జాతీయ వార్తలు
ఆయన అత్యంత నిజాయితీపరుడు. ముక్కుసూటి మనస్తత్వం ఆయనది. బెదిరింపులకు జడిసే మనిషి కాదు. అక్రమార్కులకు ఆయనంటే టెర్రర్. వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించే యువ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు డి.కె.రవి. కర్నాటకలో వాణిజ్యపన్నుల శాఖలో అదనపు కమి,నర్ గా పనిచేస్తున్న నిజాయితీకి మారుపేరైన అధికారి ఆయన. అలాంటి అధికారి మృతి చెందారన్న సమాచారాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కర్నాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమాచారం పెద్ద కలకలమే సృష్టించింది. ఆయన…
బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ పది నిమిషాల పాటు నిలిచిపోయింది. సమయానికి ఆలయ ద్వారాలు తెరుచుకోకపోవడంతో స్వామి వారికి సుప్రభాత సేవ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా ఉదయం 2:45 గంటలకు ఆలయ ముఖద్వారాన్ని తెరుస్తారు. ఆ తరువాత 3 గంటలకు శ్రీవారి సుప్రభాత సేవకు గాను ఆలయంలోని బంగారువాకిలి తలుపులు తెరుస్తారు. అయితే ఈ ఉదయం బంగారు వాకిలి తాళం తెరిచేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ తాళాలు ఎంతకీ తెరుచుకోలేదు.…
తొమ్మిది నెలల క్రితం భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఓ ఛాయ్ వాలా చరిత్ర సృష్టించాడు. అంతా తానే అయ్యి నిర్వహించిన ఆ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీని సాధించిన నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించాడు. ఓ ఛాయ్ వాలాగా ఆరోజు మోడీ ఆ ఘనత సాధిస్తే, ఆ మోడీ ఇమేజ్ ను అడ్డుకుని, దేశ వ్యాప్తంగా వీస్తున్న అతని పెను గాలికి ఎదురొడ్డి నిలిచిన ఓ మధ్యతరగతి సామాన్యుడిగా…
ఢిల్లీ సిఎం బరిలో నిలిచిన కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారు. టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969.. ఇవి రెండూ ఆమె పేరు మీదే జారీ అయినవే.. ఎన్నికల కమిషన్(ఈసీ) రికార్డుల ప్రకారం ఉదయ్‌పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఆమెకు రెండు ఓటరు కార్డులు(టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969) ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఎలా జారీ అయ్యాయో తేల్చేందుకు విచారణ చేపట్టినట్లు ఈసీ తెలిపింది. ఢిల్లీ ఎన్నికలల్లో పోటీ చేస్తున్న ఆమె…
రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. కాసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య…
మోడీకుర్తా ఫైజామా చాలా బాగున్నాయి. నాకు ధరించాలని ఉంది.’ ఇలా వ్యాఖ్యనించింది ఎవరో తెలుసా...! ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా దేశానికి అధ్యక్షుడు. ఆయనే బరాక్ఒబామా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆదివారం రాత్రి హాజరైన ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. హుషారుగా మాట్లాడుతూ గడిపారు. మీ ఆతిథ్యాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని అన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.ఒకప్పుడు చాయ్ అమ్ముకొనే వ్యక్తి తనయుడు…
యుపిఏ హయాంలో సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపుకుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సిబిఐ విచారించినట్టు తెలుస్తోంది. హిండాల్కోకు గనుల కేటాయింపువిషయం వివాదాస్పదంగా మారండంతో అప్పట్లో బొగ్గుగనుల మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను సిబిఐ విచారించవచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే మన్మోహన్‌ను విచారించిన విషయాన్ని అటు ఆయనగాని ఇటు సిబిఐగాని ధ్రువీకరించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం కొందరు సిబిఐ అధికారులు రెండు రోజుల క్రితం ఆయన ఇంటికెళ్లి విచారణ…
మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌కు భారీగా కలిసి రానుంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది లోగా 1400 రిటైల్ అవుట్లెట్లను తెరువడానికి ప్రణాళికలు వేసుకుందని తెలుస్తోంది. 2006లో పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఈ రంగంలో ప్రభుత్వ అజామాయిషి ఉండటంతో వెనక్కు తగ్గింది.. 2014 అక్టోబర్ 18న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో…
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావటంతో త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఓంఎసీ కేసులో 2011 సెప్టెంబర్ 4న జనార్దన్ రెడ్డిని సీబీఐ…