సంపాదకీయం


ప్రపంచ మానవాళిని భయోత్పాతానికి గురిచేస్తున్న ఉగ్రవాద పెనురక్కసిపై భారత్‌ సింహనాదం చేసింది. ఇక ఉగ్రవాదుల ఆటలు సాగనివ్వరాదంటూ ఈ సారి మరింతగా ప్రపంచానికి స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై సమరనాదం మోగిస్తూ ఇటీవల గోవాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్రసదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం యావత్‌ ప్రపంచాన్నీ కదిలిస్తోంది. ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రత్యేకించి బ్రిక్స్‌ దేశాలు బాగా స్పందించాయి. ఆ పిలుపే…

Read more...

వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థ కంటే దేశం ముఖ్యం. మన దురదృష్టమేంటంటే దేశం కంటే రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యమైపోతున్నారు. మనమంతా భారతీయులం అన్న భావానికి చివరి ప్రాధాన్యత కల్పిస్తూ నాది ఫలానా కులం అన్న భావానికి మొదటి ప్రాధాన్యతనిస్తు న్నారు. దేశ రక్షణ, భద్రతా పరమైన అంశాలతో సైతం రాజకీయ చదరంగం ఆడేలా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో వ్యక్తి స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రం హద్దులు…

Read more...

సరిహద్దుల్లో కల్లోలం.. ఉగ్రతండాలతో దేశంలో పలుచోట్ల విధ్వంసాలు, మారణకాండలు.. పఠాన్‌కోట్‌ స్థావరంపై ఉగ్రవాదుల దాడులు, అందమైన కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తూ ప్రజాజీవితాన్ని ఛిన్నాభిన్నం చేయడం.. ఉరీలో ఏకంగా సైనిక స్థావరంపైనే విరుచుకుపడి 18 మంది సైనికులను మంటలకు ఆహుతి చేయడం..ఇలా లెక్కపెట్టుకుంటూపోతే పాక్‌ కేంద్రంగా తిష్టవేసుకుని కూర్చునివున్న ఉగ్రవాద పిశాచులు చేస్తున్న దౌష్ట్యాలకు, క్రౌర్యాలకు.. దారుణ మారణకాండలకు అంతూ పొంతూ వుండడం లేదు. ఎప్పుడూ గుంటకాడ నక్కలా నక్కి వుండడమే..…

Read more...

ఒకే రాకెట్‌.. అందులో 8 ఉపగ్రహాలు. ఆ ఉపగ్రహాలు ఒక కక్ష్యలో కొన్ని ఒకచోట, మరికొన్ని మరోచోట దిగాలి. రెండు భిన్నమైన కక్ష్యల్లో ఆ ఉపగ్రహాలు చేరాలి. అదీ ఒకే ప్రయోగంలో జరగడమంటే చిన్న విషయమేమీ కాదు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, విశేష అనుభవంతో మన శాస్త్రవేత్తలు అంతటి క్లిష్టమైన ప్రయోగాన్ని కూడా అలవోకగా సాధించి, జంట కక్ష్యల ప్రయోగంలోనూ జయకేతనం ఎగురవేశారు. ఒకే పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ ద్వారా…

Read more...

శత్రువును పూర్తిగా చంపకుంటే ఎంతటి ప్రమాదమో చూస్తున్నాం. ఎంతటి నష్టమో తెలుసు కుంటున్నాం. శత్రువును చావుదెబ్బ కొట్టడానికి వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాం. స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్‌ వాళ్లతో పోరాడామంటే ఓ లెక్క వుంది. వాడు బయట శత్రువు. కాని స్వాతంత్య్రం వచ్చాక కూడా మనం ఏర్పాటు చేసుకున్న శత్రువు పాకిస్థాన్‌తో నిరంతరం పోరాడుతూనే వున్నాం. ఆ పోరాటంలో లక్షలాదిమంది భారతీయుల ప్రాణాలను పణంగా పెడుతున్నాం.…

Read more...

కావేరి జలాల వివాదం రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఆ వివాదం ఇటీవల తమిళనాడు-కర్నాటకల్లో పలు హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. కర్నాటకలో పలు బస్సులు లారీలు దగ్ధమయ్యాయి. తమిళనాడులో ఆగ్రహావేశాలు, నిరసనలు, అందోళనలు, విధ్వంస ఘటనలు జరిగాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆందోళనకారులు పరస్పర దాడులకు పూనుకున్నారు. పలు బస్సులు, లారీలు, వాహనాలు దగ్ధమయ్యాయి. బెంగుళూరులో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. దిగ్గజాల వంటి ప్రపంచఖ్యాతి పొందిన అనేక…

Read more...

ఎక్కడో ఆల్బేనియాలోని మేసిడోనియాలో జన్మించింది..భారత్‌లోని కోల్‌కతా నగరానికి వచ్చి స్థిరపడింది. మానవసేవే మాధవ సేవగా భావించి..జీవితాన్నంతా రోగులు..దీనజనుల సేవకే అంకితం చేసి..విశ్వమంతా మానవతా కాంతులను ప్రకాశింపజేసింది. ప్రేమే..పరమధర్మంగా..సేవే జీవితకర్తవ్యంగా ఎంచి మానవతా స్ఫూర్తిదీప్తులతో జగతిలో సేవాభావపు వెలుగుదివ్వెలను వెలిగించింది. తన జీవితాన్నే త్యాగానికి బాటగా పరచింది. విశ్వప్రేమను కాంక్షిస్తూ..మానవత్వంలోనే దైవత్వం వుందని ప్రపంచానికంతా చాటింది. ఆజన్మాంతం రోగార్తుల సేవలోనే తరించింది. 'అమ్మ' అనే అమృతతుల్యమైన మాటను విశ్వజనీనం చేస్తూ విశ్వజననిగా…

Read more...


అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ మరో ముందడుగు వేసింది. గగనతలంలో మరో ఘనవిజయం సాధించింది. భూ వాతావరణంలోని వాయువునే ఇంధనంగా, ప్రయోగాలకు ప్రాణవాయువుగా చేసుకుని ప్రయాణించే అత్యద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుని, తద్వారా స్క్రామ్‌జెట్‌ ఇంజన్‌లతో ప్రయోగాన్ని దిగ్విజయం చేసుకుని..అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంచలన విజయాన్ని సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం సరిగ్గా…

Read more...

అంబరాన్నంటే సంబరాలంటే రియో ఒలింపిక్సే. ఆ క్రీడోత్సవాల వైభవం అంతాఇంతా కాదు. ఎంతో ఉత్కంఠభరితంగా ఈ క్రీడా పోటీల్లో ప్రపంచదేశాల క్రీడాకారులంతా పోటీ పడి ఆడడం చూసినవారికి కన్నుల పండుగే. అందులోనూ బ్యాడ్మింటన్‌లో అమోఘమైన ప్రతిభతో రాణించి రజత పతకం సాధించి, విశ్వక్రీడా వేదికపై భరతమాత కీర్తిని రెపరెపలాడించిన ఘనత సింధూకే దక్కింది. క్రీడారంగంలో భారత కీర్తికిరీటానికి వెండివెలుగులను తాపడం చేసి ప్రపంచస్థాయిలో భారత్‌ కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసింది పివి…

Read more...


Page 3 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • పాపం పండెన్‌!
  నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
 • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
  ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter