జిల్లా వార్తలు


ఇక్కడ డబ్బుకు విలువ లేదు. స్తోమతకు స్థానం లేదు. కేవలం పేదోడే ఇక్కడ రారాజు. అన్ని లక్షలు పెట్టాం, అంతపెద్ద బడిలో మా పిల్లల్ని చేర్పించాం అని బీరాలు పలికే వారికి ఇక్కడ ప్రవేశం లేదు. ఇది కేవలం పేదోళ్ళ బడి, బడుగుల గుడి, చదువుల వొడి అదే వి.పి.ఆర్‌. విద్య. బహుశా భారతదేశంలోనే ఇదే తొలి బడి కావచ్చు. కేవలం పేదరికమే అర్హతగా, మంచి మేధస్సే పెట్టుబడిగా క్రమశిక్షణ,…

Read more...

'ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి' అన్న సామెత ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు కరెక్ట్‌గా సరి పోతుంది. తెలుగుదేశంలో కాంగ్రెస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ల నుండి వచ్చిన నాయకులకు ఇస్తున్న గౌరవమర్యాదలు, బాధ్యతలు, పార్టీని ఎప్పట్నుండో కనిపెట్టుకుని వున్న వారికి దక్కడం లేదు. దీంతో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం తెలుగు దేశం నిఖార్సు నాయకులలో కరువైంది. కొత్త వాళ్లొచ్చి తమ మీద పెత్తనం చేస్తున్నరన్న బాధ వారిలో…

Read more...

అరకు పట్టకుండానే, దుక్కి దున్నకుండానే, విత్తు నాటకుండానే, నీళ్లు పెట్టకుండానే, కలుపు తీయకుండానే, ఎరువు చల్లకుండానే... పండిన పంటను హ్యాపీగా ఇంటికెత్తుకుపోయినట్లుగా... రాజకీయాలలో అసెంబ్లీకి కాదు కదా కనీసం పంచాయితీవార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయని పి.నారాయణ ఏకంగా మంత్రి కావడం చూసాం. ఐదంతస్థుల మేడపైకి పోవాలంటే మెట్లు ఎక్కాలి. కాని నారాయణ మాత్రం నేరుగా ప్యారాచూట్‌ వేసుకుని దిగేస్తాడు. మొన్న చాలాసులువైన మార్గంలో మంత్రి పదవిని దక్కించుకున్న నారాయణకు…

Read more...

మన విద్యావ్యవస్థ నానాటికీ భ్రష్టు పట్టిపోతోంది. చదువుకునే బదులు చదువును కొనాల్సిన పరిస్థితులొచ్చాయి. మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసర వస్తు వుల ధరల కంటే ఏ ఏడాది కా ఏడాది చదువుల ధరలు పెరుగు తున్నాయి. ప్రభుత్వాలు సైతం ప్రభుత్వ విద్యను నీరు గారుస్తూ కార్పొరేట్‌ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్నాయి. ఇప్పుడు కనీసం పదో తరగతి వరకన్నా నూటికి 30మంది సర్కార్‌ బళ్లలో చదువుతున్నారు. టెన్త్‌ తర్వాత ఇంటర్‌లో చేరడం…

Read more...

నవ్యాంధ్రలో జరుగుతున్న భారీ విద్యా దోపిడీపై నినదిస్తూ ప్రారంభించబడిన ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి''పై జిల్లాలోని ఓ పాత వారపత్రిక రోత రాతలు రాసి ఉద్యమాన్ని విమర్శించే ప్రయత్నం చేసింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ అవాకులూ చవాకులూ పేలింది. ఒక సత్సంకల్పంతో ప్రారంభించబడిన ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి'పై బురద చల్లడానికి విశ్వప్రయత్నం చేసింది. ఆ పాతపేపరుపై ''నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి'' చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.…

Read more...

నెల్లూరుజిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అర్థరాత్రి దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తప్పుడు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు చాలావరకు రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి వస్తున్నాయి. రాత్రయినా దస్తావేజులు వస్తూ ఉండటంపై సబ్‌రిజిస్ట్రార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత సెంట్రల్‌ సర్వర్‌ను నిలిపి వేయడం ద్వారా వాటిని కట్టడి చేయాలని కోరుతూ గతంలో సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజికి మొరపెట్టు కున్నారు. ఈ…

Read more...

దాహం వేసినప్పుడు బావి తవ్వు కోవడం ప్రభుత్వాలకు అలవాటై పోతుంది. అయితే ఆ విధంగా తవ్వినా ఫర్వాలేదు. కాని తవ్వుతున్నట్లు నటిస్తుం డడంతోనే వచ్చిన ఇబ్బందంతా! గత యేడాది నవంబర్‌లో వచ్చిన వర్షాలు, వరదలకు నెల్లూరు లోని పలు ప్రాంతాలు మునిగిపోవడం చూసాము. కొన్ని కాలనీలలో అయితే నాలుగురోజుల దాకా తెప్పల్లో వెళ్లి బాధితులకు ఆహారపొట్లాలు, మంచినీళ్లు అందించాల్సి వచ్చింది. ఇంత తీవ్ర పరిస్థితులు తలెత్తడానికి కారణం నగరంలో పంట…

Read more...


తలా తోక లేకుండా చేసే పనులకు ఎంత ప్రజాధనం దుర్వినియోగమవు తుందన్నదానికి నెల్లూరులోని విగ్రహాల ఐలాండ్‌లే ఒక ఉదాహరణ. నగరాన్ని అందంగా కనిపించేలా చేయడానికి వివిధ ఆకృతులతో ఐలాండ్‌లు నిర్మించడం వరకు ఓకే! అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించని రీతిలో ఐలాండ్‌లు ఉండాలి. రోడ్లు వెడల్పుగా వుండి, ట్రాఫిక్‌ సాఫీగా పోతుంటే ఐల్యాండ్‌ ఎంత పెద్దదున్నా ఇబ్బంది లేదు. కాని నెల్లూరులో రోడ్లు ఉండేదే అంతంత మాత్రం. ఆక్రమణలతో రోడ్లు…

Read more...

రాజ్యసభ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఆశావహుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఉండేది నాలుగు సీట్లు. ఇప్పటి లెక్క ప్రకారం తెలుగుదేశంకు దక్కేది మూడు సీట్లు. రాష్ట్రంలోని 13జిల్లాల నుండి కూడా దాదాపు రెండు డజన్ల మంది నాయకులు రాజ్య సభను ఆశిస్తున్నారు. ఈ మూడు సీట్లకు ఏర్పడ్డ పోటీలో నెల్లూరుజిల్లా నుండి బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌ రెడ్డిల పేర్లు వినిపించాయి. తాజా సమాచారాన్ని విశ్లేషిస్తే మూడు రాజ్యసభ స్థానాల…

Read more...


Page 6 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter