వార్తా వ్యాఖ్య (36)

Saturday, 30 August 2014 12:56

వార్త - వ్యాఖ్య

Written by

వార్త     -        ఆసుపత్రుల్లో అవినీతికి అడ్డుకట్ట. – కేంద్రమంత్రి హర్షవర్ధన్.

వ్యాఖ్య  -        ముందు సక్రమంగా చికిత్స చేసే సంగతి ఆలోచించండి.

వార్త     -        జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారు. – దేశం ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల, కాల్వ.

వ్యాఖ్య  -        అది చంద్రబాబుకే కరెక్ట్ అంటారా.

వార్త     -        ఏపి పోలీసులకు త్వరలో కొత్త వాహనాలు.

వ్యాఖ్య  -        పోలీసుల పనితీరు కూడా కొత్తగా ఉఁటే ఎంతో బాగుండు.

వార్త     -        బలమైన రాజ్యాంగ విరుద్ధసంస్థగా ఆరెస్సెస్. – మాయావతి విమర్శ.

వ్యాఖ్య  -        గత ప్రభుత్వంలో బలమైన రాజ్యాంగ విరుద్ధ వ్యక్తులు వున్నప్పుడు ఏమీ అనలేదే.

వార్త     -        జగన్ పలికేవన్నీ అసత్యాలే. – చినరాజప్ప.

వ్యాఖ్య  -        చంద్రబాబు పలికేవన్నీ నిజాలైనట్లు...

వార్త     -        ఇది ప్రజాస్వామ్యమా... నియంతృత్వమా... –వైకాపా ఎమ్మెల్యేలు.

వ్యాఖ్య  -        ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం.

వార్త     -        ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే సహించం. – దిగ్విజయ్.

వ్యాఖ్య  -        ప్రాంతాల మధ్య విభేదాలకు ఓకేనా.

Friday, 22 August 2014 10:33

వార్త – వ్యాఖ్య

Written by

వార్త – రాష్ట్రం మధ్యలోనే రాజధాని.       - చంద్రబాబు

వ్యాఖ్య – కొలతలేసి పెడతారా.

వార్త – పన్నులు స్థానికంగానే చెల్లించాలి.- ఎన్జీఓ నేత అశోక్ బాబు.

వ్యాఖ్య – ప్రభుత్వం స్థానికంగా ఉంటే ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది.

వార్త – వైద్యుడు కాబోయి ఆర్థికవేత్త అయిన మన్మోహన్.  - మన్మోహన్ కుమార్తె పుస్తకంలో వెల్లడి.

వ్యాఖ్య – అలా జరిగుంటే సోనియా ఓ మంచి రిమోట్ కంట్రోల్ ను కోల్పోయి ఉండేదేమో.

వార్త – ఆరెస్సెస్ హిందూ దేశం.  - ఆరెస్సెస్ అధినేత భగవత్.

వ్యాఖ్య – అది చెప్పుకోబల్లేదు. ఈ దేశ పునాదులు అవే.

వార్త – ఏకాభిప్రాయంతోనే రాజధాని ఏర్పాటు చేయాలి.    - పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

వ్యాఖ్య – ఏకాభిప్రాయంతోనే మీ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందా.

వ్యార్త – చంద్రబాబు ప్రతిపక్షనేతగానే వ్యవహరిస్తున్నారు.            - మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.

వ్యాఖ్య – పదేళ్లు అలవాటు... ఒక్రటెండు నెలల్లోనే పోతుందా.

వార్త – భాజపా విజయంలో ప్రతిపక్షానిదే పాత్ర.    -అద్వానీ.

వ్యాఖ్య – కీలకపాత్ర వారిదే...

వార్త – మంత్రులకు బాబు మార్కులు. అత్యధికులు పరీక్ష తప్పారు.

వ్యాఖ్య – ప్రజలేసిన మార్కుల్లో చంద్రబాబుకు కూడా సున్నాలే.

వార్త – రుణమాఫీకి నిధుల వేట.- తెలంగాణ సర్కార్ కసర్తుతు.

వ్యాఖ్య – దీని కోసం హైదరాబాద్ లో వున్న ఆంధ్రావాళ్ల ఆస్తులను లాగేసుకోరుగా.

Friday, 15 August 2014 09:08

వార్త - వ్యాఖ్య

Written by

వార్త – 20 ఏళ్ల పాటు విపక్షం ఉండదు.     -చంద్రబాబు.

వ్యాఖ్య – కేంద్రంలోనా... ఇంకేదన్నా రాష్ట్రంలోనా

వార్త – జిల్లాకో వ్యవసాయ విశ్వవిద్యాలయం.          -మంత్రి పుల్లారావు.

వ్యాఖ్య – ముందు రాష్ట్రం మొత్తానికి ఒకటి ఏడవండి చాలు.

వార్త – కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.       - మంత్రి పల్లె రఘనాథరెడ్డి.

వ్యాఖ్య – నిజాంలాగా వ్యవహరిస్తున్నాడంటే ఒక్క మాటతో పోలా...

వార్త – జగన్ అక్రమాస్తులు 43 వేల కోట్లు.  - సోమిరెడ్డి.

వ్యాఖ్య – ఆడిటింగ్ మీరే చూస్తున్నట్లు చెప్పారే.

వార్త – అండగా నిలిస్తే పార్టీ నుండి వెలివేశారు.        - వైకాపాకు జూపూడి రాజీనామా.

వ్యాఖ్య – తెలుగుదేశంలోకి పోవాలంటే జగన్ ను తిట్టాల్సిందే.

వార్త – చర్చించుకుంటేనే సమస్యల పరిష్కారం.        -ఇద్దరు సీఎంలకు రాఘవులు సూచన.

వ్యాఖ్య – సమస్యలు పరిష్కారమైతే వారికి పనేముంటుంది.

వార్త – బాబు మాటలు మయసభను మించిపోయాయి.        - ఏపిసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి.

వ్యాఖ్య – మాటలు ఆకాశంలో... చేతలు పాతాళంలో అంటారా.

వార్త – ఋణమాఫీ ఆటంకాలను అధిగమిస్తాం.        - ఎంపీ కంభంపాటి.

వ్యాఖ్య – ప్రభుత్వకాలం పూర్తయ్యేనాటికా.

వార్త – భాజపా దేశాన్ని ముంచుతుంది.     - ప్రకాశ్ కారత్ ధ్వజం.

వ్యాఖ్య – మీకున్న దేశభక్తి వాళ్లకు లేదంటారా.

వార్త – గవర్నర్ కు అధికారాల అప్పగింత సరికాదు.  - తెలంగాణ మంత్రి మండలి నిరసన.

వ్యాఖ్య – మరి మీకు అధికారమిస్తే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుగా అయ్యిందే.

Friday, 08 August 2014 12:17

వార్తా - వ్యాఖ్య

Written by

వ్యార్త – మాట్లాడుకుని పరిష్కరించుకోండి.   – ఇరు రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి వెంకయ్య సూచన.

వ్యాఖ్య – మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే వారికి బాగున్నట్లుంది.

వార్త – ఎర్రచందనం వేలం ఆలస్యం.

వ్యాఖ్య – దీన్ని చూపి ఋణమాఫీని కూడా ఆలస్యం చేస్తారేమో

వార్త – రైతు ప్రయోజనాలే ముఖ్యం.

వ్యాఖ్య – 60ఏళ్లుగా అధికారంలో వున్నవారంతా ఇదే చెబుతున్నారు... డైలాగ్ మార్చండి.

వార్త – రాజకీయాలు విరమించుకోవడమో, జైలు కెళ్లడమో జగన్ తేల్చుకోవాలి.     – మంత్రి పత్తిపాటి

వ్యాఖ్య – రాజకీయాలు విరమించుకోమని బెదిరించడమా

వార్త – కాపుల సహకారంతోనే తెదేపా అధికారంలోకి.   – ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్.

వ్యాఖ్య – మిగతా వాళ్లవి ఓట్లు కాదా

వార్త – మహిళలు శక్తిస్వరూపిణులు   - మంత్రి సుజాత.

వ్యాఖ్య – అవును... తిరగబడితే ఆదిపరాశక్తులే

వార్త – ఈసారి బడ్జెట్ లక్ష కోట్లు.   – ఆర్థికమంత్రి యనమల.

వ్యాఖ్య – నోట్లేమన్నా చెట్లకు కాస్తున్నాయా ఏమిటి

వార్త – రెండో రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలి.     – మంత్రి సునీత.

వ్యాఖ్య –మొదటి రాజధాని కట్టే సరికే తెల్లారేటట్లుంది లేండి.

వార్త – కాంగ్రెస్ లో ప్రియాంకకు ముఖ్య బాధ్యతలు.

వ్యాఖ్య – రాహుల్ ను లాభం లేదనుకున్నారా

వార్త – అడ్మిషన్లలో రాజకీయాలొద్దు.   – ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీం ఓకే.

వ్యాఖ్య – రాజకీయాలు వద్దు అనే దానికంటే ప్రాంతీయవాదం వద్దు అంటే ఇంకా బాగుండేదేమో....

Friday, 01 August 2014 07:29

వార్తా - వాఖ్య

Written by

వ్యార్త – రెండో రాజధాని సాధ్యం కాదు. – మంత్రి పి.నారాయణ.

వాఖ్య – ముందు ఒక రాజధాని సంగతి చూడండి.

వార్త – ప్రభుత్వ పనుల్లో వేగం, నాణ్యత పెరగాలి. – కేంద్రమంత్రి వెంకయ్య.

వ్యాఖ్య – ప్రభుత్వం నుండి అటువంటివి ఎవరూ ఆశించరులేండి.

వార్త – 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయం. – ఆమ్ ఆద్మీ ప్రకటన.

వ్యాఖ్య – చేసి గెలిచిన రాష్ట్రంలో పొడిచిందేమీ లేదు కాబట్టా.

వార్త – రాజధాని నిర్మాణంలో భాగస్వాములమవుదాం. – మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ.

వ్యాఖ్య – భవన నిర్మాణాలకు రాళ్లెత్తుతారా.

వార్త – కొలిమి సినిమాకు కేసీఆర్ పాటలు

వ్యాఖ్య – మాటలే మంటలు రేపుతుంటే, పాటలు ఇంకెంత రెచ్చగొడతాయో

వార్త – రాజధాని నిర్మాణం పేరుతో గందరగోళం. – పీసీసీ అధ్యక్షుడు రఘవీరా.

వ్యాఖ్య – ఈ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం ఒక్కటే పనిలా వుంది.

వార్త – ఐదేళ్లలో కరువులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. – చంద్రబాబు.

వ్యాఖ్య – ముందు పరిపాలన వున్న రాష్ట్రంగా చేయండి.

వార్త – రానున్న రోజుల్లో మంచి వానలు. – కేంద్ర వ్యవసాయ మంత్రి వెల్లడి.

వ్యాఖ్య –ముందుంది మంచికాలమంటారు.

వార్త – రేషన్ కు ఆధార్ అనుసంధానం. – మంత్రి సునీత.

వ్యాఖ్య – అంటే కోత పెట్టడమేగా

Friday, 25 July 2014 06:01

వార్తా - వాఖ్య

Written by

వార్తా - యూపీలో శాంతిభద్రతలు బాగా లేవు – కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

వ్యాఖ్య – మిగతావన్నీ బాగున్నాయా..

వ్యార్త – ఏపీ ఎమ్మెల్యేలకు రాజధానిలో గూడు కరువు.

వాఖ్య – అక్కడ అడుక్కునే బదులు సొంత రాష్ట్రంలోనే ఉండొచ్చుగా...

వార్త – ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం వస్తుంది. – బీజేపీ ఎంపీ కె.హరిబాబు.

వ్యాఖ్య – ఈతరం వాళ్లు చూస్తారంటారా.

వార్త – బీజేపీ పై ముస్లింలకు విశ్వాసం పెరుగుతుంది. – కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా.

వ్యాఖ్య – ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా.

వార్త – ఆరునూరైనా రుణమాఫీ చేస్తాం. – మంత్రి రావెల.

వ్యాఖ్య – ఆరు నూరైనా అంటే... ఆ స్థాయిలో పన్నులు పెంచుతారా.

వార్త – రుణమాఫీ జగన్ కు ఇష్టం లేదు. – మంత్రి పత్తిపాటి.

వ్యాఖ్య – ఆ సొడ్డు చూపి ఎగ్గొడతారా ఏంటి.

వార్త – భూముల విలువ పెంపు ఖాయం.

వ్యాఖ్య – ఆదాయానికి ఉన్న దారుల్లో ఇదొకటి కదా.

వార్త – తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా.

వ్యాఖ్య – షోయబ్ మాలిక్ ను కూడా కలిపి పెట్టుకోవాల్సింది.

వార్త – సిమెంట్ ధరలు దించం. – కంపెనీలు.

వ్యాఖ్య – ఇంకా దంచుతామంటారా...

వార్త – అల్పపీడనాలు ఏర్పడితేనే వానలు. – వాతావరణ శాఖ.

వ్యాఖ్య – వానల కోసం తుఫాన్ లు రావాలని కోరుకునే రోజులొచ్చాయి.

Friday, 18 July 2014 12:41

వార్త – వ్యాఖ్య

Written by

వార్త     –        పదేళ్ళలో దేశంలోనే ఏపి అగ్రస్థానం. – సీఎం చంద్రబాబు.

వ్యాఖ్య –        అప్పుల్లోనా.

వార్త     -        నిరాహారదీక్షలతో ఫలితం లేదు. – కేజ్రీవాల్.

వ్యాఖ్య  -        కొంత బరువైతే తగ్గొచ్చుగా...

వార్త     -        సంక్షేమ పథకాలకు ఆధార్ ను అనుసంధానిస్తాం. – మంత్రి యనమల.

వ్యాఖ్య -        కోత పెట్టడానికి ఇదో వంకన్న మాట.

వార్త     -        ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలకు రూ.500 జరిమానా. – రాజస్థాన్ సీఎం వినూత్న చర్య.

వ్యాఖ్య -        ఒక గంట ముందుగా వస్తే ఓటి ఇస్తారా.

వార్త     -        ప్రసాదాల విక్రయం మహాపాపం. – స్వామి పరిపూర్ణానంద.

వ్యాఖ్య  -        స్వామిని చూడ్డానికి టిక్కెట్లు ఇంకా పాపం కదండీ.

వార్త     -        తెలంగాణలో తెదేపాను మరింత పటిష్టపరచాలి. – బాబు.

వ్యాఖ్య  -        అందుకేనా ఆంధ్రాను పట్టించుకోవడం లేదు.

వార్త     -        చంద్రబాబుది నియంత పాలన. – వైసిపి నేత కొణతాల.

వ్యాఖ్య  -        అసలు పాలనంటూ ఉంటేగా..

వార్త     -        పనిగంటల పెంపుతో ఫలితం ఉంటుంది. – సుప్రీం ప్రధాన న్యాయమూర్తి.

వ్యాఖ్య  -        పనిగంటలు పెంచితే కాదు, పని చేసేవాళ్ళు పనితనం పెంచితే ఫలితం ఉంటుంది.

Friday, 11 July 2014 12:06

వార్త – వ్యాఖ్య

Written by

వార్త – గ్యాస్ కొరత నుండి గట్టెక్కించండి. – సీఎంను కోరిన విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం.

వ్యాఖ్య – ముందు ఆయనను సమస్యల నుండి గట్టెక్కనివ్వండి.

వార్త – విపక్షనేత హోదాను కాంగ్రెస్ కు ఇవ్వాల్సిందే. – సోనియా డిమాండ్.

వ్యాఖ్య – ఈ మాత్రం డిమాండ్ ప్రజలనే చేసుంటే ఇచ్చేవాళ్లేమో.

వార్త – సభలో చురుగ్గా రాహుల్.

వ్యాఖ్య – అదే ప్రధాని అయ్యుంటే ఇంత చురుగ్గా ఉండేవాడా.

వార్త – సామాన్యుడి చేరువలోకి ఉపగ్రహ పరిజ్ఞానం. – ఇస్రో ఛైర్మెన్ రాధాకృష్ణన్ తో చంద్రబాబు.

వ్యాఖ్య – సామాన్యుడికి కూడు, నీడ లేకపోయినా ఉపగ్రహ పరిజ్ఞానం ఉంటే చాలంటారా.

వార్త – ఆంధ్రప్రదేశ్ లో బ్రతకాలంటే భయమేస్తుంది. – స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్.

వ్యాఖ్య – అందుకని తెలంగాణలో ఉండిపోతారా, ఏంటి.

వార్త – వైద్యకళాశాలలకు నిధులివ్వండి. – ప్రధానికి చంద్రబాబు లేఖ.

వ్యాఖ్య – లేఖలతో నిధులొస్తే అందరూ అదే పనిచేయరూ.

వార్త – ఆంధ్రప్రదేశ్ లో రాష్ర్ట పతి పాలన పెట్టాలి. – వైకాపా.

వ్యాఖ్య – మరీ అంత తొందరైతే ఎలా.

Friday, 04 July 2014 13:13

వార్త – వ్యాఖ్య

Written by

వార్త – రైతు ఋణాలు మాఫీ చేసి తీరుతాం. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

వ్యాఖ్య – మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఇదే చెప్పేటట్లున్నారు.

వార్త – చంద్రబాబు మారాడు. – ఎన్జీఓ నేత అశోక్ బాబు.

వ్యాఖ్య – ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ ఏమన్నా చేయించాడేమో.

వార్త – కరెంట్ ఆదాకు ప్రాధాన్యం. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు.

వ్యాఖ్య – ఫ్యాన్ లకు బదులు విసనకర్రలు, లైట్లకు బదులు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తులు వాడమంటే సరి.

వార్త – విద్వేషాలు రెచ్చగొట్టడం కేసీఆర్ కు తగదు. – చంద్రబాబు.

వ్యాఖ్య – ఆయన్ను సీఎం చేసిందే అది... ఎందుకు వదులుకుంటాడు.

వార్త – పీవీకి భారతరత్న ఇవ్వాలి. – కేసీఆర్.

వ్యాఖ్య – ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి ఇవ్వొచ్చులే.

వార్త – సభలో హూందాగా మెలగండి. – ఎంపీలకు స్వీకర్ హితవు.

వ్యాఖ్య – ముందు హూందాతనమంటే ఏంటో వివరించండి.

వార్త – రాహుల్ కు ప్రధాని సరకు లేదు. – బీజేపీ.

వ్యాఖ్య – ప్రతిపక్ష నేత సరకే లేదని ఆయనే ఒప్పుకున్నాడు కదా.

వార్త – అమరావతి కేంద్రంగా రాజధాని.

వ్యాఖ్య – ఒక్కోనెల ఒక్కో ఊరి పేరు ప్రచారంలోకి తెస్తే అన్ని చోట్లా భూముల రేట్లు పెరుగుతాయి.

వార్త – జైసమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం మూత.

వ్యాఖ్య – ఇక ఒకరోజు పెట్టుకున్నా అద్దె దండగ కదా.

Friday, 27 June 2014 12:54

వార్త వ్యాఖ్య

Written by

వార్త - అభినవ దుర్యోధనుడు కేసీఆర్. - మంత్రి పల్లె రఘునాథరెడ్డి

వ్యాఖ్య - ఆ పేరుకు కేసీఆర్ కటౌట్ కు సరికాదేమో.

వార్త - పార్టీ మారేవారికి సిగ్గు లేదు. - రఘువీరారెడ్డి

వ్యాఖ్య - అసలు రాజకీయాలకే సిగ్గు లేదు.

వార్త - రైల్వేల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. - వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య - దేశ ఆర్థిక పరిస్థితే బాగ లేదులే...

వార్త - రాష్ర్టపతి పదవికి తగిన వ్యక్తి అద్వానీ. - కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.

వ్యాఖ్య - తదుపరి రాష్ర్టపతిని ఇప్పుడే ప్రకటించేసారన్న మాట.

వార్త - త్వరలో నూతన మద్యం పాలసీ. - మంత్రి రవీంద్ర.

వ్యాఖ్య - ఇంటింటికి మద్యం అని మాత్రం పెట్టకండి.

వార్త - గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి. - చంద్రబాబు

వ్యాఖ్య - నాణ్యమైనది ఇవ్వాలని ఇప్పుడిచ్చేది కూడా లేకుండా చేస్తారేమో.

వార్త - హామీల వల్లే తెదేపా గెలుపు. - అసెంబ్లీలో జగన్.

వ్యాఖ్య - ఆ హామీలను వ్యతిరేకించే మీ ఓటమి.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter