సంపాదకీయం


పుష్కర గోదావరి... విషాద గోదావరే అయ్యింది. తొలిరోజు పుష్కరస్నానాలు అనేక కుటుంబాల పాలిట మృత్యుజల క్రీడలే అయ్యాయి. పుష్కర స్నానాలతో పుణ్యం మూటగట్టుకోవాలని ఎంతెంతో దూరం నుంచి ఆశపడి వచ్చిన వారిని మృత్యువు కబళించింది. దీంతో గోదావరి తీరం శోకసంద్రమే అయ్యింది. పుష్కర సంరంభాలు మొదలైన కొద్దిసేపటికి జరిగిన తొక్కిసలాటలో 27మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 32మంది తీవ్రగాయాల పాలయ్యారు. మరణించినవారిలో అత్యధికులు మహిళలే. మత్తం 23మంది మహిళలు,…

Read more...

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జరుపుతున్న మధ్యఆసియా దేశాల పర్యటన భారత దౌత్య రంగంలో మరో కొత్త అధ్యాయమేనని చెప్పవచ్చు. మధ్యఆసియా దేశాలతో సహా, రష్యాలోనూ ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఈ పర్యటన మొత్తంగా ఎనిమిదిరోజుల పాటు సాగనుంది. సోమవారం ఉజ్బెకిస్తాన్ కు వెళ్లారు. మంగళవారం కజికిస్తాన్ వెళ్లారు. అక్కడ నుంచి 8వ తేదీన రష్యా, ఆ తర్వాత తుర్క్ మెనిస్తాన్, 11వ తేదీన కిర్గిజిస్తాన్, 12న తజకిస్తాన్…

Read more...

మొన్నటి దాకా యోగ ముద్రలో వున్న కమలనాథులు ఇప్పుడు మౌనముద్రలో వున్నారు. యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రధాని నరేంద్రమోడీతో పాటు, బీజేపీ అగ్రనాయకులుగా వున్న అనేకమంది ఇప్పుడు మౌనమే శరణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ మౌనాన్ని దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం భరించలేకున్నారు. దేశంలో బీజేపీ పాలనకు ఏడాది దిగ్విజయంగా గడిచిపోవడం, విశుద్ధమైన పాలన అందిస్తున్న నరేంద్రమోడీకి పాలనలో మంచి మార్కులు రావడం కాంగ్రెస్…

Read more...

సాధారణంగా యోగం అంటే అదృష్టం అనే భావనతో వ్యవహరిస్తుంటారు. వారిది మంచియోగం, కాబట్టే అంతటి ఘనత దక్కిందనే మాట అప్పుడప్పుడూ వింటూనే వుంటాం. ఇప్పుడా మాట యోగాకే దక్కింది. సాక్షాత్తూ యోగాకే ఇప్పుడు మహాయోగం సిద్ధించింది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో విన్నా... ఇప్పుడు యోగా మాటే మారుమ్రోగుతోంది. అందరినోటా యోగా మహామంత్రమై పలుకుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటితమైంది. దీంతో,…

Read more...

విధి బలీయమైనది. మృత్యువు మరెంతో కఠినమైనది. ఎన్నెన్నో కుటుంబాల వారిని తీర్థయాత్రలకు హాయిగా తీసుకువెళ్లిన వ్యక్తి, చివరకు తన కుటుంబసభ్యులందరినీ యాత్రకు తీసుకువెళ్లి వస్తూ మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో మృత్యువు పాలవడం... ఆయనతో పాటు ఆ వాహనంలో ఆదమరచి నిద్రపోతున్న ఆయన కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం ఎంతో దారుణం. ఒకే ఒక్క బాలుడు మినహా, ఒకే కుటుంబంలో ఒకేసారి 22మంది విగతజీవులు కావడం, తీర్థయాత్రకు వెళ్లిన ఆ కుటుంబసభ్యులందరికీ…

Read more...

భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ పర్యటనతో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మైత్రీభావం వెల్లివిరిసింది. ఈ పర్యటనతో భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు పడినట్లేనని భావించవచ్చు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే ఎటూ తేలకుండా అపరిష్కృతంగానే వున్న 1974 నాటి భూ సరిహద్దు ఒప్పందంపై రెండు దేశాలూ ఒక నిర్ణయానికి వచ్చి ఆమేరకు ఒప్పందాలపై సంతకాలు చేయడం ఒక చరిత్రాత్మక పరిణామమే అవుతుంది. భారత్-బంగ్లాదేశ్ ల మధ్య 4096కిలోమీటర్ల…

Read more...

రానురాను రాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టిపోతున్నాయో తెలియజెప్పేందుకు తాజా ఉదాహరణే రేవంత్ వ్యవహారం. పదవులే పరమావధిగా, అడ్డదారిలోనైనా సరే గెలవడమే ప్రధానంగా భావిస్తూ తెలుగుదేశంపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, తెలంగాణాలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి నోట్ల కట్టలు ఎరజూపడం తెలుగు రాష్ర్టాల్లో సంచలనం కలిగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రూ.50లక్షలు ఇవ్వజూపుతుండగా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసిబి…

Read more...


ఎన్ని మార్కులు వచ్చాయనేదానికంటే... రిమార్కు లేకుండా ఉండడం చాలా ముఖ్యం అన్నది పెద్దలమాట. విద్యార్థులకు మంచి నడవడికను బోధించే ఉపాధ్యాయులు చెప్పే మాట కూడా ఇదే. అయితే, దేశపాలన విషయంలో అలా కాదు, అటు మార్కూలూ రావాలి... ఇటు రిమార్కు రాకుండా చూడాలి. అప్పుడే అది భేషైన పాలన కింద లెక్క. ఇప్పుడు మోడీ ఏడాది పాలనలో మంచి మార్కులు సాధించడమే కాక, ఎలాంటి అవినీతి రిమార్కు లేకుండా పాలన…

Read more...

స్నేహబంధం ఎంతో మధురమైనది. అందుకే స్నేహానికి సర్వత్రా ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ రెండు దేశాల మధ్య స్నేహబంధం ఒక ఆత్మీయానుబంధంగా, మరింత బలోపేతం కావడం ఎంతైనా హర్షించదగ్గది. ఏదో మనసు కష్టంతో ఏళ్ల తరబడి దూరంగా వుండి బాధపడేకన్నా, ఎప్పుడో ఒక రోజున మనసు విప్పి మాట్లాడుకుంటే అన్ని కలతలూ తీరిపోతాయి. చైనా-భారత్ ల విషయంలో ఇప్పుడు జరుగుతున్నదదే. ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించేందుకు సౌహార్ద్రపూరితమైన వాతావరణంలో జరిగే…

Read more...


Page 9 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter