గల్పిక

సదావర్తి భూములను ఎవరంటే వాళ్ళ చేత కొనిపిస్తే ఒప్పుకోను, బినామీలను అసలు ఒప్పుకోను, ఆళ్ల రామకృష్ణారెడ్డే కొనాలి, బినామీలను పెట్టుకుంటే రామకృష్ణారెడ్డి ఇంటి మీదకు ఐ.టి వాళ్లను పంపుతా... సిబిఐని ఉసికొల్పుతా! ఆయనపై కేసు వేసి కోర్టుకీడుస్తా... ఏబిసిడి న్యూస్‌ ఛానల్‌లో వస్తున్న తన పుత్రరత్నం నారా లోకేష్‌ ప్రెస్‌మీట్‌ను ఉండవల్లిలోని తన ఇంట్లో కూర్చుని ఎంతో ఆనందంగా చూస్తున్నాడు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు. అక్కడే వున్న మంత్రులు…
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్రమోడీతో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, సురేష్‌ ప్రభు, నితిన్‌ గడ్కరీ, వెంకయ్య నాయుడు, రక్షణశాఖ కార్యదర్శి అజిత్‌ ధోవల్‌, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌ సమా వేశమైవున్నారు. అక్కడ మోడీ, వెంకయ్య నాయుడులు తప్ప మిగతా అందరి ముఖా ల్లోనూ టెన్షన్‌ సునామీలా పోటెత్తుతోంది. అరుణ్‌జైట్లీ వుండి ప్రధానితో... సార్‌, నేనేమో చైనాతో నోటికొచ్చినట్లు సవాళ్ళు చేసాను, 1962 నాటి భారత్‌ వేరు...…
వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై తలక్రింద డన్‌లప్‌ దిండు వేసుకుని శయనించి ఎదురుగా ఎల్‌సిడి స్క్రీన్‌పై 'బాహుబలి-2' సినిమా చూస్తున్నాడు. మహాలక్ష్మిదేవి 'నవరత్న' ఆయిల్‌తో ఆయన కాళ్లకు మర్ధన చేస్తూ... స్వామి, ఆ చిత్రంలో కనిపిస్తున్న కోటలు, ఏనుగులు, యుద్ధాలు... అన్నీ నిజమైనవేనా? అని అడిగింది. అందుకు విష్ణుమూర్తి... అవన్నీ గ్రాఫిక్స్‌ దేవి అని చెప్పాడు. గ్రాఫిక్స్‌ అనగా ఏమని లక్ష్మీదేవి అడిగింది. ఎలా చెప్పాలో తెలియక విష్ణుమూర్తి కొంచెం…
తన కలల రాజధాని అమరావతిలోని సచివాలయం నుండి ఉండవల్లిలోని తన ఇంటికి అప్పుడే చేరుకున్నాడు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు. చంద్రబాబు హాల్‌లోకి రాగానే మనుమడు దేవాన్ష్‌ బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి తన తాత చేతికి టీవీ రిమోట్‌ అందిం చాడు. చంద్రబాబు టీవీ ఆన్‌ చేసి తనకు పెద్దగా ఇష్టంలేని ఏబిసిడి న్యూస్‌ఛానెల్‌ పెట్టాడు. అందులో ఎంపీ టీజీ వెంకటేష్‌, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావులు…
ఉండవల్లిలోని హైటెక్‌రత్న, సింగపూర్‌ సింహా చంద్రబాబు నివాసం. మనువడు దేవాన్ష్‌తో చంద్రబాబు బూచి ఆట ఆడు కుంటున్నాడు. వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ అప్పుడే అక్కడకు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు కె.ఇ.కృష్ణ మూర్తి, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీతలు వచ్చారు. వాళ్ళ ముఖాలు సీరియస్‌గా వున్నాయి. అందరిలోనూ టెన్షన్‌ వుంది. వాళ్లను చూసి చంద్రబాబు ఏంటలా వున్నారని అడిగాడు. కోడెల రొప్పుతూ... అవతల మన…
అది ప్రపంచంలోని పాతిక మేటి నగరాలను మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిన అమరావతి రాజధాని నగరం. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్ర బాబు నివాసం. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శిద్ధా రాఘవ రావు, నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాతలు అప్పుడే ఇంట్లోకి వచ్చారు. అప్పుడే లోకేష్‌ తన కొడుకు దేవాన్ష్‌ను భుజాల మీద కెత్తుకుని... ''చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా'' అనే…
అది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ప్రాంగణం. తెలుగుదేశం పార్టీ మూడురోజుల మహానాడు ఉత్సవాలకు ఆ ప్రాంగణం ముస్తాబౌవుంది. విజయవాడ నుండి బయలుదేరిన హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అప్పుడే విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింత కాయల అయ్యన్నపాత్రుడు, సుజయ్‌కృష్ణ రంగారావులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్‌ బయలుదేరి ఆంధ్ర యూనివర్శిటీ వద్ద ఆగింది. చంద్రబాబు కారు దిగాడు. అక్కడున్న స్వాగత ద్వారాన్ని చూసాడు. కెవ్‌...…
అది ప్రపంచంలోని ప్రధాన నగ రాలన్నింటిని గ్రైండర్‌లో వేసి రుబ్బితే వచ్చిన అమరావతి రాజధాని నగరం. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్‌ ఆఫీసులో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిలతో సమావేశమై ఉన్నాడు. రాష్ట్రంలో కాస్తున్న ఎండలపై ఆయన సమీక్షా సమావేశం పెట్టాడు. అప్పుడే మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ లోపలకు వచ్చాడు. వస్తూనే...…
జరిగిన కథ - హైటెక్‌రత్న చంద్రబాబు తన టీమ్‌తో అమెరికా పర్యటనకు వెళ్లాడు. వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్‌క్లింటన్‌ దంపతులు, బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లు ఆయనకు స్వాగతం పలికారు. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, బిల్‌గేట్స్‌లు చంద్రబాబు దయవల్లే తాము ఈ స్థాయిలో వున్నామని ట్రంప్‌కు చెబుతారు. అసలు తాను అమెరికా అధ్యక్షుడనయ్యిందే చంద్రబాబు వల్లనని…
Page 3 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter