రాష్ట్రీయ వార్తలు


నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గంలో బలమైన నాయకుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ను వీడి ఏ పార్టీలో చేరనున్నాడన్నది ప్రశ్నార్థ కంగా మారింది. ఈయన కాంగ్రెస్‌ను వీడడం అయితే ఖాయమైంది. ఆయ నను చేర్చుకోవడానికి అటు వైయస్సార్‌ కాంగ్రెస్‌తో పాటు ఇటు తెలుగుదేశం కూడా సిద్ధంగా వుంది. ఇరుపార్టీలు కూడా సీటు విషయంలో హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికలలో కందుకూరులో…

Read more...

చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరిస్తాడని, అందులో తమకు చోటుంటుందని చాలామంది నాయకులు ఆశపడుతున్నారు. బాబు నోట విస్తరణ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు 'ఆ ఒక్కటి అడక్కు' అన్న టైపులో వ్యవహరిస్తూ మిగతావన్నీ మాట్లాడుతున్నాడు. ఈసారి విస్తరణ అంటూ జరిగితే రెడ్లకు పెద్దపీట వేస్తారని, కనీసం ఇద్దరు లేదా ముగ్గురు రెడ్లను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ కోవలో చూస్తే వైసిపి నుండి వలస వచ్చిన…

Read more...

పుష్కరాలంటే ఇవి కదా... పుష్కరాలను చేయాల్సింది ఇలా కదా... పుష్కరాలను చేయాలంటే చంద్రబాబుకు క్రిందే... ఇక ఏ రాష్ట్రంలో పుష్కరాలు, కుంభమేళాలు జరిగినా ఆ ఈవెంట్‌లను చంద్రబాబుకు అప్పగిస్తే చాలు... నభూతో నభవిష్యత్‌ అన్నట్లు నిర్వహించేస్తాడు... కాకపోతే చిన్న ఇబ్బంది ఒక్కటే! సాంప్రదాయ బద్ధంగా ఎవరి పద్ధతుల్లో వాళ్లు పుష్కరాలు చేసుకుంటే వంద కోట్లు ఖర్చయితే, అదే పుష్కరాలను చంద్రబాబు చేస్తే 2వేల కోట్లవుతున్నాయి. ఖరీదైన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అన్నమాట.…

Read more...

పరిపాలకుడి విధానాలు ప్రజల్లో ఆశలు రేకెత్తించాలి. భవిష్యత్‌పై భరోసా కల్పించాలి. భద్రతపై నమ్మకమివ్వాలి. ఏపి ప్రజలకు ఆ విధమైన భద్రత కల్పించడంలో, భవిష్యత్‌ పై భరోసానివ్వడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో వున్నోళ్లకు, పార్టీలో ముఖ్యస్థానాల్లో వున్నవారికి తప్పితే, సామాన్య ప్రజానీకానికి తమ పురోభివృద్ధిపై ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్ధికంగా నష్టపోయింది. హైదరాబాద్‌ రూపంలో విలువైన ఆస్తులను వదులుకున్నాం. విభజన…

Read more...

అన్నీ అనుకూలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కార్ల పరిశ్రమ నెల్లూరుజిల్లాలో ఏర్పా టయ్యే అవకాశముంది. దక్షిణకొరియాకు చెందిన అంతర్జాతీయ కార్ల కంపెనీ హ్యూండాయ్‌కి అనుబంధ సంస్థ అయిన 'కియా మోటార్స్‌' మన దేశంలో తమ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమైంది. ఇందుకు ఆంధ్రా, తమిళ నాడులను ఆ కంపెనీ పరిశీలిస్తోంది. 3400 కోట్ల పెట్టుబడితో 500ఎకరాల స్థలంలో ఈ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమవుతున్నారు.…

Read more...

ప్రజా జీవితంలో ఉండే నాయకులకు కులంతో, మతంతో సంబంధం లేదు. ఏ కులమైనా అతనిదే! ఏ మతమైనా అతని సమ్మతమే! ప్రతిఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తూ, ఆచరిస్తూ ముందుకు సాగేవారే ప్రజాజీవితంలో ముందడుగు వేయగలరు. ఈ దేశంలో కాశ్మీర్‌, పాతబస్తీ వంటి చోట్ల తప్పితే ఒక మతం వాళ్లు మాత్రమే ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు. అన్ని మతాలను, అన్ని కులాలను ఆదరిం చాల్సిందే! ఒక నాయకుడి మీద…

Read more...


నెంబర్‌ 1... ఏ రంగంలో ఉన్నవారైనా కోరుకునే స్థానం. పారిశ్రామిక రంగంలో నెంబర్‌ వన్‌ కావాలని, సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కావాలని, ఐసిసి క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌.1 స్థానాన్ని చేజిక్కించుకోవాలని... ఇలా ఏ రంగంలో వున్నవారు ఆ రంగంలో నెంబర్‌.1 స్థానాన్ని కోరుకుంటుంటారు. అలాంటి నెం.1 స్థానమే మన నెల్లూరుజిల్లాకు చెందిన మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణకు దక్కింది. అయితే ఈ నెంబర్‌ వన్‌ ర్యాంకు మంత్రిగా…

Read more...


పుష్కరాలు... తరతరాలుగా వస్తున్న సంప్రదాయ సంబరాలు. ప్రకృతిని పూజించే హైందవ సంస్కృతి ప్రతీకలు. భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూనో, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులో కనిపెట్టినవి కావు. మన ఋషులు, ఆథ్యాత్మిక వేత్తలు, పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన సంప్రదాయ వేడుకలు. మరిప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న హడావిడి చూస్తుంటే పుష్కరాలను కూడా ఆయనే కనిపెట్టాడేమోననిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు…

Read more...


నెల్లూరుజిల్లా రైల్వే ప్రయాణీ కులు హింసపురి ఎక్స్‌ప్రెస్‌ అని పిలుచుకునే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ టైం మారింది. ఇంతకుముందు ఇది గూడూరులో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి, నెల్లూరులో 10.40కు కదిలేది. సికింద్రాబాద్‌కు ఉదయం 8.35 గంటలకు కరెక్ట్‌గా వెళితే చేరేది. కాని అమావాస్యకు, పౌర్ణమికి తప్పితే ఇదెప్పుడూ టైంకు పోయేది కాదు. గంటా రెండు గంటలు ఆలస్యమయ్యేది. హైదరాబాద్‌లో పొద్దున్నే పనులు మీద పోయే వాళ్లకు ఇదే మాత్రం సౌకర్యంగా…

Read more...


Page 10 of 47

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter