గల్పిక

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో సన్నివేశం ఇది. మల్లిఖార్జునరావు లాయర్. తన కుటుంబసభ్యులకు ఆస్తి పంపకాలు చేయాలని బ్రహ్మానందం మల్లిఖార్జునరావు వద్దకు వస్తాడు. మల్లిఖార్జునరావు ఆస్థి వివరాలను చెప్పమంటాడు. బ్రహ్మానందం ఇలా చెప్పసాగాడు. ఊర్లో వంద ఎకరాల కొబ్బరితోట భార్యకు, 50ఎకరాల మామిడి తోట పెద్ద కొడిక్కి, 60ఎకరాల చేపలచెరువు చిన్నకొడుక్కి, రెండంతస్థుల మేడ సెకండ్ సెటప్ కు... అని చెప్పుకుపోతుండగా, ఆస్తుల డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయని…
అది ఢిల్లీ ఎయిర్ పోర్టు. ప్రధాని నరేంద్ర మోడీ అయిదు రోజుల జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. కేంద్రమంత్రులు ఆయనకు వీడ్కోలు పలకడానికి వచ్చారు. మోడీ విమానం ఎక్కుతూ తల వంచి జపనీయుల శైలిలో వందనం చేసాడు. అరుణ్ జైట్లీ, వెంకయ్యతో... సార్ ఏంటి కొత్తశైలిలో ప్రణామం చేస్తున్నారని అడిగాడు. వెంకయ్య ఉండి... సార్ వెళ్లేది జపాన్ పర్యటన కదా... ఐదురోజుల పాటు ఆయన అక్కడ అలాగే దండాలు పెడుతుండాలి. కాబట్టి…
అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం.వెంకయ్యనాయుడు అప్పుడే పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా వెంకటాచలంలో తన కూతురు దీపావెంకట్ శ్రీవారి వరుణయాగాన్ని తలపెట్టిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఢిల్లీ నుండి రేణిగుంటకు విమానంలో బయల్దేరాడు. వెంకయ్య రేణిగుంటలో విమానం దిగి తన కోసం సిద్ధంగా ఉంచిన కారెక్కాడు. ఆయనతో పాటు ఓఎస్ డి సత్య కూడా…
అది ద్వారకా నగరం. ఆరోజు గోకులాష్టమి. ఆరోజు కృష్ణభగవానుడు ఎవరి ఇంట ఉండాలనే దానిపై ఆయన 8 మంది భార్యలు ముందురోజే లక్కీడీప్ నిర్వహించారు. దీంట్లో సత్యభామ పేరు రావడంతో ఆయన ఆరోజు సత్యభామ ఇంట వుండి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఆ వేణుగానాన్ని వింటూ సత్యభామ తనను తానే మైమరచిపోయింది. అంతలో నారాయణ... నారాయణ... అనే పిలువు వినిపించింది. కృష్ణుడి గుండెల్లో రాయి…
అది 1951 ప్రాంతం. బ్రిటీషో డు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిపోయాడు. కాని దేశంలో ఆయా సంస్థానాలు అలాగే స్వతంత్రంగా ఉండిపోయాయి. తన శక్తిసామర్ధ్యాల మీద అంతగా గురి కుదరని ప్రధాని పండిట్ జవహరంలాల్ నెహ్రూ వాటిని విలీనం చేసే బాధ్యతను ఉక్కు నమనిషి, ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు అప్పగించారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు పరిపాలిస్తున్నాడు. భారత దేశంలో విలీనంకావడం నిజాంకు ఇష్టంలేదు. పాకిస్థాన్ తోనన్నా కలవాలి,…
అది ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధి చెందిన సింహపురి మహానగరం. రాష్ట్ర దోమలు, పందులు (పురపాలక) శాఖామంత్రి పి.నారాయణ ఆరోజు ఉదయం నుండి తిరిగి తిరిగి అప్పుడే నారాయణ ఆసుప్రతి ప్రాంగణంలోని తన ఇంటికి చేరుకున్నాడు. బాల్లో ఉన్న సోఫాలో కాళ్లు బార్లా చాపుకుని నీరసంగా కూర్చుండిపోయాడు. అంతలో అక్కడకు నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు. తన బాస్ నిరుత్సాహంగా ఉండడం గమనించి…
హైటెక్ రత్న, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఛాంబర్లో కూర్చుని దీర్ఘాలోచనలోపడ్డాడు. ఆయన ముఖంలో తెలియని ఆందోళన ఏదో కనిపిస్తుంది. తమ తమ పనులు ముగించుకుని మంత్రులు పి.నారాయణ, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘనాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, సిద్ధారాఘవరావు తదితరులు చంద్రబాబు వద్దకు వచ్చారు. దిగులుగా వున్న చంద్రబాబును చూసి... ఏం సార్, అంత విచారంగా ఉన్నారని నారాయణ అడిగాడు. అందుకు చంద్రబాబు... సీఎం అయ్యాక…
అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మరియు ఇళ్ల నిర్మాణశాఖ మంత్రి యం.వెంకయ్యనాయుడు తన ఆఫీసులో కూర్చుని బిజీబిజీగా ఫైల్స్ చూస్తున్నాడు. అంతలో స్వర్ణాంధ్ర కమ్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్కడకు వచ్చారు. వెంకయ్య ఆయనను ఆహ్వానించి కూర్చోమని, ఏం ఇలా వచ్చారని అడిగాడు. చంద్రబాబు చేతులు పిసుక్కుంటూ.... అదే ఋణమాఫీ గురించి మాట్లాడదామని వచ్చానన్నాడు. ఆ మాట వినగానే వెంకయ్య ముఖం…
అది దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు హాల్. బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలపై చర్చ రసవత్తరంగా ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేచి... అధ్యక్షా... ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు దేశంలో ఇంకా 80శాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నట్లు అని ప్రశ్నించింది వెంటనే అద్వానీ లేచి... అధ్యక్షా... ధరలు పెరిగింది గత ప్రభుత్వ…
Page 10 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter