జిల్లా వార్తలు


నెల్లూరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఎన్నో దశాబ్దాల కల. నెల్లూరీయుడైన స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా నెల్లూరుకు వైద్యకళాశాలను తీసుకు రాలేకపోయాడు. అలాంటిది గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు వైద్యకళాశాలను మంజూరు చేయించారు. నిధులు విడుదల చేసి కాలేజీని పూర్తి చేయించి, ఆ కాలేజీకి తమ పెదనాన్న స్వర్గీయ ఏ.సి.సుబ్బారెడ్డి పేరు కూడా పెట్టుకోవడం జరిగిపోయింది. కాలేజీ పూర్తి చేసింది ఒకరైతే దానిని…

Read more...

జిల్లాలో తెలుగుదేశం తరపున ఒక్కరు తప్ప అన్నీ కొత్త ముఖాలేనా? 2019 అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వుంది. ప్రభుత్వ పాజిటివ్‌ ఓటుతో అభ్యర్థులను గెలిపించుకోవడం కష్టం. అదీగాక పెద్దనోట్ల రద్దు ప్రభావం కూడా వచ్చే ఎన్నికల మీద ఉండబోతోంది. ధనం వున్న అభ్యర్థులనే కాకుండా గుణగణాలున్న అభ్యర్థులను వెదకాలి. ఈ కోణంలో చూస్తే సిటింగ్‌లకు చాలావరకు కటింగేనని…

Read more...

చంద్రబాబు మంత్రివర్గంలోకి నారాయణను తీసుకున్నప్పుడే అర్ధమైపోయింది... మున్ముందు ఆయన నిర్ణయాలు ఎంత నికృష్టంగా ఉండబోతున్నాయో... ఆయన మంత్రిగా తీసుకున్న నారాయణ నిర్ణయాలు ఇంకెంత ముదనష్టంగా ఉండబోతున్నా యన్న విషయం. మంత్రి పదవికి నారాయణ అనర్హుడు. ప్రజల కష్టనష్టాలు తెలియని మనిషి మంత్రిగా వుంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో గత రెండున్నరేళ్ల నుండి చూస్తున్నాం. ఇప్పుడు మరో అసంబద్ధ నిర్ణయం తీసుకుని మన మంత్రిగారు తన విధానాన్ని చాటుకున్నారు. శాసనమండలి…

Read more...

కాకాణి గోవర్ధన్‌రెడ్డి... జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌గా ఐదేళ్ల పదవీ కాలంలో రాజకీయాలకతీతంగా అందరి మన్ననలు పొందిన నాయకుడు. జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌గా జిల్లాలో ఒక కొత్త ట్రెండ్‌ సృష్టించాడు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి స్ఫూర్తివంతంగా నిలిచాడు. తన పనితీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకున్నాడు. 2014 ఎన్నికలప్పటికి ఇతను జిల్లాలో ఏ అసెంబ్లీ నుండి పోటీ చేసినా గెలుస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. జడ్పీ ఛైర్మెన్‌గా ప్రశంసలు తప్ప విమర్శలు ఎదుర్కోని…

Read more...

ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా అవసరమైతే తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలకు పోతామన్న వైకాపా అధ్యక్షుడు వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాట మిగతా ఎంపీల సంగతేమోగాని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి మాత్రం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నట్లే వుంది. ఎక్కడ రాజీనామాలు చేయమంటాడోనని ఈయన అదురుకుంటున్నాడు. ఐదేళ్లకోసారి ఎన్నికల్లో నిలబడాలంటేనే అభ్యర్థులకు తడిసి మోపెడవుతుంది. అలాంటిది ఐదేళ్లలో రెండు ఎలక్షన్‌లు చేయాలంటే మాటలా? అదీగాక నెల్లూరు ఎంపీ…

Read more...

తెలుగుదేశం నాయకులు, వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ దీపావళి పండుగ పోగానే ఉండబోతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి స్పష్టమైన సంకేతాలు అందినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ కోసమే ఇటీవల చంద్రబాబు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైనట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ జరిగితే పాత కేసులు ముగ్గురు నుండి నలుగురు దాకా ఔట్‌ కావచ్చు. వైకాపా నుండి చేరిన ఎమ్మెల్యేలలో ఓ నలుగురికి…

Read more...

నెల్లూరుజిల్లా ప్రజలకు షాక్‌లాంటి వార్త ఇది. ఎప్పుడు చూసినా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ రాహుల్‌గాంధీతో, మధ్యాహ్నం లంచ్‌ సోనియా గాంధీతో, సాయంత్రం డిన్నర్‌ అహ్మద్‌పటేల్‌తో చేసానని చెప్పుకునే శాసనమండలి సభ్యులు, పారిశ్రామికవేత్త కూడా అయిన వాకాటి నారాయణరెడ్డి కూడా వివిధ బ్యాంకుల్లో 1098కోట్లు బకాయిలు కట్టాలి. మొత్తం బ్యాంకుల నుండి ఆయన 1538కోట్లు ఋణంగా తీసుకోగా 400 కోట్ల పైనే చెల్లించారు. మిగిలిన బకాయిలు కట్టాలి. గత కొన్నేళ్లుగా బకాయిలు కట్టక…

Read more...


నెల్లూరుజిల్లాలో డెంగీ పంజా విసిరింది. దీంతో డెంగీ వ్యాధిగ్రస్తులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22మందికి డెంగీ ఉన్నట్లు పరీక్షల ద్వారా తేలింది. అందులో 8కేసులు నెల్లూరు నగర పరిధిలో ఉన్నాయి. గత ఏడాది వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 22 కేసులు నమోదు కావడం అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నెల్లూరులోని మన్సూర్‌ నగర్‌, వెంగళరావునగర్‌, వెంకటేశ్వరపురం, భక్తవత్సలనగర్‌ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు…

Read more...

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలం నుండి కూడా పత్రికలలో, ప్రచారంలో విస్తృతంగా కనిపించి, వినిపించిన నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) కల ఎట్టకేలకు నెరవేరింది. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 18వ తేదీన ఆమోదముద్ర వేసింది. 'నుడా'కు తుది రూపం కూడా వచ్చేసింది. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీలు, కావలి, బోగోలు, అల్లూరు, కొడవలూరు, విడవలూరు, కోవూరు,…

Read more...


Page 3 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter