నెల్లూరులో నేడు (113)

drugsకేంద్రప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛభారత్‌ అంటూ ఊదరగొడుతున్నా, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని పదేపదే ప్రచారం చేస్తున్నా.. ఇప్పటికీ ప్రకృతిని ఆస్వాదిస్తూ బహిర్భూమికి వెళ్ళే సంస్కృతి మన వాళ్ళది. అనాదిగా వస్తున్న ఆచారా లని, అలవాట్లని ఇప్పటికిప్పుడు మార్చుకోమంటే మార్చుకోలేని మనస్తత్వాలు మనోళ్ళవి. ఇలాంటి సంప్రదాయాలు పాటించే సమాజంలో రాత్రికి రాత్రే మార్పులు తెచ్చి సంఘ సంస్కర్తలమనే బిరుదు పొందాలని తాపత్రయపడుతుంటారు కొందరు. అలాంటి కొందరిలో ఒక్కడే నెల్లూరుజిల్లా ఔషధ నియంత్రణాధికారి.

తాను అవినీతి మచ్చలేని నిఖార్సయిన అధికారినని ముక్కు సూటిగా వెళ్ళడం తన విధానమని చెప్పుకుంటూ నియంత పోకడతో మందుల వ్యాపారులకు ఈ అధికారి చిరాకు తెప్పి స్తున్నట్లు సమాచారం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఈయన మనిషి మంచోడే కానీ... అంటూ మందులషాపు యజమానులు తమ యాష్టను వెళ్ళగ్రక్కుతున్నారు. ఇలాంటి మంచి అధికారిని మేమిప్పటివరకూ చూడలేదు అంటూనే తమ గోడు విన్నవిస్తున్నారు. చిన్నపాటి తప్పులకు కూడా పెద్దపెద్ద శిక్షలు వేసి మా కడుపు కొడుతున్నా డంటూ వాపోతున్నారు. నియంత్రణాధికారి నియంతలా వ్యవహ రించడం సబబుకాదని నికార్సయిన అధికారి ఇలా నిక్కచ్చిగా ప్రవర్తించడం విచారకరమంటూ బాధపడుతున్నారు.

ఆయనేం చేస్తున్నాడంటే...

- మందుల దుకాణాలలో పనిచేసేవారు ఖచ్చితంగా యాప్రాన్‌ (తెల్లకోటు) ధరించాలని అదేశిస్తున్నాడు. ఆయన దుకాణాన్ని సందర్శించినప్పుడు తెల్లకోటు వేసుకోకుండా వుంటే కనీసం 10 నుండి 15రోజులు షాపు మూసేస్తున్నాడంట. అంత చిన్న తప్పుకు ఇది అతిపెద్ద శిక్షే.

- పెద్దసైజు దుకాణాలలో ఎక్స్‌పైరి స్టాక్‌ కనీస మోతాదులో కనపడ్డా వెంటనే ఆ షాపుని 15రోజులు సీజ్‌ చేసేస్తున్నాడట. వేలాది మందులు నిలువ వుంచుకునే దుకాణాలలో ఎక్కడో ఒక్క మందు దొరికితే ఇంతపెద్ద శిక్ష వేయడం అన్యాయం అన్నది మందులషాపు యజమానుల ఆవేదన. వారంలో ఒకసారి అన్నీ పరిశీలించుకుని ఎక్స్‌పైరీ మందులను తామే తీసేస్తామని, కానీ ఈలోగానే ఈ అధికారి తమ మీద సవారీ చేస్తున్నాడన్నది వీరి వాదన.

- 5 సంవత్సరాలకోసారి మందులషాపుల లైసెన్సులు రెన్యూవల్‌ చేసుకోవాలి. రెన్యూవల్‌ సమయంలో షాపు కొలతలు సరిగ్గా వున్నాయా లేదా, షాపు యజమానికి డిఫార్మసి పట్టా వుందా లేదా అన్నది ఖచ్చితంగా గమనించాలి. అయితే షాపుకు సంబంధించిన లీజు అగ్రిమెంటు కూడా ఈ అధికారి జత చేయమనడంతో షాపు నిర్వాహకులకు భవన యజమానులతో పెద్ద సమస్య ఎదురౌతుంది. అప్పటి వరకూ 10వేలో లేక 5వేలో వున్న బాడుగను భవన యజమానులు ఒక్కసారిగా పెంచేస్తున్నారు. లీజు అగ్రిమెంటు లేకపోతే లైసెన్సు రెన్యూవల్‌ కాదన్న సాకుని అడ్డం పెట్టుకుని భవన యజమానులు షాపు నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితికి కూడా ఈ అధికారే కారణం కావడం గమనార్హం.

- మందుల చీటీ లేకుండా మందులు అమ్మడానికి లేదనడం మంచిదే కావచ్చు కానీ ఆచరణలో ఇది అసాధ్యమైన విషయం. దీర్ఘకాల రోగాలతో బాధపడే ఎంతోమంది గ్రామీణ ప్రాంత వాసులు నిరక్షరాస్యులు తమ వద్ద వున్న పాత మందులనే శాంపిల్‌గా తీసుకెళ్లి మళ్లీ అవే మందులు కొనుగోలు చేస్తుం టారు. వెళ్లిన ప్రతిసారీ మందుల చీటీ చూపించాలంటే వాళ్లకి చాలా కష్టం.

తప్పు నిజంగా జరిగితే తప్పు చేసినవారికి భారీ జరిమానా విధించినా ఫరవాలేదు కాని, ఇలా రోజుల తరబడి మందుల షాపులను మూసేయించడం సమంజసం కాదు. పెద్దపెద్ద నిరసనలు బంద్‌లు జరిగే సమయాల్లో కూడా మందులషాపులకు మినహాయింపు వుంటుంది. అలాంటిది ఈ అధికారి వారాల తరబడి షాపులను మూయించడం ఆయన నిరంకుశ పోకడకు అద్దం పడుతుందని దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు.

రూల్‌ ఈజ్‌ రూల్‌ అంటూ తనను తాను భుజం తట్టు కుంటూ పనిచేస్తున్న ఈ అధికారి పొగతోటలో ఆసుపత్రులకు అనుబంధంగా వున్న మందులషాపుల జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఎక్కువగా శాంపిల్స్‌ దొరికేది ఆ షాపుల్లోనే. అయితే ఆసుపత్రి నిర్వాహకుల పరపతి ఏ స్థాయిలో వుంటుందోనన్న భయంతో ఈయన వారి జోలికి మాత్రం పోవడం లేదు. వారిని నియంత్రించడంలో తన నియంత పోకడని చూపించడం లేదు. రూల్‌ ఎవరికైనా రూలే సార్‌...

మహానగరాలలో సైతం లేని అలవాట్లను నెల్లూరులాంటి ప్రదేశాల్లో అమలు చేయాలంటే కష్టమే. మీ నిజాయితీని నిబద్ధతలను ప్రదర్శించుకోవడానికి సామాన్య షాపు యజమాను లను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. నెల్లూరులో అక్రమాల నిలయాలుగా వున్న ఎన్నో కార్పొరేట్‌ ఆసుపత్రులకు అను బంధంగా మందుల దుకాణాలున్నాయి. ఆ దుకాణాలపై దాడి చేసే ధైర్యం దమ్ము మీకుందా..? అని మందులషాపు యజ మానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి...? ఒక్కసారి ఆలోచించుకోండి మన చేతిలో అధికారం వుంది కదా అని కామన్‌మేన్‌ని ఇబ్బంది పెట్టి, కార్పొరేట్‌ రంగాన్ని వదిలిపెట్టడం నిజాయితీ అనిపించుకోదు.

దొంగ మందులను, ఎక్స్‌పైరీ మందులను నియంత్రించే బాధ్యతే మీది కాని, ఇలా నియంతలా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించుకోవాలి...?

cc camనెల్లూరు నగరంపై నిఘాకళ్లు వేలాడు తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ట్రాఫిక్‌జాం అయినా, ఎక్కడ వాహన దారులు ట్రాఫిక్‌రూల్స్‌ను అధిగమించినా, ఎక్కడ అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపినా జిల్లా పోలీసు కార్యాలయానికి ఇట్టే తెలిసిపోతుంది. ట్రాఫిక్‌రూల్స్‌ అతిక్ర మించిన వాహనదారుడి ఇంటికి పక్కరోజే పెనాల్టీ నోటీస్‌ వస్తుంది.

నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాం తాల్లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ విశాల్‌గున్నీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నగరాన్ని కొన్ని రింగ్‌లుగా విభజించారు. వీటిలో ప్రధానమైన రింగ్‌ కె.వి.ఆర్‌ పెట్రోల్‌ బంకు నుండి మొదలై ఆర్టీసీ, విఆర్‌సి, గాంధీబొమ్మ, ఏ.సి సెంటర్‌, బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్‌, మినీబైపాస్‌ల మీదుగా బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ వద్ద టర్న్‌ తిరిగి మాగుంట లే అవుట్‌ మెయిన్‌రోడ్డు గుండా తిరిగి కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద కలుస్తుంది. ఈ రింగ్‌లో సిసి కెమెరాల ఏర్పాటు పూర్తయ్యింది. ఓ ప్రైవేట్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ లైన్ల ద్వారా ఈ కెమెరాలన్నింటిని పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంకు అనుసంధానం చేశారు. ఈ రింగ్‌లోని ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసు కున్నా, నేరాలు జరిగినా, లేక ట్రాఫిక్‌ సమస్యలు ఎదురైనా పోలీసులు తక్షణం స్పందించడానికి అవకాశముంటుంది. అలాగే నేరగాళ్లను పట్టుకోవడానికి సి.సి కెమెరా విజువల్స్‌ బాగా ఉపయోగపడ తాయి. ముఖ్యంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సులభమవుతుంది. మొదటి రింగ్‌లో కీలక ప్రాంతాలన్నీ నిఘా పరిధిలోకి వచ్చాయి. తదుపరి మిగతా ప్రాంతాల్లో కూడా సి.సి కెమెరాలు ఏర్పాటు కొనసాగనుంది.

Friday, 16 September 2016 07:14

నెల్లూరుపై ఉగ్రనీడ?

Written by

terrorఫ్యాక్షనిజం గొడవలు, మావోయిస్టుల మందుపాతర పేలుళ్లు వంటి వాటికి దూరంగా ఎంతో ప్రశాంతంగా ఉండే నెల్లూరులో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

ఈ నెల 12వ తేదీన నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రహరీగోడ వద్ద గుర్తు తెలియని దుండగులు ప్రెషర్‌కుక్కర్‌ బాంబు పేల్చారు. ఈ పేలుడువల్ల సమీప గోడ దెబ్బతింది. సమీపంలో ఎవరూ మనుషులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అరలీటర్‌ సామర్ధ్యంగల ప్రెషర్‌ కుక్కర్‌ను టిఫిన్‌ బ్యాగ్‌లో అమర్చి 9వోల్ట్స్‌ బ్యాటరీలను పేలుడుకు ఉపయోగించారు. పేలుడు సంభవించగానే స్థానికంగా

ఉన్నోళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఒక్క నిముషం ఏం జరిగిందో అర్ధం కాలేదు. బాంబు పేలుడు గురించి తెలియ గానే గుంటూరులో వున్న ఎస్పీ విశాల్‌గున్నీ వెంటనే నెల్లూరుకు చేరుకున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాంబు పేలుడు వెనువున్న కారణాలపై అన్వేషణ మొదలు పెట్టారు. ఈ బాంబు పేలుడుపై ఉగ్రనీడ లున్నాయని తెలుస్తోంది. కక్షల కోణంలో జరిగుంటే నాటుబాంబులను మాత్రమే ప్రయోగించేవాళ్లు. ప్రెషర్‌కుక్కర్‌ బాంబు లను పేల్చే టెక్నాలజీ ఉండేది మావోయి స్టులు, టెర్రరిస్టుల వద్దే! రాష్ట్రంలో మావో యిష్టుల కదలికలే లేవు. ఇక ఉగ్రవాదం కోణంలోనే ఆలోచించాల్సి వస్తోంది. తమిళనాడు కేంద్రంగా పని చేసే ఆల్‌

ఉమా అనే ఉగ్రవాద సంస్థపై అనుమానా లున్నాయి. ఇటీవల చిత్తూరుజిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఇదే తరహా బాంబు పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాద సంస్థ తమ ఉనికిని చాటుకోవడానికి, అలాగే ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని చెడగొట్టడానికే ఈ బాంబును పేల్చినట్లు భావిస్తున్నారు. ఈ బాంబు పేలుడును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ బాంబు పేలుడుపై దర్యాప్తును వేగవంతం చేశాయి. త్వరలోనే దీనికి సంబంధించి నిజాలు బయపడొచ్చు.

Friday, 02 September 2016 08:20

వృక్ష విలాపం

Written by

vilapamపర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్ధులు కావాలని, మొక్కలను విస్తారంగా నాటి వాటిని పరిరక్షించాలని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం అదేపనిగా నిత్యం చెప్తూనే వున్నా, నెల్లూరు నగరానికి మాత్రం ఆ మాటలు వర్తించవు అన్నట్లుంటుంది ఇక్కడి అధికారుల పరిస్థితి. రోడ్డు విస్త రణకు.. విద్యుత్‌ తీగలకు అడ్డుగా వున్నా యంటూ ఆదివారం నెల్లూరులోని పొదల కూరు రోడ్డులోని క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో వున్న పలు పచ్చటి చెట్లను నిర్దయగా కొట్టివేశారు. వైర్లకు అడ్డం లేకుండా కొమ్మలను సరిచేసే విధానా లున్నా, చిత్తం వచ్చిన రీతిలో వాటిని కొట్టే స్తుండడం చూసి ప్రజలు విస్తుపోయారు. ఇలా ఒక్క నెల్లూరులోనే కాదు, జిల్లాలో అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఎప్పుడు ఎవరికి అడ్డమని అనిపిస్తే వారు చెట్లను నరికి వేస్తుండడం సర్వసాధారణమైపోయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీడనిస్తూ వున్న పెద్దపెద్ద చెట్లను, మహావృక్షాలను కూడా దేనికోదానికి అడ్డమని అడ్డంగా నరికివేయడం మామూలైపోయింది. అయినా... నోరు లేని చెట్లు.. తమ బాధని ఎవరికి చెప్పుకోగలవు?.. ఏమని చెప్పు కోగలవు?..వృక్షో రక్షతి రక్షిత: అంటూనే.. వృక్షాలను భక్షిస్తున్న వారిని చూసి ప్రకృతి మాత హృదయం క్షోభించదా?.. చిన్ని చిన్ని మొక్కలను నాటేందుకు భలే శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం, సంవత్సరాల నాటి వృక్షాలు ఇలా మానవుని నిర్దయకు నేలకూలిపోవాల్సిందేనా?..అని ప్రజలు, పర్యావరణ పరిరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు గడిస్తే కానీ ఒక మొక్క వృక్షంగా ఎదగదే.. అలాంటిది ఏళ్ళతరబడి వున్న వృక్షాలను, ప్రజలకు నీడనిస్తున్న చెట్లను ఇలా అడ్డ దిడ్డంగా నరికివేసి, మరోవైపు పర్యావరణను పరిరక్షించాలంటూ.. చిన్న చిన్న మొక్కలు నాటుకుంటూ కూర్చోవడం ఏమిటో పాలకులకే తెలియాలనే విమ ర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో రోడ్లమధ్యలో ఒకవేళ పెద్దపెద్ద చెట్లే వున్నా వాటిని సైతం పరిరక్షించుకుంటూ, ఆ వృక్షాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికా బద్ధంగా రోడ్డునే పక్కకు మార్చి వేసుకుం టారే తప్ప ఆ వృక్షాలను నాశనం చేసు కోరు. మనదే ఎక్కడ లేని విపరీతం!.. ఇంతకాలం మనకు నీడనిచ్చిన చెట్లని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా నరికి వేయడం మనకే చెల్లింది. వృక్షో రక్షతి రక్షిత: అనే మాటను యధార్థం చేయాలంటే వృక్షాలను పరిరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం. చెట్ల పరిరక్షణకు కఠినమైన చట్టాలుంటే తప్ప చెట్లకు రక్షణ వుండనే వుండదు. ప్రభుత్వానికి చిత్త

శుద్ధి వుంటే వెంటనే అలాంటి చట్టాలకు పదునుబెట్టాలి. ఏదేమైనా..ఇంతకాలం మనకు చల్లటి నీడనిచ్చిన మన చెట్లను మనమే నరికేసుకోవడం ఏపాటి విజ్ఞతో అందరూ ఆలోచించుకోవాలి!...

vasanthaఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన, జీవనోపాదుల ఎగ్జిక్యూటివ్‌ కమిటి మెంబర్‌గా వసంతలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అండ్‌ రీసర్చి సెంటర్‌ అధినేత్రి, హై కోర్టు న్యాయవాది అయిన డా|| టి.వసంత లక్ష్మిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నియమించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లూరు పొగతోటలోని వసంతలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వసంతలక్ష్మి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కష్టాలు కన్నీళ్లలో వున్న అర్హులైన మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులను అక్కున చేర్చుకుని నిర్భాగ్యు లైన వారి జీవితాల్లో ట్రస్టు ద్వారా మంచి భవిష్యత్తును అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణ పేదరిక నిర్మూ లన సంస్థ మంత్రి నారాయణ సహకా రంతో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా తనను ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా నియమించడం ఆనందంగా వుందన్నారు.

సమాజంలో ప్రజలందరి సహాయ సహకారాలతో, జిల్లా అధికారుల సమన్వ యంతో పేద, బడుగు వర్గాల యువత, మహిళల జీవనోపాదులు పెంచే విధంగా, వారి పేదరికాన్ని జయించే రీతిలో ప్రభుత్వ పథకాలను అమలయ్యే విధంగా చూస్తానని, తద్వారా సమాజంలో పేదరిక నిర్మూలనకు తనవంతు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

muvvaఎక్కడ పనిచేస్తున్నా వివాదాలను తన కేరాఫ్‌ అడ్రస్‌గా మలచుకున్న మువ్వా రామలింగం మళ్ళీ నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చాడు. పైస్థాయిలో పైరవీలు జరిపి, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో పట్టుబట్టి మళ్ళీ ఆయన ఈ జిల్లాకే రాగలిగాడు. ఎక్కడున్నా విద్యాశాఖను భ్రష్టు పట్టిం చడంలో మువ్వా రామలింగంకు ప్రత్యేక మైన పేరుంది. పదిహేనేళ్ల క్రితమే ఆయన ఇక్కడ డిప్యూటీ డిఇఓగా పనిచేస్తూ ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. సంతపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌నే కార్యాలయంగా మార్చుకుని ఎన్నో అక్రమా లకు తెరతీశాడు. ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు జరిపాయి. డిఇఓగా పదో న్నతి పొందిన తర్వాత చిత్తూరుజిల్లాలో డిఇఓగా పని చేశాడు. ఈయన అక్రమాల దెబ్బకు అక్కడ జడ్పీ పాలకవర్గ సభ్యులు ఇతని మీద జడ్పీ సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం పెట్టించి బదిలీ చేయించారు. ఆ తర్వాత 2007లో గుంటూరు డిఇ ఓగా, 2008లో కర్నూలు డిఇఓగా పని చేశాడు. గుంటూరులో లంచం తీసు కుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు. కర్నూలు లోనూ ఉపాధ్యాయ సంఘాలతో గొడవలు పడ్డాడు. కొంతకాలం ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2011 జూన్‌లో నెల్లూరు డిఇఓగా వచ్చాడు. 2014 ఏప్రిల్‌ దాకా పని చేశాడు. ఈమధ్య కాలంలో ఉపా ధ్యాయులకు, ఉపాధ్యా సంఘాలకు చుక్కలు చూపించాడు. రామలింగం ఇక్కడున్నంతకాలం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక ఉపాధ్యాయ సంఘం ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన జరిపింది. ఈయన అక్రమాలపై విచారణ జరిపించి అప్పటి కలెక్టర్‌ శ్రీకాంత్‌ ఇతనిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఏడాది పాటు సస్పెన్షన్‌లో వున్న రామలింగం ఆ తర్వాత ప్రకాశం డిఇఓగా పోస్టింగ్‌ తెచ్చు కున్నాడు. ఆ తర్వాత అక్కడా గొడవపడి మున్సిపల్‌ స్కూల్స్‌, ఐఐటి ఫౌండేషన్‌ కోర్సు ఏఓగా బదిలీ అయ్యాడు. గత కొంత కాలంగా ఆయన తిరిగి నెల్లూరుకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా గంటా నెల్లూరు జిల్లాకు తొలి సారి వచ్చినప్పుడు 'మీ మిత్రుడు' పేరుతో జిల్లాలో ఆయనకు భారీఎత్తున స్వాగతం ఫ్లెక్సీలు పెట్టించింది కూడా మువ్వా రామలింగమేనని సమా చారం. జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు, ఆఖరకు జిల్లా తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా గంటా ఆశీ స్సులతో మువ్వా రామలింగం నెల్లూరుకు రావాలన్న పంతం నెగ్గించుకున్నాడు. కాకపోతే జిల్లాలోని ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకే ఇక మనశ్శాంతి ఉండదు.

nellore railwayస్వచ్ఛభారత్‌లో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది మనకు మనం తగిలించుకున్న ఘనత కాదు. కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక బృందం పరిశీలించి ఇచ్చిన సర్టిఫికేట్‌ ఇది. దేశంలో 407 ప్రధాన రైల్వేస్టేషన్‌లను కేంద్ర బృందం పరిశీలించింది. వారి పరిశీలనలో నెల్లూరు రైల్వేస్టేషన్‌లో పరిశుభ్రత నిర్వహణకు మంచి మార్కులే పడ్డాయి. నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఏపిలో మొదటి స్థానంలోనూ, దేశంలో 28వ స్థానంలోనూ నిలిచింది.

jaganవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆగష్టు 1, 2, 3తేదీలలో నెల్లూరులో ఉండబోతున్నాడు. 1, 2తేదీలలో మినీబైపాస్‌ రోడ్డులోని అనిల్‌ గార్డెన్స్‌లో జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, స్థానిక సమస్యలు, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో చర్చించనున్నారు. అలాగే 3వ తేదీ కెవిఆర్‌ పెట్రోల్‌బంక్‌ సెంటర్‌లోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో ప్రత్యేకహోదా సాధనలో భాగంగా జరిగే యువభేరి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. జగన్‌ పర్యటనను జయప్రదం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

mkరుచికి, శుచికి, శుభ్రతకి, నాణ్యతకి నమ్మకంగా నెల్లూరీయుల అభిరుచులకు చిరునామాగా గత 46సంవత్సరాలుగా ఆదరింపబడుతున్న మురళీకృష్ణ హోటల్స్‌ యాజమాన్యం మద్రాసు బస్టాండు ప్రాంతంలోని ప్రకాశం పంతులు కాంప్లెక్స్‌లోగల వెజిటేరియన్‌ హోటల్‌ని కొద్దికాలం మూసివేసి ఆధునిక హంగులతో జూలై 21వ తేదీ(నిన్న) గురువారం ఉదయం పునఃప్రారంభించారు. ఆధునిక వసతులతో పాటు కొంత భాగాన్ని ఎయిర్‌కండిషన్‌ చేశారు. పూర్తి స్థాయిలో శాఖాహార ఫలహార భోజనాలను సరఫరా చేసే ఈ హోటల్‌ను సంస్థ వ్యవస్థాపకులు గ్రోసు గోపాలయ్య ప్రారంభించారు. మురళీకృష్ణ కుటుంబం గోపాలయ్య, హజరత్‌బాబు, సుబ్బారావు, మురళి, చైతన్యకృష్ణ, మురళీకృష్ణల సారధ్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. వందలాది మంది గోపాలయ్య ఆప్తులు, మురళీకృష్ణ అభిమానులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

గోపాలయ్యే స్వయంగా రిబ్బన్‌ కత్తిరించి హోటల్‌ని పునఃప్రారంభించిన ఈ వేడుకలో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఓయస్‌డి పెంచలరెడ్డి, కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పుట్టా రామకృష్ణారెడ్డి, యం.జి.బ్రదర్స్‌ అధినేత గంగాధరం, నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, పట్టణంలోని వివిధ హోటల్స్‌ అధినేతలు, వైద్యులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

వచ్చిన ప్రతి అతిథిని మురళీకృష్ణ కుటుంబం ఆప్యాయంగా పలుకరించి స్వాగతం పలికారు. నాలుగున్నర దశాబ్దాలుగా నెల్లూరీయుల మనసుల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న మురళీకృష్ణ కుటుంబానికి ''లాయర్‌'' అభినందనలు.

Friday, 08 July 2016 07:27

'దేశం'లో పదవుల గోల

Written by

nellore tdp leadersతెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కిలారి వెంకట స్వామినాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవి దక్కింది. ఈమేరకు ఆయనకు పార్టీ మహారాజు చంద్రబాబు, యువరాజు లోకేష్‌ల ఆశీస్సులు లభించాయి. సొర చేపకు గాలం వేస్తే పిత్తపరిగ పడినట్లు కిలారికి ఈ పదవి దక్కింది.

2014 ఎన్నికల్లో నెల్లూరురూరల్‌ సీటు కోసం ఆయన ప్రయత్నించాడు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ పెత్తనం చెలాయిద్దామనుకుంటే, దానిని ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌ ఛైర్మెన్‌ పదవన్నా ఇమ్మని చాలారోజుల నుండి మొత్తుకుం టున్నాడు. అయితే ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున ఆ పదవిని ఇవ్వలేమని చెప్పి, జిల్లాలో ఎవరూ పెద్దగా డిమాండ్‌ చేయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవిని మాత్రం కట్టబెట్టారు. దీనికి నిధులు, విధులు పెద్దగా లేకపోయినా పుస్తకాలు, ప్రోటోకాల్‌ మర్యాదలు దండిగా ఉంటాయి.

సమన్వయం లేకుండానే...

అయితే కిలారి ఎంపిక కేవలం మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రమేయంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇది జిల్లా స్థాయి పదవి. జిల్లాలో సమన్వయ కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల ఆమోదం కూడా తీసుకుని వుండాలి. అయితే వీళ్లెవరి అభిప్రాయాలు తీసుకోలేదు. దీంతో మిగతా నాయకులంతా కూడా ఈ ఎంపిక పై మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

బి.సి, దళితులకు మొండిచేయేనా?

జిల్లా నుండి మరో నలుగురికి త్వరలో నామినేటెడ్‌ పదవులు దక్కే సూచనలు న్నాయి. వీరిలో తాళ్లపాక అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, దేశాయిశెట్టి హనుమంత రావుల పేర్లున్నాయి. అనూరాధకు స్త్రీ శిశు సంక్షేమశాఖలో రాష్ట్రస్థాయి పదవి ఇవ్వ నున్నారు. అలాగే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని బాల కృష్ణ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కోవూరు నియో జకవర్గంలో పార్టీ కేడర్‌కు అండగా నిలిచిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేరు కూడా నామినేటెడ్‌ పదవికి పరిశీలనలో వుంది. ఇక రెండుసార్లు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేసి ఆర్ధికంగా నష్టపోయిన దేశాయిశెట్టి హనుమంతరావుకు కూడా నామినేటెడ్‌ పదవి దక్కొచ్చు. అయితే వీరంతా అగ్ర వర్గాలవారే!

పార్టీలో దళితులు, మైనార్టీలు, బల హీనవర్గాల నాయకులు కూడా వున్నారు. అగ్రవర్ణాల నాయకులతో పాటు వీళ్లు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయితే తొలిదశ నామినేటెడ్‌ పదవుల్లో ఈ వర్గాల నాయకులెవరి పేర్లు పరి శీలనలో లేనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వర్గాల వారిలో అసంతృప్తి వ్యక్త మవుతోంది.

Page 2 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter