సంపాదకీయం


భక్తజనమంతా ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకలు కూడా ఒక్కోసారి ప్రమాదాల పాలై విషాదానికి గురిచేస్తున్నాయంటే.. నిజంగా దురదృష్టమేననుకోవాలి. అందులోనూ అలాంటి దుర్ఘటనలు ఆలయాల వద్ద కూడా జరగడం దారుణం. కేరళలోని పుట్టింగళ్‌ ఆలయం ప్రాంగణంలో జరిగిన బాణసంచా పేలుడు దుర్ఘటనలో మానవతప్పిదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో పొరపాటునో గ్రహపాటునో ఏ ప్రమాదమో జరిగితే అది వేరే విషయం కానీ, ఎంతోమంది భక్తులు అలాంటి దుర్ఘటనకు ఆహుతైపోవడమే ఎవరూ జీర్ణించుకోలేని…

Read more...

పరిపాలకుడిని బట్టి, పరిపాలనా తీరునుబట్టి రాష్ట్రమైనా, దేశమైనా దాని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అభివృద్ధికి ఎంచుకునే మార్గాలలో వైవిధ్యమే ఆయా రాష్ట్రాల లేదా దేశాల భవిష్యత్‌ను మారుస్తుంది. ఈ కోణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి పరంగా ఏఏ దారులను ఎంచుకున్నారన్నది ప్రధాన ప్రశ్న? ముఖ్యమంత్రిగా పరిపాలనలోగాని, రాజకీయ అనుభవంలో గాని చంద్రబాబు కంటే కేసీఆర్‌ జూనియర్‌. ప్రపంచంలోని పలు దేశాలకు తెలిసిన నాయకుడు చంద్రబాబునాయుడు. 1995-2004ల మధ్య…

Read more...

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లయితే దాదాపు 50ఏళ్ల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్‌పార్టీయే ఏలింది. అలా ఎందుకు ఏలగలిగిందనే విషయం ప్రస్తుత పరిణామాలనుబట్టి అర్ధం చేసుకోవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉంటే తప్పితే ఇంకే పార్టీ అధికారంలో వున్నా ప్రశాంతంగా పని చేయలేదు. కాంగ్రెస్‌పార్టీ చేయనివ్వదు కూడా! అష్టదరిద్రంగా దేశాన్ని పాలించినా కూడా ఎటువంటి గందరగోళం చెలరేగకుండా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య! గత పదేళ్ల యూపిఏ…

Read more...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం మళ్ళీ అయోమమయంగా మారుతోంది. విభజనలో జరిగిన అన్యాయం చాలక, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన నిర్ణయాలు లేకుండా అప్పుడొక మాట..ఇప్పుడొక మాట చెప్తూ నాయకులు ఇంకా సన్నాయినొక్కులు నొక్కుతుండడం ఎంతైనా బాధాకరమే. విభజనతో అప్పులపాలై, చివరికి రాజధాని కూడా లేక, పరిపాలన అంతా అస్తవ్యస్థమై అటు ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితులు, ఇటు ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతున్న సమయంలో,…

Read more...

మనవాళ్లెప్పుడూ ఇంతే. అవేం రాజకీయాలో తెలియదు కానీ, మాటలు చెప్తుంటారే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ షరా మామూలే. అన్ని దేశాలతో పాటు మనదేశం కూడా ఇటీవలికాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మహిళలకు సమానావకాశాలు వుంటే, మహిళలు కూడా అన్ని రంగాల్లో ధీటుగా ఎదుగుతారని, అందుకు వారికి తగు అవకాశాలు కల్పించాలని ఎంతో కాలం నుంచి అందరూ అంటున్నదే.. జనమంతా వింటున్నదే. అయినా, ఇందులో ఆలోచించాల్సింది కూడా ఏమీ…

Read more...

అనుకున్నట్లుగానే..దేశంలోని జనమంతా ఆశించినట్లుగానే ఈసారి బడ్జెట్‌ మోడీ మార్క్‌ బడ్జెట్‌ గా ముద్ర వేసుకుంది. ప్రజలకు ఈ బడ్జెట్‌ మంచి భరోసా ఇచ్చేదిగానే రూపొందింది. ముఖ్యంగా రైతులకు, పేదలకు, అనేక రంగాల ప్రగతికీ బడ్జెట్‌ కేటాయింపులు బలంగానే వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని మోడీ మనసుకు తగ్గట్లుగానే బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. దేశ ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ అంకెల గారడీగా…

Read more...

ప్రపంచ స్థాయిలో భారత్‌ ప్రతిష్టను శిఖరాగ్రాన నిలుపుతూ, తానెక్కడికి వెళ్ళినా అపూర్వమైన ఆదరణతో, ఆయా దేశాల ఆత్మీయతను చూరగొంటూ, ప్రత్యేకించి తన అద్భుతమైన వాగ్ధాటితో ప్రపంచదేశాలను మెప్పించి, దేశప్రగతికి రహదారులు వేసుకుంటూ వస్తున్న ప్రధాని మోడీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, ప్రపంచాన్ని అనేక రకాల దౌష్ట్యాలతో, హింసాకాండలతో భయపెడుతున్న ఉగ్రవాదభూతాన్ని తరిమికొట్టాలని, మానవత్వాన్ని మంటకలిపే ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలించివేస్తే తప్ప ప్రపంచం నిర్భయంగా మనుగడ సాగించలేదని స్పష్టం చేస్తూ,…

Read more...


ఒక్కోసారి దేశాన్ని కుదిపేస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. అసలు మనం ఎటు పోతున్నామో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ఏది తప్పో, ఏది ముప్పో.. ఏది ఎంతవరకు అవసరమో.. ఏది అనవసరమో.. ఇంకా తెలియని స్థితిలోనే వున్నామా ఆవేదన అందరిలోనూ కలుగుతోంది. దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక సంచలనమే ధ్యేయంగా, ఇష్టారాజ్యంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు సామాన్య ప్రజలను సైతం మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే పేరుకుపోయి వున్న…

Read more...

ఇప్పుడే కాదు..ఎప్పుడైనా సరే, సాగరాలే సకల మానవాళికీ ఆశా దీపాలు. ప్రపంచ ప్రగతికి ఇవి రానున్న కాలంలో మరెం తగానో దోహదం చేస్తాయి. మానవాళి భవితకు ఇక ఇవే స్వర్ణ సోపానాలవుతాయి. అందుకే వీటిని కాలుష్య కాసారాలు కాకుండా కాపాడుకోవాలి. సముద్ర మార్గాలు దుర్వినియోగం కాకుండా పరిరక్షించుకోవాలి. అందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలి. సముద్రమార్గాల్లో, తీరాల్లో సుస్థిరమైన రక్షణ కావాలి. సముద్ర మార్గాలను ప్రమాదరహితంగా వుండేలా తీర్చిదిద్దుకోవాలి. ఆ…

Read more...


Page 7 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter