులోని కోపాన్ని చూసి పక్కనే వున్న తెలుగు తమ్ముళ్ళంతా ఉలిక్కిపడ్డారు.

అసలు విషయానికొస్తే మంత్రి నారా యణ కుమార్తె పెళ్లి నేపథ్యంలో సిఎం చంద్రబాబు గత నెల 30వ తేదీన నెల్లూరొచ్చారు.

శుభకార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకున్నట్లు కొన్ని అధికారిక కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాడు. వీటిలో భాగం గానే నెల్లూరు, సంగం బ్యారేజీల పరిశీలన. నెల్లూరు బ్యారేజీ పరిశీలించినప్పుడు సంబంధిత కాం ట్రాక్టర్‌పై చంద్రబాబు నిప్పులు కక్కారు. పనులు ఆలస్యం కావడంపై తీవ్రంగా మందలిస్తూ, నేను తలచుకుంటే దేశంలో ఎక్కడా వర్క్‌లు చేయలేవని, బ్లాక్‌లిస్టులో పెడతానని హెచ్చరించారు.

మీడియా ముందు ఈ షో బాగానే వుంది. అక్కడున్న తెలుగుతమ్ముళ్లు కూడా చంద్రబాబు యాక్షన్‌ సీన్‌ చూసి ఆనంద పడ్డారు. అసలు బ్యారేజీ పనులు ఎందుకు పెండింగ్‌లో వున్నాయి, ఇంతవరకు ఎం దుకు పూర్తి కాలేదనే విషయం చంద్రబాబు పరిశీలించారా? పట్టిసీమపై పెట్టిన శ్రద్ధలో ఒకటోవంతు శ్రద్ధ ఈ ప్రభుత్వం నెల్లూరు, సంగం బ్యారేజీలపై పెట్టుంటే ఇదివరకే ఎప్పుడో ఇవి పూర్తై వుండేవి. 2005 సంవత్సరం అంచనా ప్రకారం ఈ బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. పిల్లర్స్‌ వ్యయమే బాగా పెరిగింది. కాం ట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులు చాలా మొత్తంలో పెండింగ్‌లో వున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో ఈ రెండు బ్యారేజీ లకు నిధులు విడుదల కాలేదు. కొత్తగా చేపడుతున్న కాలువలు, సాగునీటి పనులకు ప్రభుత్వం నిధులను ఇబ్బడి ముబ్బడిగా దోచిపెడుతోంది. అంతటి శ్రద్ధ ఈ రెండు బ్యారేజీల మీద కూడా చూపించి వుంటే చంద్రబాబు ఆవేశం తెచ్చుకోవాల్సినంత అవసరం ఉండేది కాదు.

Friday, 30 October 2015 07:00

భక్త సాగరంలా... నగరం

Written by

rottela pandugaకులమతాలకు అతీతంగా ప్రతియేటా నెల్లూరు దర్గామిట్టలోని బారాషాహీద్‌ దర్గా వద్ద జరిగే రొట్టెలపండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. జిల్లా, రాష్ట్ర, దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు ఈ పండుగలో పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 5రోజుల పాటు దాదాపు 7లక్షల మందికి పైగా భక్తులు ఈ పండుగలో పాల్గొన్నట్లు సమాచారం. మొహరం పండుగకు మూడవరోజు మాత్రమే జరుపుకునే ఈ పండుగను భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో 5రోజులకు పెంచారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పండుగనకు ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అయిదు రోజులు భక్తజన సందోహంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ముస్లింలే కాకుండా హిందూ, క్రైస్తవ సర్వమతాల వారు భక్తి పారవశ్యంతో దర్గా ఆవరణంలో బారులు తీరారు. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. వివాహం కావాలని యువతులు పెళ్లి రొట్టె, ఉద్యోగం రావాలని యువత ఉద్యోగ రొట్టె, ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులు, సంతానం కలగాలని దంపతులు, అనారోగ్య సమస్యలు తీరాలని రోగగ్రస్తులు... ఇలా తమ కోర్కెల కోసం రొట్టెలు పంచుకున్నారు. పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

షహదత్‌తో పండుగ ప్రారంభమైంది. 26వ తేదీ తెల్లవారుజామున గంథ మహోత్సవం వైభవంగా జరిగింది. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫ్‌ ఉల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంథమహోత్సవంలో పాల్గొని సమాధులకు లేపనం చేశారు. అనంతరం భక్తులకు గంథం పంపిణీ చేసారు.

రాష్ట్ర మంత్రి నారాయణ రాజధాని రొట్టెను నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ నుంచి స్వీకరించారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దర్గాను సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరురూరల్‌, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ప్రత్యేకహోదా రొట్టెలను పట్టుకున్నారు. 27వ తేదీ తహలీల్‌ పాతెహాను ఘనంగా నిర్వహించారు. ఆరోజు జిల్లా కలెక్టర్‌ దర్గాను సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. ఆమెతో పాటు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, దర్గా కమిటి అధ్యక్షుడు ఆసిఫ్‌బాషా పాల్గొన్నారు. మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పాల్గొని డెంగ్యూ జ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని రొట్టె పట్టుకున్నారు.

అయిదురోజుల పాటు జరిగిన రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డా|| గజరావు భూపాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. శనివారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగ మంగళవారం తహలీల్‌ ఫాతేహాతో ముగిసింది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా వేడుకను బుధవారం అధికారులు ప్రకటించారు. తొలుత గంథం, ఖర్జూరాన్ని తీసుకొచ్చి మత పెద్దలు ఫాతేహా చేశారు. ముజావర్లు, ఫకీర్ల ప్రార్థనల మధ్య గంథాన్ని బారాషాహీదుల సమాధులపై లేపనం చేసారు. అనంతరం భక్తులకు గంథాన్ని పంచిపెట్టారు. బుధవారం సాయంత్రం వరకు పండుగ జరుగనుండడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి తమ కోర్కెల రొట్టెలను స్వర్ణాల చెరువులో పట్టుకున్నారు. రొట్టెల పండుగ కోసం దర్గా ఆవరణలో వ్యాపారులు పెద్దఎత్తున దుకాణాలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం జెయింట్‌వీల్‌, ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. విద్యుత్‌దీప కాంతులతో దర్గా ఆవరణం కళకళలాడింది.

money schemeభారతదేశంలో ప్రజలకు ఉన్న అతి పెద్ద జాడ్యం మరచిపోవడం. ఇంకో కోణంలో దీనిని వరమని కూడా అనుకో వచ్చు. ఈరోజు ఒక సంఘటన జరుగు తోంది. దాని గురించి అదే పనిగా చర్చించు కుంటుంటాం. రెండోరోజు ఇంకో సంఘటన జరిగితే మొదటిదానిని మరచిపోతుంటాం. ప్రజలకు ఈ మరిచిపోయే స్వభావం ఉండడం ప్రభుత్వాలకు, పాలకులకు వరంగా మారుతోంది.

అధికారంలో ఉన్న ప్రభుత్వం నాలుగేళ్ల తొమ్మిది నెలలు సక్రమంగా పనిచేసి, చివరి మూడు నెలల్లో ఏదన్నా ధరలు పెరగ డమో, పన్నులు పెంచడమో చేసారను కోండి... ముందుకాలంలో చేసిన మంచి నంతా మరచిపోతారు, చివరి మూడు నెలల్లో వేసిన భారాన్ని గుర్తుపెట్టుకుని కసితో ఆ ప్రభుత్వాన్ని దించేస్తారు. అదే ప్రభుత్వం 4ఏళ్ల 9నెలు ఛండాలంగా పనిచేసి చివరి మూడు నెలల్లో ఋణమాఫీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తే ముందుకాలం జరిగిన చెడునంతా మరచి పోయి మళ్ళీ అధికారం కట్టబెడతారు.

ప్రజలకు ఈ మరచిపోయే స్వభావం రాజకీయ నాయకులకే కాదు, స్కీంల పేరుతో మోసం చేసే ఛీటర్స్‌కు కూడా బాగానే ఉపయోగపడుతోంది. నెల్లూరు జిల్లాలో ఫైనాన్స్‌ మోసాలకు ఉదాహరణలు కోకొల్లలుగా వున్నాయి. అయినా ఇంకా ఫైనాన్స్‌ మోసాలు జరుగుతున్నాయంటే కారణం అంతకుముందు జరిగిన మోసా లను మరచిపోవడమే!

జిల్లాలో ఓ పక్క మనీస్కీం బాధి తులు... ఇంకో పక్క అగ్రిగోల్డ్‌ బాధి తులు... తమ బాధను ఎవరికి చెప్పుకో వాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. వందలకోట్ల రూపాయలు ఈ రెండింటి ద్వారా నష్టపోయారు. ఈ రెండింటికి బాధితులు జిల్లాలోనే వేలల్లో ఉన్నారు.

జిల్లాలో మనీస్కీం ఒక మతం ముసు గులో జరిగిన పెద్ద దోపిడీ రాకెట్‌. ప్రతి నెల పింఛన్‌లు ఇస్తామంటూ ఆశ చూపి మహిళల నుండి పెద్దమొత్తాలలో నగదు వసూలు చేసారు. రోజు కూలీలకు పోయే వాళ్లు, టిఫిన్‌ బండి, టీ బంకులు నడుపు కునేవాళ్లు ఈ మనీస్కీంలలో చేరారు. వందల కోట్లు పోగేసుకున్నాక ఈ మనీస్కీం ఏజెంట్లు చేతులెత్తేసారు. దీనిపై గతంలో డిజిపిగా పనిచేసిన జిల్లా వాసి దినేష్‌రెడ్డి సిఐడి దర్యాప్తుకు ఆదేశించడం తెలిసిందే! పోలీసులు కొందరు ఏజంట్ల నుండి భారీ మొత్తాలలో నగదును స్వాధీనం చేసుకోడం జరిగింది. కోర్టులో కేసు నడుస్తుంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. మోసానికి పాల్పడ్డ ఏజెంట్లు దర్జాగా తిరుగుతున్నారు. ఎటొచ్చి బకరాలయ్యింది డబ్బులు పోగొట్టు కున్న బాధితులే! ఇంతవరకు ఏ ఒక్క బాధితురాలికి రూపాయి తిరిగి రాలేదు. ఇంకొన్నేళ్లు పోతే ఈ మనీస్కీం మరచి పోయే ఖాతాలో చేరిపోతుంది.

అలాగే అగ్రిగోల్డ్‌ కూడా ఈ బాపతే! ప్రజల సొమ్ముతో రకరకాల వ్యాపారాలు పెట్టింది ఈ సంస్థ. వేల ఎకరాలలో భూములు కొన్నారు. సంస్థకు ఆస్తులు న్నాయి. అమ్మయినా బాధితులకు నగదు చెల్లించవచ్చు. కాని ఆస్తులన్నీ కోర్టులో

ఉన్నాయి. బాధితులు బజారున పడ్డారు. డిపాజిటర్లకు నగదు చెల్లించే పరిస్థితుల్లో అగ్రిగోల్డ్‌ సంస్థ లేదు. బాధితులు మాత్రం ఆందోళనకు దిగుతున్నారు.

చరిత్రను తిరగేద్దాం... గతంలో ఎన్నో ఫైనాన్స్‌ మోసాలు జరిగాయి. ఏ సంస్థ నుండి కూడా బాధితులకు తిరిగి చెల్లింపులు జరిగిన దాఖలాలు లేవు. కాలం ముందుకు జరిగితే, జనం జరిగిందంతా మరచిపోతారనేది పాలకుల నమ్మకం.

doctorsనెల్లూరులో డయాబిటిస్‌ డాక్టర్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్‌ సత్యనారాయణమూర్తి. నెల్లూరు పొగతోటలో ఎన్నో ఏళ్ల క్రితమే డయాబిటిస్‌ క్లినిక్‌ను నెలకొల్పి షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఆయన మెరుగైన వైద్యసేవలంది స్తున్నారు. ఇప్పుడు మరో ముందడుగు వేసారు. డయాబిటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌ను ఈ నెల 22వ తేదీన విజయదశమి నాడు ప్రారంభిస్తున్నారు. సత్యనారాయణమూర్తి అల్లుడు డాక్టర్‌ ఎం.వి.రామమోహన్‌ కూడా ఈ క్లినిక్‌ ద్వారా తమ వైద్యసేవలు అందించనున్నారు. ఈయన డయాబిటిస్‌తో పాటు ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్‌. గతంలో అపోలో వంటి ఆసుపత్రిలో పనిచేసి విశేష అనుభవం గడించారు. షుగర్‌, హార్మోన్స్‌, థైరాయిడ్‌, ఒబెసిటి, బరువు తగ్గడం, నెలవారీ సమస్యలు, పిట్యూటరి సమస్యలు, హైబిపి వంటి వాటికి సరైన చికిత్సనందించడంలో సిద్ధహస్తులు. నగరంలో కార్పొరేట్‌ ఆసుపత్రులలో తప్పితే బయట ఎండోక్రైనాలజీ వైద్యులు పెద్దగా లేరు. డయాబిటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌ ద్వారా ఆ సమస్య తీరబోతోంది.

irukalaసింహపురి గ్రామదేవత, నెల్లూరు నగరంలోని మూలాపేటలో చెరువు ఒడ్డున వెలసిన చల్లనితల్లి..శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.వి శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, ప్రతినిత్యం ఉదయం 6.30 గంటలకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు పూలంగిసేవ, రాత్రి 8 గంటలకు పల్లకీసేవ నిర్వహిస్తారు.

ఎంతో ప్రాచీన చరిత్ర వున్న ఆలయం :

నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ఈ ఆలయం నాటి కాలంలో ఎర్రని బొంతరాళ్ళతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి. ఎంతో ప్రాచీన చరిత్ర వున్న నెల్లూరు నగరంలో క్రీ.శ 10, 11 శతాబ్ధాల నాటికే ఈ ఆలయం వున్నట్లు, అప్పటినుంచే అమ్మవారు గ్రామదేవతగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర చెప్తోంది. అప్పట్లో నెల్లూరు చెరువును స్వర్ణాల చెరువు అని వ్యవహరించేవారు. ఈ చెరువును కాకతి గణపతిదేవుడు నిర్మించారు. ఈ ఆలయంలోని స్తంభాలపై తెలుగు, తమిళ, దేవనాగరి భాషల్లో వున్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రక అంశాలను తెలుపుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.

ప్రతినిత్యం కన్నుల పండువగా అలంకారాలు :

ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి నిర్వహించే విశేషాలంకరణలు భక్తులందరికీ కన్నుల పండువగా వుంటాయి. 13న ఉదయం 10 గంటలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. 14వ తేది నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ఇలా విశేష అలంకారాలను నిర్వహిస్తారు. 14వ తేది సాయంత్రం శ్రీ అన్నపూర్ణాదేవి అలం కారం, 15న శ్రీ గజలక్ష్మీ అమ్మవారి అలం కారం, 16న శ్రీ సరస్వతీదేవి అలంకారం, 17న శ్రీ భవాని అమ్మవారి అలంకారం, 18న శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకారం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వా హకులు తెలిపారు. అదేవిధంగా, 19వ తేది సాయంత్రం శ్రీ చండీ అమ్మవారి అలంకారం, 20న శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం, 21న నవమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి అలం కారం నిర్వహిస్తారు. 22న విజయ దశమిని పురస్కరించుకుని వేడుకగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి అలం కారం నిర్వహిస్తారు.

Page 7 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • వివేకన్నా... నీ రాక కోసం.. నిలువెల్ల కనులై...
  సింహపురి సోగ్గాడా... స్టైల్‌ ఆఫ్‌ సింహపురీ... ఓ వివేకా... ఎన్నిరోజు లైందయ్యా నిన్ను చూసి... నిన్ను చూడక, చిరునవ్వుల లొలికే నీ ఫేసు చూడక మా వాళ్ళ ముఖం వాచిపోయిం దనుకో... నాలుగేళ్ళు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా, పదిహేనేళ్ళు ఎమ్మె ల్యేగా వుంటే…

Newsletter