నెల్లూరులో నేడు (112)

jayendraకంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురికావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే వైద్యులు అన్నీ పరీక్షలు నిర్వహించారు . ఆరోగ్యం నిలకడగానే వుందని డాక్టర్స్ చెప్పారు .  జయేంద్ర సరస్వతి ఆదివారం నెల్లూరు కి వచ్చారు .

abvpఏబీవీపీ 32వ రాష్ట్ర మహాసభలు  నెల్లూరు నగరం లోని కస్తూరి దేవి గ్రౌండ్స్ నందు శుక్రవారం  ప్రారంభమయ్యాయి. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ ఏబీవీపీ జెండాను ఆవిష్కరించి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మహాసభలను ప్రారంభించారు. వందేమాతరం పూర్తిగీతాన్ని ఆలపించారు. ఈ గీతం రచించి 108 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 108 మంది విద్యార్థులు ఏకకాలంలో పూర్తి గీతాన్ని ఆలపించి అబ్బురపరచారు. అనంతరం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అంజనీ శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సునీల్‌కుమార్ రెడ్డిని ఎన్నుకున్నారు.

Friday, 10 January 2014 13:28

బీజేపీ ధర్నా

Written by

bjp darnaసీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు మరణశాసనంలాగా ఉన్న విభజన బిల్లును నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ అనేక విధాలుగా తమ నిరసనను తెలియజేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు (10.01.14) సీమాంధ్రలోని 13జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ నిరసన ర్యాలీలు, ధర్నాలను నిర్వహించింది. నెల్లూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు.

సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగే ఈ బిల్లుకు భారతీయ జనతాపార్టీ మద్దతిచ్చే ప్రశ్నేలేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, రాష్ర్ట కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షులు పి.సురేంద్రరెడ్డి, రాష్ర్ట కార్యవర్గసభ్యులు మిడతల రమేష్, వి.భాస్కర్ గౌడ్, జెట్టి రామచంద్రారెడ్డి, అన్నం శ్రీనివాసులు, వై.రమణయ్య, జీవరత్నమ్మ, మమతారెడ్డి, కోటేశ్వరమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

kotaడివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలోని నేతాజీనగర్, ఎన్.బి.టి. కాలనీ, శివాజీనగర్లలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కో-ఆర్డినేటర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వీధిలైట్లు లేని విషయాన్ని, కలుషిత నీటితో తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేశారు. కలుషిత నీళ్లు త్రాగితే విషజ్వరాలు వస్తున్నాయని, తమ కష్టార్జితం వేలరూపాయలు ఆసుపత్రుల పాలవుతున్నాయని, ఈ నీళ్లతో స్నానం చేస్తే చర్మరోగాలు వస్తున్నాయని ఆయనకు తెలియజేశారు. ఆ కలుషిత నీళ్లు కోటంరెడ్డి స్వయంగా పరిశీలించారు.

దీనికి కోటంరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కనీసం వీధిలైట్లు కూడా నెల్లూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకుండా పోతుందని, త్రాగునీరు ఎంత కలుషితంగా ఉన్నాయో చూస్తే కడుపు తరుక్కుపోతుందని అన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అధికారపార్టీ నాయకుల పాపాలు ఈ కలుషిత నీళ్ల ద్వారా బయటపడ్డాయని, కాసుల కక్కుర్తి కోసం చేసిన పాపాలు ప్రజల పాలిట శాపంగా మారిందని, ఈ నీళ్లు తాగే సంగతి దేవుడెరుగు కనీసం ఈ నీళ్లతో స్నానం చేయగలుగుతారా అని అధికారపార్టీ నేతలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు.

Friday, 03 January 2014 12:16

పాక్షికంగా బంద్

Written by

సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీవోల పిలుపుమేరకు జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. వైకాపా కార్యకర్తలు బంద్ కు పూర్తి మద్దతు తెలపడంతో నెల్లూరులో దుకాణాలు చాలా వరకు మూతపడ్డాయి. వైకాపా కార్యకర్తలు బైక్ లపై తిరుగుతూ తెరచివున్న షాపులను మూయించివేసారు. కాగా, ఈ బంద్ ప్రభావం ఆర్టీసీపై పెద్దగా చూపలేదు. బస్సులు యదావిధిగా తిరిగాయి.

viswa hinduహిందుధర్మ శాస్ర్త ప్రకారం జనవరి 1 మనకు కొత్త సంవత్సరం కాదు. ఉగాది మనకు కొత్త సంవత్సరం. కాని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12గంటలకు ఆలయాలు తెరచి ప్రత్యేకపూజలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట కార్యదర్శి మెంటా రామ్మోహన్ ప్రశ్నించారు. దేవాదాయశాఖ అధికారులు అర్ధరాత్రి గుడి తెరచి పూజలు నిర్వహించే వారిపై తగుచర్యలు తీసుకోవాలని మెంటా డిమాండ్ చేసారు. అసలు అర్థరాత్రి పూజలు చేయడం హిందూధర్మానికి విరుద్దమని ఆయన అన్నారు.

నెల్లూరులోని చిల్ర్డన్స్ పార్కులో జనవరి 1వ తేదీన టివి, సినీ ఆర్టిస్టులతో నిర్వహించనున్న మ్యూజికల్ నైట్ను ఏర్పాటు చేయవద్దంటూ చిల్ర్డన్స్ పార్కు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం చిల్ర్డన్స్ పార్కులో అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తే పార్కు పాడైపోయే ప్రమాదముందన్నారు. వేలాదిమంది పార్కులో తిరగడం వల్ల మొక్కలు చనిపోతాయన్నారు. ఈమధ్యనే రూ.5లక్షలు వెచ్చించి మొక్కలు నాటి, ఆట వస్తువులను ఏర్పాటు చేశారని తెలిపారు. మ్యూజికల్ నైట్ను మరో ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేసారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పాముల రమణయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ammaనెల్లూరు దుర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం హుండీని 24వ తేదీ లెక్కించారు. అక్టోబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు హుండీ ద్వారా 9,50,180 రూపాయల ఆదాయం లభించింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రత్నం జయరాం, దేవాదాయశాఖ సహాయకమీషనర్ వేగూరు రవీంద్రరెడ్డి, ఇఓ పాయసం నాగేశ్వరరావు, ప్రధానార్చకులు తంగిరాల రాధాకృష్ణ, ఇన్స్పెక్టర్ శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 24 December 2013 12:23

ఆదార్ గడువు జనవరి 31

Written by

రేషన్ కార్డుదారులు ఆధార్ తో అనుసఁధానం చేసేందుకు పౌరసరఫరాల శాఖ జనవరి 31 చివరి గడువు ఇచ్చింది. అప్పటిలోగా ఆధార్తో అనుసఁధానం చేయని కార్డులను ఫిబ్రవరి నుంచి కేటాయింపులు ఉండవని డిఎస్ఓ తెలిపారు. నెల్లూరుజిల్లాలో తెల్లరేషన్ కార్డులు అన్నపూర్ణ, అఁత్యోదయ, రచ్చబండ కార్డులు కలిపి 7,81,823కార్డుదారులున్నారు. ప్రస్తుతం రచ్చబండ-3 కింద 1.13లక్షల రేషన్ కూపన్లు మంజూరు కాగా వీటిలో 71,581 మంది ఫోటోతో అనుసంధానం చేసుకున్నారు. మొత్తం 8,53,404 కార్డులు ఆధార్ తో అనుసంధానం జరగాల్సి వుంది. కార్డుదారుల్లో మొత్తం కుటుంబాల సభ్యులు 24,45,976 మంది ఉంటే వీటిలో 10,79,136 మంది అనుసంధానం జరిగింది.

Tuesday, 24 December 2013 12:21

ప్రెస్ స్టిక్కర్లు

Written by

జిల్లాలోని అక్రిడేట్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వడానికి జిల్లా ఎస్పీ పి.వి.యస్.రామకృష్ణ నిర్ణయించారు. జిల్లాలో చాలామంది ప్రెస్, పోలీస్ స్టిక్కర్లను అంటించుకుని వాహనాలు నడుపుతున్నారు. అయితే వీరిలో ఒరిజనల్ ప్రెస్, పోలీసు వాళ్లకంటే డూప్లికేట్స్ ఎక్కువ. జర్నలిస్టుల బంధువులు, స్నేహితులు కూడా తమ వాహనాలకు ప్రెస్ అని వ్రాసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి నకిలీ ప్రెస్ వాళ్లు పోలీస్ శాఖకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని అరికట్టేందుకే అక్రిడిటేషన్ లిస్టు ప్రకారం జర్నలిస్టులకు ప్రెస్ స్టిక్కర్లు అందజేస్తారు. విలేకరులు తమ అక్రిడేషన్ నెంబర్, వాహనం ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్ల జరాక్స్లను అందజేసి పోలీసుశాఖ నుండి ఈ స్టిక్కర్ ను పొందవచ్చు. జనవరి 1వ తేదీ నుండి విలేకరులకు ఈ స్టిక్కర్లు అందజేయనున్నట్లు తెలుస్తుంది.

Page 8 of 8

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • రాజకీయమా? రక్త సంబంధమా?
  నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
 • పంచాయితీలకు ప్రమోషన్‌!
  జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
 • చుక్కలు చూపించిన జగన్‌
  ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
 • ఆనంకు 'హై'షాక్‌
  వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
 • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
  బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter