సంపాదకీయం


గలగలా గోదారి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయీ!... అంటూ ప్రసిద్ధ కవి శంకరంబాడి సుందరాచారి 'మా తెలుగుతల్లికీ మల్లెపూదండ' గీతంలో ఆ నదీమతల్లుల ప్రాశస్త్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. నదీపరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లింది. మానవ మనుగడకు ప్రాణప్రదమైన జీవజలాలను ఇచ్చే నదీనదాలు మనకు ఎల్లవేళలా పూజనీయాలే. నీరు లేకుంటే మానవునికి ఉనికే లేదు. ప్రతి మనిషికీ..చెట్టు చేమకు..సకల జీవరాశులన్నిటికీ నీరే ప్రాణాధారం.…

Read more...

'దూరపు కొండలు నునుపే'.. అన్నది పెద్దల మాట..అది నేటికీ అక్షరసత్యంగానే వుంది. కూటికోసం, కూలి కోసం.. పొట్టచేతపట్టుకుని గల్ఫ్‌దేశాలకు వలసలు వెళ్ళిన వేలాదిమంది కార్మికుల పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే వుంది. కన్నవారినీ..ఉన్న ఊరినీ అందరినీ వదులుకుని జీవనోపాధి కోసం దూరదేశాలకు వెళ్ళిన వారికి ఇప్పుడు కష్టాలే ఎదురయ్యాయి. నమ్ముకున్న కంపెనీలు మూతపడిపోగా..చివరికి తినడానికి తిండి లేక కార్మికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎండిపోయిన రొట్టెముక్కలు దొరికితే వాటిని నీళ్ళలో అద్దుకుని…

Read more...

కాశ్మీర్‌.. ఎంత అందాల లోయో!..పర్యాటకంగా ఎంతో కళకళలాడుతూ..మరెంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమో ఇది. కానీ, ఇప్పుడది అల్లర్లకు ఆటపట్టుగా మారింది. ఉగ్రవాద వర్గాలకు నెలవుగా తయారైంది. ఏళ్ళ తరబడిగా కొలిక్కిరాని జఠిలమైన సమస్యలతో నేటికీ అట్టుడికిపోతోంది. ప్రజలు శాంతిపరులైనా, అక్కడంతా అల్లర్లకు పాల్పడే ఉగ్రవాదులదే రాజ్యమైపోయింది. అసలే కాశ్మీర్‌ నిరుద్యోగలోయగా మారి వుంది. ఇక్కడున్న మూడింట రెండువంతుల జనాభా అంతా యువతే. ఇక్కడ అధికశాతంగా వున్న యువతకు ఎంతోకాలం నుంచి…

Read more...

ఇక్కడ ప్రజలే ప్రభంజనమై ఉవ్వెత్తున లేచారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నవారిని ప్రజలే జనసైన్యంగా మారి అడ్డుకున్నారు. యుద్ధట్యాంకులను పేలుస్తూ, తుపాకులు కాలుస్తూ వచ్చిన తిరుగుబాటుదార్లను అడ్డుకుని ప్రజలు ఆ తిరుగుబాటును చిత్తు చేశారు. కుట్రదారులుగా మారిన తిరుగుబాటుసైన్యంపై ఎదురొడ్డి పోరాడి..ప్రజాసైన్యందే విజయమని నిరూపించుకున్నారు. తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రజాస్వామ్య బావుటాను విజయవంతంగా ఎగురవేశారు. జనం దెబ్బకు తిరుగుబాటుదార్లు తోకముడిచారు...ఇదేదో సినిమా కథ కాదు. టర్కీలో వారం క్రితం జరిగిన సంగతి.…

Read more...

మనం ఒకటి తలిస్తే..చివరికి మరోటి జరుగుతుందని, కాలం కలసిరాకపోతే తాడే పామై కాళ్ళకు చుట్టుకుంటుందని..నాటి పెద్దల మాటలు జ్ఞప్తికి వచ్చే సన్నివేశమిది. ఇప్పుడు కశ్మీర్‌లో బిజెపి పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటోన్న రెండు ప్రధానమైన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని, మానవత్వాన్ని విశ్వసించే శక్తులన్నీ కలసికట్టుగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ముందుకు రావాలని, ఉమ్మడి పోరుతోనే ఉగ్రవినాశనం జరుగుతుందని ప్రధాని మోడీ కెన్యాలో ప్రపంచ ప్రజలకు పిలుపునిస్తున్న వేళ, ఇక్కడ…

Read more...

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌...బాంబుల పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది ఆత్మాహుతి దళాల పేలుళ్ళతో అక్కడున్న షాపింగ్‌మాల్‌ పేలిపోయింది. మొత్తం..131 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో 15 మంది చిన్నపిల్లలు కూడా వున్నారు. ఢాకాలోనూ..రక్తం ఏరులై పారింది. అనేకదేశాల్లో ఉగ్రవాదరక్కసి ఇలా వికృతనాట్యం చేస్తూనే వుంది. ప్యారిస్‌, బ్రస్సెల్స్‌.. ఇస్తాంబుల్‌.. ఢాకా.. బాగ్దాద్‌..తదితర దేశాల్లోని అనేక నగరాలు ఇప్పుడు ఉగ్రవాద రక్కసిమూకల ధాటికి గజగజ వణికిపోతున్నాయంటే…

Read more...

ఎవరమూ కలవరపడక్కర లేదు. ఒక్కోసారి ఇంతే.. ఇలాగే జరుగుతుంటుంది. మంచివారికి అన్యాయం అన్నది సర్వసాధారణమైపోతోంది. మనుషులకే కాదు, ఇప్పుడు దేశాలకు కూడా ఇదేమాట వర్తిస్తోంది. నీతిగా బతకడం ప్రధానం అన్నది పూర్వకాలపు మాట. కానీ ఇప్పుడు అది కాస్త మారింది. నీతిగా బతకడమే కాదు..నీతిగా బతుకుతున్నట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూనే వుండాలన్నది నేటి మాట. అయితే, ఇప్పుడు కాకున్నా, ఎప్పటికైనా సరే.. న్యాయానికే కాలం వుంటుందని, చరిత్ర ఎప్పుడో నిరూపించింది.…

Read more...


'యోగ'...ఈ రెండక్షరాలు ఇప్పుడు ప్రపంచంలో మారుమ్రోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే మాట. దేశమేదైతేనేం.. ప్రాంతమేదైతేనేం..అవని అంతా అన్నిచోట్లా ఈ మాటే.. ఒక మంత్రంగా మోగుతోంది. 'యోగ'.. ఇది కొందరికి జీవనవేదంగా..మరికొందరికి ఆరోగ్యనాదంగా.. మొత్తంగా ప్రపంచానికంతటికీ ఇది ఇప్పుడు సరికొత్త చైతన్య నినాదంగా దద్దరిల్లుతోంది. ఎందుకంటే, 'యోగ' అనేది ఒక దీపశిఖ లాంటిది. ఒక్కసారి వెలిగిస్తే చాలు.. జీవితమంతా వెలుగులు చిందించే అఖండజ్యోతి ఇది..మానవజీవితానికిదో వరం. భారతీయ ఆధ్యాత్మిక…

Read more...

ఒక్క గొంతును నొక్కాలని చూస్తే వంద గొంతుకలు లేస్తాయి... ఒక్క మైక్‌ను ఆఫ్‌ చేయాలని చూస్తే వంద మైకులు గోల చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ విధానకర్తలు ఈ లాజిక్‌ను ఎందుకో మిస్సవుతున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అతి ప్రజాస్వామ్యముంటుంది. క్రమశిక్షణ లేని రాజ్యవ్యవస్థ, రాజకీయ వ్యవస్థలుంటాయి. అదే సమయంలో అదే ప్రజాస్వామ్య ముసుగులో అధికార నియంతృత్వ ధోరణులు అమలువుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ముసుగులోనే నియంతృత్వం రాజ్యమేలుతున్నట్లుగా…

Read more...


Page 5 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter