గల్పిక

హైదరాబాద్‌లో హైటెక్‌రత్న, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. ''జన్మ భూమి నా దేశం నమో నమామి'' అనే పాట రింగ్‌ టోన్‌తో సెల్‌ఫోన్‌ మోగింది. నిద్ర మత్తులోనే చంద్రబాబు ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి మాటల మాంత్రికుడు, ప్రధాని నరేంద్రమోడీ... చంద్రబాబూజీ, మీ రాష్ట్రా నికి ప్రత్యేకహోదా ఇద్దామనుకుంటున్నాను, మీకు హ్యాపీయే కదా అని అన్నాడు. ఆ మాటతో చంద్రబాబు ఉలిక్కిపడ్డాడు. నిద్ర మత్తు మాయమైంది. వెంటనే ఆయన... మోడీజీ,…
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి, టాకింగ్‌ రత్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్‌, సీఎం రమేష్‌, గల్లా జయదేవ్‌, పి.నారాయణలు వున్నారు. అది విజయదశమి ముందురోజు, ఓ పక్క అమరావతి శంకుస్థాపనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు వుండి వెంకయ్యతో... రేపు మోడీజీ వస్తున్నారు కదా, ఆయన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆయన రాకుంటే పరువుపోతుందన్నాడు. మీకెందుకు ఆ డౌటు... ఆయన…
విజయవాడలో కృష్ణా నదీ తీరాన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, హైటెక్‌ రత్న చంద్రబాబునాయుడు కార్యాలయం. అమరావతి రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ.కృష్ణ మూర్తిలతో మాట్లాడుతున్నారు. సార్‌, శంకుస్థాపనకు ఆ జగన్‌ రానన్నాడు. ఆహ్వానం కూడా పంపొద్దని చెప్పాడని నిమ్మకాయల చెప్పాడు. వెరీగుడ్‌, నెత్తిన పాలు పోసాడు. ఒక ఇన్విటేషన్‌ మిగిలి నట్లే. ఇంకెవరన్నా రానని చెప్పారా అని చంద్రబాబు అడిగాడు.…
అది గుంటూరు... ప్రత్యేకహోదా కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, దీక్షాయోధ వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేస్తున్న వేదిక. జగన్‌తో పాటు వై.యస్‌.విజయమ్మ, అంబటి రాంబాబు, ఆర్‌.కె.రోజా, వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి నాయకులంతా కూర్చుని వున్నారు. అప్పుడే వైద్యులు వచ్చారు. జగన్‌కు బి.పి, షుగర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆరో రోజు దీక్ష చేస్తున్నా కూడా జగన్‌లో బి.పి, షుగర్‌ నార్మల్‌గానే వున్నాయని, ఇంకో ఆరురోజుల దాకా ఇబ్బంది లేదని డాక్టర్‌ పసుపు నాగలింగం…
అక్టోబర్‌ 4వ తేదీ... తమిళనాడు రాజధాని చెన్నై నగరమది. సాగరాన్ని చీల్చు కుంటూ ఆకాశానికెగిసిన బంతిలా సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ అప్పుడే నిద్రలేచి బెడ్‌రూంలో నుండి హాల్‌లోకి వచ్చాడు. ఆయన ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది. రాత్రంతా ఏదో ఆలోచిస్తూ మనస్థాపం చెందినట్లుగా అని పిస్తోంది. కమల్‌హాసన్‌ టీవీ ఆన్‌ చేసి 10+24=240 తెలుగు న్యూస్‌ ఛానెల్‌ పెట్టాడు. ఫ్లాష్‌ న్యూస్‌లో... నెల్లూరులో ప్రబలిన డెంగీ... ముదురుదోమలు…
అది స్నానానికి వాడిన నీటిని సైతం రీసైక్లింగ్‌ చేసుకుని తాగునీటిగా వాడుకునే సింగపూర్‌ దేశం, రాష్ట్రం, జిల్లా మరియు నగరం కూడా! ఆ దేశ ప్రధాని లీ.... తన సహచరమంత్రులతో సమావేశమై ఉన్నారు. ప్రధాని ముఖంలో ఏదో ఆందోళన కని పిస్తోంది. మంత్రి డుపెంగ్‌ లేచి... ఇప్పుడు సమావేశానికి కారణ మేంటని అడిగాడు. ప్రధాని లీ స్పందిస్తూ... మనం ఆ స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనవసరంగా రాజధాని ఒప్పందం కుదుర్చుకున్నామనిపిస్తోంది.…
అది ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధి గాంచిన నెల్లూరు నగరం. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఏదో ఆలోచిస్తూ విచారంగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదురుగా కె.లక్ష్మీసునంద, పి.శైలజ, లేబూరు పరమేశ్వరరెడ్డి, కిన్నెర ప్రసాద్‌, నూనె మల్లిఖార్జునయాదవ్‌, ఉచ్చి భువనేశ్వరప్రసాద్‌, దాసరి రాజేష్‌, మేకల రజని, వెంకయ్యయాదవ్‌ వంటి కార్పొరేటర్లు కూర్చునివున్నారు. అప్పుడే అక్కడకు వాయిస్‌ ఆఫ్‌ ద సిటీ, గ్రామీణ…
అది కైలాసం. శివుడు, పార్వతిలు టీవీ పెట్టుకుని 'కొట్టిన పెళ్లాం - ఏడ్చిన మొగుడు' సీరియల్‌ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అంతలో నారాయణ, నారాయణ అంటూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. ఆయన మెడలో తంబూరా బదులు గిటార్‌ వుంది. శివుడు ఆశ్చర్యంగా... ఇదేంటి మహర్షి... ఈ పరికరం చాలా వింతగా వుంది, మీ తంబూరా ఏమైంది అని అడిగాడు. నారదుడు... ఇది లేటెస్ట్‌ మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్రభూ... వాయించడానికి…
అది ఢిల్లీలోని టెన్‌జనపథ్‌. వివిధ జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ల రిపోర్టర్‌లు, పత్రికల ప్రతినిధులు వచ్చి వున్నారు. అక్కడే హాల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఉన్నారు. కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ మధ్యలో కూర్చోగా, ఆయనకు అటు ఇటు మన్మోహన్‌సింగ్‌, ఏ.కె. ఆంటోని, మనీష్‌తివారి, గులాంనబీ ఆజాద్‌, మల్లిఖార్జునఖర్గే, అహ్మద్‌పటేల్‌లు కూర్చుని వున్నారు. రాహుల్‌గాంధీ అటు ఇటు చూసి... దిగ్విజయ్‌సింగ్‌జీ ఎక్కడ... అని అడిగాడు. హనీమూన్‌కు వెళ్లాడ్సార్‌ అని ఆంటోని అన్నాడు.…
Page 9 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter