నెల్లూరులో నేడు (123)

nidhuluఏ ఆదాయమూ లేక ఎలాంటి పనులు చేయలేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నెల్లూరు నగరపాలక సంస్థకు 1090కోట్లు హడ్కో నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ నిధులు మంజూరైనట్లు తెలియగానే మేయర్ అబ్దుల్ అజీజ్ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నాడు. నెల్లూరుకు హడ్కో నిధుల ప్రతిపాదన ఎప్పటి నుండో వుంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ నిధులు విడుదల చేయించడానికి కృషి చేసాడు. ఈ నిధులలో 525కోట్లు భూగర్భ డ్రైనేజీకి 475కోట్లు తాగునీటి అవసరాలకు ఖర్చు పెడతామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. హడ్కో నిధులొస్తాయి. ఈ పనులకు ఖర్చు పెడతారు. అయితే ఈ నిధులు ఫ్రీగా ఇచ్చేవి కావు. ప్రతి సంవత్సరం నెల్లూరు నగరపాలక సంస్థి తిరిగి వంద కోట్ల దాకా కట్టాల్సి వుంటుంది. ప్రతి ఏటా ఈ వందకోట్ల భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై మోపుతారనే భయం కూడా ఇప్పుడు తలెత్తుతోంది.

kotam sriతెలుగేదశంపార్టీ నెల్లూరు నగర అధ్యక్షులుగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని వరుసగా రెండోసారి నియమించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నెల్లూరులోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నగర అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక జరిగింది. కోటంరెడ్డి శీనయ్యను మళ్ళీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అలాగే మాజీకౌన్సిలర్ వై.వి.సుబ్బారావును ప్రధాన కార్యదరిశగా నియమించారు. కోటంరెడ్డి శీనయ్యకు ఎక్కడున్నా చొక్కా చించుకోవడమో, లేదా అవతలి వాడి చొక్కా చించడమో జరిగేలా పనిచేస్తాడనే పేరుంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ ఎస్ యూఐలో రాజకీయ అడుగులు వేశాడు. తర్వాత కాంగ్రెస్ లో వీరసైనికుడిలా పనిచేసాడు. కాలం కలసిరాక, ఆనం బ్రదర్స్ తో సరిపడక తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వున్న సమయంలో చొక్కా ఫ్యాంటులు చించుకునేలా పనిచేశాడు.

gopalaనెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు శ్రీ వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 9వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 31వ తేదీ మంగళవారం ఉదయం 10గంటలకు ధ్వజారోహణ సమయంలో సంతానభాగ్యం కావాలని కోరే నూతన వధూవరులు, పుణ్య దంపతులు శ్రీ స్వామివారి కొడిముద్ద ప్రసాదం కొరకు ఉదయం 9గంటలకు సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. ఏప్రియల్ 1వ తేదీ హంస వాహనం, 2వ తేదీ చంద్రప్రభ, 3వ తేదీ వెండి హనుమంతసేవ, 4వ తేదీ గరుడసేవ, 5వ తేదీ కల్యాణం, 6వ తేదీ రథోత్సవం, 7వ తేదీ అశ్వవాహనం, 8వ తేదీ పొన్నవాహన సేవ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ratnamనెల్లూరు హరనాథపురంలోని రేస్ నందు ఒపన్ డే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం మరియు గౌరవ అతిథిగా ప్రముఖ భౌతికశాస్త్ర అధ్యాపకులు కోదండ రామయ్య(కోరా) విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన అనేక నమూనాలను, కళాకృతులను చూసి ఆనందించారు. విద్యార్థులను స్వయంగా వాటి వివరాలు అడిగి తెలుసుకొని వారిని ప్రశంసించారు. సంవత్సరాంతం వరకు పిల్లలు పాఠశాలలో ఏమి నేర్చుకున్నారు, వారికి సంబంధిత పాఠ్య విషయాలపై ఎంత అవగాహన పెంచుకొన్నారో వీటిని స్వయంగా తల్లిదండ్రులు వారితో కలసి ఒకరోజు పాఠశాలలో గడిపి తెలుసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి తెలియజేశారు.

cbnరాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి 8వ తేదీన నెల్లూరుకు వస్తున్నట్లు సమాచారం. ఆరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏసి స్టేడియంలో లక్షమంది మహిళలతో నిర్వహించే సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే ముత్తుకూరురోడ్డులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన అపోలో హాస్పిటల్ ను కూడా ఆయన ప్రారంభించే అవకాశాలున్నాయి.

kotam subhaకొందరు నాయకులు అందరూ ఆదర్శంగా వుండాలంటూ బోలెడన్ని మాటలు చెప్పేస్తుంటారు. తీరా తమ వద్దకు వచ్చేసరికి ఆ మాటలు తమకు వర్తించవన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కానీ, కోటంరెడ్డి అలా కాదు. చెప్పే మాటల్లోనే కాక, ఆచరణలోనూ మార్గదర్శకంగా నిలుస్తూ... అందరికీ ఆదర్శంగా వుంటున్నారు.

అందుకు ఆయన కుమార్తె శుభలేఖే ఒక చక్కని నిదర్శనం. కుమార్తె పెళ్లి వచ్చిందంటే చాలు, ఎంతో ఆడంబరంగా లక్షలాది రూపాయలు వెచ్చించి శుభలేఖలు ముద్రించి వూరంతా పంచాలని నాయకులు భావిస్తుంటారు. అయితే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అలాంటి ఖరీదు వ్యవహారాలను దూరంగా పెట్టి, సాధారణమైన తెల్లకార్డు మీదనే, అత్యంత సాదాసీదాగా శుభలేఖను ముద్రించి అందరికీ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన తమ కుమార్తె వివాహమని, మీ ఆశీస్సులే మా బిడ్డ పెళ్లికి వేదమంత్రాలనీ, నూతన వధూవరుల కొత్త జీవితానికి మీ ఆశీస్సులే శుభాశీస్సులని పేర్కొంటూ ఆయన ఎంతో అభిమానంగా ఆ శుభలేఖను పంపారు. శుభలేఖ చూసేందుకు సాదాసీదాగానే వున్నా, అందులోని అక్షరాలు కోటంరెడ్డి వినమ్రతకు, అభిమానానికి దర్పణంగా నిలుస్తాయి.

r bనెల్లూరు దర్గామిట్టలోని ఆర్ అండ్ బి అతిథిగృహఁ త్వరలోనే తిరిగి పునప్రారంభం కాబోతోంది. గత కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై ఆలనాపాలనా లేకుండా వున్న ఈ అతిథిగృహాన్ని కృష్ణపట్నం పోర్టు కంపెనీ వాళ్లు మరమ్మతులు చేపట్టి మళ్ళీ కొత్త సొగసులు తీసుకొచ్చారు. అతిథిగృహంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల్లూరుకొచ్చే విఐపిలకు కేవలం పినాకిని అతిథిగృహం మాత్రమే అందుబాటులో వుంది. అయితే అక్కడ తగినన్ని సూట్ లు లేకపోవడంతో ఒక్కోసారి ప్రైవేట్ హోటల్స్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రారంభమైతే ఈ సమస్య తీరినట్లే.

tanaతెలుగు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఈ నెల 18వ తేదీ నెల్లూరులోని శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్ లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల దాకా తానా చైతన్యస్రవంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు అడ్వయిజరీ కమిటీ ఛైర్మెన్ శ్రీ సిటి ఎం.డి. రవిసన్నారెడ్డి తెలిపారు.

2015జులై నెలలో తానా 20వ ద్వైవార్షిక సదస్సు అమెరికాలో జరుగుతుందని, అందులో భాగంగా తానా తెలుగు రాష్ర్టాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ స్థానిక కళలకు, కళాకారులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల్లో వుంటున్న నెల్లూరీయులు, పారిశ్రామికవేత్తలు సుమారు 35మంది దాకా వచ్చే అవకాశం వుందన్నారు.

సాహిత్యం, కళలు, పాత్రికేయ, వ్యవసాయ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనుపరచినవారికి సన్మానం చేస్తామని ముఖ్యసమన్వయకర్త తుంగా శివప్రభాత్ రెడ్డి తెలిపారు. గిడుగు రామ్మూర్తి అవార్డును ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీహీరో రాజేంద్రప్రసాద్, జబర్దస్త్ యాంకర్ రెష్మి, ఇతర నటులు పాల్గొంటున్నారని, సినీ గాయకులు దీపు, ప్రవీణ్, గంగాధర్ తదితరులచే సంగీత విభావరి జరుగుతుందన్నారు.

నెల్లూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివారులోని అయ్యప్పగుడి సెంటర్ సమీపంలోని చింతాలమ్మ వైన్స్ షాపులో సోమవారం తెల్లవారుజామున దుండగులు దోపిడీకి యత్నించారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్ చంద్రయ్య, అతనికి సహాయంగా ఉన్న దేవినేని శ్రీనివాసులపై దొంగలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన శ్రీనివాస్ మృతి చెందగా, వాచ్‌మెన్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దోపిడీకి పాల్పడేకంటే ముందు షాపులోని నగదును క్యాషీయర్ తీసుకెళ్లడంతో.. దొంగలు మిగిలిన సొమ్మును, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

childrens dayuనవంబర్ 14... మాజీప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిరోజు. ఆయనకు చిన్నారులంటే ఇష్టం. అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇంతవరకు ఎన్ని నవంబర్ 14లైనా వచ్చి ఉండొచ్చు. కాని 2014 నవంబర్ 14కు మాత్రం ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. లాయర్ వారపత్రిక ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరం నందు నిర్వహించిన బాలల దినోత్సవం బాలల ఆనందోత్సాహాలకు వేదికగా నిలిచింది. కిక్కిరిసిన వివిధ పాఠశాలల చిన్నారుల కేరింతలతో టౌన్ హాల్ మార్మోగిపోయింది.

ప్రతిభావంతులైన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఓ పక్క చిన్నారి లోకాన్ని మైమరపిస్తే, ఇంకో పక్క ముఖ్య అథితులుగా వచ్చిన పెద్దలు ఆశీస్సులతో ఇచ్చిన అభిభాషణ వారిలో స్ఫూర్తిని నింపింది. ఆయా పాఠశాలల విద్యార్థులు టౌన్ హాల్ కు పోటెత్తినట్లు వచ్చారు. హాలు నిండి కొందరు చిన్నారులు నిలుచోవాల్సి వచ్చింది. అయినా ఎవరూ అసౌకర్యంగా భావించకుండా అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్న చిన్నారుల నృత్యాలను చూస్తూ కార్యక్రమం ఆశాంతం అలానే నిలుచుండిపోయారు.

Page 6 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter