సినిమా వార్తలు


ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఎమ్మెస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు సినీ అభిమానులకు ఎమ్మెస్ నారాయణగా సుపరిచితుడైన మైలవరపు సూర్యనారాయణ ఏప్రిల్ 16, 1951లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రులో జన్మించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, కుమారుడు విక్రమ్, కుమార్తె శశికిరణ్ ఉన్నారు.…

Read more...

దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఐ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తొలుత మిశ్రమ రివ్యూలకే పరిమితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గత వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐ మూవీ తమిళనాట కాకుండా బయటకూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ చిత్రం కేరళలో కలెక్షన్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలో ఏ…

Read more...

ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో సికింద్రాబాదు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆదివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ప్రసాద్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఆహుతి చిత్రంలో ఆహుతి ప్రసాద్‌గా ఆయన గుర్తింపు పొందారు. దాదాపు 120 తెలుగు, రెండు తమిళ చిత్రాలలో…

Read more...

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించారు. సోమవారం తెల్లవారు ఝామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో చక్రిని ఆయన కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఐసియు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చిన్నవయస్సులోనే ఆయన సంగీత దర్శకుడిగా ఎన్నో మంచి చిత్రాలు చేశారు. దాదాపు 70సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. సింహా చిత్రానికి గాను ఆయనకు నంది అవార్డు లభించింది.…

Read more...

అక్కినేని కుటుంబానికి నవంబర్ నెల కీలకం కాబోతుంది. నాగార్జున చిన్నకొడుకు అఖిల్ హీరోగా అరంగేట్రం చేయబోయే సినిమాకు నవంబర్ 14న ముహూర్తం పెట్టారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అఖిల్ సినీరంగ ప్రవేశం జరగబోతోంది. ఆ మరుసటి రోజే 15వ తేదీ నాగార్జున సోలో హీరోగా నటించబోతున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమా మొదలు కానుంది. కల్యాణకృష్ణ దీనికి దర్శకుడు.

Read more...

ఈమధ్య హీరోయిన్ అనుష్క పెళ్లి మాట వింటే తెగ మండిపోతోంది. దీనికి కారణం... త్వరలో ఆమె పెళ్లని పుకార్లు రావడమే. దక్షిణాదిలో బాహుబలి, రుద్రమదేవి, లింగా వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అనుష్క చాలా బిజీగా వుంది. అయితే తనకు సంబంధం లేకుండా తన పెళ్లిపై రూమర్స్ రావడంతో తెగ బాధపడిపోతోంది అనుష్క. దీనివల్ల షూటింగ్ పై శ్రద్ధపెట్టలేకపోతున్నానని కూడా అంటోందట. ఏం చేద్దాం పాపం పెళ్లి అనే మాట…

Read more...

ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న జక్కన్న రాజమౌళి ’బాహుబలి’ చిత్రం మరో ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకొంది. బాహుబలి కోసం రామోజీ ఫిలింసిటీ లో 100 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దీనిని నిర్మించారు. ‘బాహుబలి’ సినిమాలో ఈ విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందనీ, దీని బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నామనీ దర్శకుడు రాజమౌళీ ట్విట్టెర్ ద్వారా తెలిపాడు. కెమేరా పొజిషన్…

Read more...


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం కిక్-2. కిక్ సినిమాలో రివతేజతో పాటు సమానంగా కిక్ నిచ్చిన హీరోయిన్ ఇలియానా. ఇప్పుడామె బాలీవుడ్ లో బిజీగా ఉండడంతో ఆ మాత్రం కిక్ ఇచ్చే వాళ్లెవరని వెతుకుతుండగా దర్శకుడికి రకుల్ ప్రీత్ సింగ్ కనిపించిందని టాలీవుడ్లో టాక్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో రకుల్ ఎక్స్ ప్రెషన్స్ ను చూసి దర్శకుడు ఆమెకు ఈ ఛాన్స్ ఇచ్చాడట.

Read more...

బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు బోల్తా కొట్టడంతో జూ.ఎన్టీఆర్ తదుపరి సినిమాల ఎంపికపై చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్లు తెచ్చిన కథలను సమగ్రంగా చదివిన తర్వాత తనకు నచ్చితేనే వారికి కాల్షీట్లు ఇస్తున్నాడట.

Read more...


Page 7 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ముగ్గురు మొనగాళ్లు
  ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
  ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter