జిల్లా వార్తలు


రాష్ట్రంలో ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగడం చూస్తున్నాం. అధికారం లేకుంటే ఆక్సిజన్‌ అందనట్లు బాధపడుతున్న ఓ 8మంది ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకు న్నారు. వైకాపా కంచుకోటల్లాంటి కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి ఎమ్మె ల్యేలు పోయినా నెల్లూరుజిల్లా నుండి ఇంకా పోలేదు. నిన్న మొన్నటివరకు జగన్‌ వెనుక జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు ఏడు మంది గట్టిగానే నిలబడివున్నారు. అయితే ఈమధ్య గూడూరు ఎమ్మెల్యే…

Read more...

2014 ఎన్నికల్లో వైకాపాకు అత్యధిక సీట్లు సాధించింది కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఈ నాలుగు జిల్లాలు కూడా ఆరోజు జగన్‌ వెంట నడిచాయి. అయితే ఈరోజు ఈ నాలుగు జిల్లాలలో మూడు జిల్లాల ఎమ్మెల్యేలు దారి తప్పారు. వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. కర్నూలు జిల్లా నుండి దగ్గర బంధువైన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలు…

Read more...

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకతో జనాన్ని ఊరిస్తోంది. ఫ్రీ ఇసుకే కదా అని ట్రాక్టర్లు తీసుకుని రీచ్‌ల వద్దకు పోతే అక్కడ స్థానిక అధికారపార్టీ నాయకులు అడ్డు కుంటూ ట్రాక్టర్‌కింతని సుంకం కట్టాల్సిం దేనంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా మారింది పరిస్థితి. జిల్లాలో 9రీచ్‌లలో ఇసుకను ఉచి తంగా తీసుకోవచ్చంటూ జిల్లా కలెక్టర్‌ యం.జానకి ప్రకటించారు. కోలగట్ల, పడ మటిపాలెం, అప్పారావుపాలెం, పుచ్చల పల్లి,…

Read more...

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది నెల్లూరుజిల్లానే! ఈ జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. పరిశ్రమల స్థాపనకు ఈ జిల్లా చాలా అనుకూలంగా ఉందని పెట్టుబడుదారులు విశ్వసిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడ్డ కృష్ణపట్నంపోర్టు, శ్రీసిటి, మేనకూరు సెజ్‌లు ఇందుకు ప్రధానకారణం. పారిశ్రామికంగా రాష్ట్రానికే నెల్లూరుజిల్లా ఆయువుపట్టుగా నిలవనుందనేది నగ్నసత్యం. అభివృద్ధి జరుగుతుందని ఆనందించడంతో పాటు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని కూడా గుర్తించాలి. ఎక్కడైతే…

Read more...

నెల్లూరులో నెలరోజులు హడావిడి... ఇసుక టెండర్ల టెన్షన్‌... టెండర్లు వేయడానికి డబ్బులు తేవాలిగా... అప్పుల కోసం పరుగులు.. వడ్డీ వ్యాపారుల వద్ద బేరసారాలు... బ్రతిమ లాడి భంగపడి అప్పులు తెచ్చుకుని టెండర్లు వేశారు. నాయకులతో ఒప్పందాలు... రీచ్‌లు వస్తే స్థానిక నేతలకు వాటాలు... కాంట్రాక్టర్లు పోటీలు పడి ఎక్కువ ధరకు కోట్‌ చేయకుండా సిండికేట్‌లు కట్టడం.. పోటీ నుండి తప్పుకున్న కాంట్రాక్టర్లకు గుడ్‌విల్‌... అయిపోయింది, అంతా అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read more...

జిల్లా పోలీసు శాఖలో ఎస్‌ఐలైనా, కానిస్టేబుళ్లయినా ముందుగా పోస్టింగ్‌ కోరుకునే ప్రాంతం తడ పోలీసుస్టేషన్‌. ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణం వైపున వున్న చివరి పోలీస్‌స్టేషన్‌ ఇది. తమిళనాడుకు సరిహద్దు. ఎవరన్నా నెల్లూరు టౌన్‌లో పోస్టింగ్‌ కోరుకుంటారు. కాని పోలీసుశాఖలో మాత్రం చాలామంది మొదటి ప్రాధాన్యత తడకే! ఇక్కడ పోస్టింగ్‌ కూడా ఊరకే రాదు. మంత్రి నుండి అధికారుల వరకు లక్షలకు లక్షలు లంచాలు ముట్టజెబితేనే ఇక్కడ పోస్టింగ్‌ ఇస్తారు. ఇది అనధికారికంగా…

Read more...

2019 ఎన్నికల నాటికి రాష్ట్ర శాసనసభ స్థానాలు 175 నుండి 225కి పెరుగుతాయని తెలుస్తోంది. ఈమేరకు కేంద్రం నుండి సంకేతాలు రాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నోట సైతం ఆ మాట రావడం విన్నాం. నియోజకవర్గాలు పెరగడం అంటే కొత్త తరం నేతలను ఆహ్వానించడమే. రాష్ట్రంలో 50నియోజకవర్గాలు పెరిగితే నెల్లూరుజిల్లాలోనూ మూడు పెరిగే అవకాశాలు న్నాయి. ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గా లున్నాయి. 2009కి ముందు జిల్లాలో 11 అసెంబ్లీలుండగా ఆ…

Read more...


రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులకు ప్రధాన ఆదాయవనరు ఇసుక. ఇంతకుముందు రాజకీయ నాయకులు దీని జోలికి వచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు ఇసుకలో ఉన్నంత డబ్బు మరిదేంట్లోనూ ఉండడం లేదు. అందుకే అందరి కళ్ళు ఇసుక మీదే పడ్డాయి. జిల్లాలో ఇసుకరీచ్‌ల టెండర్ల వ్యవహారం అయోమయంలో పడింది. ఇసుక ద్వారా ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటే, కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఇంకోటి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక ఎత్తు వేస్తే, కాంట్రాక్టర్లు ఇంకో ఎత్తు వేసి…

Read more...

చంద్రబాబుకు ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో తెలుసు. కాబట్టే అన్ని పార్టీల నుండి నాయకులను తన పార్టీలోకి లాగేసుకుంటున్నాడు. ఆనం సోదరులను కూడా ఆయన ఆ ఆలోచనతోనే పార్టీలోకి తీసుకున్నాడు. ఆనం సోదరులను తెలుగు దేశంలోకి తీసుకోవడంలో మంత్రి నారాయణ ప్రోద్బలం కూడా ఉందన్నది వాస్తవం. అయితే కేవలం నెల్లూరుజిల్లా రాజకీయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆనం బ్రదర్స్‌ను తెలుగుదేశంలోకి తీసుకోలేదు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి సీనియార్టీని రాష్ట్ర…

Read more...


Page 9 of 28

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • 'పీకే'దేమీ లేదు
  జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…
 • కాలం కరిగిపోతుంది... ఆశ ఆవిరవుతోంది!
  నిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ…

Newsletter