గల్పిక

పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా రెడీ అయ్యి నాలుగు మసాలా దోశ, ఐదు రవ్వదోశ, ఏడు ప్లేట్ల పూరీతో లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ కానిచ్చి మద్రాసుబస్టాండ్‌ వద్దకొచ్చి నిలబడ్డాడు. ఒక్క క్షణంలోనే పది ఆటోలు…
''బీజేపీని ఓడించాలి... బీజేపీ ముక్త్‌ భారత్‌... ఇటలీనే ఇండియా... ఇండియానే ఇటలీ... బీజేపీ డౌన్‌ డౌన్‌...'' ఢిల్లీ, టెన్‌జనపథ్‌లోని తన గదిలో పడుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గాఢనిద్రలో కలవరి స్తోంది. తెల్లారి ఆరుగంటలు కావ డంతో ఎంపీ వి.హెచ్‌.హనుమంతు రావు బెడ్‌కాఫీని ట్రేలో పెట్టుకుని అమ్మగారికివ్వడానికి వచ్చాడు. సోనియాగాంధీ నోటిలో నుండి వస్తున్న ఆ కలవరింతలను శ్రద్ధగా విన్నాడు. వెంటనే బయటకొచ్చి చూసాడు. అప్పుడే రాహుల్‌గాంధీ సైక్లింగ్‌ ముగించుకుని…
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం. అప్పుడే సుప్రభాతం, అర్చన, తోమాలసేవ వంటి సేవలు ముగిసి ఆరగింపుసేవ మొదలైంది. అర్చకులు పెద్దపాత్రలలో ప్రసాదాలు తెచ్చిపెట్టారు. శ్రీవారు తనకిష్టమైన లడ్డును ఒక పాత్రలో నుండి తీసుకుని నోట్లో పెట్టుకోబోతుండగా... 'ఉన్నావా అసలున్నావా... ఉంటే కళ్ళు మూసుకున్నావా... ఈలోకం కుళ్ళు చూడకున్నావా...' అనే పాట వినిపించింది. ఆ పాట దెబ్బకు ఉలిక్కిపడి శ్రీనివాసుడు ఆ పాట పాడింది ఎవరా అని…
పట్టువదలని విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తన గది నుండి బయటపడ్డాడు. మూలాపేట సెంటర్‌లో బిర్యాని తిని మద్రాసుబస్టాండ్‌ వద్దకొచ్చి ఒక ఆటో ఎక్కి పెద్దాసుపత్రి వద్ద దిగాడు. పెద్దాసుపత్రిలోని మార్చురీ వద్దకు వెళ్ళి ఫ్రెష్‌గా వున్న బాడీని చూసుకుని భుజాన వేసుకుని జిఎన్‌టి రోడ్డు మీదుగా బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశానవాటిక వైపు నడవసాగాడు. టీటీడీ కళ్యాణ మండపం దాకా…
అది లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం. ఎం.ఏ లిట్‌ క్లాస్‌రూమ్‌... ప్రొఫెసర్‌ మార్గరెట్‌ హల్వా క్లాస్‌కు అటెండయ్యి రాజకీయాలలో నిరాహారదీక్షల పాత్ర అనే సబ్జెక్ట్‌పై లెసన్‌ మొదలుపెట్టింది. దీక్షలో ఎన్ని రకాలు, ఎన్నిరోజులు చేస్తారు అని ఆమె వివరిస్తుండగా ఫిలిప్‌పాల్‌కోవా అనే స్టూడెంట్‌ లేచి... మేడమ్‌ ఇండియాలో ఇటీవల కొందరు నాయకులు తరచూ దీక్షలు చేస్తున్నట్లు చదువుతున్నాం... ఆ దీక్షల గురించి చెప్పండి అని కోరాడు. అందుకు మార్గరేట్‌ హల్వా... చెప్పడం…
జనచైతన్య యాత్రలో సైకిల్‌ తొక్కి తొక్కి అలసిపోయిన సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అల్లీపురం లోని తన ఇంటికి చేరుకున్నాడు. తన సతీమణి జ్యోతమ్మ పెట్టిన రెండు పుల్కాలు తిని మంచం ఎక్కి ఏసి ఆన్‌ చేసుకుని ముసుగుతన్నాడు. తిరుపతి సభలో 'బ్రిటీష్‌ వారిపై పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ' అన్న చంద్రబాబు మాటలే ఆయన బుర్రలో తిరగసాగాయి. ఆ మాటల గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ---- ప్రపంచంలోని…
అది ఇంద్ర లోకం రాజధాని అమరావతి. అప్పుడే తెల్లారింది. దేవేంద్రుడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మేకప్‌ వేసుకుని తన ఆస్థానానికి చేరుకున్నాడు. సభా సభ్యులంతా లేచి గౌరవ మర్యాద లతో ఆయనను స్వాగతించారు. దేవేంద్రుడు సింహాసనాన్ని అధిష్టించి.. ఈరోజు నా మనసు ఎంతో ఉల్లాసంగా వున్నది... ఈ ఆనంద సమయంలో ఈ మనసు ఏదో వినోదము కోరుతున్నది అని చెబు తుండగా... సభలో నుండి 'ఇదే మీకు…
నవ్వావు... నవ్వించావు... నవ్వులను ప్రోత్సహించావు... నవ్వుతూ బ్రతకమన్నావు... నవ్వుతూ నడవమన్నావు... నవ్వుతూ ఎదగమన్నావు... ఇలా మరణించి ఏడిపిస్తావనుకోలేదయ్యా! నా నవ్వుల 'గల్పిక'కు ఆయువు నీవే, ప్రాణవాయువు నీవే... హీరోయిజం నీదే... విలనిజమూ నీదే... నీ మరణంతో నా కలం కూడా కన్నీరుమున్నీరైంది... నీవు లేవన్న వార్త విని దాని గుండె మూగబోయింది. గలగలా నవ్వులు చిందించే నా కలం... విలవిలా.. ఏడ్చి ఏడ్చి... ఇంకిపోయింది. నువ్వు లేని, నీ ఊసు…
పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్రలేచాడు. కాలకృత్యాలు ముగించుకుని మురళీకృష్ణ హోటల్‌ కొచ్చాడు. రెండు ఇడ్లీల్లో రెండు బకెట్ల సాంబార్‌ కలుపుకుని తిని కూరగాయల మార్కెట్‌ వద్ద రోడ్డు పై నిలబడ్డాడు. వెంటనే అతని ముందు పది ఆటోలు రాకెట్‌వేగంతో దూసుకొచ్చి ఆగాయి. ఒకరు చేయి, ఒకరు కాలు పట్టుకుని లాగుతూ ఆటోవాలాలు తమ ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేసారు. విక్రమార్కుడు వారి నుండి బలవంతంగా బయటపడి…
Page 1 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter