గల్పిక

విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఏపి సీఎం, హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు కార్యాలయం. పుష్కరాలకు ఎవరెవరిని ఆహ్వానించాలన్న దానిపై మంత్రులతో ఆయన మీటింగ్‌ పెట్టాడు. చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను మించిపోయేలా కృష్ణ పుష్కరాలను జరపాలి. భక్తులు కోట్లసంఖ్యలో రావాలి. అలాగే విఐపిలను సైతం పెద్దసంఖ్యలో ఆహ్వానించాలి. దీనికి మీ దగ్గరేమన్నా సలహాలుంటే ఇవ్వండని అడిగాడు. ముదురుదోమల మంత్రి, నైట్‌రైడర్‌ నారాయణ లేచి... సార్‌, పుష్కరాలకు భక్తులను పెంచడానికి నా…
అది హైదరాబాద్‌లోని తెలంగాణ సిఎం కేసీఆర్‌ నివాసం. పక్కరోజు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ చూసుకుని కేసీఆర్‌ అప్పుడే ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే కేటీఆర్‌, కవిత, హరీష్‌రావులు కూడా చేతుల్లో పారలు, గడ్డపారలు పట్టుకుని వచ్చారు. అందరికీ చెమటలు పట్టేసి ఉన్నాయి. కేసీఆర్‌తో కేటీఆర్‌ వుండి... ప్రధాని పర్యటన ఏర్పాట్లన్నీ దగ్గరుండి మేమే చూసుకున్నాం డాడీ, అన్ని పనులు స్వయంగా మేమే చేసామని చెప్పాడు.…
ఢిల్లీలోని టెన్‌జనపథ్‌. లోపలంతా మామిడి, వేప మండలతో తోరణాలు కట్టి వున్నాయి. ఇంటికి అన్ని మూలల్లో పసుపు, కుంకుమ చల్లిన నిమ్మకాయలు పెట్టి వున్నారు. హాల్‌లో భూతవైద్యుడు డెవిల్స్‌ డేవిడ్‌ రాజు చేతిలో వేప మండలు వూపుతూ... ఏయ్‌... శాకిని, ఢాకిని, మందాకిని... జంబోల జంబో... లంబోలపంబ... ఓహో, జగన్మోహని, కాంచన, అరుంధతి, త్రిపుర... హీం... ధూమ్‌... అంటూ పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు. ఆయన ముందు ఒక ముగ్గేసి, అందులో…
అది ఢిల్లీలోని టెన్‌జనపథ్‌. వంట గదిలో సోనియాగాంధీ వంట పనిలో వుంది. వి.హెచ్‌.హనుమంతురావు ఉల్లి పాయలు, బంగాళదుంపలు తరిగిస్తూ, మసాలా దినుసులనందిస్తూ ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఇంకోపక్క పన బాక లక్ష్మి క్యారేజీ గిన్నెలు తోముతుంది. అందరూ హడావిడిగానే వున్నారు. సోనియా వుండి వి.హెచ్‌తో... బాబు నిద్ర లేచాడా అని అడిగింది. ఇంతకు ముందే లేచాడు మేడమ్‌, బెడ్‌కాఫీ ఇచ్చాను, బాత్‌రూంకు కూడా వెళ్లొచ్చాడు. బాబు మనం చెప్పకుండానే తన…
విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్య మంత్రి చంద్రబాబు కార్యాలయం. చంద్ర బాబు చేతిలో పేపర్లు పట్టుకుని సీరి యస్‌గా వున్నాడు. ఎదురుగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాథ రెడ్డి తదితరులున్నారు. నారాయణవైపు చంద్రబాబు సీరియస్‌గా చూస్తూ... నీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూడు... సర్వేలో ఏం తేలిందో చూడు... మున్సిపల్‌ మంత్రిగా నీ పనితీరుకు వచ్చిన మార్కులు చూడు... వందకు ముప్ఫైఐదు... ఇన్ని వందల విద్యాసంస్థలు నడుపుతున్నావు,…
ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. గాంధీనగర్‌లోని స్వతంత్ర విహార్‌ పార్క్‌... సాయంత్రం 5గంటలైంది. చంద్రబాబు పుణ్యాన పని పాటా లేకుండాపోయిన రియల్‌ బ్రోకర్‌ గుర్నాధం, బిల్డర్‌ బిల్డప్‌ భద్రం వేరుశెనక్కాయలు కొనుక్కుని అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు విధానాల మూలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దారుణంగా పడి పోయిందని, లేకుంటే ఇదివరకే ఒక రేంజ్‌లో వుండేవాళ్లమని తమ పాటికి తాము చెప్పుకుని, చంద్రబాబును ఓ అరగంట…
అది వైకుంఠం. మహాలక్ష్మి చేత పాదాలకు మసాజ్‌ చేయించుకుంటూ శేషపాన్పుపై పవళించి ఉన్న మహావిష్ణువు ఎదురుగా వున్న టీవీలో 'ఆడాళ్ల రాజ్యం' సినిమా చూస్తున్నాడు. అంతలో స్వామీ... స్వామీ... రక్షించండి... రక్షించండి అనే కేకలు వినిపించాయి. చూస్తే అక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజ నేయస్వామి, సాయిబాబా, గరుత్మంతుడు, అంకాలమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, ధర్మరాజు, ఇంద్రుడు, కాలభైరవుడు వంటి దేవతలంతా వున్నారు. వారిని చూసి విష్ణువు... ఏమైంది, అంతా కట్టకట్టుకుని వచ్చారు.…
అది విజయవాడలోని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయం. సీఎం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌... మంత్రులు పి.నారాయణ, కె.ఇ.కృష్ణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, సిఆర్‌డిఏ కమిషనర్‌ శ్రీకాంత్‌లు కూడా ఉన్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ మొదలుపెట్టాడు. సింగపూర్‌ అమరావతి రాజధాని అంకంలో ఈరోజు మరో అడుగు ముందుకేసాం. రైతులందరికీ లక్కీడిప్‌ తీసి ఫ్లాట్ల నెంబర్‌లు చీటీల మీద వ్రాసిచ్చాం. భవిష్యత్‌లో ఆ చీటీలే వాళ్ళ ఆస్థి. ఇక…
అది ఢిల్లీలోని రాంలీలా మైదానం. అంతర్జాతీయ యోగా దినోత్సవం(21వ తేదీ) సందర్భంగా ముందురోజు అక్కడ నాయకులందరితో ప్రధాని నరేంద్రమోడీ యోగా రిహార్సల్‌ చేయిస్తున్నారు. కేంద్ర మంత్రులు మనోహర్‌ పారికర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సురేష్‌ ప్రభులతో పాటు ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌, ఏపి మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకానందరెడ్డి(65)…
Page 4 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter