కదంబం (37)


పాపపున్నె మెరుగని ఓ చిట్టి చెల్లీకనికరమే లేని ఈ కుళ్లు లోకంలో కన్నీళ్లు పెట్టొద్దే మళ్లీ మళ్లీగొంతు ఎండేట్టు గుక్కెట్టినాఈ రాతి గుండెలు కరగవాయెకుంతికే కూతురైనందుకు కుమిలిపోవద్దే కుళ్లి కుళ్లిఏ మాయకో మానభంగానికోకుచ్చుటోపియైన ఆ తల్లికికూసింత కూడైన నీడైనకరువాయెనేమో ఈ పాడు లోకంలోవివేకం వదిలేసి, సంస్కారం మరచిపోయినఈ కుళ్లిపోయిన సమాజం ఆ తల్లిని కుళ్లబొడిచెనేమోఆ భయానికో, అవమానానికోచెత్తకుప్పనే నీకు పానుపేసెనేమోఆడ బిడ్డలయినందుకు ఆ తల్లికీ, ఈ చిట్టి చెల్లికీ అడుగడుగునాఅవహేళనలూ,…

Read more...

ఎవరి కోసం ఎవరూ ఎదురు చూడొద్దుఏ వంతెన ఎప్పడు కూలుతుందో ఎవరూ చెప్పాద్దు.రాత్రుళ్ళు రమణీయంగా వున్నప్పడుచితిమంటలు రేపొద్దుతొలిపొద్దు కంట్లో వేలుపెట్టొద్దువిరిగిన వాటిని మళ్ళీ అతకించొద్దువిరిగినవే మళ్ళీ మళ్ళీ విరుగుతుంటాయికాల్లో ముల్లు తీసినాముల్లు చివరి అణువు బద్దలవుతుందిస్టెరిలైజ్ చేసే శక్తి నీకులేదుఅన్ని రకాల ఫోబియాల మధ్య యిరుకున్నయింగిత ప్రాణివి -ఫార్ములాలు తెలియనిఒర్ఠి ప్రపంచీకుడవు -తలుపులు తీసి పడుకోవద్దుఆదామును చెడగొట్టిన పామునీలోకి జొరబడొచ్చు అప్పుడప్పుడు నిన్ను నీవు చంపొద్దుమరణించిన తర్వాత మరో ప్రపంచం…

Read more...

అక్కడ నిలబడి వుందో పురాతన వృక్షం దాని పక్కనే, కూలిపోతున్న వేదికలాంటి నీలాలనింగి వాటి కింద వున్నాయి... నిర్జీవ చర్మతో కూడిన ఆ నల్లని జోళ్ళు ఇప్పుడు జీవించిలేని ఆ వ్యక్తి పాదాలచే ఆ జోళ్ళు సాగాయి. ఆ జోళ్ళని నిశ్శబ్దంగా ఎవరు ఆ మూల వదలివెళ్ళారో.. వాళ్ళు మరో పై వేదికపై ఆ సీనమవడానికి ప్రయాణమై వెళ్ళిపోయారు... చెట్లపై గెంతుతున్న రంగురంగుల పిట్టలు ఆ ఉత్తజోళ్ళని పట్టించుకోవడం లేదు.…

Read more...

సి.హెచ్.వి.బృందావనరావు, విజయవాడ, 99633 99189. దుఖమంటే గడ్డకట్టిన చీకటి కన్నీటి ముక్కలై ముళ్ళు ముళ్ళుగా రాలుతున్న ఏడ్పుల కవాతు అడుగున అగ్నికీలలెగసే దబ్బనాల శయ్యమీద తిరుగమోతలౌతున్న పాల వరికంకుల గుండెకోత కత్తి వాదరల జల్లెడలో అనుభవాల్ని జల్లించి నిప్పుకణికల చేటల్లోకి తూర్పారపట్టే రాకాసి సాము గరిడీ నల్మీకి వాల్మీకాల్లోంచి గరళ పూత్కార శోకశ్లోకాలనుమిసే యుద్ధకాండల నిశ్శబ్ద ఝుంఝు దుఖమంటే ఒక పరచుకున్న తిమిర శయ్యా వైశాల్యం. పగలబోతున్న అగ్గికొండ కడుపులో…

Read more...

యుద్ధరచన ఆశారాజు, హైదరాబాద్. 93923 02245. దీపం ఇంకా మాట్లాడుతోంది మొగలిరేకుల గురించి మోదుగపూల గురించి రాత్రిలో విరిసిన తోటలా కాంతి అల్లుకుంటోంది దీపం నెమ్మదిగా పాడుతోంది అడవి వెన్నెల గురించి ఎర్రమల్లెల గురించి వాగు పారుతున్నట్టు వెలుగు పొర్లుతోంది దీపం కూనిరాగాలు తీస్తోంది అప్పుడప్పుడు కిడికీలోంచి దురుసుగా గాలి బెదిరిస్తోంది చిన్న పిల్లల ఏడ్పులా క్యాలెండర్ కొట్టుకుంటోంది రహస్యం చెపుతున్నట్టు నీడ, గోడ మీద వణుకుతోంది చెట్లు నడుస్తున్నట్టు…

Read more...

-       డా. ఎన్.గోపి, హైదరాబాద్, 93910 28496. ఎప్పటి నుంచో ఆ శంఖం అలా ఇసుకలో పడి ఉంది దాని నోటి నిండా గాలి చెవుల్లో కడలి హోరు దూరంగా అలల జ్ఞాపకాలు దొర్లుతూ దొర్లుతూ బీచీలో కొచ్చిపడింది ఇప్పుడది నా టేబుల్ మీద పేపర్ వెయిట్ గా మారింది ఇక నా కవిత్వానికి తొలి శ్రోత అదే.

Read more...

Page 4 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter