సంపాదకీయం


భారతీయ సంస్కృతి ఎంతో ఉదారమైనది. ఎన్ని రకాల వాదాలు, వివాదాలు, విభేదాలు వచ్చినా మన సహజసిద్ధమైన స్వభావాన్ని మాత్రం కోల్పోకుండా భారత దేశ ప్రజలందరూ ఒకటే అనే ఐక్యతాభావమే మనల్ని, మన అస్తిత్వాన్ని చెక్కుచెదరకుండా నిలుపుతోంది. అందులోనూ సహనానికీ, దయాగుణానికి, మానవతావాదానికి ప్రతీకగా వుంటూ విశ్వశాంతిని కాంక్షిస్తూ మనదేశం ప్రపంచవ్యాప్త ఖ్యాతిని అందుకుంది. సహనం-సంయమనం, సమానభావం అన్నది భారతీయుల జన్యువుల్లోనే వుంది. ఈ విషయం ఎప్పటికీ, ఎవరూ విస్మరించలేనిది.. విస్మరించరానిది…

Read more...

ఇది నిజంగా ఒక అద్భుతమే. మానవత్వం పల్లవించడమంటే ఇదే. మనిషిగుండెలో నిండుగా మానవతాభావం వుంటే ఇలాంటి అద్భుతాలకు కొదవుండదు. ఎందుకంటే, ఒక్కోసారి జీవితం..మనకు తెలియకుండానే అనుకోని మలుపులు తిరుగుతుంది. ఎక్కడెక్కడి దారులకో తీసుకువెళ్తుంది. కష్టాలు, నష్టాలు అన్నిటినీ చవిచూపిస్తుంది. అంతా అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇక ఈ జీవితమింతేనా?..అని తీవ్ర నిరాశలో వున్నప్పుడు, ఇదిగో నేనున్నాంటూ విధి మళ్ళీ కరుణస్తుంది. మానవత్వం పల్లవించాలేగానీ.. ఎన్ని కష్టాల గీతలనైనా అవలీలగా దాటేయవచ్చు. ఇప్పుడు…

Read more...

ప్రపంచంలోనే అత్యంత సుందర నగరంగా నవ్యాంధ్ర రాజధాని 'అమరావతి'ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించి, ఆ మేరకు శంకుస్థాపన మహోత్సవానికి రంగం సిద్ధం చేయడం సంతోషదాయకం. విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండానే అవతరించిన నవ్యాంధ్ర ఇప్పుడు సగర్వంగా మరింత మహోన్నత స్థాయిలో రాజధాని నిర్మాణానికి పూనుకోవడం అందరికీ గర్వకారణం. తెలుగుజాతి గర్వించదగిన విషయం ఇది. అందరికీ విజయాలను చేకూర్చే పర్వదినమైన విజయదశమి రోజున 'అమరావతి'కి శంకుస్థాపన జరగడం శుభసంకల్పమే.…

Read more...

ఈ దేశంలో వందేమాతరం పాడకుంటేనే లౌకిక భావం వర్థిల్లినట్లు... ఈ దేశంలో ఎంఎఫ్‌ హుస్సేన్‌ గీసిన సరస్వతీదేవి నగ్న చిత్రాలను చూసి చప్పట్లు కొడితేనే లౌకిక రాజ్యం వున్నట్లు... ఈ దేశంలో ప్రతి నిముషం హిందూ విశ్వాసాలను దెబ్బ తీస్తుంటే లౌకికత్వం విరాజిల్లుతున్నట్లు. ఈ దేశంలో ఆవులను తెగనరుకుతుంటేనే లౌకికతత్వాన్ని కాపాడుతున్నట్లు? వందేమాతర గీతానికి లౌకిక భావానికి సంబంధమేంటి? ఆవులను వధించడానికి లౌకిక సిద్ధాంతాలకు సంబంధమేంటి? దీనిని ఎవరన్నా ప్రశ్నిస్తే…

Read more...

దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్నదాతల స్థితి నానాటికీ అధోగతికి చేరుకుంటోంది. అనేకమంది బీదాబిక్కీ రైతన్నల దుస్థితి మరింత హృదయవిదారకంగా వుంటోంది. ఆరుగాలం కష్టించి పనిచేసి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు పట్టెడు మెతుకులు కూడా కరువవుతుండడం దారుణం.. దయనీయం. అన్నదాతల బతుకుపుస్తకం ఏ పేజీ చూసినా అంతా కష్టాలమయం.. కన్నీటి చారికలమయంగానే వుండడం ఎంత బాధాకరం. నిస్సహాయ రైతులు తీవ్రమైన నిర్వేదంతో చివరికి ఆత్మహత్యలు చేసుకొంటుండడం ఎంత విచారకరం!.. దేశంలో నేటికీ…

Read more...

చిత్తశుద్ధి.. అంకితభావంతో పాటు అందుకు తగ్గ అవగాహన, ఓర్పు-నేర్పు, ప్రతిభాపాటవాలు కూడా వుంటే సాధించలేనిదేమీ వుండదన్న మాట అక్షరాల ప్రధాని మోడీ విషయంలో మరోసారి స్పష్టమైంది. ప్రధాని మోడీ తాజా అమెరికా పర్యటన అందుకు ఒక ఉదాహరణ. గత ఆరు దశాబ్దాల్లో ఐర్లండ్‌ గడ్డమీద అడుగిడిన తొలి భారత ప్రధాని నరేంద్రమోడీయే కావడం విశేషం. ఏడురోజుల ఈ పర్యటనను ఆయన ఇటీవల జయప్రదంగా ముగించడమే కాక, ఆశించిన లక్ష్యాలను సాధించుకొచ్చారు.…

Read more...

దేశంలో ఇప్పుడిప్పుడే రిజర్వేషన్ల అంశంపై కలకలం రేకెత్తుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడది పెద్ద చర్చనీయాంశంగా వుంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు, ఈ అంశంపై ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం రేపాయి. 'దేశంలో రిజర్వేషన్ల అవసరం ఎవరికి వుంది. వారికి ఎంతకాలం పాటు రిజర్వేష్లు కల్పించాలి'.. అనే అంశాలపై ఒక కమిటీని ఏర్పాటుచేయాలని, ఇందులో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులకు చోటు కల్పించాలని, రాజకీయనాయకుల అభిప్రాయాలను…

Read more...


సరిహద్దులో శాంతి స్థాపనకు భారత్‌-పాక్‌లు కీలకమైన చర్యలు చేపట్టడం, ఇరుదేశాలూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒకరికొకరు సమ్మతించడం.. తదితర తాజా పరిణామలు సరిహద్దులో శాంతికి బాసటగా నిలిచేలా వున్నాయి. ఇదెంతో శుభపరిణామం. జమ్ముకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోర్టార్‌ దాడులపై పూర్తి నిషేధం విధించాలని ఇరుదేశాల భద్రతాధికారులు ఇటీవల ఒక నిర్ణయానికి రావడం, తద్వారా ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడేందుకు తగు చర్చలు జరగడం.. ఆహ్వానించదగ్గ పరిణామం. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు,…

Read more...

హార్ధిక్‌ పటేల్‌... ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి పాకిన పేరు. 22ఏళ్ల ఈ యువకుడు ఒక విప్లవాన్ని రగిల్చాడు. తరతరాలుగా కొన్ని వర్గాల ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని లావాలా విరజిమ్మేలా చేసాడు. ఈ అసంతృప్తి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి రూపంలో బయటపడాల్సిందే! ఇప్పుడు హార్ధిక్‌ పటేల్‌ రూపంలో అది బయటపడింది. ప్రజలంతా సమానమేనని ప్రభుత్వాలు చెబుతుంటాయి. మన రాజ్యాంగం అదే చెబుతుంది.అయితే అదే…

Read more...


Page 6 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter