నెల్లూరులో నేడు (153)

Friday, 20 June 2014 15:40

శిక్షణకు కలెక్టర్

Written by

collecజిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఈ నెల 23 నుండి శిక్షణకు గాను ముస్సోరి వెళ్లనున్నారు. 8వారాల పాటూ ఇక్కడే శిక్షణలో ఉంటారు. కలెక్టర్ లకు, ఐఏఎస్ అధికారులకు ప్రతి ఏడేళ్లకోసారి ఈ విధమైన శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగానే ఆయన వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఎవరిని నియమిస్తారో ఇంకా తెలియలేదు. జేసీ రేఖారాణి ఇక్కడే వుంటే ఆమెనే ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా కొనసాగించే అవకాశముంది. అయితే ఆమె హైదరాబాద్ కు బదిలీ ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇన్ ఛార్జ్ కలెక్టర్ పై సందిగ్ధత నెలకొంది.

postersప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2014 సందర్భంగా నెల్లూరుజిల్లా ఛైల్డ్ ఫోరం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ చేతులమీదుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్.డి.సి.ఆర్.యస్. అనేక కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సామాజిక రక్షణ అందరికి అందించాలని, కుటుంబ మరియు బాలల ప్రయోజనాలు, పిన్షలు, ప్రసూతి రక్షణ వికలాంగుల మరియు నిరుద్యోగులకు ప్రయోజనాలు, ఆరోగ్యరక్షణ విద్యా వంటి ప్రయోజనాలను కాపాడుదామని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ ఇ.జయరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

jayaగురువారం ఆనం వెంకటరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆనం జయకుమార్ రెడ్డి ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసి ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి అని అన్నారు. సర్పంచి పదవి నుంచి రాష్ర్ట మంత్రి వరకు ఎన్నో పదవులను అలంకరించినా, ఏనాడు హంగులు, ఆర్భాటాలకు పోకుండా అత్యంత సామాన్యమైన నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శప్రాయులని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లునాయుడు, గార్లపాటి విజయకుమార్, నాగేంద్ర, నాగేశ్వరరావు, చినిగ శివారెడ్డి, మహమ్మద్ గౌస్, ప్రసాద్ నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సహకార అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.బి.మల్లికార్జునరెడ్డి మే నెల 30న ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గూడూరు డిఎలంసిఓగా పనిచేస్తున్న దూడల రాజేశ్వరరావు నియమితులై బాధ్యతలు చేపట్టారు.

court buildingజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం జిల్లా యంత్రాంగానికి రద్దీ ఎక్కువ కావడంతో దీని ప్రభావం పరోక్షంగా జిల్లా యంత్రాంగంపైన పడుతున్నందున, ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఖాళీగా వున్న కోర్టు భవనంలో ప్రజావిజ్ఞప్తుల దినంను నిర్వహించడానికి నిర్ణయించారు.

శుక్రవారం(23.05.14) మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావిజ్ఞప్తుల దినం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రజలు రావడంతో కొంతమేర ఇబ్బంది ఏర్పడుతుందని అసౌకర్యాన్ని తొలగించడం కోసం కోర్టు భవనం ఉపయోగించుకోదలచి, ఆ భవనం యొక్క స్థితిగతులను కూళంకషంగా తనిఖీలు నిర్వహించవలసిందిగా రోడ్లు భవనాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు.

collec spఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారాలకు సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసే నగదు మరియు లిక్కరు వాటిపై పటిష్టమైన నిఘా వుంచి సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు.

పోలీస్ అధికారులతో అక్రమ నగదు, లిక్కర్ పంపిణీ మరియు బందోబస్తు ఏర్పాట్లపై జరిగిన సమీక్షాసమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రకాలుగా నగదు, మందు అక్రమ మార్గాలలో డంప్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని, అటువంటి వాటిపై తగిన సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రదేశాలకు పోయి గుర్తించి, వాటిని సీజ్ చేయాలన్నారు. అలాగే 7వ తేదీ పోలింగ్ జరిగే ముందురోజున ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్, డియస్పీలు వెంకటనాథరెడ్డి, రాంబాబు, బాలవెంకటేశ్వరరావు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

anilనెల్లూరులోని ప్రశాంతినగర్, సింహపురి కాలనీలలో ఈ నెల 22న వైయస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7న జరిగే సాధారణ ఎన్నికల్లో దివంగత మహానేత కుమారుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు వేసే ఓటు రాబోయే 5సంవత్సరాలు రాష్ర్టాన్ని సుభిక్షంగా వుంచేలా రాజన్న సంక్షేమ పథకాలు సక్రమంగా సాగాలే చేస్తాయని తెలిపారు. అలాగే 165డివిజన్ లోని గుర్రాలమరుగు, సంగం, ఆదినగర్ ప్రాంతాలలో కూడా అనిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏ.బాలకోటేశ్వరరావు, కాకుటూరు విజయభాస్కర్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, గంగపట్నం వినయ్, మురళి, రామ్మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సుందరయ్య కాలనీ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న సుమోను లారీ ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మృతులు ఎన్నికల విధుల కోసం వచ్చిన పాట్నా పోలీసులుగా గుర్తించారు. అలాగే ప్రక్కనే ఉన్న 108 వాహనాన్ని కూడా లారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నవాపేటలోని బంగ్లా తోట వద్ద శాంతి ఇంగ్గీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ వల్ల పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. 

thyagarajనెల్లూరు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవాలు ఈ నెల 21 నుండి 27 వరకు టౌన్ హాలు ఆవరణలో వైభవంగా జరుగనున్నాయి. 2013న నవంబరు నుండి 2014 ఫిబ్రవరి వరకు నగరంలో భిక్షాటణ చేసి తద్వారా లభించిన నగదు, వదాన్యుల సహకారంతో వారం రోజుల పాటు ఈ సంగీతోత్సవాలు జరుగుతాయి. కీర్తిశేషులు శ్రీపతి పండితారాద్యుల సాంబమూర్తి, డా‖ యనమండ్ర వేంకటేశ్వర శాస్త్రిలు 49 ఏళ్ల క్రిందట ప్రాంభించిన ఈ ఉత్సవాలు సంగీత సరస్వతి త్యాగరాజ స్వామిపై భక్తితో ఏటికేటికి మీదు మిక్కిలి ఉత్సాహంతో జరుపుతుండడం విశేషం. నెల్లూరులోని ఔత్సాహిక గాయకులతో పాటు చెన్నైలోని శాస్త్రీయ సంగీత నిష్టాతులు ఈ స్మరణోత్సవాలలో తమ గాత్రాలతో, వాయిద్యాలతో మహానీయ వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజుని స్మరిస్తూ ఈ బాలగోపాలాన్ని ఆనందడోలికల్లో ఓలలాడించడం జరుగుతోంది. 21న నెల్లూరుకు చెందిన జె.వి.యస్.ఆర్.ఎస్.ప్రసాద్ అండ్ పార్టీ, 22న చెన్నైకు చెందిన దినేష్ కుమార్ అండ్ పార్టీ చే వాద్య సమ్మేళనం, 23, 24, 25, 26 తేదీల్లో చెన్నైకు చెందిన సిక్కిల్ గురుచరణ్ అండ్ పార్టీ, సాతూరు సిస్టర్స్ అండ్ పార్టీ, అమృతమురళి అండ్ పార్టీ, తోపూరు బి.సాయిరామ్ అండ్ పార్టీలచే గాత్రకచేరీలు వుంటాయి.

Page 10 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
  • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
    1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter