సంపాదకీయం


ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ నైపుణ్యం ఉన్న ఇజ్రాయెల్‌తో భారత్‌ సంబంధాలు మునుపటి కన్నా మరింతగా బలోపేతం అవుతుండడం ఎంతైనా సంతోషకరం. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు భారత్‌ పర్యటన ఇరుదేశాల స్నేహాన్ని సుదృఢం చేస్తూ ముందుకు సాగుతుండడం ఎంతో ఆనందదాయకం. మన ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి నేరుగా స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి నెతన్యాహును ఆలింగనం చేసుకుని స్వాగతం పలికి ఇజ్రాయిల్‌ పట్ల భారత్‌కు ఉన్న మైత్రీభావాన్ని,…

Read more...

పెద్దనోట్ల రద్దుతో దేశంలో కాలక్రమేణా డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న ప్రస్తుత దశలో, ఇదే అదనుగా భావిస్తున్న సైబర్‌ నేరగాళ్ళు పూర్తిస్థాయిలో విజృంభించి ఆన్‌లైన్‌ మోసాలు, చీటింగ్‌లతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుండడం దేశవ్యాప్తంగా కలవరం కలిగిస్తోంది. ఒకవైపు నగదు రహిత చెల్లింపులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంటే, మరోవైపు సైబర్‌ దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వైనం దేశప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా ఈ సైబర్‌ నేరాల…

Read more...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడూ ఒక సంచలనమే. ఆయన సినిమాలు ప్రజలను ఉర్రూతలూగిస్తూ ఎంతో సంచలనం కలిగించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లోనూ రజనీ ఒక సంచలనమే. ఆయన చేసిన రాజకీయ ఆరంగేట్రం ప్రకటన కూడా ఒక పెద్ద కలకలమే. దాదాపు రెండు దశాబ్దాలుగా 'ఇదిగో వస్తున్నా.. అదిగో వచ్చేస్తున్నా'నంటూ అందరినీ ఊరిస్తున్న రజనీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశానంటూ తాజాగా ప్రకటించడంతో తమిళనాడులో కొత్తసంవత్సరం కొంగ్రొత్త రాజకీయపరిణామాలతో ఉత్కంఠభరితంగా ఉంది.…

Read more...

అది ఏ వ్యాపారమైనా సరే, వస్తువు ఉత్పత్తి ధర కన్నా, వినియోగదారునికిచ్చే ధర అధికంగానే ఉంటుంది. కారణం, అందులో ఖర్చులు పోను కొంత ఆదాయానికే ఆ వస్తువును విక్రయిస్తుంటారు. అందువల్ల వ్యాపారం ఎప్పుడూ మూడుపువ్వులు ఆరు కాయలుగానే ఉంటుంది. కానీ, ఇక్కడలా కాదు. ఇది వ్యవసాయం. స్వేదంతో కలిపి చేసే సేద్యం. ఆరుగాలం కష్టపడి, తొలికోడి కూయకముందే పంటపొలాల్లోకి వెళ్ళి రాత్రనక, పగలనక శ్రమిస్తేనే ధాన్యం గింజలు రాలేది. అన్నదాతలైన…

Read more...

ముందుగానే.. సర్వేలు జోస్యం చెప్పినట్లుగానే గుజరాత్‌లోను, హిమాచలప్రదేశ్‌లోనూ కమలం వికసించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. గుజరాత్‌లో బిజెపి అధికారం నిలబెట్టుకున్నప్పటికీ, గతంలో వలె బిజెపికి ఇక్కడ భారీ విజయమేమీ లభించలేదు. అత్తెసరు మెజార్టీతో బయటపడింది. 150స్థానాలు గ్యారంటీ అనుకుంటే, కేవలం 99సీట్లతోనే సరిపెట్టు కోవాల్సివచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం అనూహ్యంగా బలం పెంచుకుని 77 సీట్లు గెల్చుకుంది. ఇలా జరుగుతుందని బహుశా కమలనాధులు…

Read more...

మన దేశంలో ప్రజారోగ్యం పడకేసింది. అనారోగ్యం మాత్రం అంతటా విస్తరిస్తోంది. ఏ చేయూతా లేక అసహాయస్థితిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉన్న అనేకానేక పథకాలు ఆచరణలో చట్టుబండలవు తుండడంతో రకరకాల వ్యాధుల బాధలతో, అనారోగ్యాలతో ప్రజలు నిత్యం వేదన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా, పేదరికం కారణంగా గర్భిణులు సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల..వారితో పాటు, శిశువుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. రానురాను మన సమాజంలో మాతా శిశువుల…

Read more...

పోలవరం జాతీయ ప్రాజెక్టు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే ఒక్క పోలవరంలోనే పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో మహత్తరమైన అభివృద్ధి జరిగిపోతోందనే ప్రచారంతో అందరి దృష్టీ దానిమీదే పడి 'దిష్టి' తగిలిందే ఏమో!.. మళ్ళీ ఇప్పుడు లేనిపోని వాదవివాదాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తికావాలని అందరూ ఆశిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్తగా వచ్చిన ఇబ్బందులు పరిస్థితిని మళ్ళీ మొదటికి తీసుకువస్తాయేమోననే ఆందోళనకు…

Read more...


కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నా లక్ష్యం అని ప్రధాని నరేంద్రమోడీ ఓ పక్క కంకణం కట్టుకుని పని చేస్తున్నాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు తాముంటున్న పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులను చూసాం, కాని తొలిసారిగా ఇంకో పార్టీ పతనం కోసం పని చేస్తున్న నాయకుడిగా నరేంద్ర మోడీని చూస్తున్నాం. ప్రధాని అయ్యాక ఆయన ప్రసంగాలు గమనిస్తే... తనను ప్రధానిని చేసిన భారతీయ జనతాపార్టీ పేరు కంటే ప్రతిపక్ష…

Read more...

ఎక్కడైనా.. ఎప్పుడైనా సరే, కీలక సమయాల్లో ఆలోచించి అడుగేయడం.. సమస్యలు వచ్చినప్పుడు ముందుచూపుతో జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది ఎంతైనా ముఖ్యం. ఎక్కడా తొందరపాటు పనికి రాదు. ఇది, ఏ ఒక్కవ్యక్తికో కాదు, అందరికీ ఇదే మాట వర్తిస్తుంది. సుహృద్భావపూరిత వాతావరణంలో, సమస్యలను అవగాహన చేసుకుని వాటి పరిష్కారానికి సముచితమైన నిర్ణయాలు తీసుకునేవారికి మేలే జరుగుతుంది. ఇప్పుడు భారత్‌ కూడా అదే బాటలో పయనిస్తోది. అదే భారత్‌కు విజయాలను చేరువ చేస్తోంది.…

Read more...


Page 2 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter