నెల్లూరులో నేడు (117)

Tuesday, 24 December 2013 12:21

ప్రెస్ స్టిక్కర్లు

Written by

జిల్లాలోని అక్రిడేట్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వడానికి జిల్లా ఎస్పీ పి.వి.యస్.రామకృష్ణ నిర్ణయించారు. జిల్లాలో చాలామంది ప్రెస్, పోలీస్ స్టిక్కర్లను అంటించుకుని వాహనాలు నడుపుతున్నారు. అయితే వీరిలో ఒరిజనల్ ప్రెస్, పోలీసు వాళ్లకంటే డూప్లికేట్స్ ఎక్కువ. జర్నలిస్టుల బంధువులు, స్నేహితులు కూడా తమ వాహనాలకు ప్రెస్ అని వ్రాసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి నకిలీ ప్రెస్ వాళ్లు పోలీస్ శాఖకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని అరికట్టేందుకే అక్రిడిటేషన్ లిస్టు ప్రకారం జర్నలిస్టులకు ప్రెస్ స్టిక్కర్లు అందజేస్తారు. విలేకరులు తమ అక్రిడేషన్ నెంబర్, వాహనం ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్ల జరాక్స్లను అందజేసి పోలీసుశాఖ నుండి ఈ స్టిక్కర్ ను పొందవచ్చు. జనవరి 1వ తేదీ నుండి విలేకరులకు ఈ స్టిక్కర్లు అందజేయనున్నట్లు తెలుస్తుంది.

రాష్ర్ట ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నానని నెల్లూరుజిల్లా గూడూరు నుండి రాపూరు మీదుగా రాజంపేట వరకు రోడ్డు పనులు ప్రారంభమవుతాయని రాష్ర్ట ఆర్థికశాఖామంత్రి ఆనఁ రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం సంక్రాంతిపల్లి గ్రామపంచాయతి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా సౌకర్యార్థం గూడూరు నుండి రాజంపేట రోడ్డు రెండు లైన్లు విస్తీర్ణం పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయిందని తొలివిడతగా 17కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, తహశీల్దార్ బషీర్ అహ్మద్, కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, పెంచలకోన ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి, ఏసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు నగరం విఆర్ కళాశాల మైదానంలో శుక్రవారం రాత్రి ప్రప్రథమంగా నిర్వహించిన సింహపురి ప్రీ క్రిస్మస్ మహోత్సవాలు అందరి శ్రమ, సహకారంతో విజయవంతం అయ్యిందని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు విఆర్ కళాశాలలో విలేకర్లతో మాట్లాడారు. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే అందరి సహకారం అవసరమన్నారు. వేలాదిగా ప్రజలు విచ్చేసి ఏసుక్రీస్తుపై విశ్వాసం ఉంచారన్నారు. ముఖ్య ప్రసంగీకులు స్టీఫెన్ పాల్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందన్నారు. అంతర్జాతీయ సింగర్ నోయల్ ఆలపించిన గీతాలు ప్రార్థనలు అలరించాయన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ నగర కమీషనర్ డి.జాన్ శ్యాంసన్, ఎంఇలు టి.సంపత్ కుమార్, శ్రీనివాసరావు, వెంకట్రావు, డిఇలు పివి అనిల్ కుమార్, డి.సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతాపార్టీని నరేంద్ర మోడీ తన ప్రచారంతో విజయపథాన నడిపి మూడు రాష్ర్టాల్లో విజయకేతనం ఎగురవేసారని, నరేంద్రమోడీని దేశ ప్రధాని కావాలని యువత కోరుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మినీబైపాస్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చ నగర పతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర యువమోరాచ అధ్యక్షులు మధుసూదనరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సురేంద్రరెడ్డి మాట్లాడుతూ యువమోర్చ యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టి వారికి బీజేపీ పట్ల అవగాహన కల్పించి ఓటు ఆవశ్యకతను తెలియజేసి యువతను ఓటర్లుగా నమోదు చేయిఁచాలన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చ అధ్యక్షుడు మన్నెం మధుసూదనరావు, నగర ఉపాధ్యక్షులుగా గొల్లప్రోలు సుబ్బారావును నూతనంగా ప్రకటించారు. గుర్రం ప్రసాద్, జనార్ధన్, అన్నాబత్తిన శాంతమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.

Monday, 23 December 2013 14:48

దిష్టిబొమ్మ దగ్ధం

Written by

భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడేను అవమానించడాన్ని నిరసిస్తూ కులవివక్ష వ్యతిరేకపోరాట సమితి, ఐద్వా, ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ ఐ, పిఎన్ ఎం తదితర ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం నెల్లూరు బాలాజీనగర్ సెంటర్ మినీబైపాస్ రోడ్డు వద్ద అమెరికా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సఁఘ జిల్లా కార్యదర్శులు మాట్లాడారు. అమెరికా తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ, తిరుపాలు, మాలకొండయ్య, కృష్ణయ్య, రమమ్మ, షాహినాబేగం తదితరులు పాల్గొన్నారు.

Page 9 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter