వార్తా వ్యాఖ్య (36)

Friday, 23 May 2014 13:00

వార్త – వ్యాఖ్య

Written by

వార్త     -        జగన్ సముద్రాలనూ మింగేసేవాడు. – డి.ఎల్.రవీంద్రారెడ్డి.

వ్యాఖ్య  -        ఓడిపోయాడు కదా... ఎన్నయినా అంటారు.

వార్త     -        చంద్రబాబుకు మంచి భవిష్యత్తు. – మాజీప్రధాని దేవేగౌడ.

వ్యాఖ్య  -        మీవల్లే... లేకుంటే 1996లో మీ బదులు ఆయన ప్రధానై వుంటే ఇప్పుడు మీలానే ఉండేవాడు.

వార్త     -        ఎన్నికల్లో ఓటమికి నాదే బాధ్యత.   జయప్రకాశ్ నారాయణ.

వ్యాఖ్య -        గెలిచున్నా మీ క్రెడిటే...

వార్త     -        మావోయిస్టులపై నిషేధాన్ని ఎత్తేయాలి. – సీపీఐ నారాయణ.

వ్యాఖ్య  -        జరగని పనుల గురించే ఎక్కువ మాట్లాడడం మీ హాబీనా.

వార్త     -        నా పదవీ కాలం తెరచిన పుస్తకం. – మన్మోహన్ వెల్లడి.

వ్యాఖ్య  -        అందులో చదువుకోవడానికేమీ లేదుగా.

వార్త     -        తప్పిదాలు ఉంటే క్షమించండి. – బొత్స.

వ్యాఖ్య  -        ఉంటే ఏంటి... చేసినవన్నీ అవేగా.

వార్త     -        ప్రజలు అభివృద్ధిని చూడలేదు. – కోట్ల.

వ్యాఖ్య  -        మీ పార్టీ ప్రజల మనసులను చూడలేదు.

వార్త     -        నేను ఇష్టపడే అతికొద్ది మంది నేతల్లో మీరొకరు. – మన్మోహన్ తో ఒబామా.

వ్యాఖ్య -        అంతగా ఇష్టపడితే మీ దేశానికే తీసుకుపోయి ఉండాల్సివుంది.

Saturday, 17 May 2014 12:13

వార్త - వ్యాఖ్య

Written by

వార్త - రాజధానిని నిర్ణయించేది కేంద్రమే.

వ్యాఖ్య - విభజనతో మా తలరాతను నిర్ణయించేసారుగా... రాజధాని ఎక్కడైతే ఏంటి

వార్త - ఫలితాల తర్వాతే మూడో కూటమి ప్రయత్నాలు. - ప్రకాశ్ కారత్.

వ్యాఖ్య - ఇప్పుడు అనవసరపు శ్రమ అనుకుంటున్నారా.

వార్త - ఎన్నికల సంఘంలో విభేదాలు లేవు.   - ప్రధాన ఎన్నికల కమీషన్ సంపత్.

వ్యాఖ్య - మీక్కూడా రాజకీయాలు ఒంటబట్టాయా ఏంటి.

వార్త - నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి. - గవర్నర్ కు చంద్రబాబు లేఖ.

వ్యాఖ్య - మీ లేఖ ఆయనకు చేరేలోపు ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది లేండి.

వార్త - అవినీతిపై విసుగులేని పోరాటం. - జస్టిస్ చంద్రకుమార్.

వ్యాఖ్య - అవును... నిరంతర పోరాటం చేసినా ఫలితం ఉండదు కాబట్టి.

వార్త - అవినీతి వల్లే అభివృద్ధిలో వెనుకంజ. - సీపీఎంబి డైరెక్టర్ మోహన్ రావు.

వ్యాఖ్య - అవినీతి ఎక్కువకావడం కూడా అభివృద్ధే కదా.

వార్త - మాది సమిష్టి నాయకత్వం. - కాంగ్రెస్.

వ్యాఖ్య - అది తెలిసిందేలే... ఓడితే సమిష్టి లోపం... గెలిస్తే రాహుల్ ఇమేజ్

వార్త - నియమకాల్లో సోనియా జోక్యం చేసుకునే వారు. - ప్రణాళికా సంఘం సభ్యుడి వెల్లడి.

వ్యాఖ్య - ప్రధానమంత్రినే ఆమె నియమిస్తే మిగతావి లెఖ్ఖా.

Friday, 09 May 2014 14:52

వార్త - వ్యాఖ్య

Written by

వార్త - పాలనానుభవం బాబుకే - ఆర్. కృష్ణయ్య

వ్యాఖ్య - అనుభవం కాదు, ఆశయం, ఆలోచన ముఖ్యం.

వార్త - పిచ్చి ముదిరిన పిల్లోడు జగన్. - వాసిరెడ్డి

వ్యాఖ్య - దానిని పిచ్చి అనరు.. లెక్కలేని తిక్క అంటారు.

వార్త - ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదు. ప్రియాంక గాంధీ.

వ్యాఖ్య - మీ పనైపోయినట్లేనని ఒప్పుకుంటున్నారా.

వార్త - మోడీ... చరిత్ర మళ్లీ చదవండి. - సోనియా.

వ్యాఖ్య - ఆయన కంటే ముందు మీరు చదవాల్సి వుంది.

వార్త - దళితులంతా ఏకమై వైకాపాను భూస్థాపితం చేయాలి. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ.

వ్యాఖ్య - మీకుతెలిసినట్లులేదే... దళితులే ఈరోజు వైకాపా బలం.

Friday, 02 May 2014 07:29

వార్త-వ్యాఖ్య

Written by

వార్త     -        జగన్ అవినీతి నిపుణుడు. – బాలకృష్ణ.

వ్యాఖ్య  -        మీక్కూడా దేంట్లోనో నైపుణ్యమున్నటుందే.

వార్త     -        చిన్న రాష్ర్టానికి సీఎంగా వద్దనే పోటీ నుండి తప్పుకున్నా. – కిరణ్

వ్యాఖ్య  -        పెద్ద రాష్ర్టానికే సీఎంగా ఉండాలనుకుంటే యూపికి పోండి.

వార్త     -        పదిరోజుల్లో తెదేపా ప్రభుత్వం. – నారా రోహిత్.

వ్యాఖ్య  -        ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా.

వార్త     -        బీసీల్ని తిడితే తాటతీస్తా. – కేసీఆర్ పై నిప్పులు చెరిగిన పవన్.

వ్యాఖ్యా-        మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని తిట్టినా ఒప్పుకునేటట్లు లేరు.

వార్త     -        దేశాన్ని దేవుడే కాపాడాలి. – సోనియా.

వ్యాఖ్య  -        అవును... కాంగ్రెస్ నుండి కాపాడాలంటే దేవుడికే సాధ్యం.

వార్త     -        బాలకృష్ణను విమర్శించే అర్హత షర్మిలకు లేదు. – టీడీపీ ప్రధానకార్యదర్శి అనూరాధ.

వ్యాఖ్య  -        దానికేమన్నా డిగ్రీలు చదవాలా.

వార్త     -        మోడీ ప్రధాని అయితే నాశనమే. – కేంద్రమంత్రి ఆజాద్.

వ్యాఖ్య  -        కాంగ్రెస్ పార్టీనా.

వార్త     -        సీమాంధ్రను సింగపూర్ గా చేయడం చంద్రబాబుకే సాధ్యం. – నారా లోకేష్.

వ్యాఖ్య  -        అధికారంలోకొస్తే సీమాంధ్రకు సింగపూర్ అని పేరు మార్చేటట్టున్నారే.

వార్త     -        చిరంజీవి కాంగ్రెస్ కు సంజీవని. – పద్మరాజు.

వ్యాఖ్య  -        ఎవరు ఎవరికి సంజీవనో ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

వార్త     -        రెచ్చగొట్టే విషయంలో కిరణ్, కేసీఆర్ లు ఒకటే. – దాసరి జైరాం రమేష్.

వ్యాఖ్య  -        కిరణ్ కు అంత సీన్ వుంటే రాష్ర్టం విడిపోయేదా.

వార్త     -        16నెలలు జైల్లో ఉన్న జగన్ కు ఓటేస్తారా. – మేధాపాట్కర్.

వ్యాఖ్య  -        ఈ లెక్కన చూస్తే ఎవ్వరికీ ఓటేయబల్లేదు.

వార్త     -        జగన్ ది ఆత్మరక్షణ పోరు... బాబుది ఆఖరిపోరు. – చిరంజీవి.

వ్యాఖ్య  -        తమది అధికార పోరు.

వార్త     -        జగన్ మోడీని విమర్శించరేం. – సీపీఎం నేత మధు.

వ్యాఖ్య  -        ఆయన్ను ఈయన తిట్టకుంటే మీకొచ్చిన బాధేంటో.

Friday, 25 April 2014 11:13

వార్త – వ్యాఖ్య

Written by

వార్త     -        ఎన్నికల్లో పోటీకి దూరం. – కిరణ్ కుమార్ రెడ్డి.

వ్యాఖ్య  -        గెలిస్తే ఎమ్మెల్యేనే... పోటీ చేయకుంటే మాజీ సీఎం అంటారు కదా.

వార్త     -        భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకే తెలంగాణ. – కేంద్రమంత్రి జైరాం రమేష్.

వ్యాఖ్య -        భూస్వామ్య వ్యవస్థకు బదులు దొరల వ్యవస్థను తెచ్చారు.

వార్త     -        విభజించి పాలించాలని చూస్తున్నారు. – మోడీపై రాహుల్ విమర్శ.

వ్యాఖ్య -        ఆ సిద్ధాంతం మన పార్టీదేగా.

వార్త     -        దళితబిడ్డ ప్రధాని కాకుండా కుట్ర. – మాయావతి.

వ్యాఖ్య  -        యూపిలో సీట్లొస్తే మీరు ప్రధాని అయిపోతారా.

వార్త     -        కె.వి.పి. నాకు బేరం పెట్టారు. – కేసీఆర్.

వ్యాఖ్య  -        కుదరలేదా.

వార్త     -        ఇక ఎన్నికల్లో పోటీ చేయను. – గాదె వెంకటరెడ్డి.

వ్యాఖ్య -        మీలాంటి పెద్దతరం వారికి టిక్కెట్లు కూడా రావులే.

వార్త     -        విభజనకు కారణమైన పార్టీలను ఓడించండి. – జైసపా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి.

వ్యాఖ్య  -        మిమ్మల్ని గెలిపించమని చెప్పుకోరా.

వార్త     -        ముస్లింల రిజర్వేషన్లకు కృషి. – ములాయంసింగ్ యాదవ్.

వ్యాఖ్య  -        కులాలు, మతాల గురించి మాట్లాడుతారుగాని ఒక్కరూ పేదల రిజర్వేషన్ల గురించి మాట్లాడరే.

Friday, 18 April 2014 10:01

వార్త - వ్యాఖ్య

Written by

వార్త - మా పొత్తు సునామీ సృష్టిస్తుంది. -చంద్రబాబు.
వ్యాఖ్య - ఆలం రెడీ మీ పార్టీలో అసంతృప్తి సునామీ పుట్టిందిగా.
వార్త - జయ జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. - కరుణానిధి
వ్యాఖ్య - అనవసరంగా ఆమెకు జైలు గుర్తుచేయకండి... మీకే ఇబ్బంది.
వార్త - సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. - మాజీ మంత్రి డొక్క
వ్యాఖ్య - అవును... ఈసారి ఎవరూ అడుగలేదు కాబట్టి టిక్కెట్లలో సామాజిక న్యాయం చేసారు.
వార్త - మోడీని ప్రపంచం విశ్వసించదు. - కాంగ్రెస్
వ్యాఖ్య - భారత్ విశ్వసిస్తే చాలుగా...
వార్త - పదవులు ఆశించి టీడీపీలోకి రాలేదు. - గంటా శ్రీనివాసరావు
వ్యాఖ్య - టిక్కెట్ మాత్రమే ఆశించారు.
వార్త - వైకాపా ఎన్నికల ప్రణాళిక ఓ చెత్త కాగితం. - తులసిరెడ్డి
వ్యాఖ్య - అన్ని పార్టీల మేనిఫెస్టోలు అదే బాపతులే
వార్త - ముస్లింలను జంతువులకంటే హీనంగా చూస్తున్నారు. - మాయావతి.
వ్యాఖ్య - వాళ్లకు లేని ఆలోచనలను కూడా మీరు తెప్పిస్తున్నారు.
వార్త - సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం. - బీజేపీ నేత వెంకయ్యనాయుడు.
వ్యాఖ్య - విడగొట్టింది అందుకేనా
వార్త - మన్మోహన్ అత్యంత బలహీన ప్రధాని. - అద్వానీ
వ్యాఖ్య - ఏదన్నా ఐరన్ టానిక్ వాడుండాల్సింది.
వార్త - కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి. - చిరంజీవి
వ్యాఖ్య - ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి వెలగబెట్టారో చూస్తూనే ఉన్నాంగా
వార్త - జగన్ ది నియంతృత్వ ధోరణి. -దేశం నేతల ధ్వజం
వ్యాఖ్య - చంద్రబాబుదేదో ప్రజాస్వామ్యబద్ధ వైఖరి అయినట్లు
వార్త - భారత్ లో అవినీతి విస్తరించింది. -అమెరికా సంస్థ వెల్లడి.
వ్యాఖ్య - విస్తరించలేదు... ఆక్రమించేసింది.

Friday, 11 April 2014 10:22

వార్త - వ్యాఖ్య

Written by

వార్త     -        కిరణ్ కు బాబు, మోడీ సరిరారు.-తులసిరెడ్డి.

వ్యాఖ్య  -        అంత బరువున్నారా

వార్త     -        అత్యధిక సీట్లే లక్ష్యంగా కృషి.      -బీజేపీ అధ్యక్షుడు హరిబాబు.

వ్యాఖ్య  -        చంద్రబాబు నుండి సీట్లు తెచ్చుకున్నంత సులభంకాదు గెలుచుకోవడం.

వార్త     -        రాహుల్ కంటే మోడీనే ప్రధానిగా మేలు   - జయప్రకాశ్ నారాయణ.

వ్యాఖ్య  -        ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టుకోవడానికి అన్నట్లుగా వుంది.

వార్త     -        అవినీతి పై పోరులో అందరికన్నా మేమే మిన్న.   - కేరళలో ప్రధాని

వ్యాఖ్య  -        అవినీతిపై పోరులోనా... అవినీతి జోరులోనా...

వార్త     -        ఫలితాలకు ముందే కొత్త బంగ్లాకు ప్రధాని.

వ్యాఖ్య  -        అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ఇక ఆయన ప్రధాని అయ్యేది              లేదుకాబట్టా.

వార్త     -        మోడీ మంచి పాలనాధ్యక్షుడు.   - అద్వానీ కితాబు

వ్యాఖ్య  -        కాబట్టే కదా మిమ్మల్ని మించిపోయింది.

వార్త     -        పొత్తు ఇరువర్గాలకు లాభమే.     - పురంధేశ్వరి.

వ్యాఖ్య  -        లాభం మాటేమోగాని నష్టం తప్పేటట్లు లేదు... చూడండి

వార్త     -        దేశ ప్రయోజనాలకే బీజేపీతో పొత్తు.       - బాలకృష్ణ

వ్యాఖ్య  -        అది కాదులే... తెలుగుదేశం ప్రయోజనానికే

వార్త     -        ఎన్డీఏ కు 300కు పైగా స్థానాలు.- బీజేపీ నేత వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య  -        పోటీ చేసేవి కాదు, గెలిచేవి చెప్పండి.

వార్త     -        పార్టీల పాపాలను కాంగ్రెస్ మోస్తోంది.     - కేంద్ర మంత్రి జె.డి.శీలం

వ్యాఖ్య  -        కాంగ్రెస్ ను పాపాల పుట్ట అంటారు.

వార్త     -        కిరణ్ మనసంతా కాంగ్రెస్సే.       - ఎంపీ సాయిప్రతాప్

వ్యాఖ్య  -        అంటే మళ్లీ కాంగ్రెస్లోకొస్తాడనేగా

వార్త     -        యువత, బీసీలకు ప్రాధాన్యం.    - రఘవీరారెడ్డి

వ్యాఖ్య  -        అసలు టిక్కెట్లు అడిగేవారే లేరుగా.. ఎవరికైనా ప్రాధాన్యతనిస్తారు.

వార్త     -        కిరణ్ వస్తానన్నా చేర్చుకోరేమో   - ఆనం రామనారాయణ రెడ్డి.

వ్యాఖ్య  -        కాంగ్రెస్ కు అంత సీన్ ఉందా

Friday, 04 April 2014 04:59

వార్త - వ్యాఖ్య

Written by

వార్త - ఆసుపత్రి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రానీయం. - చంద్రబాబు
వ్యాఖ్య - మీ ఆస్తులు అమ్మి పెడతారా
వార్త - దళితుల్ని మోసం చేస్తే కేసీఆర్ ను తిరగనివ్వం. - మంద కృష్ణ
వ్యాఖ్య - కాంగ్రెస్నే మోసం చేసిన ఆయనకు మీరో లెఖ్ఖా
వార్త - ఎన్నికల హడావిడిలో విభజన ఏర్పాట్లు. - కిరణ్
వ్యాఖ్య - మీకంత హడావిడి ఏముంది.
వార్త - జాబితాతో ఢిల్లీకి రండి. రఘవీరాతో దిగ్విజయ్
వ్యాఖ్య - అభ్యర్థులే దొరక్కుంటే ఆయనేం జాబితా తయారుచేస్తాడు.
వార్త - గ్యాస్ ధర పెంచమన్నది మోడీయే. - అరవింద్ కేజ్రీవాల్
వ్యాఖ్య - మీరు ప్రభుత్వం కంటే ప్రతిపక్షం పైనే ఎక్కువ గురి పెట్టినట్లున్నారు.
వార్త - తెలుగు భాషను రక్షించుకోవాలి. - బీజేపీ నేత వెంకయ్య
వ్యాఖ్య - తెలుగు భాషతో పాటు తెలుగు దేశాన్ని కూడా రక్షించే పనిలో ఉన్నట్లున్నారు.
వార్త - నిత్యావసర ధరలు పెరుగుతాయి. - కాంగ్రెస్ పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి
వ్యాఖ్య - కొంపదీసి మళ్ళీ కాంగ్రెస్సే వస్తుందా, ఏంటి
వార్త - సాక్షిలో వచ్చే వాటిని చెల్లింపు వార్తలుగా పరిగణించాలి. - ఎన్నికల సఁఘానికి టీడీపీ లేఖ.
వ్యాఖ్య - మరి ఎల్లో పేపర్లలో వచ్చే వాటిని...
వార్త - ఢిల్లీలో ఎన్నికలు జరపండి. - క్రేజీవాల్.
వ్యాఖ్య - మళ్ళీ హంగే వస్తే....
వార్త - నటిస్తూనే.... రాజకీయాల్లో కీలకపాత్ర - నందమూరి బాలకృష్ణ
వ్యాఖ్య - రాజకీయాల్లో కూడా నటించడమేగా
వార్త - సమస్యలు పరిష్కరించే వారికే ఓటెయ్యండి. -యువతకు అబ్దుల్ కలాం పిలుపు.
వ్యాఖ్య - అలాగనుకుంటే ఎవరికీ ఓటేయబల్లేదు.
వార్త - చిరు అభిమానులకు కాంగ్రెస్ గాలం.
వ్యాఖ్య - అవతల పవన్ అభిమానులకు వలనే విసిరి వున్నారు,
వార్త - అధికారంలో కాదు, వ్యవస్థలో మార్పు రావాలి. -అన్నా హజారే.
వ్యాఖ్య - ఈ యుగానికి ఆ సంగతి మర్చిపోండి.

Friday, 28 March 2014 06:28

వార్త వ్యాఖ్య

Written by

వార్త     -        మా పార్టీ మద్దతు తృతీయ ఫ్రంట్ కే       - కిరణ్.

వ్యాఖ్య  -        అంత అవసరం వస్తుందనుకుంటున్నారా

వార్త     -        సీమాఁధ్ర అభివృద్ధి బాధ్యత బీజేపీదే        -వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య  -        అగాధంలోకి నెట్టింది మీరే కాబట్టా

వార్త     -        మోడీకి విపరీత ప్రచారం.-మీడియాపై మండిపడ్డ అసరుద్దీన్

వ్యాఖ్య  -        ఉరిమురిమి మంగళం మీద పడడం అంటే ఇదే.

వార్త     -        చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి.       -ఎంపీ రాయపాటి

వ్యాఖ్య  -        రాజకీయ నాయకులకు దేవుడు రెండు నాలుకలిచ్చేటట్లున్నాడు.

వార్త     -        ఓటు బ్యాంకు రాజకీయాల్ని నిర్మూలించారు.

వ్యాఖ్య  -        ఓటు బ్యాంకులే ప్రజాస్వామ్యాన్ని కబళిస్తున్నాయి.

వార్త     -        జెండా మోసిన వారిని విస్మరించం.        - చంద్రబాబు.

వ్యాఖ్య  -        కొంపదీసి డైలీ లేబర్ క్రింద డబ్బులివ్వరుగా

వార్త     -        కొంత కష్టమైనా పొత్తులకు సిద్ధం.          - జయప్రకాశ్ నారాయణ.

వ్యాఖ్య  -        లేకుంటే ఇంకొంచెం కష్టమవుతుందనా

వార్త     -        మోడీ ప్రధాని కావాలి.    - నాగార్జున ఆకాంక్ష.

వ్యాఖ్య  -        రాహుల్ ను వద్దనేగా.

వార్త     -        త్వరలో పార్టీ మారతా.   - పితాని

వ్యాఖ్య  -        తొందరగా ఆ పనిచేయండి. రెండు నెలల్లో మూడు పార్టీలు మారిన రికార్డన్నా ఉంటుంది.

వార్త     -        గుజరాత్ అభివృద్ధి కట్టుకథే.      - బృందా కారత్

వ్యాఖ్య  -        మనం చేయం, చేసినవాళ్లను తిట్టకుండా ఉండం...

వార్త     -        రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తాం.    - బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు.

వ్యాఖ్య  -        పార్టీల జిల్లా అధ్యక్షుల సంఖ్య పెంచుకోవచ్చనా

వార్త     -        కుటుంబానికి ఒకే టికెట్.- కాంగ్రెస్ అధిష్టాన విధాన నిర్ణయం.

వ్యాఖ్య  -        ఒకోక నాయకుడిని ఒక్కో కుటుంబంగా పరిగణిస్తారా.

వార్త     -        మేమొస్తే ఆరోగ్య హక్కు. – రాహుల్

వ్యాఖ్య  -        అవినీతి హక్కు కూడానా.

వార్త     -        కాంగ్రెస్ ఓటమి సుస్పష్టం. – అద్వానీ.

వ్యాఖ్య  -        అది వాళ్లే చెబుతున్నారులే...

Friday, 21 March 2014 07:54

వార్త - వ్యాఖ్య

Written by

వార్త     -        ఈసారికి ఆశలేనట్లే. – దిగ్విజయ్ కి స్పష్టం చేసిన సీమాంధ్ర నేతలు.

వ్యాఖ్య -        వచ్చేసారి కూడా ఇదే మాట అనుకోవాల్సిందే.

వార్త     -        తెలంగాణలో సమైక్య ఉద్యమం వస్తుంది. – కిరణ్

వ్యాఖ్య -        కొంపదీసి అక్కడ చేరి మీరే మొదలుపెడతారా.

వార్త     -        ప్రజలు భిన్నమైన తీర్పిస్తారు. – లాలూ.

వ్యాఖ్య  -        వాళ్లెప్పుడూ భిన్నమైన తీర్పునే ఇస్తారు. కాబట్టే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు.

వార్త     -        కాంగ్రెస్ను అంటరాని పార్టీగా చూడడం లేదు. – సీపీఐ నారాయణ.

వ్యాఖ్య  -        ఎవరితోనైనా పోవడానికి రెడీగా ఉన్నామని చెప్పడమేగా.

వార్త     -        కాంగ్రెస్ తో పొత్తుండదు. – కేసీఆర్.

వ్యాఖ్య  -        తెలంగాణ ఏర్పడగానే ఆ విషయం అర్థమైపోయిందిలే.

వార్త     -        బీజేపీ బలం పెరిగితే ప్రమాదం. – బి.వి.రాఘవులు.

వ్యాఖ్య -        కమ్యూనిష్టులకా.

వార్త     -        కేసీఆర్ తెలంగాణ రాదనుకున్నారు. – చంద్రబాబు.

వ్యాఖ్య  -        వస్తుందనుకుంటే విలీనం చేస్తానని ఎందుకంటాడు.

వార్త     -        నాయకులు లేని పార్టీ కాంగ్రెస్. – వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య  -        రేపు కార్యకర్తలు, ఎల్లుండి ఓటర్లు కూడా ఉండరు.

వార్త     -        కాంగ్రెస్ ను విజయతీరాలకు చేరుస్తాం.    - రఘువీరారెడ్డి.

వ్యాఖ్య  -        ఏ రాష్ర్టంలో కూడా చెప్పండి.

వార్త     -        జెండా మోసేవారికి కాంగ్రెస్లో కొదవలేదు. – చిరంజీవి.

వ్యాఖ్య  -        ఓట్లేసే వాళ్లకే కొరత.

వార్త     -        మోడీని ఓడించడమే ప్రధాన లక్ష్యం. – కేజ్రీవాల్.

వ్యాఖ్య  -        మీరు గెలవాలనేది ఇంపార్టెంట్ కాదా.

వార్త     -        త్వరలో సంచలనాత్మక విషయం వెల్లడిస్తా.         - మోహన్ బాబు.

వ్యాఖ్య  -        మీరు సీఎం అయ్యేదాకా ఎవరినీ ఫోన్లు కొనొద్దంటారు.

Page 2 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter