నెల్లూరులో నేడు (138)

Friday, 02 September 2016 08:20

వృక్ష విలాపం

Written by

vilapamపర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్ధులు కావాలని, మొక్కలను విస్తారంగా నాటి వాటిని పరిరక్షించాలని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం అదేపనిగా నిత్యం చెప్తూనే వున్నా, నెల్లూరు నగరానికి మాత్రం ఆ మాటలు వర్తించవు అన్నట్లుంటుంది ఇక్కడి అధికారుల పరిస్థితి. రోడ్డు విస్త రణకు.. విద్యుత్‌ తీగలకు అడ్డుగా వున్నా యంటూ ఆదివారం నెల్లూరులోని పొదల కూరు రోడ్డులోని క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో వున్న పలు పచ్చటి చెట్లను నిర్దయగా కొట్టివేశారు. వైర్లకు అడ్డం లేకుండా కొమ్మలను సరిచేసే విధానా లున్నా, చిత్తం వచ్చిన రీతిలో వాటిని కొట్టే స్తుండడం చూసి ప్రజలు విస్తుపోయారు. ఇలా ఒక్క నెల్లూరులోనే కాదు, జిల్లాలో అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఎప్పుడు ఎవరికి అడ్డమని అనిపిస్తే వారు చెట్లను నరికి వేస్తుండడం సర్వసాధారణమైపోయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీడనిస్తూ వున్న పెద్దపెద్ద చెట్లను, మహావృక్షాలను కూడా దేనికోదానికి అడ్డమని అడ్డంగా నరికివేయడం మామూలైపోయింది. అయినా... నోరు లేని చెట్లు.. తమ బాధని ఎవరికి చెప్పుకోగలవు?.. ఏమని చెప్పు కోగలవు?..వృక్షో రక్షతి రక్షిత: అంటూనే.. వృక్షాలను భక్షిస్తున్న వారిని చూసి ప్రకృతి మాత హృదయం క్షోభించదా?.. చిన్ని చిన్ని మొక్కలను నాటేందుకు భలే శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం, సంవత్సరాల నాటి వృక్షాలు ఇలా మానవుని నిర్దయకు నేలకూలిపోవాల్సిందేనా?..అని ప్రజలు, పర్యావరణ పరిరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు గడిస్తే కానీ ఒక మొక్క వృక్షంగా ఎదగదే.. అలాంటిది ఏళ్ళతరబడి వున్న వృక్షాలను, ప్రజలకు నీడనిస్తున్న చెట్లను ఇలా అడ్డ దిడ్డంగా నరికివేసి, మరోవైపు పర్యావరణను పరిరక్షించాలంటూ.. చిన్న చిన్న మొక్కలు నాటుకుంటూ కూర్చోవడం ఏమిటో పాలకులకే తెలియాలనే విమ ర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో రోడ్లమధ్యలో ఒకవేళ పెద్దపెద్ద చెట్లే వున్నా వాటిని సైతం పరిరక్షించుకుంటూ, ఆ వృక్షాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికా బద్ధంగా రోడ్డునే పక్కకు మార్చి వేసుకుం టారే తప్ప ఆ వృక్షాలను నాశనం చేసు కోరు. మనదే ఎక్కడ లేని విపరీతం!.. ఇంతకాలం మనకు నీడనిచ్చిన చెట్లని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా నరికి వేయడం మనకే చెల్లింది. వృక్షో రక్షతి రక్షిత: అనే మాటను యధార్థం చేయాలంటే వృక్షాలను పరిరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం. చెట్ల పరిరక్షణకు కఠినమైన చట్టాలుంటే తప్ప చెట్లకు రక్షణ వుండనే వుండదు. ప్రభుత్వానికి చిత్త

శుద్ధి వుంటే వెంటనే అలాంటి చట్టాలకు పదునుబెట్టాలి. ఏదేమైనా..ఇంతకాలం మనకు చల్లటి నీడనిచ్చిన మన చెట్లను మనమే నరికేసుకోవడం ఏపాటి విజ్ఞతో అందరూ ఆలోచించుకోవాలి!...

vasanthaఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన, జీవనోపాదుల ఎగ్జిక్యూటివ్‌ కమిటి మెంబర్‌గా వసంతలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అండ్‌ రీసర్చి సెంటర్‌ అధినేత్రి, హై కోర్టు న్యాయవాది అయిన డా|| టి.వసంత లక్ష్మిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నియమించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లూరు పొగతోటలోని వసంతలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వసంతలక్ష్మి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కష్టాలు కన్నీళ్లలో వున్న అర్హులైన మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులను అక్కున చేర్చుకుని నిర్భాగ్యు లైన వారి జీవితాల్లో ట్రస్టు ద్వారా మంచి భవిష్యత్తును అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణ పేదరిక నిర్మూ లన సంస్థ మంత్రి నారాయణ సహకా రంతో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా తనను ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా నియమించడం ఆనందంగా వుందన్నారు.

సమాజంలో ప్రజలందరి సహాయ సహకారాలతో, జిల్లా అధికారుల సమన్వ యంతో పేద, బడుగు వర్గాల యువత, మహిళల జీవనోపాదులు పెంచే విధంగా, వారి పేదరికాన్ని జయించే రీతిలో ప్రభుత్వ పథకాలను అమలయ్యే విధంగా చూస్తానని, తద్వారా సమాజంలో పేదరిక నిర్మూలనకు తనవంతు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

muvvaఎక్కడ పనిచేస్తున్నా వివాదాలను తన కేరాఫ్‌ అడ్రస్‌గా మలచుకున్న మువ్వా రామలింగం మళ్ళీ నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చాడు. పైస్థాయిలో పైరవీలు జరిపి, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో పట్టుబట్టి మళ్ళీ ఆయన ఈ జిల్లాకే రాగలిగాడు. ఎక్కడున్నా విద్యాశాఖను భ్రష్టు పట్టిం చడంలో మువ్వా రామలింగంకు ప్రత్యేక మైన పేరుంది. పదిహేనేళ్ల క్రితమే ఆయన ఇక్కడ డిప్యూటీ డిఇఓగా పనిచేస్తూ ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. సంతపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌నే కార్యాలయంగా మార్చుకుని ఎన్నో అక్రమా లకు తెరతీశాడు. ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు జరిపాయి. డిఇఓగా పదో న్నతి పొందిన తర్వాత చిత్తూరుజిల్లాలో డిఇఓగా పని చేశాడు. ఈయన అక్రమాల దెబ్బకు అక్కడ జడ్పీ పాలకవర్గ సభ్యులు ఇతని మీద జడ్పీ సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం పెట్టించి బదిలీ చేయించారు. ఆ తర్వాత 2007లో గుంటూరు డిఇ ఓగా, 2008లో కర్నూలు డిఇఓగా పని చేశాడు. గుంటూరులో లంచం తీసు కుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు. కర్నూలు లోనూ ఉపాధ్యాయ సంఘాలతో గొడవలు పడ్డాడు. కొంతకాలం ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2011 జూన్‌లో నెల్లూరు డిఇఓగా వచ్చాడు. 2014 ఏప్రిల్‌ దాకా పని చేశాడు. ఈమధ్య కాలంలో ఉపా ధ్యాయులకు, ఉపాధ్యా సంఘాలకు చుక్కలు చూపించాడు. రామలింగం ఇక్కడున్నంతకాలం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక ఉపాధ్యాయ సంఘం ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన జరిపింది. ఈయన అక్రమాలపై విచారణ జరిపించి అప్పటి కలెక్టర్‌ శ్రీకాంత్‌ ఇతనిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఏడాది పాటు సస్పెన్షన్‌లో వున్న రామలింగం ఆ తర్వాత ప్రకాశం డిఇఓగా పోస్టింగ్‌ తెచ్చు కున్నాడు. ఆ తర్వాత అక్కడా గొడవపడి మున్సిపల్‌ స్కూల్స్‌, ఐఐటి ఫౌండేషన్‌ కోర్సు ఏఓగా బదిలీ అయ్యాడు. గత కొంత కాలంగా ఆయన తిరిగి నెల్లూరుకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా గంటా నెల్లూరు జిల్లాకు తొలి సారి వచ్చినప్పుడు 'మీ మిత్రుడు' పేరుతో జిల్లాలో ఆయనకు భారీఎత్తున స్వాగతం ఫ్లెక్సీలు పెట్టించింది కూడా మువ్వా రామలింగమేనని సమా చారం. జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు, ఆఖరకు జిల్లా తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా గంటా ఆశీ స్సులతో మువ్వా రామలింగం నెల్లూరుకు రావాలన్న పంతం నెగ్గించుకున్నాడు. కాకపోతే జిల్లాలోని ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకే ఇక మనశ్శాంతి ఉండదు.

nellore railwayస్వచ్ఛభారత్‌లో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది మనకు మనం తగిలించుకున్న ఘనత కాదు. కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక బృందం పరిశీలించి ఇచ్చిన సర్టిఫికేట్‌ ఇది. దేశంలో 407 ప్రధాన రైల్వేస్టేషన్‌లను కేంద్ర బృందం పరిశీలించింది. వారి పరిశీలనలో నెల్లూరు రైల్వేస్టేషన్‌లో పరిశుభ్రత నిర్వహణకు మంచి మార్కులే పడ్డాయి. నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఏపిలో మొదటి స్థానంలోనూ, దేశంలో 28వ స్థానంలోనూ నిలిచింది.

jaganవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆగష్టు 1, 2, 3తేదీలలో నెల్లూరులో ఉండబోతున్నాడు. 1, 2తేదీలలో మినీబైపాస్‌ రోడ్డులోని అనిల్‌ గార్డెన్స్‌లో జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, స్థానిక సమస్యలు, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో చర్చించనున్నారు. అలాగే 3వ తేదీ కెవిఆర్‌ పెట్రోల్‌బంక్‌ సెంటర్‌లోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో ప్రత్యేకహోదా సాధనలో భాగంగా జరిగే యువభేరి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. జగన్‌ పర్యటనను జయప్రదం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

mkరుచికి, శుచికి, శుభ్రతకి, నాణ్యతకి నమ్మకంగా నెల్లూరీయుల అభిరుచులకు చిరునామాగా గత 46సంవత్సరాలుగా ఆదరింపబడుతున్న మురళీకృష్ణ హోటల్స్‌ యాజమాన్యం మద్రాసు బస్టాండు ప్రాంతంలోని ప్రకాశం పంతులు కాంప్లెక్స్‌లోగల వెజిటేరియన్‌ హోటల్‌ని కొద్దికాలం మూసివేసి ఆధునిక హంగులతో జూలై 21వ తేదీ(నిన్న) గురువారం ఉదయం పునఃప్రారంభించారు. ఆధునిక వసతులతో పాటు కొంత భాగాన్ని ఎయిర్‌కండిషన్‌ చేశారు. పూర్తి స్థాయిలో శాఖాహార ఫలహార భోజనాలను సరఫరా చేసే ఈ హోటల్‌ను సంస్థ వ్యవస్థాపకులు గ్రోసు గోపాలయ్య ప్రారంభించారు. మురళీకృష్ణ కుటుంబం గోపాలయ్య, హజరత్‌బాబు, సుబ్బారావు, మురళి, చైతన్యకృష్ణ, మురళీకృష్ణల సారధ్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. వందలాది మంది గోపాలయ్య ఆప్తులు, మురళీకృష్ణ అభిమానులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

గోపాలయ్యే స్వయంగా రిబ్బన్‌ కత్తిరించి హోటల్‌ని పునఃప్రారంభించిన ఈ వేడుకలో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఓయస్‌డి పెంచలరెడ్డి, కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పుట్టా రామకృష్ణారెడ్డి, యం.జి.బ్రదర్స్‌ అధినేత గంగాధరం, నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, పట్టణంలోని వివిధ హోటల్స్‌ అధినేతలు, వైద్యులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

వచ్చిన ప్రతి అతిథిని మురళీకృష్ణ కుటుంబం ఆప్యాయంగా పలుకరించి స్వాగతం పలికారు. నాలుగున్నర దశాబ్దాలుగా నెల్లూరీయుల మనసుల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న మురళీకృష్ణ కుటుంబానికి ''లాయర్‌'' అభినందనలు.

Friday, 08 July 2016 07:27

'దేశం'లో పదవుల గోల

Written by

nellore tdp leadersతెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కిలారి వెంకట స్వామినాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవి దక్కింది. ఈమేరకు ఆయనకు పార్టీ మహారాజు చంద్రబాబు, యువరాజు లోకేష్‌ల ఆశీస్సులు లభించాయి. సొర చేపకు గాలం వేస్తే పిత్తపరిగ పడినట్లు కిలారికి ఈ పదవి దక్కింది.

2014 ఎన్నికల్లో నెల్లూరురూరల్‌ సీటు కోసం ఆయన ప్రయత్నించాడు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ పెత్తనం చెలాయిద్దామనుకుంటే, దానిని ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌ ఛైర్మెన్‌ పదవన్నా ఇమ్మని చాలారోజుల నుండి మొత్తుకుం టున్నాడు. అయితే ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున ఆ పదవిని ఇవ్వలేమని చెప్పి, జిల్లాలో ఎవరూ పెద్దగా డిమాండ్‌ చేయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవిని మాత్రం కట్టబెట్టారు. దీనికి నిధులు, విధులు పెద్దగా లేకపోయినా పుస్తకాలు, ప్రోటోకాల్‌ మర్యాదలు దండిగా ఉంటాయి.

సమన్వయం లేకుండానే...

అయితే కిలారి ఎంపిక కేవలం మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రమేయంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇది జిల్లా స్థాయి పదవి. జిల్లాలో సమన్వయ కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల ఆమోదం కూడా తీసుకుని వుండాలి. అయితే వీళ్లెవరి అభిప్రాయాలు తీసుకోలేదు. దీంతో మిగతా నాయకులంతా కూడా ఈ ఎంపిక పై మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

బి.సి, దళితులకు మొండిచేయేనా?

జిల్లా నుండి మరో నలుగురికి త్వరలో నామినేటెడ్‌ పదవులు దక్కే సూచనలు న్నాయి. వీరిలో తాళ్లపాక అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, దేశాయిశెట్టి హనుమంత రావుల పేర్లున్నాయి. అనూరాధకు స్త్రీ శిశు సంక్షేమశాఖలో రాష్ట్రస్థాయి పదవి ఇవ్వ నున్నారు. అలాగే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని బాల కృష్ణ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కోవూరు నియో జకవర్గంలో పార్టీ కేడర్‌కు అండగా నిలిచిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేరు కూడా నామినేటెడ్‌ పదవికి పరిశీలనలో వుంది. ఇక రెండుసార్లు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేసి ఆర్ధికంగా నష్టపోయిన దేశాయిశెట్టి హనుమంతరావుకు కూడా నామినేటెడ్‌ పదవి దక్కొచ్చు. అయితే వీరంతా అగ్ర వర్గాలవారే!

పార్టీలో దళితులు, మైనార్టీలు, బల హీనవర్గాల నాయకులు కూడా వున్నారు. అగ్రవర్ణాల నాయకులతో పాటు వీళ్లు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయితే తొలిదశ నామినేటెడ్‌ పదవుల్లో ఈ వర్గాల నాయకులెవరి పేర్లు పరి శీలనలో లేనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వర్గాల వారిలో అసంతృప్తి వ్యక్త మవుతోంది.

jiyarదాదాపు వెయ్యేళ్ళ క్రితమే సమాజాన్ని ఆధ్యాత్మిక తత్వంతో ఎంతగానో ప్రభావితం చేసి, లోకమంతా సమతా మమతలు వెల్లివిరియాలని సమసమాజ స్థాపనకు కృషిచేసి..జగతికి వెలుగుబాటలు పరచిన మహా సంఘసంస్కర్త.. సమతామూర్తి భగవద్రామానుజాచార్యులవారి సహస్రాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన నెల్లూరులోని విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, ప్రముఖ దాత.. ఆధ్యాత్మికవేత్త శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరమహంస పరివ్రాజకులు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక సదస్సుకు నెల్లూరు-గొలగమూడి రోడ్డులో వున్న విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. ఆధ్మాత్మికత వుట్టిపడే ఈ సదస్సుకు స్థానిక ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రజలు పెద్దఎత్తున తరలిరానున్నారు.

సమాజ సంస్కరణాభిలాషతో వందల ఏళ్ళ క్రితమే సమాజంలో కులతత్వ నివా రణకు కృషి చేసి, సమాజానికి ఆధ్యాత్మిక సుగంధం పూసే పలు విశిష్టమైన గ్రంథా లను రచించి, తన బోధలతో.. రచనలతో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మహనీయుడు శ్రీ భగవద్రామానుజస్వామి వారు. ఆ మహానుభావుడు జన్మించి 2017 నాటికి వెయ్యేళ్ళవుతున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రవచనాలను ప్రపంచానికంతా పున:పరిచయం చేయా లనే సదాశయంతో శ్రీ త్రిదండి చిన్న శ్రీమ న్నారాయణ రామానుజ జియ్యర్‌స్వామి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ బృహత్‌ కృషిలో భాగంగా, హైదరాబాద్‌ సమీపం లోని శంషాబాద్‌ ఆశ్రమంలో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో భగవద్రామానుజా చార్యుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కంకణం కట్టుకున్నారు. వచ్చే ఏడాది అక్కడ 216అడుగులు ఎత్తున శ్రీ రామా నుజస్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 'స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ' పేరుతో ఇంత భారీఎత్తున నిర్మించే ఆ 'సమతామూర్తి' విగ్రహం ఏర్పాటుకే కనీసం నూరుకోట్ల రూపాయల దాకా వ్యయమవుతుందని భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా వ్యయమవుతాయని అంచనా. మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో చిన్నజియ్యర్‌ స్వామివారు కృషి చేస్తున్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీ రామా నుజులస్వామివారి దివ్యక్షేత్రాలు వుండా లనే ఆకాంక్షతో విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై కూడా 108 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజుల స్వామివారి సుధామూర్తి (సిమెంట్‌ విగ్రహం) ఏర్పా టుకు కూడా కృషి చేస్తున్నారు. ఈ సంద ర్భంగా శ్రీ రామానుజులవారు రచించిన బృహత్‌ గ్రంథాలను, భాష్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీ భగవద్రామానుజస్వామివారి సహస్రాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 5న గొలగమూడిరోడ్డులో వున్న విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రముఖ దాత.. ఆధ్యాత్మికవేత్త శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సారథ్యంలో పెద్దఎత్తున 'ఆధ్యాత్మిక సదస్సు' ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామివారి ప్రవచనాలు.. మంగళాశాసనం వుంటాయి.

భావితరాలకు స్ఫూర్తినిస్తూ, ఆధ్యాత్మిక రంగానికి అనితరసాధ్యమైన సేవలందించి అజరామర కీర్తినార్జించిన భగవత్‌ రామా నుజాచార్యులవారు నాటి తరానికే కాదు.. నేటి తరానికీ.. భావితరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత.. ఆ మానవతా దీప్తిని.. సమతా మూర్తిని స్మరించుకుంటూ.. సింహపురీయు లందరికి శ్రీ రామానుజస్వాములవారి దివ్యబోధలను తెలుసుకునే సదవకాశాన్ని కల్పించేందుకు సద్భక్తితో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఏర్పాటుచేస్తున్న ఈ సదస్సుకు భక్తులు..ప్రజలు..ప్రముఖులు అందరూ తరలిరావాలని విపిఆర్‌ ఫౌండేషన్‌ సమా దరంతో స్వాగతిస్తోంది.

'ఆధ్యాత్మిక సదస్సు' కార్యక్రమ వివరాలు:

విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ ఆధ్యాత్మిక సదస్సు కార్యక్రమ వివరాలిలా వున్నాయి. 5వతేది మంగళవారం ఉదయం 9 నుంచి 9.30గంటల దాకా పూజా కార్యక్రమం వుంటుంది. అనంతరం 10 నుంచి 10.30 గంటల దాకా ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌చే భక్తిగీతాలాపనలు వుంటాయి. ఆ తర్వాత, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామివారిచే 'భగవత్‌ రామా నుజులవారి సహస్రాబ్ధి సందేశం' వుంటుంది.

అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసాంతం విని.. జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి.

knr schoolఈరోజు సర్కార్‌ బళ్లు ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయో చూస్తూనే వున్నాం. ఒక్కో స్కూల్‌ను చూస్తుంటే అయ్యవార్లకు జీతాలు దండగనిపిస్తుంది. 20 నుండి 60వేల వరకు జీతాలు తీసుకుంటున్న టీచర్లుంటున్న సర్కార్‌ స్కూళ్లలో పిల్లలు ఉండడం లేదు. ఇక్కడంతా బి.ఇడి పూర్తయిన టీచర్లే. అనుభ వజ్ఞులే. కాని ఏం లాభం. విద్యార్థులు లేకుండా చదువులను గోడలకు చెట్లకు చెప్పుకోవాల్నా? మరి 5వేల నుండి 10వేల లోపు జీతాలు తీసుకుంటూ బి.ఇడి కూడా దాటని టీచర్లుంటున్న ప్రైవేట్‌ స్కూళ్లలో మాత్రం విద్యార్థులు మందలు మందలుగా ఉంటున్నారు. తేడా ఏంటంటే అక్కడ ప్రభుత్వ యాజమాన్యం, ఇక్కడ ప్రైవేట్‌ యాజమాన్యం.

ప్రభుత్వ చదువులు చట్టబండలవుతూ, సర్కార్‌ స్కూళ్లలో విద్యార్థులు కరువవుతున్న నేటికాలంలో కూడా నెల్లూరులోని ఓ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో సీట్లకు డిమాండ్‌ పెరగడం ఆశ్చర్యం గొలిపే విషయమే! నెల్లూరు, బి.వి.నగర్‌లోని కురుగంటి నాగిరెడ్డి నగరపాలక ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఇది. నగరం లోనే ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వుంది. ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉపాధ్యాయులు ఇక్కడ విద్యాబోధన చేస్తుంటారు. అంతేకాదు పరీక్షలలో మంచి ఫలితాలను కూడా సాధిస్తుంటారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో ఈ స్కూలు విద్యార్థి ఒకరు పదికి పది పాయింట్లు సాధించడమే కాదు, ఎక్కువ శాతం మంది విద్యార్థులు 9కిపైగా పాయింట్లు సాధించడం విశేషం. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఐఏఎస్‌, ఐఆర్‌టిఎస్‌ వంటి ఉన్నత స్థానాలను కూడా సాధించి వున్నారు. ఇక వివిధ వృత్తులలో రాణిస్తున్న వారికైతే కొదవే లేదు. ఈ పాఠశాల సాధిస్తున్న మంచి ఫలితాలు,

స్కూల్‌ వాతావరణం చూసి ఉన్నత, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు కూడా తమ పిల్లలను ఇక్కడ చేర్చడానికి ఉత్సాహం చూపించారు. కాబట్టే ప్రతి ఏటా ఈ స్కూల్‌లో 1400మందికి తక్కువ కాకుండా విద్యార్థులుంటున్నారు. ఈ ఏడాది అయితే 7 నుండి 10వ తరగతి వరకు సీట్లు ఖాళీయే లేవు. సీట్ల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు రావడంతో 'సీట్లు లేవు' అంటూ ప్రధానోపాధ్యా యులు ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ప్రభుత్వ విద్యను బ్రతికించుకోవాలంటే ఇలాంటి స్కూళ్లను లోకానికి చూపాలి. ఆధునిక విద్యకు దీనిని కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చాలి. ప్రతి సర్కార్‌ బడిని ఈ స్కూల్‌ మాదిరిగా చేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి లక్షల రూపాయలు మిగిల్చిన వాళ్లవుతారు.

vegetablesసామాన్యుడి జీవనం రానురాను మరింత దుర్భ రంగా తయారవుతోంది. ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోకపోవడంతో నిరుపేద, సామాన్యుల జీవన యాత్ర రోజురోజుకీ వ్యయభరితమై దయనీయంగా మారుతోంది. మార్కెట్లోకెళ్ళి ఏం కొనాలన్నా, తినా లన్నా భగ్గుమంటున్న ధరలతో ప్రజలు నిత్యం బాధపడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా ఈ పెరిగిపోతున్న ధరలకు విలవిలలాడిపోతున్నా రంటే అతిశయోక్తి కాదు. చివరికి మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలు కొందామనుకున్నా, జేబు నిండా డబ్బులుండాల్సిందే. ఏ కూరగాయలు కొందామన్నా ధరలు ఆకాశానికంటుతున్నాయి. నెలనెలా ఈ ధరలు మరింత పేట్రేగిపోతున్నాయి. మూడు నెలల క్రితం కిలో వంకాయలు 20రూపాయలుంటే, ఇప్పుడు ఏకంగా 35 రూపాయల దాకా వుంది. అదేవిధంగా 15రూపాయలున్న ఉల్లగడ్డలు ఇప్పుడు 45 రూపా యలు పెట్టందే రావడం లేదు. ఇక పచ్చిమిర్చి ఘాటు చెప్పనే అక్కరలేదు. మూడునెలల క్రితం 20 రూపాయలున్న ధర ఇప్పుడు భారీగా 80కి పెరిగింది. ఇలా ఏ రకం కూరగాయలు కొనాలన్నా ఈ మూడు నెలల్లోనే రెండింతలు, మూడింతలు పెరిగి పోయాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు సంపాదించే నెలవారీ సంపాదన ఏమాత్రం పెరగక పోయినా, ఇలా నిత్యావసరాలు, కూరగాయలు,

ఉప్పు పప్పు ధరలన్నీ పెరిగిపోతుంటే జీవితాలు ఎలా గడవాలో, కుటుంబాలనెలా పోషించుకోవాలో తెలియక ప్రజలు పడే బాధలు వర్ణనాతీతంగా వున్నాయి. ప్రజలకు నిత్యం అవసరమైన వంట సరకులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వగైరాల ధరలన్నీ ఎవరి చిత్తానుసారం వారు భారీగా పెంచుకుంటూపోతున్నా అడిగే నాధులు లేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలకు రవాణా ఖర్చులు వగైరాలన్నీ పోను, కిలోకి న్యాయమైనరీతిలో ఆదాయం వేసుకుని ధరలు నిర్ణయించకుండా, ఏదో ఒక సాకు చెప్పి భారీ ధరలుచెప్తూ, కొంటే కొనండి లేకపోతో మానండి అన్నట్లుండే వ్యాపారుల తీరు మరింత బాధాకరం. జిల్లా ఉన్నతాధికారులు ఒకసారి ఫలసరుకుల ధరలపై, కూరగాయల ధరలపై దృష్టి సారించి, వాటి ధరలను నియంత్రించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోతే, ఇక ఎంత గొప్పవారైనా కూరగాయలను కొనే పరిస్థితి కూడా వుండదన్నా ఆశ్చర్యం కాదు. ఏ కూరగాయలు మార్కెట్‌కు ఏ ప్రాంతం నుంచి వస్తాయి?.. వాటి అసలు ధర ఎంత?.. రవాణా ఖర్చులెంత?.. దుకా ణాల నిర్వహణకు ఖర్చయ్యేదెంత?.. చివరికి ఆదాయం ఎంత?.. అనే వాటిపై కూలంకుషంగా ఆరా తీసి, న్యాయమైన ధరలు నిర్ణయించాల్సి వుంది. ధరలను నియంత్రించేందుకు గతంలో అధికారులు కాస్తంత శ్రద్ధ తీసుకున్నారు కానీ, ఇప్పుడా పరిస్థితి కనుమరుగైపోయింది. మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో పరిశీలిస్తూ, వినియోగ దారులకు న్యాయమైన ధరలతో కూరగాయలు, సరుకులు అందించాల్సిన అధికారగణం అసలు ఆ పరిస్థితులనే పట్టించుకోకపోవడం, ఒకవేళ ఎప్పుడైనా పట్టించుకున్నా కొద్దిరోజులకే మళ్ళీ పరిస్థితి యధా విధిగా మారడం మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కూరగాయలను పండించే రైతుల వద్ద వ్యాపారులు అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసి, మార్కెట్‌కు తీసుకువచ్చి అత్యంత ఎక్కువ ధరలకు విక్రయించుకుంటున్నా అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు, వర్తకప్రముఖులు, సమాజసేవకులు అందరూ కలసి ఒక బృందంగా ఏర్పడి, ఏ రోజుకారోజు ధరలను సమీక్షించి, న్యాయమైన ధరలను ప్రతిరోజూ ప్రకటించి, ఆ ధరలకే కూరగాయలు కానీ, ఇతరత్రా సరుకులు కానీ విక్రయించే ఏర్పాటు వుంటే బావుం టుందనేది పలువురి సూచన. కూరగాయల ధరలపై ఎప్పటికప్పుడు పారదర్శకంగా వుండేలా ఏరోజు ధరలను ఆరోజు మార్కెట్లలో బోర్డులు ఏర్పాటుచేసి ప్రకటించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇలా బోర్డుల ద్వారా, ఏరోజు ధరలు ఆ రోజు 'నెట్‌' ద్వారా, సెల్‌ఫోన్‌ల ద్వారా ప్రజలకు తెలియజేయడం వల్ల ఏ రకం కూరగాయల ధరలు ఎక్కువ లేదా తక్కువ వున్నాయో ప్రజలకు అర్ధమవుతుంది. తమవద్ద వున్న డబ్బును బట్టి వారు ఆ రకం కూర గాయలు కొనేందుకు సిద్ధమవుతారు కూడా. ఇలా అధికారికంగా, ఏ కూరగాయలు ఏ ధరతో వున్నాయో తెలుసుకుంటే వినియోగదారులకు ఇక బేరమాడాల్సిన అవసరం కూడా వుండదు. అంతేకాదు, అధికారుల అనుక్షణ పర్యవేక్షణ ఏర్పాటు చేసినప్పుడు ఏ కూర గాయల ధర అయినా న్యాయబద్ధంగా వుంటుంది కనుక, ధరలు భారీగా పెరగకుండా ఎప్పటికప్పుడు నియంత్రించే అవకాశం కూడా ఆ కమిటీకి వుండేలా చూడాలి. అలా కాకుండా, తింటే తింటారు లేకుంటే లేదు..అన్నట్లుగా, ఎవరూ పట్టించుకోకపోతే పేదలు, సామాన్యుల జీవన పరిస్థితి ఏం కావాలో అధికారులు ఆలోచించాల్సివుంది. ఏ సరుకైనా సరే, మార్కెట్లో ఎంత ధర చెప్తే అంత ధరకు కొనాల్సిరావడం, లేకుంటే 'భలే కొన్నారులెండి..మాకేం తేరగా రాలేదు పోండి'..అనే ఈసడింపు మాటలను తరచూ ఎదుర్కో వడం ప్రజలకు ఎంత దుర్భరంగా వుంటోందో అధికారులు మార్కెట్లలోకి వచ్చి గమనిస్తే తెలుస్తుంది. మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ రోజు పరిస్థితిని బట్టి ఏ నిమిషానికి ఆ నిమిషం ధరను భారీగా పెంచుకుంటూ పోతుండడం న్యాయమా?.. అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పండగో, పబ్బమో వస్తే పూలు, పండ్లు కొందామన్నా భయమే. వీటి ధరలను ఇక ఎవరూ పట్టలేరు. ఒక్క నెల్లూరు నగరంలోనే కాదు, జిల్లావ్యాప్తంగా ఇదే దుస్థితి. అన్ని ప్రాంతాల్లోనూ ధరల నియంత్రణకు కళ్ళెం వేసే నాధులే కన్పించడం లేదు. దీంతో, సామాన్యుని జీవనం రానురాను మరింత దుర్భరంగా తయా రవుతోందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లని అటు రైతులు కానీ, ఇటు వ్యాపారులు కానీ ఏమీ నష్టపోనక్కరలేదు. ప్రజల కోరికల్లా ఒకటే.. న్యాయమైన ధరలకు సరుకులు అందాలన్నదే. అందుకు ప్రభుత్వ అధికారులతో పాటు, న్యాయ నిపుణులు.. వర్తక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరూ కలసి శాశ్వత ప్రాతిపదికపై ఒక కమిటీగా ఏర్పడి, ఏరోజుకారోజు న్యాయమైన ధరలను నిర్ణ యించి వినియోగదారులకి అందజేస్తే వినియోగ దారులకు ఎంతో ఉపయోగంగా వుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు అనునిత్యం అవసరమైన కూరగాయల ధరలు, ఆకుకూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, పండ్లు..పూల ధరలను తక్షణం తగ్గించేందుకు అధికారులు కృషి చేయాల్సివుంది. ఒకవేళ ధరలు అప్పటికప్పుడు మారితే ఆ మార్పు కూడా అందరికీ వెంటనే తెలిసేలా సమాచారం అందుబాటులో వుంచాలని ప్రజలు కోరుకుంటు న్నారు. విశ్వవ్యాప్తంగా సమాచార వ్యవస్థ ఎంతో అధునాతన రీతిలో అందుబాటులోకి వచ్చిన నేటి ఆధునిక కాలంలో నిత్యం మార్కెట్లకు వెళ్ళి కూర గాయలు, సరుకులు కొనేందుకు వస్తున్నా...ఏ ధర ఎంత వుందో వినియోగదారులకు ముందుగానే తెలుసుకోలేని పరిస్థితి లేకపోవడం విచారకరం. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో మన వెనుకబాటుతనానికి ఇది మరో నిదర్శనం. ఇకనైనా జిల్లా అధికారయంత్రాంగం వినియోగదారులకు ప్రతిరోజూ సరుకులు, కూరగాయల ధరలు వగైరా లను అందుబాటులో వుంచేందుకు ఏ విధానం అనుసరిస్తే బావుంటుందో, బోర్డుల ద్వారా, నెట్‌ ద్వారా, సెల్‌ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు ధరలను ప్రజలంతా తెలుసుకునేలా సరికొత్త విధానాలను అనుసరించడం ఎంతైనా అవసరమని ప్రజలు కోరుతున్నారు. ధరల నియంత్రణే వీటన్నిటి లక్ష్యంగా వుండాలని, ఆ మేరకు వినియోగదారులకు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Page 4 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ల్యాండవుతున్న విమానం
  దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
 • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
  వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter