రాష్ట్రీయ వార్తలు


అధికారుల పనితీరు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్రమాలకు సహకరించేదీ వీళ్ళే... అక్రమాలను సహించేది లేదంటూ కన్నెర్రజేసేదీ వాళ్ళే! అక్రమాలను ఆదిలోనే అరికడితే వాటి వల్ల ఎవరికీ పెద్ద నష్టం ఉండదు కదా! నెల్లూరు నగరంలో అక్రమ కట్టడా లను పరిశీలించి, అనుమతి లేకుండా కట్టిన భవనాలను గుర్తించి, వాటిని కూల్చేం దుకంటూ రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు ఆధ్వర్యంలో పెద్ద బృందమే నెల్లూరొచ్చి హడావిడి చేయడం జరిగింది. సోమ, మంగళవారాలలో…

Read more...

కంచె చేను మేస్తే... న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తులే అన్యాయానికి దిగితే... సామాన్యులను రక్షించేదెవరు? న్యాయాన్ని కాపాడేదెవరు? అన్యాయాన్ని ప్రశ్నించేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఆస్థులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రకు మిగిలాయి. ఉమ్మడి ఆస్తులను 58-42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం కోర్టు సూచించినా, ఆ విధంగా పంపకాలు జరిగిన దాఖలాలు లేవు. ఆస్తుల పరంగా ఏపి ఎంతో నష్టపోయింది. గత యూపిఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు సోనియాగాంధీ చేసిందే అన్యాయమనుకుంటే ఇప్పుడు కేసీఆర్‌…

Read more...

ఆరు దశాబ్దాలుగా హైదరాబాదుతో వున్న బంధాన్ని, సహఉద్యోగులతో ఉన్న అనుబంధాన్ని తెంపుకుని, కొన్నేళ్లుగా జరిగిన అవమానాలను గుండెల్లో దాచుకుని, మూటాముల్లె సర్దుకుని ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌, ఇతర శాఖల ఉద్యోగులంతా అమరావతికి వచ్చి కొలువుదీరారు. దీంతో అమరావతి రాజధాని ప్రక్రియలో తొలి అడుగు పడినట్లయ్యింది. ఇష్టంగా కొందరు, అయిష్టంగా మరికొందరు... ఉద్యోగులు అమరావతి బాట పట్టక తప్పలేదు. జూలై నెలకల్లా అమరావతి రాజధాని నుండే ఏపి పరిపాలనా వ్యవహారాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి…

Read more...

లేని ఆశలు కల్పించారు. రేకెత్తించిన ఆశలను నీరు గార్చారు. కేవలం నాయకుల వాగ్దానాలకు, పత్రికలలో వూహాగానాలకు, రియల్టర్ల భూముల కొనుగోలుకు మాత్రమే దుగరాజపట్నం పోర్టు అన్న ఓ ఫోబియాను పరిమితం చేశారు. వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద పోర్టు రానూ వచ్చింది, పోనూ పోయింది. అయితే ఇదంతా కాగితాల మీదే జరిగిపోయింది. దుగరాజపట్నం వద్ద పోర్టు సబ్జెక్ట్‌ ముగిసి పోయిన కథలాగే కనిపిస్తోంది. ఇక్కడ పోర్టు నిర్మాణం వల్ల పెద్దగా…

Read more...

అవసరమున్న పని చేస్తే విజ్ఞత అవుతుంది. అనవసరమైన పనిచేస్తే అజ్ఞానమవుతుంది. ఒక్కోసారి మేధావులు కూడా అజ్ఞానాంధకారంలో పడి, తాము జ్ఞానసాగరంలో పయనిస్తున్నామన్న భ్రమలో ఉంటారు. రాష్ట్ర రాజకీయాలలో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ మేధావి చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి భ్రమల్లోనే ఉన్నాడా... అనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ప్రజలు పట్టించుకోకుంటే ప్రభుత్వం బలపడుతుంది. అధికారంలో వున్న పార్టీయే మళ్ళీ మళ్ళీ అధికా రంలోకి వస్తుంది. కాని ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలనే అధికార పార్టీ ప్రయత్నం…

Read more...

ఆచరణ సాధ్యం కాని హామీలు ఒక్కోసారి మెడకు బలంగానే చుట్టుకుంటుంటాయి. ఒక్కోసారి వంద అనకొండల నుండి బయటపడినా ఒక్క మట్టిపాము కరిచి చచ్చిపోతుంటారు. ఒక వాగ్ధానం చేస్తే అది అమలు చేసేదిలా ఉండాలేగాని, గాలికొదిలేసేదిలా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అమాయ కులు, నిస్సహాయులు. తమలో అసంతృప్తి, కోపం వున్నా వాటిని ప్రభుత్వంపై ఏ రూపంలోనూ చూపలేరు. తమ కోపాన్ని చల్లార్చు కునే అవకాశం మళ్ళీ ఎన్నికల దాకా ఒక వాగ్ధానం…

Read more...


రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికార జులుం చూపిస్తోంది. ధనం, అధికార బలంతో రాష్ట్రంలో ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని చూస్తోంది. కోట్లాది రూపాయలు ఆశపెట్టి వైకాపా ఎమ్మెల్యేలను కొంటోంది. ఇప్పటికే వైసిపి నుండి 19మంది దాకా ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. పార్టీని నిలబెట్టుకోవడం కష్టమేమో... అన్నంత పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలాంటి కష్టమే ఇంకో నాయకుడికి వచ్చివుంటే ఇదివరకే జెండా దించేసి, షట్టర్‌ మూసేసి పార్టీ కార్యాలయానికి తాళం వేసుండేవాడు. కాని అక్కడున్నది వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. దివంగత…

Read more...


కొందరి దగ్గర పని ఉంటుంది. మాటలుండవు. పి.వి.నరసింహారావు లాంటి నాయకుడన్న మాట! ఇంకొందరి వద్ద మాటలతో పాటూ పనులు కూడా ఉంటాయి. వాజ్‌పేయి, నరేంద్ర మోడీల మాదిరిగా! మరికొందరి వద్ద మాటలే వుంటాయి. పని ఉండదు. మన చంద్రబాబునాయుడులాగా! రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనకు ఈ నెల 8తో రెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో మనం అభివృద్ధిని చూల్లేదు. కాకపోతే అభివృద్ధి గురించి గ్యాప్‌…

Read more...


ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల యాజమాన్యం కోటా సీట్లు, ప్రభుత్వ కోటా సీట్లు అని చూస్తుంటాం. మేనేజ్‌మెంట్‌ కోటాలో వుండేవి పేమెంట్‌ సీట్లు. వాటిని పెద్దమొత్తాలకు అమ్ముకుంటుంటారు. ఇప్పుడు రాజకీయాల లోనూ అలాంటి పేమెంట్‌ సీట్లుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే! అన్ని పార్టీలకు కూడా ఆదాయ వనరులా మారిన ఆ పేమెంట్‌ సీట్ల పేరే రాజ్యసభ సీట్లు. రాజ్యసభ అంటే భారత రాజ్యాంగ వ్యవస్థలో పెద్దల సభ. ప్రజల చేత ప్రత్యక్షంగా…

Read more...


Page 9 of 45

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter