నెల్లూరులో నేడు (138)

camవందేళ్లకు పైగా చరిత్ర కలిగి, లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసి, ఎందరి జీవితాలలోనో వెలుగు నింపిన నెల్లూరు, మూలాపేటలోని సిఏఎం హైస్కూల్‌ ఇప్పుడు తన భవిష్యత్‌ అర్ధంకాక తనను కాపాడేవారి కోసం ఎదురుచూస్తోంది. చరిత్ర నుండి తనను మాయం చేయకముందే కాపాడుకోండని కోరుతోంది.

నెల్లూరుజిల్లాలో క్రైస్తవ మిషనరీల ఆస్తులు అన్యాక్రాంతమవుతుండడం తెలి సిందే! అప్పటికే అమెరికన్‌ ఆసుపత్రిని చుట్ట చుట్టేసారు. తాజాగా సిఏఎం హైస్కూల్‌కు కూడా ఎసరుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విద్యా వ్యాపారం వల్ల ప్రభుత్వ బళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. మిషనరీ స్కూళ్ళు కూడా అలాగే తయారయ్యాయి. దీంతో విద్యా ర్థులు చేరక ఈ హైస్కూల్‌ను మూసేయా ల్సిన పరిస్థితిని కల్పించారు. ఈ హైస్కూల్‌ ప్రాంగణాన్ని ఇప్పుడు రోజూ వ్యాయా మాలు చేసుకోవడానికి, ఆటలు ఆడుకోవ డానికి, ఎలక్షన్‌ల టైంలో పోలింగ్‌బూత్‌లు పెట్టుకోవడానికి వాడుతున్నారు. తాజాగా పరివార్‌ గ్రూప్‌ హోటల్స్‌ అనే సంస్థకు ఈ హైస్కూల్‌ను అతితక్కువ లీజుతో ఇచ్చే సారు. పరివార్‌ ప్యాలెస్‌ పేరుతో వాళ్లు ఇక్కడ హోటల్‌ వ్యాపారం మొదలుపెడ తారు. హైదరాబాద్‌, ముంబై, మైసూరు వంటి నగరాలలో ఈ ప్యాలెస్‌ బిజినెస్‌ బ్రహ్మాండంగా జరుగుతుంది. చారిత్రాత్మక కట్టడాలలో ఈ ప్యాలెస్‌ హోటల్‌ వ్యాపారం సాగుతుంటుంది. ఇప్పుడు సిఏఎం హై స్కూల్‌ కూడా అటువంటి వ్యాపారానికే వేదిక కాబోతుంది. మరి ఉన్నతాధికారులు ఈ హైస్కూల్‌ను కాపాడుకోవడానికి ఏం చర్యలు తీసుకుంటారో, ఈ హైస్కూల్‌ పూర్వవిద్యార్థులు ఇది వ్యాపార సంస్థ చేతు ల్లోకి పోకుండా ఎంతవరకు కాపాడుకుం టారో చూడాలి!

buildinవిక్రమ సింహపురి విశ్వవిద్యాలయం... వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ప్రతిరోజూ ఏదో ఒక వివాదమే... యూనివర్శిటీని మొదలుపెట్టినప్పటి నుండి ఆందోళనలతో ప్రయాణమే! సిబ్బంది నియామకాలు, హాస్టల్‌ మూత, బోధనా తరగతులు, భవనాల కాంట్రాక్ట్‌ పనులు... ఒకటేమిటి ప్రతి అంశంలోనూ వివాదమే!

దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వి.ఆర్‌. విద్యాసంస్థలలో మొదలైన విశ్వవిద్యాలయంకు వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద ఆయనే 60ఎకరాల భూమి కేటాయించడం తెలిసిందే! ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్శిటీ కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయబడి శంకుస్థాపన కూడా జరిగింది. యూనివర్శిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. విఆర్‌ విద్యాసంస్థలలో నడుస్తున్న యూనివర్శిటీని కొత్త భవనాలలోకి మార్చాలని విద్యార్థి సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే దానికి ముహూర్తమే కుదరడం లేదు. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చి ఇఫ్కో సెజ్‌లో నిర్మించబడ్డ 'గమేషా' ఫ్యాక్టరీని ప్రారంభించి వెళ్లారు. వాస్తవానికి ఆరోజు విశ్వవిద్యాలయం భవనాల ప్రారంభోత్సవం సీఎం పర్యటనలో ప్రధాన కార్యక్రమం. చివరికి చూస్తే ఆ ప్రోగ్రామే లేకుండా పోయింది! అసలు విశ్వవిద్యాలయం భవనాలకు చంద్ర బాబు చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకునే అదృష్టం ఉందా? అన్నది ప్రశ్న! ఆ ముహూర్తం ఇంకెప్పుడొస్తుందో?

azizఎవ్వరి మాటా వినడు ఈ సీతయ్య అన్నటైపులో తయారయ్యాడు నెల్లూరు మేయర్‌ అజీజ్‌. నాకెవరూ బాస్‌లు లేరు. నాకు నేనే బాస్‌ని అన్నట్లుగా వ్యవహరిస్తూ తన పార్టీ వాళ్లకు, తనను పార్టీలోకి తీసుకొచ్చిన వాళ్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుడితోనూ ఆయనకు సఖ్యత, సమన్వయం లేకుండా పోయాయి. సోమిరెడ్డి, ఆదాల, బీద... ఇలా అందరితో దూరమే! ఆనం అంటే ముందు నుండీ పడదు. సరే, వీళ్లందరినీ పక్కనపెట్టినా తనను పార్టీలోకి తీసుకొచ్చిన మంత్రి నారాయణతోనన్నా బాగుంటున్నాడా? ఆయన మాటకు గౌరవమిస్తున్నాడా అంటే అదీ లేదు. మంత్రి నారాయణ అంటే ఆయనకు బొటనవేలి మీద వెంట్రుకతో సమానమైంది. మేయర్‌కు మంత్రితో పాటు ముఖ్యమైన జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేదు. తన పార్టీ కార్పొరేటర్ల మద్దతు లేదు. అయినా అజీజ్‌ అందరినీ ఢీకొంటున్నాడు. ప్రతి ఒక్కరితో కయ్యానికి సై అంటున్నాడు. అతని ధైర్యానికి కారణమేంటి? అతను ఆడుతున్న గేమ్‌ ఏంటి?

అతనికి జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేకపోయినా తెలుగుదేశం యువరాజు లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు. తనపై లోకేష్‌ బ్రాండ్‌ వేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అజీజ్‌కు మైనార్టీ ముద్ర కూడా కలిసొచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో మైనార్టీ కోటా నుండి నెల్లూరు నగరం సీటును దక్కించుకోవాలని అతని ప్లాన్‌. అందుకు లోకేష్‌ ఆశీస్సులుంటేచాలని నమ్మకం. కాబట్టే లోకేష్‌ను కాకా పడుతున్నాడు. అదే సమయంలో నెల్లూరు కార్పొరేషన్‌లో వైకాపా వారితో మంతనాలకు తెరతీసి డబుల్‌ గేమ్‌ ఆడుతున్నాడు. పార్టీ మారి తప్పు చేసానని, వైకాపా కార్పొరేటర్లు సహకరిస్తే కార్పొరేషన్‌లో తెలుగుదేశం వాళ్లతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటానంటున్నాడు. ఈమేరకు కార్పొరేషన్‌లో వైకాపా ప్రతినిధులుగా వ్యవహరించే పి.రూప్‌కుమార్‌యాదవ్‌, బొబ్బల శ్రీనివాసయాదవ్‌ల సహకారం అభ్యర్థించాడు. అయితే ఒకసారి అజీజ్‌ చేతిలో మోసపోయిన వాళ్లు మళ్లీ అంత తొందరగా అజీజ్‌ను నమ్మలేరుగా! అదీగాక ఈ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్‌ల నిర్ణయమే కీలకం. అజీజ్‌ తెలుగుదేశంలోనే వుంటే ఆయనకు సహకరించినంత మాత్రాన వైకాపాకు అదనంగా వచ్చే ప్రయోజనమేదీ లేదు.

రాజకీయంగా మంత్రి నారాయణకు ఇంతవరకు ఎవరితోనూ పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన ఏదో నాలుగు సినిమా డైలాగ్‌లు వదిలి సరిపెట్టుకున్నాడు గాని, వారితో తీవ్రమైన రాజకీయ యుద్ధం జరిపింది లేదు. అజీజ్‌ రూపంలో ఎదురైన సవాలే మంత్రి నారాయణను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అజీజ్‌పై ఏదన్నా చర్య తీసుకుందామా? అంటే మైనార్టీ ముద్ర అడ్డమొస్తోంది. అలాగని చూస్తూ వదిలేస్తే సొంత కార్పొరేషన్‌లో అడ్డం తిరిగిన మేయర్‌నే ఏం పీకలేని నారాయణ ఇక మంత్రిగా ఏం వెలగబెడతాడనే ప్రశ్న వస్తుంది! మొత్తానికి అజీజ్‌ వైఖరితో జిల్లా తెలుగుదేశంలోనే అంతర్మధనం మొదలైందని చెప్పొచ్చు.

peena barrageక్రిందట జిల్లా మంత్రి పి.నారా యణ చెప్పారు. ఆయన మంత్రయ్యాక ఒకటికి నాలుగుసార్లు ఈ బ్యారేజీల నిర్మాణాన్ని పరిశీలించారు. నెల్లూరు బ్యారేజీ పనులను చీకట్లో చూడ్డానికి వెళ్లినప్పుడే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కాలుజారి గాయపడ్డాడు. పోయినసారి తనిఖీలప్పుడే మార్చికల్లా ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తవుతుందని, బ్యారేజీల మీద బండ్లు కూడా పోవచ్చని చెప్పారు. ఇప్పుడు జనవరి నెల. ఇంకో పదిరోజులు దాటితే ఫిబ్రవరి కూడా వస్తుంది. మరి మార్చికి ఎలా ఇవి పూర్తవుతాయో తెలియడం లేదు. మంత్రి మాటల్లో

ఉన్నంత ఊపు చేతల్లో ఉండడం లేదు. ఇప్పటికే ఈ బ్యారేజీల నిర్మాణానికి 170కోట్ల దాకా ఖర్చయ్యింది. ఇంకో 120కోట్ల దాకా ఖర్చుందని అంచనా! గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చి ఈ బ్యారేజీలను పరిశీలించి, వీటిని తొందరగా పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్టులో పెడతా మని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాంట్రాక్టర్లు తమ సమస్యలను చెబితే... వాటిని పరిష్కరిస్తానని కూడా ముఖ్య మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల ఈ పనులకు సంబంధించి కొన్ని బిల్లులు కూడా మంజూరు చేశారు. అయితే సీఎం గాని, మంత్రి గాని ఈ బ్యారేజీలపై మాటల్లో చూపించినంత శ్రద్ధ చేతల్లో చూపడం లేదు. గట్టిగా ఇంకో మూడు నెలలు పనిచేస్తే నెల్లూరు బ్యారేజీ, అయి దారు నెలలు పనిచేస్తే సంగం బ్యారేజీ పూర్తవుతాయి. ఈ రెండు బ్యారేజీల ఖర్చు కూడా భారీఎత్తున లేదు. మంత్రి చొరవ తీసుకుంటే మార్చికి కాకున్నా 2017 ఏడాది పోకముందే వీటిని పూర్తి చేసుకుని ప్రారంభించుకోవచ్చు.

msrపేద గర్భిణీ స్త్రీలు నగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోల కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి, నెల్లూరులోని మాగుంట శరత్‌చంద్రారెడ్డి యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అయిదు ఆటోలను కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ ఆటోలను యువజన సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత్‌చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రసాద్‌ను ఆయన అభినందించారు. ఈ ఉచిత ఆటోలు నగరమంతా తిరుగుతాయని, వాటిపై ఫోన్‌ నంబరు కూడా వుంటుందని, అవసరమైనవారు ఫోన్‌ చేస్తే వెంటనే తమ ఆటో వస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, ప్రసాద్‌, దారా మహేష్‌, మాదా బాబు, జైరాజ్‌, రమేష్‌, నాగార్జున, సాయి తదితరులు పాల్గొన్నారు.

Friday, 06 January 2017 12:25

బూడిదైన బతుకులు

Written by

fire accident2016 పోతూ పోతూ నెల్లూరుజిల్లాలో ఓ 17 కుటుంబాలలో చీకటి నింపి పోయింది. ఇక కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా, కొందరికి కొత్త సంవత్సరాన్ని చూసే ఆశ, అవకాశం లేకుండా చేసింది. అనునిత్యం ప్రజల సంతోషాలలో భాగమైన బాణాసంచాను తయారుచేసే కార్మికుల బ్రతుకుల్లో చీకటిని చిమ్మింది.

పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, కొందరు వ్యాపారుల దురాశ... వెరసి ఒక పెను ప్రమాదానికి దారి తీసాయి. 2016 డిసెంబర్‌ 31వ తేదీన నెల్లూరుజిల్లా చరిత్రపుటలో పెద్దప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు సమీపంలోని పెన్నా పొర్లుకట్ట వద్ద వున్న బాణాసంచా గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, గురువారానికి ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మరో 8మంది మరణించారు. మిగిలినవారు 80శాతం గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మొదట బాధితులను పెద్దాసు పత్రికే తీసుకెళ్లారు. కాని అక్కడ వైద్య సదుపాయాలు ఎంత ఘోరంగా అఘో రిస్తున్నాయో తెలిసిందే కదా! అక్కడ వారికి సరైన వైద్యసదుపాయం అందించే అవకాశం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చొరవ తీసుకుని వారిని వెంటనే నారాయణ ఆసుపత్రికి తర లించారు. ప్రమాదం సంభవించింది అనుమతి లేని బాణాసంచా గోడౌన్‌లో! 50గజాల గోడౌన్‌లో 17మంది కార్మికులు పని చేస్తుండడమే ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. యం.వి.రమణయ్యశెట్టి అనే అతను ఈ బాణాసంచా గోడౌన్‌ నిర్వ హిస్తుండగా భాస్కర్‌ అనే గుమస్తా దీని వ్యవహారాలు చూస్తుంటాడు. నూతన సంవత్సర వేడుకలతో పాటు, సంక్రాంతి సంబరాలకు బాణాసంచా అమ్మకాలు ఎక్కువుగా వుంటాయనే ఉద్దేశ్యంతో కూలీ లను పెట్టి బాణాసంచా తయారు చేయిస్తు న్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్వాహకుడు భాస్కర్‌ అక్కడే వున్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువుగా ఉండడంతో అతను పరారుకాగా తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎక్కువమంది యువకులే...

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది పాతికేళ్ళలోపు యువకులే ఉండడం విచారకరం. నూనూగు మీసాల వయస్సులోనే వారికి నూరేళ్ళు నిండాయి. అందరూ గిరిజన యువకులే! ఇతర పనులకు పోవడంకంటే ఇక్కడైతే నీడపట్టున కూర్చుని పనిచేయవచ్చనే బాణాసంచా గోడౌన్‌లకు వస్తుంటారు. రోజు కూలీ కూడా రూ.500లు ఇస్తుండడంతో ఇక్కడ పనిచేయడానికి ఆసక్తితో వస్తారు. కడుపు నింపుకోవ డానికి ఏదో ఒక పని అని వస్తే... ఆ పనే వీరి పాలిట మృత్యువుగా మారింది.

ఎస్‌బి హెచ్చరికలు బేఖాతరు...

దీపావళి సమయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు నెల్లూరు సమీపంలోని అన్ని బాణాసంచా గోడౌన్‌లలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బాణాసంచా గోడౌన్‌లను గుర్తించి, వాటిని తొలగించాల్సిందిగా ఆయా పోలీస్‌స్టేషన్‌లకు సమాచార మిచ్చారు. ఆ గోడౌన్‌లలో ప్రమాదం జరిగిన భాస్కర్‌ గోడౌన్‌ కూడా వుంది. అయితే మూడో నగర పోలీసులు దీనిపై పెద్దగా స్పందించలేదు. వూరికే హెచ్చరించి వదిలేసారని తెలిసింది. ఇప్పుడు అదే గోడౌన్‌లో ప్రమాదం సంభవించడంతో మూడోనగర పోలీసుల మెడకు చుట్టుకుంది. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అప్పటి త్రీటౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణను సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రస్తుత సిఐ రామారావు సస్పెండ్‌కు సిఫారసు చేస్తూ ఐజికి లేఖ వ్రాసారు.

మొత్తానికి అధికారులు, పోలీసుల వైఫల్యం వల్ల, విధి నిర్వహణలో ఉదాసీనత వల్ల ప్రజలు ఎంతగా మూల్యం చెల్లిస్తున్నారనడానికి చితికి చిధ్రమైన ఈ బడుగుజీవుల బ్రతుకులే ఓ ఉదాహరణ.

buildingతిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిన పురచ్చితలైవి కుమారి జె.జయలలితకు నెల్లూరు నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జనం మెచ్చిన నాయకురాలే కాదు, నెల్లూరుకు మనుమరాలు కూడా!

నెల్లూరుతో ఆమెది విడదీయరాని బంధం. రంగనాధుడి గుడి, అక్కడే వున్న చిత్రకూటం, పక్కనేవున్న పెన్నానది, తిక్కన పార్కు జయలలిత జీవిత చరిత్రలో మరపురాని జ్ఞాపకాలు. జయలలిత తల్లి సంధ్య సినీనటి! ఆమె సొంతూరు నెల్లూరే! రంగనాయకులపేటలోని చిత్రకూటం వద్ద వారిళ్లుండేది. నెల్లూరులో వున్నప్పుడే సంధ్య సినీ పరిశ్రమలోకి వెళ్లారు. అప్పుడే మైసూరు రాజా ఆస్థానంలో వైద్యుడిగా పనిచేస్తున్న జయరామన్‌ను ఆమె వివాహమాడారు. వారికి జయలలిత జన్మించింది. సంధ్య అత్తమామలు కర్నాటకలోని శ్రీరంగంలో ఉండేవారు. సంధ్య సినిమాలలో బిజీగా వున్న సమయంలో ఆమె భర్త మరణించారు. ఆ సమయంలో ఒకటిన్నర ఏడాది వయసున్న జయలలితను ఆమె నెల్లూరులోని తన తల్లి వద్ద వుంచింది. అలా 5ఏళ్ల వయ సొచ్చే దాకా జయలలిత నెల్లూరులోనే పెరిగింది. ఆ తర్వాత చెన్నైకు వెళ్ళినా సెలవుల సమయంలో నెల్లూరొచ్చి తన మేన మామల వద్ద గడిపేది. చిత్రకూటం ప్రాంతంలో చిన్నతనంలో జయలలితకు చాలామంది స్నేహితులుండేవాళ్లు. ఈ ప్రాంతాల్లో తోటి స్నేహితులతో కలసి ఆమె సరదాగా ఆడుకునేది. రంగనాథ స్వామి ఆలయంకు క్రమం తప్పకుండా వెళుతుండేది. జయలలిత సినిమాల్లోకి వెళ్లాక నెల్లూరుకు రావడం మానేసింది.

నెల్లూరీయులతో సత్సంబంధాలు

నెల్లూరుతో వున్న ప్రత్యేక అనుబంధమో ఏమోగాని నెల్లూరుకు చెందిన వ్యక్తులను ఆమె ఎంతగానో అభిమానించేవారు. ముఖ్యంగా స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబానికి ఆమె అత్యంత ఆప్తురాలు. 1992లో నెల్లూరు ఏ.సి స్టేడియంలో జరిగిన మాగుంట సుబ్బరామిరెడ్డి తనయుడు మాగుంట విజయ్‌రెడ్డి వివాహానికి ఆమె రావడం జరిగింది. 1995లో నక్సలైట్ల చేతుల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి దారుణహత్యకు గురైనప్పుడు కూడా ఆమె నెల్లూరొచ్చి సుబ్బరామన్నకు నివాళులర్పించారు. అలాగే తమిళనాట తెలుగువారి కీర్తి బావుటాగా వున్న ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సి.ఎం.కె.రెడ్డి, సీబ్రోస్‌ అధినేత సుబ్బారెడ్డి లాంటి నెల్లూరీయులతోనూ ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇలా నెల్లూరుతోనూ, నెల్లూరీయులతోనూ జయలలితకు వున్న అనుబంధం చరిత్రలో తీపిజ్ఞాపకంగా మిగిలిపోనుంది.

swamuluకంచి కామకోటి పీఠాధిపతి సద్గురు జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్రసరస్వతి స్వామీజీలు ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు నెల్లూరులో విడిది చేస్తారు. 10వ తేదీ రాత్రికే వాళ్లు నెల్లూరు చేరుకుంటారు. మూలాపేటలోని శంకరమఠంలో బస చేస్తారు. వారితో పాటు ఎంతో విశిష్టమైన పీఠాన్ని కూడా తీసుకువస్తున్నారు. శ్రీకంచి కామాక్షి చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయం వద్ద కంచి స్వాముల పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగురోజుల పాటు కంచిపీఠం సంప్రదాయాల ప్రకారం విశేషపూజలు, చండీహోమం, పీఠానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ స్వామీజీల ప్రవచనాలుంటాయి.

Friday, 25 November 2016 13:20

వ్యాపారాలన్నీ బంద్‌

Written by

mgbపెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క సామాన్య ప్రజలే కాదు వ్యాపారాలన్నీ పడిపోయి వ్యాపారస్థులు విలవిలలాడుతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక వ్యాపార లావాదేవీలు సగానికి సగం పడిపోయాయి. వెయ్యి, 500 నోట్లు రద్దు చేశారు. కొత్తగా 2వేల నోటు విడుదల చేశారు. మార్కెట్‌లో చిల్లర లేక ఇవి చెలామణి కావడం కష్టసాధ్యంగా మారింది. వంద, యాభై, 20, 10... చిన్ననోట్ల హవా పెరిగింది. మార్కెట్‌లో ఈ నగదు శాతం తక్కువ. చెలామణిలో ఎక్కువుగా ఉన్నది 500నోట్లే! కొత్తగా 500 నోటు విడుదల కావడం ఆలస్యమైంది. దీంతో వ్యాపారస్థులకు సినిమా కష్టాలు మొదలయ్యాయి.

మొదటి దెబ్బ రియల్‌ ఎస్టేట్‌ మీద పడింది. అసలే అంతంతమాత్రంగా వున్న రియల్‌ మార్కెట్‌ పెద్ద నోట్ల రద్దుతో కుదేలయ్యింది. రియల్టర్లు డీలా పడిపోయారు. రియాల్టీ మీదనే వందల కోట్లలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వడ్డీ వ్యాపారులు ఖంగుతిన్నారు. కొందరు బాకీల వసూళ్లకు పరుగులు తీస్తుంటే, ఇంకొందరు లక్షలు, కోట్లలో తిరిగి వచ్చిన అప్పులను తెల్ల ధనంగా ఎలా మార్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. ఇక రియల్‌ ఆధారంగా జరుగుతున్న వ్యాపారాలన్నీ కూడా తగ్గాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి. స్టీలు, సిమెంట్‌ వ్యాపారాల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. వ్యాపారాలు లేక జిల్లాలో వేలాది లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు ఆగిపోయాయి. ప్రజల వద్ద చిల్లర కొరతతో పాటు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేకపోవడంతో మందుబాబులు మద్యం షాపులు, బార్లకు పోవడం తగ్గించేశారు. ఇంతకుముందు రోజూ హాఫ్‌ తాగేవాళ్లు ఇప్పుడు క్వార్టర్‌ లేదా రెండు పెగ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. కూరగాయలు, చిల్లర వర్తకంలోనూ జోరు తగ్గింది. నోట్ల రద్దు ప్రకటించిన పక్కరోజు బంగారు అమ్మకాలు జోరుగా సాగాయి. అయితే బంగారం అమ్మకాలపై పాన్‌కార్డు నిబంధనను పెట్టడంతో ఈ అమ్మకాలు కూడా పడిపోయాయి. చాలాచోట్ల బంగారం దుకాణాలను మూసేసారు.

ముఖ్యంగా లగ్జరీ వ్యాపారాలపై దీని ప్రభావం బలంగా వుంది. ఇంతకుముందు ఆయా ఆటోమొబైల్‌ షోరూమ్‌లలో లగ్జరీ కార్లు, చిన్న కార్లు, బైక్‌ల అమ్మకాలు తీవ్రస్థాయిలో ఉండినాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీల కార్లు డెలివరీకైతే 10 నెలల దాకా గడువు పెడుతూ వచ్చారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కార్లు, మోటార్‌ బైక్‌ల అమ్మకాలు బాగా తగ్గాయి. చేతిలో వున్న చిల్లరను జాగ్రత్తగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రజలు సినిమాలు, షాపింగ్‌లకు పోవడం లేదు. బట్టల కొనుగోళ్లు కూడా తగ్గాయి. రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టుల వ్యాపారం కూడా సగానికి పడిపోయింది. ఆయా వ్యాపార సంస్థలైతే ఈ నెల వ్యాపారాలు లేక తమ సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో వున్నాయి. ముఖ్యంగా జీతాలు ఇవ్వడానికి కొత్త నోట్లు లేవు. పాత నోట్ల రూపంలో జీతాలు ఇవ్వలేరు. రైతులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైర్ల సీజన్‌ కావడంతో ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ సంబంధిత కొనుగోళ్లు ఉంటాయి. వీటి కొనుగోలుకు పాతనోట్లు తీసుకోవడం లేదు, రైతుల వద్దకు కొత్త నోట్లు రావడం లేదు. మొత్తానికి పెద్దనోట్ల రద్దు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. కొత్తనోట్లు, పూర్తి స్థాయిలో చిల్లర అందుబాటులోకి వచ్చినా పడిపోయిన ఈ వ్యాపారాలన్నీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

tdp jandaవైపాకా వాళ్లు 'గడప గడపకు వైకాపా' కార్యక్రమం నిర్వహిస్తుండగా, అధికార తెలుగుదేశంపార్టీ కూడా పోటీగా 'జనచైతన్యయాత్ర'లకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనచైతన్యయాత్రలు మొదల య్యాయి. కోవూరు, వెంకటగిరిలలో ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ యాత్రలు జరుగుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తొలిరోజే కింద పడి చేతికి గాయం కావడంతో యాత్రలు ముగిసేదాకా ఇక ఆయన పాల్గొనలేక పోవచ్చు. తన నియోజకవర్గ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడని తెలిసినా, ఆ వైపుకు రాకుండా మహా రాష్ట్రలో తన కాంట్రాక్ట్‌ పనులు చూసుకునే ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు యధావిధిగా జనచైతన్య యాత్రల ప్రారంభానికి రాలేదు. ద్వితీయశ్రేణి నాయకులే ఇక్కడ జనచైతన్య యాత్రలు చేస్తున్నారు. ఆత్మకూరులో ఆనం రామ నారాయణరెడ్డి, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎంతో హుషారుగా యాత్రలు జరుగుతున్నాయి. కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు నగరం, నెల్లూరురూరల్‌ నియో జకవర్గాలలో కూడా ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వ ర్యంలో జనచైతన్యయాత్రలు మొదల య్యాయి. ఈ యాత్రలు మండలస్థాయి నేతలకు అగ్నిపరీక్షగా మారాయి. యాత్ర లకు జనాన్ని తీసుకొచ్చే బాధ్యత వారిదే కావడంతో ఎక్కడికక్కడ జనాలను తర లించడానికి వాళ్లు నానా తంటాలు పడుతున్నారు.

Page 3 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter