వార్తా వ్యాఖ్య (36)

Friday, 14 February 2014 06:11

14-02-2014 వార్త - వ్యాఖ్య

Written by

వార్త -  దారితప్పిన షిర్డి రైలు.    -అవస్థలు పడిన ప్రయాణీకులు.

వ్యాఖ్య - ప్రభుత్వాలే దారితప్పాయి. రైళ్లొక లెక్కా

వార్త -  తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం.  -జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్.

వ్యాఖ్య – ఫ్రంట్ అంటే ఒక రకంగా టెంటేకదా

వార్త -  పార్లమెంటులో ఇక చెడుగుడే.    -లగడపాటి

వ్యాఖ్య – బాగా ప్రాక్టీస్ చేయండి.

వార్త – వేసవికి ముందే విద్యుత్ కోతలు.

వ్యాఖ్య – అప్పటికి అలవాటు పడిపోతారని.

వార్త – దండగమారి మన్మోహన్. -గౌహతి సభలో మోడీ వ్యాఖ్య.

వ్యాఖ్య – దేశానికి దండగైనా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడుగా

వార్త – కణతకు తుపాకీ ఎక్కుపెట్టారు.    -విభజన బిల్లుపై వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య – మీది రామరాజ్యమైతే కాంగ్రెస్ ది రౌడీ రాజ్యం.

వార్త – విభజన నిర్ణయం రాజ్యంగ విరుద్ధం.        -కేంద్రమంత్రి కావూరి.

వ్యాఖ్య – ఆ సంగతి తెలిసి కూడా పదవిలో ఉండడానికి సిగ్గులేదా

వార్త – పార్లమెంటులో ప్రాణత్యాగానికైనా సిద్ధమే.  -సబ్బం హరి.

వ్యాఖ్య – అంత దూరమొద్దుగాని, బిల్లును అడ్డుకోండి చాలు.

వార్త – మేము జీవితమంతా సోనియాకు ఋణపడి ఉండాలి.        -మంత్రి డొక్క

వ్యాఖ్య – ప్రజలకు కాదు...

వార్త – బాధ్యతల నుండి తప్పుకోవడమే అవుతుంది.      -రాజీనామాలపై బొత్స.

వ్యాఖ్య – కాంగ్రెస్ కు సమాధికట్టే బాధ్యతల నుండా...

వార్త – దేశ చరిత్రలో ఇది విధ్వంసకర దశాబ్ధం.    -నరేంద్రమోడీ.

వ్యాఖ్య – దీనిని మన్మోహన్ దశాబ్ధమంటే సరి..   

వార్త – సీమాంద్రకి సోనియా న్యాయం చేస్తారు.    -డి.యస్

వ్యాఖ్య – ఆమె దయాదాక్షిణ్యాలతో బతికేకంటే చావడం నయం.

వార్త – ఓట్లు రాలే అంశాలకే బడ్జెట్లో ప్రాధాన్యం.    -జేపీ.

వ్యాఖ్య – మరి ఎన్నికలు దగ్గరకొచ్చాయిగా.

Friday, 07 February 2014 13:37

వార్త - వ్యాఖ్య

Written by

వార్త – ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తుంది. – లోక్సత్తా అధ్యక్షుడు జేపీ.

వ్యాఖ్య – మరి ప్రభుత్వాన్ని సాకేది మద్యమేగా

వార్త – తెదేపాతో పొత్తుకు అవకాశం లేదు. – ప్రకాశ్ కారత్.

వ్యాఖ్య – వాళ్లు బీజేపీ కోసం వెంపర్లాడుతున్నారులే.

వార్త – ఆర్టికల్ -3తో సీమాంధ్రపై అత్యాచారం. – దేశం నేత పయ్యావుల.

వ్యాఖ్య – యూపిఏ ప్రభుత్వం పెద్ద రేపిస్టు అంటారు.

వార్త – కేంద్రం చేతిలో రాష్ర్ట భవిత. – కేంద్రమంత్రి చిరంజీవి.

వ్యాఖ్య – ప్రజల చేతిలో తమ భవిత వుందని మీరు అనుకుంటున్నట్లు లేదు.

వార్త – అందరి కలలు నెరవేరుద్దాం. – చంద్రబాబు.

వ్యాఖ్య – తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కావాలని చాలామంది కలలు కంటున్నారు... నెరవేరుస్తారా.

వార్త – ఏదో ఒకటి తేల్చేయాలి. – తెలంగాణపై చిదంబరం.

వ్యాఖ్య – సీమాంధ్రను చంపేయడానికి తొందరపడుతున్నారే.

వార్త రాష్ర్టపతిభవన్ ఎదుట దుస్తులు విప్పేసిన జంట.

వ్యాఖ్య – ఇదేమన్నా ఫరిన్ అనుకుంటున్నారేమో.

వార్త – సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందే. – వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య – ముందు అన్యాయం చేయకుండా చూడండి.

Friday, 31 January 2014 10:08

వార్త వ్యాఖ్య

Written by

వార్త.    ఎన్ని లోపాలున్నా దిద్దుకోవచ్చు.                   -విభజన బిల్లుపై దిగ్విజయ్.

వ్యాఖ్య  కాని దీనిలో దిద్దలేని లోపాలున్నాయే

వార్త     యువతతోనే అవినీతి రహిత సమాజం.   -సీబీఐ ఐ.జీ లక్ష్మీనారాయణ.

వ్యాఖ్య  ఆ సమాజమే యువతను అవినీతిపరులను చేస్తుంటే...

వార్త     హైదరాబాద్లో నమో టీ స్టాల్.

వ్యాఖ్య  రాహుల్ పేరుతో బడ్డీకొట్లు పెడతారేమో

వార్త     విభజన ప్రక్రియ తప్పుల తడక.  -పయ్యావుల కేశవ్.

వ్యాఖ్య  బిల్లును తయారుచేసిన ప్రభుత్వం కూడా అలాంటిదేగా

వార్త     చీలికల ప్రభుత్వంతో వినాశనమే.-రాష్ర్టపతి గణతంత్ర దినోత్సవ సందేశం.

వ్యాఖ్య  కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ ఇమ్మనా.. లేక తుడిచిపెట్టమనా

వార్త     కిరణ్, బాబు ప్రసంగాల్లో నిజాయితీ ఉంది.-సబ్బం హరి.

వ్యాఖ్య  ఇద్దరిలో ఒకరిని ఎంచుకోబోతున్నారన్న మాట.

వార్త     లోకంసభ ఎన్నికల్లో మహిళలకు మరిన్ని సీట్లివ్వాలి.      -మహిళా కాంగ్రెస్ అభీష్టం.

వ్యాఖ్య  ఓడిపోయేదానికి ఎన్ని సీట్లిస్తే ఏంటి

వార్త     నెహ్రూ మా హక్కులను కాలరాశారు.     -రేవంత్ రెడ్డి.

వ్యాఖ్య  ఉరిమురిమి మంగళం మీదపడడం అంటే ఇదే.

వార్త     రాష్ర్ట ప్రజలతో కాంగ్రెస్ చెలగాటం.-బీజేపీ నేత వెంకయ్య.

వ్యాఖ్య  రాష్ర్ట ప్రజలతో కాదు, మొత్తం దేశంతోనే చెలగాటమాడుతుంది.

వార్త     నల్లధనం వెనక్కితెచ్చే పార్టీకే ఓటు.        రాంజెఠ్మలానీ.

వ్యాఖ్య  అలాగైతే ఏ పార్టీకి ఓటేయబల్లేదు.

Friday, 24 January 2014 15:12

వార్త వ్యాఖ్య

Written by

వార్త     -        అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తాం.

                   -బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజ్ నాథ్ సింగ్.

వ్యాఖ్య  -        అంటే ఎన్నికలలోపు తెలంగాణ లేనట్లేనా...

వార్త     -        తెలంగాణ ఏర్పాటు అనివార్యం.   -అసెంబ్లీలో జేపీ.

వ్యాఖ్య  -        కేసీఆర్ కూడా ఇంత గట్టిగా ఎప్పుడూ కోరలేదే

వార్త     -        వైకాపా దోపిడీదారుల పార్టీ.       -నారా లోకేష్.

వ్యాఖ్య  -        ఏదైనా ప్రారంభమయ్యింది మన నుండే కదా

వార్త     -        రాష్ర్టంలో కాంగ్రెస్ భూస్థాపితమే.  -అశోక్ బాబు.

వ్యాఖ్య  -        ఆ సంగతి సోనియాగాంధీకి కూడా తెలుసుగా

వార్త     -        సప్తవర్ణాల భారత్ను ఆవిష్కరిస్తాం.        -నరేంద్రమోడీ.

వ్యాఖ్య  -        ప్రస్తుతం సప్తవర్గాల భారత్ ఉంది కదా

వార్త     -        అధికారంలోకి వస్తే వై.యస్.విగ్రహాలను కూల్చేస్తాం.        -గాలి ముద్దు కృష్ణమనాయుడు.

వ్యాఖ్య  -        ఆ మాట చెప్పండి..వచ్చే ఓట్లు కూడా రావు.

వార్త     -        జైనులను మైనార్టీలుగా గుర్తించండి.       -ప్రధానితో రాహుల్.

వ్యాఖ్య  -        పనిలో పనిగా హిందువులను కూడా గుర్తిస్తే సరి

వార్త     -        నిజాం లౌకికవాది.        -అక్బరుద్దీన్.

వ్యాఖ్య  -        ఈ లెక్కన చూస్తే దేశంలో మతతత్వవాదులు లేనట్లే.

వార్త     -        అన్నాడిఎంకెతో పొత్తు మేలు.     -సీతారాం ఏచూరి.

వ్యాఖ్య  -        రాష్ర్టానికో పార్టీకి తోకలా తయారవుతున్నారన్నమాట.

వార్త     -        పోలీసుల పిల్లలకు మంచి చదువులు.    -డిజిపి ప్రసాద్రావు.

వ్యాఖ్య  -        పోలీసులకు కూడా మంచి నీతిపాఠాలు చెప్పించండి.

వార్త     -        నియంతృత్వానికి నిదర్శనం నిజాంపాలన.          -కోడెల.

వ్యాఖ్య  -        తెలంగాణ వాళ్లకు ఆయన బానిస పాలనే బాగున్నట్లుంది.

వార్త     -        పట్టణాభివృద్ధికి ఏంచేయాలి.      -సీఎస్ ను అడిగినప్రధాని.

వ్యాఖ్య  -        ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు.

వార్త     -        12సిలిండర్లపై ఈ వారమే నిర్ణయం.        -కేంద్రమంత్రి మొయిలీ.

వ్యాఖ్య  -        రాహుల్ కోరిక కదా... ఆ మాత్రం స్పీడుంటుందిలే

Friday, 10 January 2014 11:17

వార్త – వ్యాఖ్య

Written by

వార్త – ఎండాకాలంలో కరెంట్ కోతలుండవు. – ముఖ్యమంత్రి వెల్లడి.

వ్యాఖ్య – అప్పటికి మీరు ముఖ్యమంత్రిగా వుండరు కాబట్టి ఏమైనా చెబుతారు.

వార్త – మోడీకన్నా ప్రమాదకరవ్యక్తి మన్మోహన్. – సిపిఐ నారాయణ.

వ్యాఖ్య – మెత్తగా ఉండే ముంచేస్తాడంటారా.

వార్త – రాజీనామాపై వెనక్కి తగ్గను. – శ్రీధర్ బాబు.

వ్యాఖ్య – పదవిలో ఉన్నా ఇక పొడిచేదేముందనా.

వార్త – చిరంజీవి నాకు అన్యాయం చేసారు. – పొన్నాల.

వ్యాఖ్య – ఆయన వల్ల ఎవరికి మాత్రం న్యాయం జరిగిందిలే.

వార్త – రాష్ర్ట విభజన ఆపేది చంద్రబాబే. – దేశం ఎంపీలు కొనకళ్ల, సుజనాచౌదరి.

వ్యాఖ్య – ఆపేది ఏమోగాని చీలితే మాత్రం ఆయన వల్లే.

వార్త – రాష్ర్టానికి కాంగ్రెస్ పరిశీలకులు.

వ్యాఖ్య – పార్టీ ఏ మాత్రం నాశనమైందో చూడడానికా.

వార్త – బిల్లుపై చర్చకు గడువు పెంచాలి. – యనమల.

వ్యాఖ్య – ఏడాది సరిపోతుందా.

వార్త – విభజన ఆగాలన్నదే కేసీఆర్ కోరిక. – జయప్రకాశ్ నారాయణ.

వ్యాఖ్య – ఆ నిజాన్ని ఇప్పటికి తెలుసుకున్నారా.

Friday, 03 January 2014 08:37

03-01-14 వార్త – వ్యాఖ్య

Written by

వార్త – సమాజాన్ని పాడుచేస్తున్న మీడియా – కావూరి మండిపాటు.

వ్యాఖ్య – ఎంత చేసినా మీ రాజకీయనాయకులకంటే తక్కువేలే.

వార్త – ముఖ్యమంత్రి జైలుకు వెళ్లకతప్పదు. – శంకర్రావు.

వ్యాఖ్య – అలా అని అగ్రిమెంట్ ఏమన్నా ఉందా.

వార్త – కిరణ్, బాబు, జగన్ ఏకం కావాలి. – మంత్రి టి.జి.వెంకటేష్.

వ్యాఖ్య – ఒబామా, సద్ధాం, లాడెన్లు కలిసి పనిచేయాలన్నట్లుంది.

వార్త – ఎన్నికల లోపు విభజనకు అవకాశం లేదు. – మంత్రి తోట నరసింహం.

వ్యాఖ్య – విభజన లేకుంటే ఎన్నికలకు కూడా అవకాశం లేనట్లుంది.

వార్త – చేతనైతే ఢిల్లీ పెద్దలకు చెప్పండి. – బొత్సకు మంత్రి గంటా సూచన.

వ్యాఖ్య – అక్కడ చెప్పే ధైర్యం లేకేకదా ఇక్కడ మాట్లాడేది.

వార్త – విభజనను అడ్డుకుంటేనే భాజపాతో పొత్తు. – కోడెల.

వ్యాఖ్య – విభజనకు మద్దతిస్తేనే పొత్తు అని వాళ్లంటున్నారే...

వార్త – విభజన బిల్లు ఏకపక్షంగా వుంది. – రాష్ర్టపతికి సీమాంధ్ర బీజేపీ నేతల విజ్ఞప్తి.

వ్యాఖ్య – ఏకపక్షంగా ఉంటేనే కదా కాంగ్రెస్ కు ఒక చోటయినా సీట్లొచ్చేది.

వార్త – పార్టీగా మనం వెనుకబడి ఉన్నాం. – కిషన్రెడ్డి.

వ్యాఖ్య – విభజనతో ఇంకా వెనుకబడ్డారు.

Friday, 27 December 2013 11:15

27-12-13 వార్త - వ్యాఖ్య

Written by

వార్త – విభజన ప్రక్రియను ఆపండి. – రాష్ర్టపతిని కోరిన సీమాంధ్ర మంత్రులు.

వ్యాఖ్య – ఆయన కూడా కాంగ్రెస్ తానులో ముక్కే కదా.

వార్త – కాంగ్రెస్కు నాయకత్వ లేమి. – నోబెల్ గ్రహీత అమర్త్యసేన్.

వ్యాఖ్య – దానికంటే కూడా భజన పెద్ద సమస్య అయ్యింది.

వార్త – స్వలింగసంపర్కులపై పునరాలోచించండి. – సుప్రీంను కోరిన కేంద్రం.

వ్యాఖ్య – వీరిమీదున్న శ్రద్ధ దేశం మీద కూడా లేదే.

వార్త – పద్మశ్రీలు తిరిగిచ్చేయండి. – మోహన్బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు ఆదేశం.

వ్యాఖ్య – పద్మశ్రీని చేతి రుమాళ్లుగా వాడుకున్నందుకు తగిన శాస్తే జరిగింది.

వార్త – రాష్ర్ట విభజన జరగదు. – మంత్రి కాసు కృష్ణారెడ్డి.

వ్యాఖ్య – కాంగ్రెస్ పనిమీద అంత నమ్మకమా.

వార్త – ఛార్జీలు పెంచే యోచన లేదు. – రైల్వే మంత్రి ఖర్గే.

వ్యాఖ్య – లేదంటే వున్నట్లే... రాజకీయ నేతల మాటలకు అర్థాలు రివర్స్లే.

వార్త – నన్ను ప్రధానిని చేయండి. – పార్టీ శ్రేణులకు ములాయం పిలుపు.

వ్యాఖ్య – గాడిదమీద కూర్చుని ప్రపంచ జైత్రయాత్ర చేయాలనుకున్నట్లుగా వుంది.

వార్త – తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదు. – రేవంత్ రెడ్డి.

వ్యాఖ్య – చాలా ఆలస్యంగా నిజం తెలుసుకున్నారు.

వార్త – పార్టీలో ఉండాలనుకుంటున్నా... బొత్స వద్దంటున్నారు. – జేసీ.

వ్యాఖ్య – ఆయన వద్దనేది మీ మంచికోసమేగా.

Sunday, 22 December 2013 04:44

20-12-13 వార్త - వ్యాఖ్య

Written by

వార్త – బెయిల్ పై జైలు నుండి విడుదలైన లాలూ.

వ్యాఖ్య – పశువులు బెదురుతాయేమో.

వార్త – సీమాంధ్రనేతల్లో ఐక్యత ఏదీ.

వ్యాఖ్య – అంటే అందర్నీ మీ దార్లోకి రమ్మనా.

వార్త – గవర్నర్ చేతికి శాంతిభద్రతలు విడ్డూరం.

-     ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ

వ్యాఖ్య – లేకుంటే మీ చేతికిమ్మంటారా.

వార్త – విభజనకు మద్దతు ఇచ్చే బీజేపీతో పొత్తా. – దేశంపై బొత్స వ్యాఖ్యలు.

వ్యాఖ్య – పోనీ విభజించే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమంటారా.

వార్త – అవినీతిపై యుద్ధం ప్రారంభించండి. – కలాం.

వ్యాఖ్య – ఏ యుద్ధంలో అయినా గెలవచ్చేమోగాని ఈ యుద్ధంలో గెలవడం కష్టమే.

వార్త – కొత్త రాజకీయానికి తరుణమిదే. – లోక్ సత్తా అధినేత జేపీ.

వ్యాఖ్య – కొత్త రాజకీయాలంటే ఓటు రేటు పెరుగుతుందని ఆశపడతారు.

వార్త – రాష్ర్ట విభజన అసంబద్ధం. – జస్టిస్ పి.చంద్రశేఖర్ రావు.

వ్యాఖ్య – అసంబద్ధమైన పనులు చేయడమే కాంగ్రెస్ స్పెషాలిటీ.

వార్త – పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి. – అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ అక్షర సేవాసమితి.

వ్యాఖ్య – ఆయనేమన్నా నెహ్రూ కుటుంబంలో పుట్టాడా.

వార్త – జగన్ నా కుమారుడులాంటివాడు. – దిగ్విజయ్.

వ్యాఖ్య – మీలాంటి తండ్రిని మాత్రం ఎవరూ కోరుకోరు.

వార్త – బిల్లులో అనేక ఉల్లంఘనలు. – చంద్రబాబు.

వ్యాఖ్య – అసలు బిల్లే పెద్ద ఉల్లంఘన.

వార్త – బిల్లును గట్టిగా వ్యతిరేకిద్దాం. – సీమాంధ్ర నేతలతో సీఎం.

వ్యాఖ్య – ఏవన్నా ఉపయోగముండే మాటలు చెప్పండి.

వార్త – కాంగ్రెస్ తోనే ఉంటా. – లాలూ.

వ్యాఖ్య – రెండూ మునిగే పడవలే కదా.

వార్త – హైదరాబాద్లో పోటీ చేయండి... టిక్కెట్టిస్తాం. – ఆదాలకు కేటీఆర్ ఆఫర్.

వ్యాఖ్య – మావాళ్ళు పోటీ చేసేపనయితే మీకు టిక్కెట్లు మిగలవు.

Page 3 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter