నెల్లూరులో నేడు (123)

doctorsనెల్లూరులో డయాబిటిస్‌ డాక్టర్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్‌ సత్యనారాయణమూర్తి. నెల్లూరు పొగతోటలో ఎన్నో ఏళ్ల క్రితమే డయాబిటిస్‌ క్లినిక్‌ను నెలకొల్పి షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఆయన మెరుగైన వైద్యసేవలంది స్తున్నారు. ఇప్పుడు మరో ముందడుగు వేసారు. డయాబిటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌ను ఈ నెల 22వ తేదీన విజయదశమి నాడు ప్రారంభిస్తున్నారు. సత్యనారాయణమూర్తి అల్లుడు డాక్టర్‌ ఎం.వి.రామమోహన్‌ కూడా ఈ క్లినిక్‌ ద్వారా తమ వైద్యసేవలు అందించనున్నారు. ఈయన డయాబిటిస్‌తో పాటు ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్‌. గతంలో అపోలో వంటి ఆసుపత్రిలో పనిచేసి విశేష అనుభవం గడించారు. షుగర్‌, హార్మోన్స్‌, థైరాయిడ్‌, ఒబెసిటి, బరువు తగ్గడం, నెలవారీ సమస్యలు, పిట్యూటరి సమస్యలు, హైబిపి వంటి వాటికి సరైన చికిత్సనందించడంలో సిద్ధహస్తులు. నగరంలో కార్పొరేట్‌ ఆసుపత్రులలో తప్పితే బయట ఎండోక్రైనాలజీ వైద్యులు పెద్దగా లేరు. డయాబిటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌ ద్వారా ఆ సమస్య తీరబోతోంది.

irukalaసింహపురి గ్రామదేవత, నెల్లూరు నగరంలోని మూలాపేటలో చెరువు ఒడ్డున వెలసిన చల్లనితల్లి..శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.వి శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, ప్రతినిత్యం ఉదయం 6.30 గంటలకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు పూలంగిసేవ, రాత్రి 8 గంటలకు పల్లకీసేవ నిర్వహిస్తారు.

ఎంతో ప్రాచీన చరిత్ర వున్న ఆలయం :

నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ఈ ఆలయం నాటి కాలంలో ఎర్రని బొంతరాళ్ళతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి. ఎంతో ప్రాచీన చరిత్ర వున్న నెల్లూరు నగరంలో క్రీ.శ 10, 11 శతాబ్ధాల నాటికే ఈ ఆలయం వున్నట్లు, అప్పటినుంచే అమ్మవారు గ్రామదేవతగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర చెప్తోంది. అప్పట్లో నెల్లూరు చెరువును స్వర్ణాల చెరువు అని వ్యవహరించేవారు. ఈ చెరువును కాకతి గణపతిదేవుడు నిర్మించారు. ఈ ఆలయంలోని స్తంభాలపై తెలుగు, తమిళ, దేవనాగరి భాషల్లో వున్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రక అంశాలను తెలుపుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.

ప్రతినిత్యం కన్నుల పండువగా అలంకారాలు :

ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి నిర్వహించే విశేషాలంకరణలు భక్తులందరికీ కన్నుల పండువగా వుంటాయి. 13న ఉదయం 10 గంటలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. 14వ తేది నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ఇలా విశేష అలంకారాలను నిర్వహిస్తారు. 14వ తేది సాయంత్రం శ్రీ అన్నపూర్ణాదేవి అలం కారం, 15న శ్రీ గజలక్ష్మీ అమ్మవారి అలం కారం, 16న శ్రీ సరస్వతీదేవి అలంకారం, 17న శ్రీ భవాని అమ్మవారి అలంకారం, 18న శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకారం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వా హకులు తెలిపారు. అదేవిధంగా, 19వ తేది సాయంత్రం శ్రీ చండీ అమ్మవారి అలంకారం, 20న శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం, 21న నవమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి అలం కారం నిర్వహిస్తారు. 22న విజయ దశమిని పురస్కరించుకుని వేడుకగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి అలం కారం నిర్వహిస్తారు.

sp fatherత్యాగరాజ భిక్షువు, సుప్రసిద్ధ సినీ గాయకుడు యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ అక్టోబర్‌ 3వ తేదీ జరగబోతోంది.

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ కస్తూర్భా కళాక్షేత్రంలో ఘంటశాల వెంకటేశ్వరరావు విగ్రహం ప్రక్కన సాంబమూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్‌ 3వ తేదీ తన తండ్రి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో స్వచ్ఛభారత్‌ అవగాహన ర్యాలీని కూడా ఏర్పాటు చేసి స్వచ్ఛభారత్‌ ప్రచారకర్తగా ప్రభుత్వం తనపై వుంచిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో తన స్వంతగడ్డ నెల్లూరు నుండే శ్రీకారం చుట్టబోతున్నాడు యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.

3వ తేదీ శనివారం మధ్యాహ్నం 4గంటల నుండి రాత్రి 9గంటల వరకూ జరిగే వివిధ కార్యక్రమాలకు సంబం ధించిన వివరాలను త్వరలోనే నెల్లూరీయు లకు తెలియజేస్తామని సాంబమూర్తి విగ్రహ కమిటి ఉపాధ్యక్షులు వీరిశెట్టి హజరత్‌బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీ శనివారం నెల్లూరుకు విచ్చేసిన యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షించి, 3వ తేదీ జరుప తలపెట్టనున్న ''స్వచ్ఛభారత్‌'' ర్యాలీ మరియు విగ్రహావిష్కరణ కార్యక్రమ విశేషాలను నెల్లూరుజిల్లా కలెక్టర్‌ శ్రీమతి జానకి, ఎస్పీ శ్రీ గజరావు భూపాల్‌లను కలసి చర్చించారు. దాదాపు 15వేల మందికిపైగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు కూడా కమిటి సభ్యులు తెలిపారు. బాలు వెంట సినీ గేయ రచయిత వెన్నెలకంటి, బాలు బాల్య మిత్రుడు సుబ్బారావు, వీరిశెట్టి హజరత్‌ బాబు, బెజవాడ నరేష్‌చంద్రారెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, డి.హేమంత్‌కుమార్‌, విగ్రహ నిర్మాణ పర్యవేక్షక ఇంజనీర్‌ తాటి చలపతిరావ్‌, మైథిలి మనోహర్‌రెడ్డిలతో పాటు కమిటి ముఖ్యసమన్వయకర్త తుంగా శివప్రభాత్‌రెడ్డి కూడా వున్నారు.

cabయాత్రజిని... ట్రావెల్స్‌ రంగంలో ఓ సంచలనం. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చే రవాణా సంస్థ. నెల్లూరుకు చెందిన 40ఏళ్ల యువకుడు కోమిట్ల రెనిల్‌ కుమార్‌రెడ్డి ఏడాది క్రితం స్థాపించిన సంస్థ ఇది. నెల్లూరు నగరంతోపాటు ఆంధ్రా, తెలంగాణలో అన్ని జిల్లాల్లోని ప్రయాణీకులకు యాత్రజిని బస్‌లు, క్యాబ్స్‌ సేవలంది స్తున్నాయి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోనూ ఈ సంస్థ బస్‌, క్యాబ్స్‌ ప్రయాణీకులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. ఈ నెల 13వ తేదీతో ఈ సంస్థను ప్రారంభించి ఏడాదవుతుంది. ఈ సందర్భంగా ఆరోజు మధ్యాహ్నం 3గంటలకు అయ్యప్పగుడి నుండి మినీబైపాస్‌ మీదుగా క్యాబ్స్‌, బస్సులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని యాత్రజిని సిబ్బంది కోరుతున్నారు.

gramasimhaluనెల్లూరు రోడ్ల మీద మనుషులకంటే కుక్కలు, పందులు, ఆవులు ఎక్కువుగా కనిపిస్తుంటాయి. కోతులుండేది చెట్ల మీద కాబట్టి, వాటిని ఈ లెక్కలోకి తీసుకోలేము. కుక్కలు, పందులు, కోతులు... ఈ మూడు జాతుల జీవాలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. నగరం నడిబొడ్డులోని ప్రాంతాల్లో కూడా కోతులు తిష్టేసివున్నాయి. ఏదో ఒక సందులో నుండి ఇళ్లల్లో దూరడం, దొరికిన వస్తువులను, ఆహారపదార్ధాలను తీసుకోవడం, ఇళ్లను గందరగోళం చేయడం పరిపాటైంది.

ఇక నగర సందుల్లో పందులైతే మందలు మందలుగానే వుంటున్నాయి. పంది ఒకే ఈతలో పది కంటే ఎక్కువ పిల్లల్ని కంటుంది. దీంతో పందుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పందులు కాసేవాళ్లు నగరంలోని ముఖ్యమైన కాలనీల్లోనే

ఉంటున్నారు. తమ ఇళ్ల వద్దనే పందులను పెంచుతున్నారు. ఈ పందులు అన్ని వీధుల్లో తిరుగుతూ తామూ నగరపౌరులమే అన్నట్లుగా విహరిస్తున్నాయి. పందుల మూలంగా అనేక జబ్బులు ప్రబలుతున్నాయని తెలిసినా వీటిని పట్టుకుని తరలించలేని నిస్సహాయస్థితిలో నెల్లూరు నగరపాలక సంస్థ వుంది. ఆమధ్య అధికారులు స్పందించి కొన్ని ప్రాంతాల్లో పందులను పట్టి లారీల్లోకి ఎక్కించి నగర శివార్లలో వదలాలని చూసారు. పందుల పెంపకందార్లు ఆ లారీలకు అడ్డంపడి పందులను విడిపించుకుపోయారు. పందుల పెంపకం ఒక వ్యాపారం. వాటి యజమానులుంటారు. కాబట్టి అడ్డం పడతారు. మరి వీధికుక్కలను పట్టి దూరంగా వదిలేయడానికి ఉన్న ఇబ్బందేమిటి? నగరంలోని అన్ని ప్రాంతాల్లో కుక్కలు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా తిరుగుతున్నాయి. ఎక్కడన్నా కుక్కల గుంపుందంటే ఆ వీధిలో పోవడానికి జనం భయపడుతున్నారు. ఇటీవలే మూలాపేటలో కుక్కలు కరిచి 11మంది గాయపడ్డారు. మాగుంట లే అవుట్‌ కింగ్స్‌కోర్టు అవెన్యూలోనూ కొందరిని కుక్కలు కరిచాయి. నగర శివారు కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువుగా వుంది. ముఖ్యంగా చిన్నారులు ఒంటరిగా స్కూళ్లకు వెళుతుంటారు. కుక్కల బెడద ఎక్కువ కావడంతో తల్లి దండ్రులు భయపడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి అన్ని ప్రాంతాల్లో కుక్కలు, పందుల బెడదను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాల్సి వుంది.

jsreddyగత 18సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రముఖులకు ఇస్తూ వస్తున్న ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు ఈ యేడాది ప్రముఖ కాంట్రాక్టర్‌ జెయస్‌ రెడ్డికి ఇస్తున్నారు. జె.యస్‌.రెడ్డి క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రాంగణంలో జక్కా సుజాతమ్మ క్యాన్సర్‌ నిర్ధారణ కేంద్రాన్ని నెలకొల్పడంతో పాటు ఆదిత్యనగర్‌లోని చిల్డ్రన్స్‌పార్క్‌ను జన్మభూమి కార్యక్రమంలో చేపట్టి చిన్నపిల్లలకు కానుకగా ఇచ్చారు. అంతే కాకుండా ఆర్‌ఎల్‌రెడ్డి పురమందిరాన్ని(టౌన్‌హాలు) తన సొంత నిధులతో ఆధునీకరించి కళా రంగానికి అందించారు. ప్రస్తుతం ఆయనే పురమందిరం కమిటి సెక్రటరీగా కూడా వున్నారు. ఈ నెల 6వ తేదీన టౌన్‌హాల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిసింది. గత యేడాది ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుకి అవార్డు ఇచ్చిన సందర్భంగా బెజవాడ ఆడపడుచు మాగుంట కుటుంబీకురాలు శ్రీమతి మాగుంట పార్వతమ్మను తీవ్రంగా నిర్లక్ష్యం చేసారని మనస్థాపం చెందిన బెజవాడ కుటుంబసభ్యులు ఈ అవార్డు కార్యక్రమాన్ని అంతటితో ముగించేస్తున్నట్లు, అందుకోసం ఏర్పాటు చేసిన నిధిని కస్తూరిదేవి విద్యాసంస్థల అభ్యున్నతికి అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే జెయస్‌రెడ్డి పేరు గత రెండు సంవత్సరాలుగా ప్రతిపాదనలో వున్నందున ఈ యేడాది ఆయనకు ఈ అవార్డును అందజేసి వచ్చే యేడాది నుండి అవార్డు ప్రదానోత్సవాన్ని నిలిపివేద్దామని కమిటీలోని కొంతమంది పెద్దలు సూచించడంతో ఈ అవార్డును ఈయేడాది జెయస్‌.రెడ్డికి ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు అన్ని అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీమతి మాగుంట పార్వతమ్మను ఈసారి నిర్వాహకులు అసలు ఆహ్వానించకపోవడం కొసమెరుపు.

yv subbaవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు జిల్లా పరిశీలకులుగా ఒంగోలు పార్ల మెంట్‌ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డిని నియ మించారు. సుబ్బారెడ్డికి నెల్లూరుజిల్లా రాజకీయాలపై అవగాహన వుంది. జిల్లా పార్టీలో ఎమ్మెల్యేలకు, నాయకులకు సుబ్బా రెడ్డిపై గౌరవం వుంది. ఆయనతో ఇక్కడి నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జిల్లా పరిశీలకుడిగా సుబ్బారెడ్డిని నియమించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

vinod redరాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నెల్లూరుకు చెందిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి నియ మితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌పార్టీకి ఏపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్‌వెంటివ్‌ యాడ్స్‌ వినోద్‌గా నెల్లూరులో అందరికీ సుపరిచితుడైన వినోద్‌రెడ్డి మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ముఖ్యఅనుచరుడు. విద్యార్థిగా ఎన్‌ఎస్‌యూఐలో చురుకుగా పని చేశారు. వివేకా అనుచరుడిగా కాంగ్రెస్‌లో చేరి జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా, ఇటీవల కాలం నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నెల్లూరులో చాలామంది నాయకులు వివేకాను వదిలేసి తెలుగుదేశం, వైకాపాలలో చేరిపోయారు. వినోద్‌ మాత్రం కాంగ్రెస్‌ను, అంతకంటే కూడా వివేకాను వదలకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. ఏపి సోషల్‌ మీడియా కాంగ్రెస్‌ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ద్వారా జాతీయ కాంగ్రెస్‌ నాయకులకు సైతం దగ్గరయ్యారు.

robberyగుర్తు తెలియని ఆగంతకులు బ్యాంకులలోకి, బంగారు దుకాణాలలోకి రావడం, తుపాకులు చూపి బెదిరించి అక్కడున్న నగదు, నగలు మూటగట్టుకు పోవడం నెల్లూరోళ్లు సినిమాలలోనే చూస్తుంటారు. అంతేగాని, ప్రత్యక్షంగా ఇలాంటి దోపిడీలు ఇక్కడ జరగలేదు. వ్యాపారులకు ఈ జిల్లాలో ఆ విధమైన భద్రత ఇంతకాలం ఉండేది. ఇప్పుడా నమ్మకం పోయింది.

ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1.50గంటల ప్రాంతంలో నెల్లూరు నగరం నడిబొడ్డున కాపువీధిలోని జయంతి జ్యూయలర్స్ లో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు ఆగంతకులు షాపులోకి వచ్చారు. అక్కడున్న శాత్ మల్ జైన్, హిమన్షులను తుపాకులతో బెదిరించి, 40లక్షల విలువచేసే ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. కేవలం 10నిముషాల వ్యవధిలోనే వచ్చిన వాళ్లు పని ముగించుకుని వెళ్లిపోయారు. పట్టపగలే ఈ దోపిడీ జరగడంతో నగరంలోని వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు.

annamayyaనెల్లూరు రాజీవ్ మార్గ్(మినీబైపాస్ రోడ్డు) నందు అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి ప్రతియేటా అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని అన్నమయ్య సర్కిల్(విగ్రహం కూడలి) వద్ద నిర్వహిస్తున్న అన్నమాచార్య జయంత్యుత్సవ కమిటి ఈ యేడాది జయంతిని ఆగష్టు 1న జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన విద్వాంసులను, సంగీత కళాకారులను రప్పించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక కళాకారులచే కూడా ఈసారి వినూత్న తరహాలా అన్నమయ్య సంగీత నృత్య కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.

రత్నం విద్యాసంస్థల సారధి కె.వి.రత్నం గౌరవాధ్యక్షులుగా, ప్రముఖ దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షుడిగా, మురళీకృష్ణ హోటల్స్ యం.డి వీరిశెట్టి హజరత్ బాబు ఉపాధ్యక్షులుగా మరో 22మంది కార్యవర్గంతో మొత్తం 25మంది సభ్యులుగా మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మెన్, మన నెల్లూరీయుడు చదలవాడ కృష్ణమూర్తిని కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Page 5 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
  కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter