సంపాదకీయం


నవ్యాంధ్ర తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి పాలనకు ఈ నెల 16వ తేదీతో నూరురోజులు పూర్తయింది. కాంగ్రెస్ హయాంలో రాష్ర్టంలో పరిపాలన అంతా అస్తవ్యస్తం కావడం, అనేక ప్రాధాన్యతగల రంగాలు సైతం అభివృద్ధికి నోచుకో కుదేలైపోవడం, ప్రధానమైన విద్యుత్, సాగునీటి రంగాల పరిస్థితిని పట్టించుకునేవారు లేక అటు ప్రజలు, ఇటు రైతులు సమస్యల సుడిలో విలవిలలాడిపోవడం, మరోవైపు విభజనతో రాష్ర్టంలో మరిన్ని గడ్డు పరిస్థితులు…

Read more...

ఏ ముహూర్తంలో రాష్ర్టాన్ని విభజించారో గాని, ఆంధ్రప్రదేశ్ కు అన్నీ కష్టాలే వచ్చిపడుతున్నాయి. ఏ అభివృద్ధి పనిచేద్దామన్నా నిధులు లేక నీరసపడడం మినహా గత్యంతరం లేని దుస్థితి ఏర్పడింది. అసలే భారీ లోటు బడ్జెట్ ఒకవైపు, చేయాల్సిన అభివృద్ధి పనులు మరోవైపు. ఈ రెండింటికీ మధ్య సమన్వయం కుదరడం లేదు. ఏమి చేయాలన్నా నిధులతో పని. ఆర్థికంగా ఒక రాష్ర్టం ఇన్ని ఇబ్బందులు ఎదర్కోవడం ఎప్పుడూ వినలేదు. కనలేదు. ఈ…

Read more...

భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటన ఫలవంతమైంది. ఆశించిన లక్ష్యాలను సాధిస్తూ ఆయన పర్యటన ఆసాంతం ఉత్సాహంగా కొనసాగింది. జపాన్ ప్రధాని షింజో అబేతో టోక్యోలో ఈ నెల 1న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వున్న సంబంధ బాంధవ్యాలను మరింత పెంపొందించుకునేలా తమ అభిప్రాయాలను, ఆలోచనలను సవివరంగా స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని కూడా మోడీ అభిప్రాయాలతో ఏకీభవించి, భారత్ లో…

Read more...

రాష్ర్టంలోని పలు జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో క్రమేణా కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. నిత్యం నీలిమబ్బుల దోబూచులాటలే తప్ప, వానచినుకులు మాత్రం కురవడంలేదు. రైతన్నల కంటి కొలుకుల్లోంచి బొటబొటా కన్నీటి చుక్కలు రాలుతున్నా వురుణుడికి మాత్రం కరుణ కలగడం లేదు. రాష్ర్టంలోని పలు జిల్లాల్లో వున్న డెల్టా ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, ముఖ్యంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు వాన రాక కోసం నిత్యం నిరీక్షిస్తూనే వున్నారు.…

Read more...

కలసి వుంటే కలదు సుఖం. అన్ని కాలాల్లోనూ ఈ మాట అందరికీ వర్తిస్తుంది. విభేదాలను పెంచుకుంటూ అభివృద్ధికి దూరం కావడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి సమస్యలు ఒకరు సహృదయంతో అవగాహన చేసుకుని, కలసికట్టుగా వ్యవహరిస్తే ఎంతటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు. ఎవరైనా సరే, రచ్చల మాటలొదిలేసి చర్చల బాటకొస్తే, మాటామాట అనుకోకుండా సామరస్య ధోరణితో సంభాషించుకుంటే ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించవచ్చు. ఇప్పుడు సాక్షాత్తూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నుకున్న…

Read more...

చేతిలో డబ్బులు లేక తల్లిదంరడులకు చికిత్స చేయించలేకపోవడం, పిల్లలను చదివించుకోలేక అవస్థలు పడడం, చివరికి సెలవులకు ఇళ్ళకు వెళ్లేటప్పుడు రైళ్ళలో రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడుతుండడం.. ఇలాంటివెన్నో సమస్యలను సైనికులు, సైనికుల కుటుంబాలు నిత్యం ఎదుర్కొంటూనే వుంటాయి. అయినప్పటికీ, వారు విధి నిర్వహణలో మాత్రం అలాంటివేమీ పట్టించుకోరు... వారి కర్తవ్యదీక్ష అలాంటిది... అంటూ భారత ప్రధాని నరేంద్రమోడీ వీర జవాన్ల దేశభక్తిని, కర్తవ్యదీక్షను కొనియాడుతూ చేసిన ప్రసంగం అందరినీ ఎంతో…

Read more...

ఒక యుద్ధం ఎంతోమందిని భీతావహులను చేస్తుంది. అయితే, ఒక స్నేహహస్తం మరెంతో మందికి ఆత్మీయతానురాగాలను అందిస్తుంది. ఇరు దేశాల మధ్య ప్రగతికి దారులు వేసే స్నేహవారధి ఆయా దేశాలకే కాక, ప్రపంచానికే మార్గదర్శకమవుతుంది. శాంతి సామరస్యాలతో జీవించడం, దేశవిదేశాల్లోనూ, ఖండఖండాంతరాల్లోనూ ఎల్లలు లేని స్నేహానురాగాలను అందరికీ పంచడం అన్నది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అలాంటి పవిత్రమైన భారతదేశం నేతగా, దేశ ప్రధానిగా నరేంద్రమోడీ ఇటీవల చేస్తున్న విదేశీ పర్యటనలు…

Read more...


జులై నెల... మెదక్ జిల్లా మాసాయిపేటకే కాదు, తెలుగు ప్రజలందరికీ పెనువిషాదాన్ని మిగిల్చిన అత్యంత దురదృష్టకర మాసంగా ముద్రవేసుకుంది. ఈ ఏడాదిలోనే ఇదొక నెత్తుటి మాసంగా నిలిచిపోయింది. బస్సులో బడికి వెళ్తున్న అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను పొట్టనబెట్టుకుని, వారి తల్లులకు గర్భశోకాన్ని, తండ్రులకు తీరని గుండెకోతనూ మిగిల్చి ఇదో విషాద మాసంగా నిలిచిపోయింది. ఎట్టకేలకు జులై వెళ్లిపోయింది. తెలుగు వారి గుండెల్ని నిలువునా కోసినంతగా బాధపెట్టి, ఎంతోమంది తల్లిదండ్రుల…

Read more...

కోట్లాది రూపాయల అప్పులు, కుప్పలు తెప్పలుగా సమస్యలు, భరించలేనంత లోటు బడ్జెట్.. సంక్షోభంలో వ్యవసాయరంగం, ఆరని నిప్పులగుండంలా నిరుద్యోగం, విద్య – వైద్యం – పరిశ్రమలు వంటి ప్రాధాన్యతారంగాలు చతికిలబడిపోవడం... సాగునీరు, విద్యుత్ వంటి ప్రాణప్రదమైన రంగాలు కుదేలైపోవడం.. మరోవైపు ఎటుచూసినా అవినీతి – అక్రమాలు పెరిగిపోవడం, సామాన్య జనం జీవనం సాగించలేనంతగా ధరలు ఆకాశానికంటడం ప్రగతి దారి పట్టాల్సిన రాష్ట్రం అధోగతి పాలవడం ఇలా ఎన్నో రకాల కష్టాలూ..…

Read more...


Page 10 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter