నెల్లూరులో నేడు (128)

sp sailajaనెల్లూరులోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాంజలి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6.30గంటలకు నెల్లూరు, టౌన్ హాల్లో ప్రముఖ సినీ నేపథ్యగాయని శ్రీమతి ఎస్.పి.శైలజకు కళాంజలి ఆత్మీయ పురస్కారం వుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు కళాంజలి అనంత్ తెలియజేసారు. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి జ్యోతిప్రకాశనం చేస్తారని తెలిపారు. ముఖ్యఅతిథులుగా స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, కళాంజలి గౌరవాధ్యక్షులు వీరిశెట్టి హజరత్ బాబు తదితరులు పాల్గొంటారని, ఈ సందర్భంగా సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సినీ పాటల పోటీలు – ఈ సంధర్భాన్ని పురస్కరించుకుని ఆరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల దాకా సినీపాటల పోటీలు నిర్వహిస్తామని, 12ఏళ్ళ లోపు వారిని జూనియర్లుగా, ఆపై వారిని సీనియర్లుగా పరిగణించి, ఆయా విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. విజేతలకు అదేరోజు సాయంత్రం జరిగే కళాంజలి ఆత్మీయ పురస్కారం కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని వివరించారు. వివరాలకు కళాంజలి అనంత్, ఫోన్. 9848959575ను సంప్రదించాలని ఆయన కోరారు.

ravi sannaదక్షిణభారత దేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల సెజ్ పురస్కారం శ్రీసిటీ సాధించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారం కూడా. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీగా వున్న శ్రీసిటీకి ఈ బెస్ట్ మల్టీ ప్రాడెక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఇన్ సౌత్ ఇండియా అవార్డు రావడం ఎంతో గర్వకారణం. ఎగ్జిమ్ ఇండియా ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన సౌత్ ఈస్ట్ సిఇఓ కాన్ క్లేవ్ అవార్డ్స్ – 2014 కార్యక్రమంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అఁదుకున్నారు. ఎంసిసిఐ ఎక్స్ పర్ట్స్ కమిటీ ఛైర్మెన్ జె.శ్రీకృష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా ఆయన అందుకున్నారు. శ్రీసిటీ సెజ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా వుందని, మరింత ఉన్నత ప్రమాణాలతో నిబద్ధతతో సెజ్ ను మరింత తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తామని ఈ సందర్భంగా శ్రీసిటీ ఎం.డి రవీంద్ర సన్నారెడ్డి అన్నారు.

anilనెల్లూరు, రామచంద్రాపురం ఎఫ్ సిఐ కాలనీలో పిక్కిలి హసనయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. యువకులు ఇచ్చిన రక్తాన్ని రెడ్ క్రాస్ వారు సేకరించారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి, రక్తదానంపై ప్రజల్లో వున్న అపోహలను తొలగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాథ్, దామవరపు రాజశేఖర్, పిక్కిలిరాజ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Friday, 20 June 2014 15:40

శిక్షణకు కలెక్టర్

Written by

collecజిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఈ నెల 23 నుండి శిక్షణకు గాను ముస్సోరి వెళ్లనున్నారు. 8వారాల పాటూ ఇక్కడే శిక్షణలో ఉంటారు. కలెక్టర్ లకు, ఐఏఎస్ అధికారులకు ప్రతి ఏడేళ్లకోసారి ఈ విధమైన శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగానే ఆయన వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఎవరిని నియమిస్తారో ఇంకా తెలియలేదు. జేసీ రేఖారాణి ఇక్కడే వుంటే ఆమెనే ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా కొనసాగించే అవకాశముంది. అయితే ఆమె హైదరాబాద్ కు బదిలీ ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇన్ ఛార్జ్ కలెక్టర్ పై సందిగ్ధత నెలకొంది.

postersప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2014 సందర్భంగా నెల్లూరుజిల్లా ఛైల్డ్ ఫోరం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ చేతులమీదుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్.డి.సి.ఆర్.యస్. అనేక కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సామాజిక రక్షణ అందరికి అందించాలని, కుటుంబ మరియు బాలల ప్రయోజనాలు, పిన్షలు, ప్రసూతి రక్షణ వికలాంగుల మరియు నిరుద్యోగులకు ప్రయోజనాలు, ఆరోగ్యరక్షణ విద్యా వంటి ప్రయోజనాలను కాపాడుదామని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ ఇ.జయరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

jayaగురువారం ఆనం వెంకటరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆనం జయకుమార్ రెడ్డి ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసి ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి అని అన్నారు. సర్పంచి పదవి నుంచి రాష్ర్ట మంత్రి వరకు ఎన్నో పదవులను అలంకరించినా, ఏనాడు హంగులు, ఆర్భాటాలకు పోకుండా అత్యంత సామాన్యమైన నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శప్రాయులని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లునాయుడు, గార్లపాటి విజయకుమార్, నాగేంద్ర, నాగేశ్వరరావు, చినిగ శివారెడ్డి, మహమ్మద్ గౌస్, ప్రసాద్ నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సహకార అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.బి.మల్లికార్జునరెడ్డి మే నెల 30న ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గూడూరు డిఎలంసిఓగా పనిచేస్తున్న దూడల రాజేశ్వరరావు నియమితులై బాధ్యతలు చేపట్టారు.

court buildingజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం జిల్లా యంత్రాంగానికి రద్దీ ఎక్కువ కావడంతో దీని ప్రభావం పరోక్షంగా జిల్లా యంత్రాంగంపైన పడుతున్నందున, ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఖాళీగా వున్న కోర్టు భవనంలో ప్రజావిజ్ఞప్తుల దినంను నిర్వహించడానికి నిర్ణయించారు.

శుక్రవారం(23.05.14) మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రజలు రావడంతో కొంతమేర ఇబ్బంది ఏర్పడుతుందని అసౌకర్యాన్ని తొలగించడం కోసం కోర్టు భవనం ఉపయోగించుకోదలచి, ఆ భవనం యొక్క స్థితిగతులను కూళంకషంగా తనిఖీలు నిర్వహించవలసిందిగా రోడ్లు భవనాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు.

collec spఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారాలకు సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసే నగదు మరియు లిక్కరు వాటిపై పటిష్టమైన నిఘా వుంచి సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు.

పోలీస్ అధికారులతో అక్రమ నగదు, లిక్కర్ పంపిణీ మరియు బందోబస్తు ఏర్పాట్లపై జరిగిన సమీక్షాసమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రకాలుగా నగదు, మందు అక్రమ మార్గాలలో డంప్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని, అటువంటి వాటిపై తగిన సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రదేశాలకు పోయి గుర్తించి, వాటిని సీజ్ చేయాలన్నారు. అలాగే 7వ తేదీ పోలింగ్ జరిగే ముందురోజున ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్, డియస్పీలు వెంకటనాథరెడ్డి, రాంబాబు, బాలవెంకటేశ్వరరావు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

anilనెల్లూరులోని ప్రశాంతినగర్, సింహపురి కాలనీలలో ఈ నెల 22న వైయస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7న జరిగే సాధారణ ఎన్నికల్లో దివంగత మహానేత కుమారుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు వేసే ఓటు రాబోయే 5సంవత్సరాలు రాష్ర్టాన్ని సుభిక్షంగా వుంచేలా రాజన్న సంక్షేమ పథకాలు సక్రమంగా సాగాలే చేస్తాయని తెలిపారు. అలాగే 165డివిజన్ లోని గుర్రాలమరుగు, సంగం, ఆదినగర్ ప్రాంతాలలో కూడా అనిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏ.బాలకోటేశ్వరరావు, కాకుటూరు విజయభాస్కర్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, గంగపట్నం వినయ్, మురళి, రామ్మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Page 8 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • 'పీకే'దేమీ లేదు
    జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…
  • కాలం కరిగిపోతుంది... ఆశ ఆవిరవుతోంది!
    నిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ…

Newsletter