సంపాదకీయం


పెద్దలు వూరికే అనలేదు... పండ్లు వున్న చెట్లకే రాళ్లు తగులుతుంటాయని, పురుగులెత్తే గుర్రాన్నే పరుగెత్తిస్తుంటారనీ... ఇలాంటివన్నీ ఎంతో అనుభవంతో చెప్పిన సామెతలు. ఒక్కోసారి అవెంత నిజమో కదా... అని అనిపిస్తుంటుంది కూడా. దేశ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న తంతు కూడా దాదాపూ ఇలాగే అనిపిస్తోంది. కుదేలైపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను ఒక కొలిక్కి తీసుకురావడం, కదలనంటే కదలనని మొరాయిస్తూ కూర్చున్న ప్రగతిబండి చెవి మెలితిప్పి మరీ పరుగులు పెట్టిస్తుండడం, ధనంపై…

Read more...

ఉగ్రవాదం... ప్రపంచ వ్యాప్తంగా ముంచుకొస్తున్న ఒక పెను ముప్పు. ప్రపంచ మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఉగ్రవాద మహమ్మారిని ప్రతిఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రత్యేకించి ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై కలసికట్టుగా ఉమ్మడిపోరు సాగించాలి... అంటూ భారత ప్రధాని ఏ దేశానికి వెళ్లినా పదేపదే హెచ్చరిస్తూనే వున్నారు. ఉగ్రవాదం ఎంతటి ప్రమాదకరమైనదో విశదీకరిస్తూ, మానవత్వం వున్న ప్రతిఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరు సాగించాలని పిలుపునిస్తుండడం విశేషం. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు సాగించాలంటూ బెర్లిన్…

Read more...

పేరు మార్చుకోవడం, వేషాలు మార్చుకోవడం, చివరికి తనను గుర్తుపట్టకుండా వుండేందుకు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయించుకోవడం, తన ఆచూకీ తెలియకుండ వుండడానికి తరచూ ఇళ్లు మారుతూవుండడం... ఒకటేమిటి రకరకాల వేషాలు వేస్తూ, ఉగ్రవాద కార్యక్రమాలను చురుగ్గా సాగించే నేరచరిత్ర వున్న కరుడుగట్టిన ఐఎస్ ఐ ఉగ్రవాది వికారుద్దీన్ చరిత్రకు పోలీసులు ముగింపు పలికారు. పోలీసులను మట్టుబెడతానని సవాల్ విసిరే వికార్, చివరికి పోలీసుల చేతిలోనే హతమైపోయాడు. అతనితో పాటు…

Read more...

మొత్తానికి... మన్మధనామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కు కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది. విభజన శాపంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం కొంతమేరకు కరుణ చూపడంతో, ఈ పయనం ఏమవుతుందోనని బిక్కుబిక్కు మంటూ ఒంటరియాత్ర సాగిస్తున్న నవ్యాంధ్రకు... ఎట్టకేలకు కొంత చేదోడు లభించినట్లయింది. వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఆసాంతం మునిగిపోకుండా అదృష్టవశాత్తూ ఏ మానో మాకో చేతికి దొరికినట్లు, ఇప్పుడున్న కల్లోల ఆర్ధిక పరిస్థితుల్లో రాష్ర్టానికి కేంద్రం ఆదరహస్తం అందించడం, రాష్ట్రప్రగతి పట్ల కేంద్రం…

Read more...

మన్మధ నామ సంవత్సరం.... పేరుకు తగ్గట్లుగా ఎంతో మధురమైన సంవత్సరం కూడా. అందుకే ఈ కొత్త ఏడాది రాష్ర్టం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తుందని, ఈ ఏడాది అందరికీ మధురానుభూతులు మిగిలిస్తుందని పంచాంగకర్తలు కొందరు ఈ ఉగాదిన పంచాంగశ్రవణాల్లో చెప్పిన మాటలు అందరికీ వీనులవిందు చేశాయి. వారి మధుర వాక్కులు ఫలించాలనే కోరుకుందాం. అయితే, రాష్ర్టం ఇప్పుడున్న అయోమయ పరిస్థితుల్లో ఈ ఏడాది ఆశించిన అభివృద్ధిని సాధిస్తుందా... అన్నది రాజకీయ…

Read more...

రాష్ర్టాన్ని విభజించడమే ఆంధ్రప్రదేశ్ కు శాపం. అంతపనీ జరిగిపోయాక... వచ్చే ఆ కష్టనష్టాలన్నిటినీ అనుభవించాల్సి వుంది కనుక, ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నటులగా అప్పట్లో కాంగ్రెస్ ఉత్తుత్తి హామీలిచ్చేసింది. అధికారం వుంది కదా అని అత్యంత దారుణంగా రాష్ర్టాన్ని ముక్కలు చేసేసింది. అయితే, ఆ పాపం ఊరికే పోదన్నట్లుగా, అది తిరిగి కాంగ్రెస్ కే పెనుశాపమై చుట్టుకుంది. రాష్ర్టంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలై,…

Read more...

జమ్ము-కాశ్మీర్ లో కరడుగట్టిన వేర్పాటువాది మసరత్ ఆలంను ఇటీవల విడుదల చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. జమ్ము-కాశ్మీర్ లో కొత్తగా ఏర్పడిన పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే, అక్కడి ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ హటాత్తుగా ఇలాంటి చర్య తీసుకోవడం సర్వత్రా దిగ్ర్భాంతికి గురిచేసింది. గత నాలుగేళ్లుగా జైల్లో వుంటున్న కాశ్మీర్…

Read more...


రాష్ర్టం పరిస్థితి రానురాను అయోమయంగా కనిపిస్తోంది. భవిష్యత్తంతా అగమ్యగోచరంగా అనిపిస్తోంది. విభజన కష్టాల నుంచి భారీ నష్టాల నుంచి గట్టెక్కడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందకపోతుండడం రాష్ర్ట ప్రజలందరికీ ఆవేదనను కలిగిస్తోంది. వరుసగా రెండు బడ్జెట్లూ చూసాక... కేంద్రం మన రారష్టానికి గతంలో ఇచ్చిన భరోసాలన్నీ ఏమైపోతున్నాయోనన్న ఆందోళన కలుగుతోంది. అందులోనూ విభజనాంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాలు, కష్టాలు అన్నీ తమకు…

Read more...

కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకోవడం ఎంతైనా శుభపరిణామం. రాష్ర్టాల అభ్యున్నతి దృష్ట్యా ఇది ఎంతో మంచి నిర్ణయమనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక చారిత్రాత్మక నిర్ణయం కూడా. పన్నుల రూపంలో కేంద్రప్రభుత్వానికి లభించే ఆదాయంలో 42శాతం వాటాను రాష్ర్టాలకు కేటాయించాలని ఆర్ బిఐ మాజీ గవర్నర్ వైవిరెడ్డి సారధ్యంలోని 14వ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించడం, ఆ…

Read more...


Page 8 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter